Jump to content

కేర‌ళ‌కు ఆంధ్రప్రదేశ్ రూ.51 కోట్ల సాయం

sonykongara

Recommended Posts

కేర‌ళ‌కు ఆంధ్రప్రదేశ్ రూ.51 కోట్ల సాయం
11-09-2018 20:24:29
 
636722942695597920.jpg
  • రూ.35 కోట్ల న‌గ‌దు
  • రూ.15 కోట్ల విలువైన స‌హాయ సామ‌గ్రి
  • రేపు కేర‌ళ‌లో అంద‌జేయ‌నున్న ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌
అమ‌రావ‌తి: అకాల వర్షాలతో కకావికలమై.. వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్న కేర‌ళ రాష్ట్రానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.51 కోట్ల‌కుపైగా సాయం అంద‌జేయ‌నుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.51.018 కోట్ల న‌గ‌దు, స‌హాయ సామ‌గ్రిని మంగళవారం కేర‌ళ‌కు పంపింది. ఇందులో రూ.35 కోట్ల విరాళం కాగా, మిగిలినవి సహాయ సామ‌గ్రి. ఏపీ ఉపముఖ్య‌మంత్రి చిన రాజ‌ప్ప‌, ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు ఈ సహాయాన్ని బుధ‌వారం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌యన్‌కి అంద‌జేస్తారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు త‌మ ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన .20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.కోటి, పీఐఐసీ నుంచి రూ.17 ల‌క్ష‌ల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.8.09 ల‌క్ష‌లు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ ట‌న్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామ‌గ్రి, విశాఖ‌ప‌ట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్ప‌ట్లు ఇత‌రత్రా స‌హాయ సామ‌గ్రి ఇందులో ఉన్నాయి.
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

APNGO employees 1 day salary 20 crores aa.. shockingg

Link to comment
Share on other sites

చంద్రబాబుకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
16-09-2018 12:23:08
 
636726973852985752.jpg
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. కేరళలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థల నుంచి సహాయాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు చేసిన సహాయం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది.., తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది భారతీయ సంస్కృతీ నిదర్శనం..., మీరు చేసిన సహాయంలో 40.180 కోట్ల రూపాయలలో 10కోట్లు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అందించడం గొప్ప విషయం’ అని ఆ లేఖలో రాశారు.
Link to comment
Share on other sites

మీ సాయానికి కృతజ్ఞతలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేరళ సీఎం లేఖ
02501616BRK84A.JPG

అమరావతి: వరదలతో ఆపదలో చిక్కుకున్న కేరళను పెద్ద మనసుతో ఆదుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కేరళ సీఎం పినరయి విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున కేరళ సహాయనిధికి రూ.10కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, వివిధ సంఘాల నుంచి కేరళకు రూ.40కోట్ల సాయం అందిందని లేఖలో పేర్కొన్నారు. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పెద్ద మనసుతో స్పందించారని కొనియాడారు. సాటి భారతీయులుగా ఏపీ ప్రజల స్పందనకు గర్విస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...