Jump to content

lokesh china tour


sonykongara

Recommended Posts

మంత్రి లోకేష్‌కు అరుదైన ఆహ్వానం
12-09-2018 17:04:48
 
636723686894826055.jpg
అమరావతి: మంత్రి నారా లోకేష్‌కు అరుదైన ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్ 18 నుండి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక
సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్‌ను ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానం మేరకు మంత్రి లోకేష్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా జరిగే 11 ఆర్థికపరమైన సమావేశాల్లో లోకేష్ ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ ఐదురోజుల చైనా పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనడంతో పాటు.. పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. ఆయా తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
Link to comment
Share on other sites

చైనా ప‌ర్యట‌న‌కు వెళ్లిన మంత్రి లోకేశ్
15-09-2018 22:32:44
 
636726475653804614.jpg
అమరావతి:  ఏపీ మంత్రి నారా లోకేశ్.. చైనా ప‌ర్యట‌న‌కు వెళ్లారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంపియ‌న్స్ వార్షిక స‌మావేశాల‌లో ఆయన పాల్గొననున్నారు. ఇండియా త‌ర‌ఫున మంత్రి నారా లోకేశ్‌కు మాత్రమే ఈ అవ‌కాశం లభించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీల ప్రతినిధుల‌తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల‌తోనూ మంత్రి లోకేశ్ స‌మావేశంకానున్నారు
Link to comment
Share on other sites

22 minutes ago, sonykongara said:
చైనా ప‌ర్యట‌న‌కు వెళ్లిన మంత్రి లోకేశ్
15-09-2018 22:32:44
 
636726475653804614.jpg
అమరావతి:  ఏపీ మంత్రి నారా లోకేశ్.. చైనా ప‌ర్యట‌న‌కు వెళ్లారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంపియ‌న్స్ వార్షిక స‌మావేశాల‌లో ఆయన పాల్గొననున్నారు. ఇండియా త‌ర‌ఫున మంత్రి నారా లోకేశ్‌కు మాత్రమే ఈ అవ‌కాశం లభించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీల ప్రతినిధుల‌తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల‌తోనూ మంత్రి లోకేశ్ స‌మావేశంకానున్నారు

:no1:

Link to comment
Share on other sites

మెగా పరిశ్రమలే లక్ష్యం!
16-09-2018 03:11:46
 
636726643079160651.jpg
  • భారీ పెట్టుబడి ఒప్పందాలకు కసరత్తు
  •  చైనా పర్యటనకు లోకేశ్‌.. ఎకనమిక్‌ సదస్సులో ప్రసంగం
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ చైనా పర్యటనకు బయల్దేరారు. ఎలక్ర్టానిక్‌ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలన్నది ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. శనివారం అర్థరాత్రి ఆయన బయల్దేరి వెళ్లారు. 16 నుంచి 22 వరకూ పర్యటిస్తారు. సీఈవోలతో భేటీ అవుతారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. మరోవైపు రాష్ట్రంలో 15వేల మంది ఒకేచోట పనిచేసేలా ఫాక్స్‌కాన్‌ కంపెనీని తీసుకురాగా.. తిరుపతిలో రానున్న రిలయన్స్‌ సెజ్‌లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పుడు అంతకుమించి ఒకేచోట లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే మెగా ఫ్యాక్టరీ దిశగా పెట్టుబడులు తేవాలన్నది తన లక్ష్యంగా లోకేశ్‌ ఇటీవల ప్రకటించారు. చైనాలోని షెంజెన్‌ నగరం ఇలాంటి మెగా ప్రాజెక్టులకు ప్రసిద్ధి. ఆ నగరంలో కూడా రెండురోజుల పాటు లోకేశ్‌ పర్యటించనున్నారు. లోకేశ్‌తో పాటు ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, ఐటీ కార్యదర్శి విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులు చైనా వెళ్లారు.
Link to comment
Share on other sites

4 minutes ago, NatuGadu said:

You jelous

Daaniki emundi, Konchem elections varakaina ee over bhajana aapithe better emo. Edo lokesh capabilities choosi pilichinatlu antunte navcochhindi.

CBN/Govt. invitation ki Lokesh ni pamputhunnaru.

If Lokesh Brings 5-10 Big IT Companies with his capability & able to give 1 Lakh employment in IT industry (AP) before May-2019 as per his commitment i will also praise him in DB. Till then wait & watch.

