Jump to content

lokesh china tour


sonykongara

Recommended Posts

ఏపీలో పెట్టుబడులు పెట్టండి: లోకేశ్‌

08172819BRK142-LOKESH.JPG

అమరావతి: చైనా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఈ రోజు జీఎస్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సీహాంగ్‌తో భేటీ అయ్యారు. కొరియాకు చెందిన జీఎస్‌ గ్లోబల్‌ స్టీల్‌, పెట్రోలియం, కెమికల్స్‌, కోల్‌, ఇండస్ట్రీయల్‌ ప్రొడక్ట్స్‌‌, లాజిస్టిక్స్‌, రిటైల్‌ రంగాల్లో వివిధ దేశాల్లో జీఎస్‌ గ్లోబల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులకు గేట్‌ వే ఆఫ్‌ ఇండియాగా ఎదుగుతున్నామని, గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని, సింగపూర్‌ దీనికి మాస్టర్‌ ప్లాన్‌ అందించిందని లోకేశ్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు అతి పెద్ద తీరప్రాంతం, ఆరు పోర్టులు ఉన్నాయని, మరో ఆరు పోర్టులు నిర్మించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 100 ఎకనామిక్‌ సిటీలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మెగా ఫ్యాక్టరీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని వారికి వివరించారు. చైనాకు చెందిన హోలీ టెక్‌ కంపెనీ మొదటిసారి చైనాకు బయట ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని జీఎస్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సీహాంగ్‌ను ఆహ్వానించారు. అనంతరం సీహాంగ్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తక్షణమే కంపెనీ తరఫున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న రంగాలను గుర్తిస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి జీఎస్‌ గ్లోబల్‌
20-09-2018 03:42:56
 
636730117733482948.jpg
  • పెట్టుబడులకు దక్షిణ కొరియా కంపెనీ సంసిద్ధత
  • శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రపంచ ఆర్థిక వేదిక ఓకే
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణకొరియాకు చెందిన జీఎస్‌ గ్లోబల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. తక్షణమే కంపెనీ తరఫున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న రంగాలను గుర్తిస్తామని తెలిపింది. మరోవైపు ఏపీకి వచ్చి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ చూస్తామని, ప్రభుత్వానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని హెచ్‌పీ కంపెనీ హామీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని ప్రపంచ ఆర్థిక వేదిక ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఈ సంస్థలు ఈ మేరకు హామీ ఇచ్చాయి. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సమాచార సేకరణ కోసం డ్రోన్ల వినియోగం, మెరుగైన సమాజం కోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచడం అన్న అంశాలపై జరిగిన సమావేశాల్లో బుధవారం మంత్రి లోకేశ్‌ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పలు అంశాలను పలు దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు వివరించారు.
 
ఈ సదస్సు వేదికగా ఆయన జీఎస్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సీహాంగ్‌తో భేటీ అయ్యారు. స్టీల్‌, పెట్రోలియం, కెమికల్స్‌, కోల్‌, పారిశ్రామిక ఉత్పత్తులు, లాజిస్టిక్స్‌, రిటైల్‌ రంగాల్లో ఈ కంపెనీ పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులకు గేట్‌ వే ఆఫ్‌ ఇండియాగా ఎదుగుతున్నామని సీహాంగ్‌తో లోకేశ్‌ అన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని, సింగపూర్‌ దీనికి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిందన్నారు. ఏపీకి అతి పెద్ద తీర ప్రాంతం ఉందని, ఆరు పోర్టులున్నాయని, మరో ఆరు పోర్టులు నిర్మించబోతున్నామని చెప్పారు. ఆటోమొబైల్‌ రంగంలో గత నాలుగేళ్లలో భారత్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడిలో అత్యధిక శాతం ఏపీకి వచ్చిందన్నారు. కొరియాకు చెందిన కియ కార్ల కంపెనీతోపాటు ఇసుజు, హీరో మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌లు కూడా వచ్చాయన్నారు. రాష్ట్రంలో 100ఎకనామిక్‌ సిటీలు అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మెగా ఫ్యాక్టరీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
 
