Jump to content

MMS & Chiddu gaali theesina Raghuram Rajan


Kiran

Recommended Posts

ప్రధాని కార్యాలయం పట్టించుకోలేదు 
రుణాలు ఎగవేసిన  పెద్ద తిమింగలాల జాబితా పంపించా 
కేసు నమోదు చేద్దామన్నా 
అయినా ఫలితం కనిపించలేదు 
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడి 
దిల్లీ 
11ap-main13a.jpg

బ్యాంకు రుణాల కుంభకోణాలపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ బాంబు పేల్చారు. ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే తప్పుబట్టారు. రుణాలు ఎగవేసి తప్పించుకుంటున్న పెద్ద తిమింగలాల గురించి ప్రధాని కార్యాలయానికి తెలియజేసినా పట్టించుకోలేదని చెప్పారు. భాజపా నేత మురళీ మనోహర్‌ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘానికి సమర్పించిన నివేదికలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రఘురామ్‌రాజన్‌.. 2016, సెప్టెంబరు వరకు మూడేళ్ల పాటు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేశారు. ‘‘బ్యాంకులను మోసం చేసే కేసులను ప్రారంభంలోనే గుర్తించేందుకు నేను రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు మోసాల గుర్తింపు విభాగాన్ని ఏర్పాటు చేశాను. ప్రధాని కార్యాలయానికి పెద్ద స్థాయి కేసుల జాబితాను పంపించాను. కనీసం ఒకరిద్దరిపైన అయినా కేసు నమోదు చేసేందుకు సమన్వయంగా పని చేద్దామని విజ్ఞప్తి చేశాను. అయినా ఈ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. వాస్తవానికి అత్యవసరంగా  చర్యలు తీసుకోవాల్సిన వ్యవహారమిది.’’ అని రఘురామరాజన్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క అవినీతిపరుడిపై అయినా ఈ వ్యవస్థ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్కరిపైనైనా కేసు నమోదు చేయలేకపోయింది. దగాలను అడ్డుకోలేకపోయారు.’’ అని రాజన్‌ చెప్పారు.  కొన్ని సందర్భాల్లో బ్యాంకులు స్వయంగా శ్రద్ధ పెట్టి పరిశీలించకుండానే ప్రమోటర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు రూపొందించిన ప్రాజెక్టు నివేదికల ఆధారంగానే రుణాలు ఇవ్వడానికి అంగీకరించాయి. బ్యాంకర్లు అతివిశ్వాసానికి పోయాయరన్నది స్పష్టం. చాలా బ్యాంకులు స్వతంత్రంగా అధ్యయనం చేయలేదు. ఎస్‌బీఐ క్యాప్స్‌, ఐడీబీఐపై ఎక్కువగా ఆధారపడ్డాయి.’’ అని చెప్పారు. అనుమానాస్పద రీతిలో బొగ్గు గనులను కేటాయించడం వంటి పరిపాలన సమస్యలకు తోడు దర్యాప్తు భయం వంటివి ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ఈ పరిణామం యూపీఏ,

ప్రాజెక్టులు నిలిచిపోవడంతో వాటి వ్యయం పెరిగిపోయిందని, రుణం చెల్లింపు కష్టంగా మారిందని చెప్పారు. భారత్‌లో విద్యుత్తు కొరత ఉందని, అయినా విద్యుత్తు ప్రాజెక్టుల్లో ప్రతిష్టంభన కొనసాగడం చూస్తుంటే ప్రభుత్వం తగినంత వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతోందని స్పష్టమవుతోందన్నారు. నిరర్ధక ఆస్తులను గుర్తించడంలో విఫలమయ్యారంటూ తనపై వచ్చిన విమర్శలను రఘురామ్‌రాజన్‌ తిప్పికొట్టారు. ఈ విమర్శలు హాస్యాస్పదమన్నారు. ఆయా ప్రాజెక్టుల విలువను బ్యాంకులు అతిగా అంచనా వేసిన తొలినాళ్లలోనే రుణాల తీరుతెన్నులపై రిజర్వుబ్యాంకు అప్రమత్తం చేసి ఉండాల్సిందని అంగీకరించారు. నిబంధనలను పాటించని బ్యాంకులపై జరిమానాలు విధించడంలో మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఉండాల్సిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తోందన్నారు.

రఘురామ్‌రాజన్‌ నివేదికను కాంగ్రెస్‌ అవకాశంగా మలుచుకుంది. ఆయన ప్రధాని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుబట్టారని పేర్కొంది. రుణాలు ఎగవేసిన వారెవరో తెలిసినా ప్రధాని చర్య ఎందుకు తీసుకోలేదని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. యూపీఏ అధికారంలోంచి దిగినప్పుడు నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.83లక్షల కోట్లేనని, ఇప్పుడు ఎగవేసిన రుణాల విలువ రూ.12లక్షల కోట్లు అని విమర్శించారు.

Link to comment
Share on other sites

Chiddu & MMS gali tiyyatam kadu, eeyana B odi gadi ni nanga chesadu ga

"రఘురామ్‌రాజన్‌ నివేదికను కాంగ్రెస్‌ అవకాశంగా మలుచుకుంది. ఆయన ప్రధాని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుబట్టారని పేర్కొంది. రుణాలు ఎగవేసిన వారెవరో తెలిసినా ప్రధాని చర్య ఎందుకు తీసుకోలేదని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. యూపీఏ అధికారంలోంచి దిగినప్పుడు నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.83లక్షల కోట్లేనని, ఇప్పుడు ఎగవేసిన రుణాల విలువ రూ.12లక్షల కోట్లు అని విమర్శించారు."

Link to comment
Share on other sites

52 minutes ago, curiousgally said:

reading several news papers with details that RR alerted PMO office with the details and PMO just sat on it doing nothing...

I didn't read the report but if true, entha convenient ga ignore chesaaru report lo aaa details ee thread lo veyyakundaa.  ?

ninna news adhi, ivalti news idhi, ninna cong ni kumme sariki, balancing act today, as usual mana papers ninna news ignored ivalti news highlighted :comfort:

Link to comment
Share on other sites

21 minutes ago, niceguy said:

UPA 10 yrs lo 2.83L koka

B00di 4 yrs lo 12L koka

 

NDA didn't give new loans, aa loan bokkalu bayata padataniki time pattindhi :comfort:

rajan babu cheppadu ga NPA bokkalu gift of UPA, and NDA didn't pay attention on the magnanimity of the issue.

Link to comment
Share on other sites

Just now, Kiran said:

NDA didn't give new loans, aa loan bokkalu bayata padataniki time pattindhi :comfort:

rajan babu cheppadu ga NPA bokkalu gift of UPA, and NDA didn't pay attention on the magnanimity of the issue.

4.6 years Modi emi chesadu action teesukokunda?

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

4.6 years Modi emi chesadu action teesukokunda?

cbn 4 yrs emi chesadu la undhi quechen, inka PM ayyi 4.6 yrs avvala relax ?

Banks dry ante Demo set chesadu, but ee defaults major issue ayyaka insolvency law set chesadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...