Jump to content

Thota Trimurthulu


bujji

Recommended Posts

పార్టీ మారబోయే నేతలపై దృష్టి ఇంటెలిజెన్స్‌ ఆరా
16-09-2018 12:02:47
 
636726961636544735.jpg
కాకినాడ: ‘‘ఏ పార్టీ అయినా పర్వాలేదు. టికెట్‌ ఇస్తామంటే వెళ్లిపోవడమే మేలు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్నా ఏమీ పట్టించుకోలేదు. టికెట్‌ ఇవ్వకపోగా, పార్టీలో తగిన ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదు. ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఏంటి లాభం..?’’ ఇదీ జిల్లాలో ప్రధాన పార్టీల్లో పలువురి నేతల యోచనగా కనిపిస్తోంది. పార్టీలు మారబోయే నాయకుల గురించి జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఏ నేత.. ఏ పార్టీ నుంచి, ఏ పార్టీలో చేరాలని దృష్టిసారించారు? ఆ పార్టీలో చేర్చేందుకు ఎవరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్‌ దృష్టి కేంద్రీకరించింది. స్టేట్‌ ఇంటెలిజెన్స్‌తోపాటు.. ఐబీ అధికారులు కూడా జంప్‌ జిలానీలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీల మార్పు ప్రభావం ఎవరికి లాభం? ఏ పార్టీకి మైనస్‌ అవుతుందనేదానిపైనా రాజకీయ విశ్లేషకులతోపాటు.. ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా లెక్కలు వేస్తోంది.
 
2014 ఎన్నికల నుంచి ఇటీవల వరకు జిల్లాలో టీడీపీ, వైసీపీలే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇటీవల జనసేన చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవ్వడంతో జిల్లాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎక్కువగా వైసీపీ నుంచీ, కాంగ్రెస్‌ నుంచీ జనసేనలోకి చేరికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయినవారు, టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైనవారు, ఈ దఫా టికెట్‌ దక్కదని భావిస్తున్న వారు వైసీపీ నుంచి జనసేనలోకి క్యూకట్టారు. వాస్తవానికి జిల్లాలో 2009 నుంచీ పార్టీలు మారే సంస్కృతి ఎక్కువైంది. అప్పట్లో జిల్లాలో టీడీపీ నుంచి ఎక్కువగా కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తుందంటూ జిల్లాలో రాజకీయ విశ్లేషకులతోపాటు.. పలు సర్వేలతో హడావుడి చేశారు. అయితే ప్రజారాజ్యం రాకతో టీడీపీకి గట్టి దెబ్బపడింది. తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆ శకం ముగిసింది.
 
వాళ్లే ఎక్కువ..
అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిన కేడరే ఇప్పుడూ జనసేనలో ఎక్కువగా చేరుతున్నారు. టికెట్లు దక్కనివారు, ఉన్న పార్టీలో గౌరవం లేక వస్తున్నవారే ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలుగా పదవులు చేసిన రాపాక వరప్రసాద్‌, పాముల రాజేశ్వరి, అనిశెట్టి బుల్లబ్బాయ్‌రెడ్డి, వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన గిరిజాల స్వామినాయుడు, కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ చేసి, ఇటీవల వైసీపీలోకి వెళ్లిన కందుల దుర్గేష్‌.. ముత్తా కుటుంబం.. ఇలా పలువురు కాంగ్రెస్‌, వైసీపీల నుంచే జనసేనలో చేరారు. టీడీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు బలమైన నాయకుడెవరూ జనసేనలో చేరలేదు. టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం జనసేనలో చేరతారని విస్తృతమైన ప్రచారం సాగుతోంది.
 
వేగం పెంచిన ఇంటెలిజెన్స్‌..
జిల్లాలో ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలలో ప్రభావం చూపగల నాయకులు ఉన్న పార్టీ నుంచి ఇతర పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? పార్టీ మారితే టికెట్‌ వస్తుందన్న గ్యారంటీ ఉందా? లేక ఆ పార్టీకి భవిష్యత్‌ ఉంటుందనుకుంటున్నారా? వాళ్లు ఏమని భావిస్తున్నారు? ఆయా నాయకుల రాజకీయ అంచనాలు ఎలా ఉంటున్నాయి.. వంటి అంశాలపై ఇంటెలిజెన్స్‌ విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఏరోజు ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి జిల్లా రాజకీయాలలో నెలకొంది. ఒకప్పుడు పార్టీ మారితే జనం, కేడర్‌ ఏమనుకుంటుందోనని కాస్త తడబడే నేతలు సైతం ఇప్పుడు.. ధైర్యంగా, ధీమాగా పార్టీ మారుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అన్ని పార్టీలూ ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నట్టుగానే క్షేత్ర స్థాయిలోనూ కనిపిస్తోంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • Replies 68
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...