త్వరలోనే ఏపీకి వచ్చి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని నేరుగా చూస్తామని, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని సీహాంగ్‌ ప్రకటించారు. హెచ్‌పీ కంపెనీ చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ క్రిక్‌తో కూడా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌ అమల్లో హెచ్‌పీ కంపెనీ సహకారం కావాలన్నారు. త్వరలో ఏపీకి రావాలని ఆహ్వానించారు. త్వరలోనే వచ్చి ఆర్టీజీ సెంటర్‌ చూస్తామని, ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని క్రిక్‌ హామీ ఇచ్చారు. కాగా, నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి... ప్రపంచ ఆర్థిక వేదిక త్వరలోనే భారత్‌లో సెంటర్‌ ఏర్పాటుచేస్తుందని..ఆ వేదిక బోర్డు పేర్కొంది. ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంటామన్నారు. ఈ బోర్డు సభ్యులతో లోకేశ్‌ భేటీ అయ్యారు. 10లక్షల ఐవోటీ పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని ఈ సందర్భంగా లోకేశ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

మంత్రి నారా లోకేష్ చైనా పర్యటన...

షేన్ జెన్...

ఆంధ్రప్రదేశ్ కి మరో పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీ

ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ టిసిఎల్

దేశంలో మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడుతున్న టిసిఎల్

తిరుపతి లో కంపెనీ ఏర్పాటు చేయనున్న టిసిఎల్

తిరుపతిలో మెగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్న టిసిఎల్

మంత్రి నారా లోకేష్ సమక్షంలో టిసిఎల్,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం

టీవీలు,స్మార్ట్ ఫోన్లు,వాషింగ్ 
మేషిన్లు,ఏసీలు,ఫ్రిడ్జ్ లు తదితర కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్   తయారీ లో ఉన్న టీసీఎల్

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో టిసిఎల్ కార్యకలాపాలు...ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మంది ఉద్యోగులు

సంవత్సరానికి 80 లక్షల టివి ప్యానల్స్, 3 కోట్ల మొబైల్ యూనిట్స్ తయారు చేస్తున్న టిసిఎల్ 

టిసిఎల్ కంపెనీ సీఎఫ్ఓ మైకెల్ వాంగ్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ 

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన లోకేష్ 

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడా లేని పాలసీని తీసుకొచ్చాం.ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తున్నాం 

దేశంలో పనిచేస్తున్న మూడు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ఇప్పటి వరకూ దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ మాత్రమే జరిగింది

కానీ ఆంద్రప్రదేశ్ లో నిజమైన ఎలక్ట్రానిక్స్ తయారీ జరగాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం 

డిజైన్ టూ డెత్ అనే మోడల్ లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం 

ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్,పిసిబి,చిప్ డిజైన్,కెమెరా మాడ్యూల్స్,బ్యాటరీ ఇలా అన్ని ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం 

చెన్నై,బెంగుళూరు కారిడార్ ని వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు వివిధ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చాం 

రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క మొబైల్ కూడా తయారు కాలేదు కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న 100 ఫోన్లలో 30 ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయి 

ఫాక్స్ కాన్,సెల్ కాన్, కార్బన్ ,డిక్సన్ ఇప్పటికే వచ్చాయి 

హొలీ టెక్ ,ఫ్లెక్స్ ట్రానిక్స్, రిలయన్స్ జియో త్వరలో రాష్ట్రంలో కంపెనీలను ప్రారంభించబోతున్నాయి 

చైనా కి చెందిన హొలీ టెక్ మొదటి సారి చైనా బయట ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడుతుంది 

కొరియా కంపెనీ అయిన కియా భారీ పెట్టుబడి పెట్టింది...త్వరలో కంపెనీ నిర్మాణం కూడా పూర్తి అవ్వబోతుంది 

ఆంధ్రప్రదేశ్ లో కంపెనీల ఏర్పాటు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది 

దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము నెంబర్ ఒన్ గా ఉన్నాం...పరిశ్రమ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారానే మేము వరుసగా రెండో సారి నెంబర్ ఒన్ స్థానంలో నిలబడ్డాం

ఇండియాలో ప్రతి సంవత్సరం 500 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ వినియోగిస్తున్నారు 

అందులో 50 శాతం...250 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు చెయ్యాలి అని టార్గెట్ గా పెట్టుకున్నాం 

ఆంధ్రప్రదేశ్ లో మినీ షేన్ జెన్ ఏర్పాటు చెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం

