Jump to content

Khammam Elections - MLA Contestants


RKumar

Recommended Posts

Ummadi Khammam district MLA seat contestants?

 

Khammam - Renuka Chowdary (Congress) Vs Puvvada Ajay (TRS)

Paleru - Tummala (TRS) Vs Nama (TDP)

Madhira(SC) - Mallu (Congress) Vs Kamalraj (TRS)

Sathupalli(SC) - Sandra (TDP) Vs Ravi (TRS)

Kothagudem - Vanama (Congress) Vs Jalagam (TRS)

 

Link to comment
Share on other sites

Paleru lo Tummala Vs Nama telchukovali. Iddaru kalisi party ni munchaaru 2014 lo.

Tummala meeda Farmers ki bedilu vesi arrest cheyichaadu ani bad name vundi, have to see if anyone can beat him.

If Renuka doesn't contest from Khammam, Nama (TDP) might take this seat.

 

Link to comment
Share on other sites

13 minutes ago, Bittu_77 said:

 

Any chance for Koneru chinni from TDP here? 

Any 1 unreserved seat only TDP will get mostly that too strong candidate Nama only. Khammam/Paleru.

BCs ki vunna oke okka seat Kothagudem so mostly it will be given to Congress (Vanama-BC-M.Kapu)

Link to comment
Share on other sites

4 minutes ago, Bittu_77 said:

Hmm may be..  Actually Koneru Nageswararao garu , maa atta gari pedananna.. so they used to tell about vanama being their relative.. 

 nageswararao gari daughter love marriage anukunta vanama family lo

Koneru nageswarao vala son Koneru Chinni ee ga 

Link to comment
Share on other sites

అన్ని స్థానాల్లో టీడీపీ బలమే కీలకం’
16-09-2018 09:08:00
 
636726856763198246.jpg
  • జిల్లాలో మూడు సీట్లు అడుగుతున్నాం
  • సత్తుపల్లి, ఖమ్మంలో తప్పనిసరి పోటీ
  • మహాకూటమిగానే ఎన్నికల బరిలోకి..
  • టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-ఖమ్మం)
రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం జిల్లాలో బలహీనపడింది. ముఖ్యనేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ గత వైభవాన్ని కోల్పోయింది. ఈసారి ఎన్నికలలో తన ఉనికి చూపేందుకు సన్నద్ధమవుతోంది. 1983 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కేడర్‌ గులాబీ వైపు వెళ్లడమంతో క్షేత్రస్థాయిలో కూడా బలహీనపడింది. ఈసారి జరగబోతున్న ఎన్నికలు టీడీపీకి పరీక్షగా నిలవనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కార్యచరణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్యూ..
 
 
ఆంధ్రజ్యోతి: ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేయబోతోంది?
తుళ్లూరి: జిల్లాలో మూడు సీట్లు డిమాండ్‌ చేస్తున్నాం. సత్తుపల్లి, ఖమ్మంలో తప్పనిసరిగా పోటీచేస్తాం. వైరా సీటు కూడా మాడిమాండ్‌లో ఉంది.
 
ఆంధ్రజ్యోతి: ఖమ్మం నుంచి మీరు బరిలో దిగే అవకాశం ఉందా?
తుళ్లూరి: పోటీచేయాలన్న ఆసక్తి ఉన్నా.. ఆర్థికంగా ఆస్థాయి లేదు. నేను ఒక కార్యకర్తనే. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావును పోటీ చేయాలని ఇప్పటికే కోరాం. పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పాం. ఆయన పోటీ చేయడంవల్ల పార్టీ మరింత బలపడుతుంది. గత ఎన్నికలలో ఖమ్మం ఎంపీగా తక్కువ ఓట్లతో ఓటమి చెందారన్న సానుభూతి ప్రజల్లో ఉంది.
 
ఆంధ్రజ్యోతి: పొత్తులు, సీట్లు సర్దుబాటు ఎంతవరకు వచ్చింది?
తుళ్లూరి: రాష్ట్రస్థాయిలో ప్రాథమికంగా టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్‌ మహాకూటమిగా పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మహాకూటమిగా అన్ని విపక్షాలు ఏకమై పోటీచేయడం తథ్యం. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి జిల్లాల్లో అన్ని సీట్లు గెలుచుకుని తీరుతాం.
 