Link to comment
Share on other sites

11 minutes ago, RKumar said:

Daaniki emundi, Konchem elections varakaina ee over bhajana aapithe better emo. Edo lokesh capabilities choosi pilichinatlu antunte navcochhindi.

CBN/Govt. invitation ki Lokesh ni pamputhunnaru.

If Lokesh Brings 5-10 Big IT Companies with his capability & able to give 1 Lakh employment in IT industry (AP) before May-2019 as per his commitment i will also praise him in DB. Till then wait & watch.

so Lokesh has to prove himself antav... but ela? 5-10 companies kaadhu... 30-40 techhina, CBN vunnantha kalam... even if it is the work of Lokesh, the credit always goes to CBN. There is no way this can change.

Link to comment
Share on other sites

1 minute ago, katti said:

so Lokesh has to prove himself antav... but ela? 5-10 companies kaadhu... 30-40 techhina, CBN vunnantha kalam... even if it is the work of Lokesh, the credit always goes to CBN. There is no way this can change.

Ippati varaku CBN valla vachhina companies tanu techhinatlu choopincharu kada, ippudu on his own let him bring few IT companies.

HCL laanti pedda company CBN 2 years nunchi follow up chesthe ippudu realize avuthondi. Let Lokesh follow up with few other big IT organizations.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Ippati varaku CBN valla vachhina companies tanu techhinatlu choopincharu kada, ippudu on his own let him bring few IT companies.

HCL laanti pedda company CBN 2 years nunchi follow up chesthe ippudu realize avuthondi. Let Lokesh follow up with few other big IT organizations.

akkada lokesh follow up chesina inkokallu follow up chesina at the end the credit always goes to CBN. even investors look at CBN before they invest. so sorry... ur wish cannot not be achieved...

Link to comment
Share on other sites

hope our ap team is safe ...

part of trip lokesh&team scheduled  meetings in shenzhen electronic park (in return) slong with wef forum speech up north...

He was in beijing yesterday and i hope they are still north(as tianjin wef speech on 18th-20)

 

 

They had storm of century in shenzhen and lot of damage to electrnoic clusters and total hardware mfg belt..initial report shows total electrokic city impacted....

 

 

https://twitter.com/jenzhuscott/status/1041194429598453760

Link to comment
Share on other sites

Government eyes USD 240-billion electronics industry in Andhra Pradesh

Minister for IT, Electronics and Communication Nara Lokesh has said the State government aims to have electronic manufacturing industry worth USD 240 billion in Andhra Pradesh.

Published: 17th September 2018 06:34 AM  |   Last Updated: 17th September 2018 06:34 AM   |  A+A-

eyes.jpg

Lokesh interacts with China Telugu Association members in Beijing on Sunday

By Express News Service

VIJAYAWADA: Minister for IT, Electronics and Communication Nara Lokesh has said the State government aims to have electronic manufacturing industry worth $240 billion in Andhra Pradesh. He said the State government was taking steps for achieving the target by creating a robust ecosystem to invest in AP.

Lokesh, on the first day of his six-day visit to China on Sunday, interacted with China Telugu Association members in Beijing, and pitched AP as the potential investment destination. “According to the projections, India will be a $480 billion market for electronic goods in the coming years. Our target is to manufacture at least half of the electronic products sold in India,” the minister observed.

He also appealed to the Telugu diaspora to promote Andhra Pradesh as an investment destination to the companies they are working in. “You are the brand ambassadors of our State,” he said.

From Tuesday, the IT minister will participate in the World Economic Forum’s three-day annual meeting. He will participate in 11 plenary sessions and meet the heads of electronics manufacturing firms including OnePlus, Xiaomi and others.

Link to comment
Share on other sites

చైనా పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్‌
17-09-2018 09:51:43
 
636727747001852582.jpg
అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ చైనా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సీఈటీసీ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ సీఈఓ వాన్గ్‌ బిన్‌తో లోకేష్‌ భేటీ అయ్యారు. సీఈటీసీ ఎలక్ర్టానిక్స్‌ అనే సంస్థ సోలార్‌ ఎనర్జీ సంబంధిత పరికరాలను తయారుచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్ స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య సుమారు అరగంటకు పైగా పలు విషయాలు చర్చకు వచ్చాయి.
 