మీ కంపెనీ ఏర్పాటు కు పూర్తి సహకారం అందిస్తాం 

మీకు విడిభాగలు సప్ప్లై చేస్తున్న 15 కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అని కోరుతున్నాను

...మంత్రి నారా లోకేష్

ఈ కార్యక్రమంలో ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రెటరీ విజయానంద్, ఎలక్ట్రానిక్స్ శాఖ సిఈఓ భాస్కర్ రెడ్డి,టిసిఎల్ కంపెనీ రీజనల్ డైరెక్టర్ ఇండియా టిసిఎల్ కమ్యూనికేషన్స్ భరద్వాజ్,టిసిఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

చైనాలోని షేన్జెన్లో టిసిఎల్ కంపెనీ సిఈఓ కెవిన్ వాంగ్ తో గురువారం భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ..ఏపీకి టీసీఎల్ రావాలని ఆహ్వానించారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టిసిఎల్,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది.

Link to comment
Share on other sites

ఏపీపై ‘ఎవరీ’ ఆసక్తి
22-09-2018 02:54:27
 
636731816650256129.jpg
  • రాష్ట్రంలో పర్యటిస్తాం.. పెట్టుబడులు పెడతాం
  • లోకేశ్‌కు చెప్పిన ‘ఎవరీ’ చైర్మన్‌
  • చైనా టూర్‌లో వివిధ కంపెనీలతోనూ మంత్రి చర్చలు
  • త్వరలో హాంకాంగ్‌ నుంచి తిరుపతికి విమాన సర్వీసులు
  • 130 ఎకరాల్లో రిలయన్స్‌ జియో
 
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ) తయారీ కంపెనీ ‘ఎవరీ’ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ షెన్‌జెన్‌లోని ‘ఎవరీ’ కంపెనీని సందర్శించారు. ఆ కంపెనీ చైర్మన్‌ చార్లె్‌సతో భేటీ అయ్యారు. స్టార్టప్‌ రాష్ట్రంగా అభివృద్ధిలో ఏపీ ఏ విధంగా పరుగులు పెడుతుందో ఆయనకు లోకేశ్‌ వివరించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో నంబరు వన్‌గా ఉన్నాం. పరిశ్రమలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో వరుసగా రెండోసారి నంబరు వన్‌ స్థానాన్ని పదిలపరుచుకొన్నాం. దేశంలో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రకటించిన ఒకే ఒక రాష్ట్రం ఏపీ’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. సమయం వృథా చేయకుండా.. ఒప్పందం చేసుకొన్న వెంటనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. ‘భారత్‌లో మార్కెట్‌ పెరుగుతోంది. మీ దేశంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంది’ అని ఎవరీ చైర్మన్‌ చార్లెస్‌ ఈ సందర్భంగా బదులిచ్చారు. ‘మీ రాష్ట్రం విజన్‌ నచ్చింది. త్వరలోనే మా బృందం ఏపీకి వస్తుంది. అక్కడ పర్యటించి పరిస్థితులు అంచనా వేసుకొని ఒక నిర్ణయానికి వస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.
 
వేగంగా అనుమతులు
ఏఏసీ టెక్నాలజీస్‌ ఉపాధ్యక్షుడు కిమ్‌ చుల్‌, బొమిన్‌ ఎలక్ట్రానిక్స్‌ అసిస్టెంట్‌ ప్రెసిడెంట్‌ జింజర్‌ సూ, డబ్ల్యూయూఎస్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ క్రిస్‌ వూ, ఎస్జీసీ కంపెనీ చైర్మన్‌ మార్క్‌ జాంగ్‌, ఎస్వై టెక్‌ డైరక్టర్‌ చెన్‌, వివో కంపెనీ అధ్యక్షుడు షేన్‌ వెయ్‌ తదితరులతోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాయితీలు, 24 గంటల విద్యుత్‌, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, నైపుణ్యం కలిగిన యువత ఉందని మంత్రి వివరించారు. ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌, హోలీ టెక్‌, రిలయన్స్‌ జియో త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వంద పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీకి వచ్చి తమ దగ్గరున్న మూడు ఎలకా్ట్రనిక్స్‌ క్లస్టర్లు చూసిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరలోనే హాంకాంగ్‌ నుంచి తిరుపతికి డైరెక్ట్‌ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు.
 