ఆంధ్రజ్యోతి: పొత్తుల్లో మా సీట్లు వదలొద్దంటూ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే అధిష్ఠానికి చెప్పారు కదా?
తుళ్లూరి: టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే విపక్షాలు కలవాల్సిన అవసరం ఉంది. కేవలం కాంగ్రెస్‌గా ఒక్కరే గెలవడం సాధ్యంకాదు. విపక్షాలన్నీ కలిస్తేనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దెదించే అవకాశం ఉంటుంది. సీపీఎంను కూడా కలిసి పోటీకి రావాలని కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు సీట్ల విషయంలో సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
 
ఆంధ్రజ్యోతి: కాంగ్రెస్‌తో కలవడం వల్ల టీడీపీ ఓట్లు బదిలీ అయ్యే అవకాశం ఉండదని కొందరంటున్నారు? వాస్తవమేనా ?
తుళ్లూరి: టీడీపీ, కాంగ్రెస్‌తో ఇతర పక్షాల కూటమి ప్రజలు హర్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్‌స్‌ను ఓడించాలన్న బలమైన కోరిక ప్రజలతోపాటు మాపార్టీల కేడర్‌లోను కనిపిస్తుంది. అక్కడక్కడా ఓట్లు స్వల్పంగా పడకపోయినా మెజారిటీ ఓటుబ్యాంకు బదిలీ అవుతుంది. తద్వారా అధికార టీఆర్‌ఎస్‌ ఓటమి చెందుతుంది.
 
ఆంధ్రజ్యోతి: టీడీపీకి ఓటుబ్యాంకు లేదని.. అంతా టీఆర్‌ఎస్‌కు వెళ్లారని.. సీట్లుఇవ్వడం వల్ల నష్టం ఉంటుందని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు కదా?
తుళ్లూరి: అది పూర్తిగా అవాస్తవం. ముఖ్యనాయకులు వెళ్లినమాట నిజమే. నాయకత్వం అక్కడక్కడా సమస్యగా ఉన్నా కేడర్‌ బలం టీడీపీకి ఉంది. అనేక వర్గాలు టీడీపీని నమ్ముకునే ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో 20శాతం ఓటుబ్యాంకు ఉంది. ఏపార్టీనైనే గెలిపించే, ఓడించే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉంది.
 
ఆంధ్రజ్యోతి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీ శ్రేణులు సమర్ధిస్తారా?
తుళ్లూరి: పొత్తును అందరు కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు శత్రువు కాంగ్రెస్‌కాదు. టీఆర్‌ఎస్‌. పార్టీని నష్టం చేయడంతోపాటుఅనేక ఇబ్బందులకు గురిచేసంది. అందువలపార్టీని క్షేత్రస్థాయినుంచి కూడా కేడర్‌ మహాకూటమిలో ఉండాలని కోరుతోంది.
 
ఆంధ్రజ్యోతి: కూటమివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పదికి పదిసీట్లు వస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు? నిజమైనా?
తుళ్లూరి: గతంలో 1994, 2004 ఎన్నికల తరుణంలో టీడీపీ, కమ్యూనిస్టుల కూటమి, ఆతర్వాత కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కూటమి ఎలాంటి ఫలితాలిచ్చాయో జిల్లా ప్రజలకు తెలుసు. కూటముల బలం అధికారపక్షానికి ఇబ్బందులు తెచ్చిన సంఘటనలున్నాయి. అదే నమ్మకంతో ముందుకు పోతున్నాం.
Link to comment
Share on other sites

ఆ స్థానంలో టీడీపీ గెలుపు అవకాశాలపై ముమ్మరంగా సర్వే
16-09-2018 07:29:20
 
636726797567080790.jpg
  • ఎవరు విజయం సాధిస్తారు?
  • పార్టీల సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి?
  • సత్తుపల్లిలో నిఘా వర్గాల సర్వే.. అభ్యర్థుల స్థితిగతులపై ఆరా
సత్తుపల్లి(ఖమ్మం): సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశావహులైన అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వ నిఘా వర్గాలు రెండు రోజులుగా నియోజకవర్గంలో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లి అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇప్పటికే పిడమర్తి రవిని పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో స్థానిక నినాదంతో ఆదే పార్టీ నాయకుడు, దిశా సభ్యుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి పలు వర్గాల ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని పలు సందర్భాల్లో కోరారు. మరో పక్క కాంగ్రెస్-టీడీపీ-సీపీఐలతో మహాకూటమి ఏర్పడుతున్న క్రమంలో సత్తుపల్లి అభ్యర్థిగా టీడీపీ మాజీ శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లో రేగిన వివాదం, మరో పక్క మహా కూటమి అభ్యర్థిగా సండ్ర ప్రచారం నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రెండు రోజులుగా నిఘా వర్గాలు అన్ని కోణాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
 
 
ఏ అంశాలు కలిసొస్తాయి
సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కలిసివచ్చే అంశాలు ఏమిటనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరో పక్క టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పాటు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని నాయకత్వాన్ని కోరుతున్న డాక్టర్‌ మట్టా దయానంద్‌కు నియోజకవర్గంలో ఏ మేరకు అనుకూల వర్గం ఉంది, ఆయన అనుచరులు ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన పార్టీ పరంగా లేదా స్వతంత్య్రంగా పోటీ చేస్తే ఏ మేరకు ప్రభావితం చేయగలరు? తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, వ్యాపారవర్గాలను కలుసుకుని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి రహస్యంగా ఈ సర్వే సాగుతోంది. త్వరలో ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక అందజేయనున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...