 
లోకేశ్ మాట్లాడుతూ.. " ఏపీలో పునరుత్పాదక శక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. నాలుగేళ్లలో 6.8 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అందుకున్నాం. మరో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన సహకారం అందిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. సీఈటీసీ సబ్సిడరీ కంపెనీలు, సప్లయర్‌ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం కావాలని కోరాం. కంపెనీల ఏర్పాటులో ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని ఆయా కంపెనీల సీఈవోలకు వివరించాం. ఏపీలో సీఈటీసీ కార్యకలాపాలు విస్తరించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి" అని లోకేష్‌ వివరించారు.
 
 
సీఈటీసీ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ సీఈఓ వాన్గ్‌బిన్‌ మాట్లాడుతూ.. " ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. కంపెనీ విస్తరణ పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సప్లైయర్ కంపెనీలు,సబ్సిడరి కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తాం. ఏపీలో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. కంపెనీ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఈటీసీ సబ్సిడరీ కంపెనీలు, సప్లయర్‌ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తాం" అని ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీకి పెట్టుబడులతో రండి: లోకేశ్‌

10203017BRK110-LOKESH.JPG

బీజింగ్‌: చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ కంపెనీల ప్ర‌తినిధుల‌తో మంత్రి నారా లోకేశ్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు అంగీకారం తెలిపాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని రాష్ట్రానికి ఆహ్వానించడమే లక్ష్యంగా ఆయన రెండో రోజు పర్యటన సాగింది. బీజింగ్‌లో ప్ర‌ఖ్యాత కంపెనీల య‌జ‌మానులు, సీఈవోల‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి వారిని మెప్పించి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా షామీ సప్లయర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో లోకేశ్‌ పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనువైన పరిస్థితుల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్టార్టప్‌ రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నామ‌ని, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని వారికి ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ స్థాపించిన కంపెనీలు ఏ ఒక్క‌దానికి విద్యుత్‌, నీరు, మౌలిక స‌దుపాయాల స‌మ‌స్య లేద‌ని తెలిపారు. ఫాక్స్ కాన్ కంపెనీలో ఒకేచోట ఎటువంటి ఇబ్బంది లేకుండా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నార‌ని, ఫాక్స్ కాన్, సెల్‌కాన్‌, కార్బన్, డిక్సన్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయ‌ని, రిలయన్స్ జియో త్వరలోనే తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయ‌నుంద‌ని మంత్రి వివ‌రించారు. నాలుగున్నరేళ్లలో ఆటోమొబైల్ రంగంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయ‌ని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంపెనీ అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపు, మౌలిక వసతులు కల్పించిన అద్దె భవనాలు కూడా ఏర్పాటు చేస్తామ‌ని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనువైన వాతావరణం క‌ల్పిస్తామ‌ని మంత్రి వారికి హామీ ఇచ్చారు. షామి స్లపయర్‌ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఈ భేటీలు, చ‌ర్చ‌ల‌లో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కార్యదర్శి విజయానంద్, అధికారులు, షామీ వైస్ ప్రెసిడెంట్ ఫెంగ్, సీవోవో మురళి, హొలీ టెక్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్గ్, షామి సప్లయర్స్‌ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

10203517BRK110-LOKESH1.JPG

Link to comment
Share on other sites

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న మంత్రి లోకేష్
18-09-2018 09:58:06
 
636728614833872561.jpg
అమరావతి:  ఏపీ మంత్రి నారా లోకేష్  చైనా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూ ఛాంపియన్స్‌ వార్షిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా హియర్‌ టెక్నాలజిస్‌ హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ మెలోడీతో లోకేష్‌ భేటీ అయ్యారు. కంటెంట్‌, ట్రాకింగ్‌, లొకేషన్‌ సర్వీసెస్‌, ఐటీ సేవలను హియర్‌ టెక్నాలజిస్‌ అందిస్తోంది. ఏపీలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఫ్రాంక్లిన్‌, కాన్డ్యూయెంట్‌లాంటి కంపెనీలు విశాఖకు వచ్చాయన్నారు. ఏపీలో నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, కంపెనీ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి అని మంత్రి లోకేష్‌ కోరారు. అలాగే అక్టోబర్‌లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్‌లో పాల్గొనాల్సిందిగా హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీని ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...