 
యువతకు నైపుణ్య శిక్షణ
ఏపీ ప్రభుత్వం, ఇండియన్‌ సెల్యులార్‌-ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లోనూ మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. కంపెనీలకు కావాల్సిన విధంగా యువతకు శిక్షణ ఇచ్చి వెంటనే ఉద్యోగాల్లో చేరే విధంగా సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రిలయన్స్‌ జియో త్వరలోనే తిరుపతిలో 130 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. ఏపీకి వస్తే కేవలం 21రోజుల్లోనే అనుమతులు, 8 నెలల్లో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర ఐటీ కార్యదర్శి విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

టోంగ్డా కంపెనీ వైస్ చైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ
22-09-2018 08:40:13
 
636732024107391902.jpg
చైనా: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చైనాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. శనివారం టోంగ్డా కంపెనీ వైస్‌ చైర్మన్‌ వాంగ్‌యాహువాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. మెబైల్‌ ఫోన్ల ప్లాస్టిక్‌ కేసింగ్‌ను  టోంగ్డా కంపెనీ తయారు చేయనుంది. 60 శాతం షావోమి ఫోన్లకు ప్లాస్టిక్‌ కేసింగ్‌‌‌ను ఆ కంపెనీ అందిస్తోంది. ఈ సందర్భంగా టోంగ్డా కంపెనీని ఏపీకి రావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. దీనిపై వాంగ్‌యాహువా స్పందిస్తూ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నామని అన్నారు. అక్టోబర్‌ రెండోవారంలో కంపెనీ బృందం ఏపీలో పర్యటిస్తుందని వాంగ్‌యాహువా తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీతో కలిసి పనిచేస్తామన్న హువావే కంపెనీ
22-09-2018 15:53:27
 
636732284046360757.jpg
చైనా: చైనాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశమై.. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. హువావే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హాన్ జియోతో లోకేష్‌ సమావేశమైయ్యారు. షేన్‌జెన్‌లోని హువావే కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు వెల్లడించారు.
 
 
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హువావే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హాన్ జియో తెలిపారు. ఏపీ విజన్ బాగుందని కితాబిచ్చారు. రియల్ టైం గవర్నెన్స్.. స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:
ఏపీతో కలిసి పనిచేస్తామన్న హువావే కంపెనీ
22-09-2018 15:53:27
 
636732284046360757.jpg
చైనా: చైనాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశమై.. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. హువావే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హాన్ జియోతో లోకేష్‌ సమావేశమైయ్యారు. షేన్‌జెన్‌లోని హువావే కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు వెల్లడించారు.
 
 
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హువావే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హాన్ జియో తెలిపారు. ఏపీ విజన్ బాగుందని కితాబిచ్చారు. రియల్ టైం గవర్నెన్స్.. స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Huwei vadni పడితే big achievement annatte.. 

Link to comment
Share on other sites

Lokesh NaraVerified account @naralokesh 3m3 minutes ago

 
 

Participated in a conference of Hongkong and Chinese investors organized by Astrum. The GoAP has already signed an MoU with Astrum which is into design and manufacturing of mobile accessories, audio devices and LED lights for setting up their unit in Tirupati.

Link to comment
Share on other sites

Lokesh NaraVerified account @naralokesh 4m4 minutes ago

 
 

They will invest Rs. 100 Crore and generate employment for 1000 people. Following the steps of Astrum, another three companies – LLK Design, Shenzhen Power Technology Limited & Dongguan Weiji Electronic Technology – have signed MoUs with Astrum to set up industries in AP.

1 reply 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

 
 
 
 
 
 
 

LLK Design will set up Innovation & Design Centre in Tirupati, Shenzhen Power will set up a manufacturing unit in Tirupati and Dongguan Weiji will provide technology support to Astrum’s operations. #ChinaTour2018

0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

టోంగ్డా కంపెనీ వైస్ చైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ
22-09-2018 08:40:13
 
636732024107391902.jpg
చైనా: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చైనాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. శనివారం టోంగ్డా కంపెనీ వైస్‌ చైర్మన్‌ వాంగ్‌యాహువాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. మెబైల్‌ ఫోన్ల ప్లాస్టిక్‌ కేసింగ్‌ను  టోంగ్డా కంపెనీ తయారు చేయనుంది. 60 శాతం షావోమి ఫోన్లకు ప్లాస్టిక్‌ కేసింగ్‌‌‌ను ఆ కంపెనీ అందిస్తోంది. ఈ సందర్భంగా టోంగ్డా కంపెనీని ఏపీకి రావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. దీనిపై వాంగ్‌యాహువా స్పందిస్తూ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నామని అన్నారు. అక్టోబర్‌ రెండోవారంలో కంపెనీ బృందం ఏపీలో పర్యటిస్తుందని వాంగ్‌యాహువా తెలిపారు
Link to comment
Share on other sites

kontha mandi enduku saami antha kindal gaa matladutaru ...

Lokesh thana prayatnam thanu chesthunnadu gaa ... enni materialize avthai anedi pakkana pettandi ...

everyone in TDP, including Lokesh thama prayatnam thaamu chestunnaru ... investments/companies oorike ravuga ... they have other options, we need to present ourselves in a convincing way ... that's what Loki is doing.

I for one, appreciate that.

History tells us this kind of progress only happens under TDP government. Don't forget that.

TDP abhimanulam anukuntu ... support cheyyaka poina kindal cheyyakandi ... we have enough ycp/js/bjp maroons for that.

 

Link to comment
Share on other sites

అస్ట్రం సహా 4 కంపెనీలు 
తిరుపతిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం 
ఎల్‌ఎల్కే ఇన్నోవేషన్‌, డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు 
మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఒప్పందాలు 
22ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: చైనాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ అస్ట్రంతోపాటు మరో మూడు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ క్లస్టర్‌లో రూ.వంద కోట్ల పెట్టుబడితో కంపెనీని ఏర్పాటుచేసి వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు అస్ట్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అస్ట్రంకు అనుబంధంగా చైనాకు చెందిన ఎల్‌ఎల్కే డిజైన్‌ కంపెనీ తిరుపతిలో ఇన్నోవేషన్‌, డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. అదే ప్రాంతంలో షేన్‌ జెన్‌ పవర్‌ టెక్నాలజీ, డాన్గువాన్‌ వైజి ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి లోకేశ్‌.. అస్ట్రం కంపెనీ ఆధ్వర్యంలో బీజింగ్‌లో శనివారం ఏర్పాటుచేసిన హాంకాంగ్‌, చైనా పెట్టుబడుదారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అవకాశాలను అంచనా వేసేందుకు త్వరలోనే వస్తామని చైనాకు చెందిన సీవీటీఈ కంపెనీ డైరక్టర్‌ హువాంగ్‌ జేన్కాంగ్‌ మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. 
* రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టోంగ్జా కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ వాన్గ్‌ యాహువా సానుకూలత వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్ల ప్లాస్టిక్‌ కేసింగ్‌ తయారీలో దిగ్గజ సంస్థ అయిన టోంగ్జా 60 శాతం షామి ఫోన్లకు ప్లాస్టిక్‌ కేసులు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో వైస్‌ ఛైర్మన్‌ వాన్గ్‌ను కలిసిన మంత్రి లోకేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రానికి బృందాన్ని పంపుతామని, అనంతరం పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని వాన్గ్‌ హామీ ఇచ్చారు. 
* క్లౌడ్‌ డేటా సెంటర్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ తదితర సేవలు అందిస్తున్న హువావే కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హాన్‌ జియో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్ర విజన్‌ బాగుందని, రియల్‌ టైం గవర్నెన్స్‌, స్మార్ట్‌ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. చైనాలోని షేన్‌జెన్‌లోగల హువావే కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేశ్‌ సందర్శించి సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఐటీ టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. యువనేస్తం, డ్రోన్ల వినియోగం తదితర అంశాలను మంత్రి ప్రస్తావించారు. కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి విజయానంద్‌, ఎలక్ట్రానిక్స్‌ సీఈవో భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఏపీకి టోంగ్డా.. ఆస్ట్రల్‌!
23-09-2018 03:28:03
 
636732700813123477.jpg
  • భారీగా పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు.. ఇన్నోవేషన్‌-డిజైన్‌ సెంటర్‌
  • ఏర్పాటుకు ఎల్‌ఎల్కే సంసిద్ధత
  • తయారీ కంపెనీ నెలకొల్పేందుకు షెన్‌జెన్‌ పవర్‌ టెక్నాలజీస్‌ సుముఖత
  • ఆర్టీజీ, స్మార్ట్‌ గ్రామాలకు హువావే సహకారం
  • చైనాలో పలు కంపెనీలతో మంత్రి లోకేశ్‌ భేటీ
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మొబైల్‌ ఫోన్ల ప్లాస్టిక్‌ కేసింగ్‌ తయారీలో పేరెన్నికగన్న ‘టోంగ్డా’ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తంచేసింది. ఇప్పటివరకూ ఈ కంపెనీ చైనాను దాటింది లేదు. కానీ తొలిసారిగా దేశం వెలుపల.. అదీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత తెలియజేసింది. అక్టోబరు రెండో వారంలో టోంగ్డా ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించి.. తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ కంపెనీ ఉపాధ్యక్షుడు వాంగ్‌ యాహువా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు హామీ ఇచ్చారు. చైనాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌.. శనివారం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
 
ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై టోంగ్డా ఉపాధ్యక్షుడు వాంగ్‌కు ఆయన వివరించారు. 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని, కంపెనీ అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్రంలోని యువతీ యువకులకు ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తామని లోకేశ్‌ తెలిపారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని వివరించారు. ప్రస్తుతం చైనాలోని టోంగ్డా కంపెనీలో 24 వేల మంది పనిచేస్తున్నారు. ఏపీలో కంపెనీ పెడితే 5వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.
 
ఆస్ట్రల్‌కు మరో 3 కంపెనీల దన్ను
ఆస్ట్రల్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో లోకేశ్‌ పాల్గొన్నారు. తిరుపతిలో రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే కంపెనీలో వెయ్యిమందికి ఉపాధికల్పనకు ఆస్ట్రల్‌ ఒప్పందం చేసుకుంది. ఆడియో పరికరాలు, ఎల్‌ఈడీ బల్బులు, సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ విడిభాగాలు, గేమ్‌ కంట్రోలర్స్‌ తదితరాలను ఆస్ట్రల్‌ ఉత్పత్తి చేస్తుంది. తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ తయారీ జోన్‌లో ఈ కంపెనీ రానుంది. ఆస్ట్రల్‌తో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో 3 కంపెనీలు ముందుకొచ్చాయి. ఎల్‌ఎల్కే డిజైన్‌ కంపెనీ తిరుపతిలో ఇన్నోవేషన్‌-డిజైన్‌ సెంటర్‌, షెన్‌జెన్‌ పవర్‌ టెక్నాలజీ సంస్థ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నాయి. సాంకేతిక సాయం అందించేందుకు డాన్గువాన్‌ వైజీ ఎలకా్ట్రనిక్స్‌ టెక్నాలజీ కంపెనీ ఆస్ట్రల్‌తో ఒప్పందం చేసుకొంది. ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హువావే కంపెనీ పేర్కొంది. ‘ఏపీ విజన్‌ బాగుంది. ఆర్టీజీ, స్మార్ట్‌ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం’ అని ఆ కంపెనీ చీఫ్‌ హాన్‌ జియో హామీ ఇచ్చారు.
 
రాష్ట్రానికొస్తాం
సీవీటీఈ వెల్లడిఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌, కార్పొరేట్‌ ఎడ్యుకేషన్‌, ఇంటెలిజెన్స్‌ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో సేవలందిస్తున్న సీవీటీఈ కంపెనీ డైరెక్టర్‌ హువాంగ్‌ జేన్గాంగ్‌తోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరించారు. డీటీపీ విధానం ద్వారా 50% అద్దె రాయితీతో కార్యాలయ స్పేస్‌ ఇస్తున్నామని, తాత్కాలిక కంపెనీ ఏర్పాటు చేసి కనీసం ఏడాదిపాటు కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత భూములు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాంక్లిన్‌, కాన్డుయ్యయెంట్‌, హెచ్‌సీఎల్‌, జోహో వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అమరావతికి ఇన్వికాస్‌, రిలయన్స్‌ పరిశోధన అభివృద్ధి సంస్థలు వస్తున్నాయని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచన ఉందని, ఏపీలో ఉన్న అవకాశాలను అంచనా వేసుకొనేందుకు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని జేన్గాంగ్‌ బదులిచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...