Jump to content

Haranna as Chaithanya Rathasaradhi in which year


MadhuNTR

Recommended Posts

నాడు అన్న ఎన్టీఆర్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో హరికృష్ణ సేవలు మరువలేనివి. తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తొలినాళ్లలో చైతన్య యాత్ర పేరుతో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్టీఆర్ చైతన్యరథంపైనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. ఆయనకు చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. పాత చెవ్రోలెట్ వ్యానును రిపేరు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు.
 
పాతవాహనం చైతన్యరథంగా రూపుదిద్దుకోవడంలో హరికృష్ణ శ్రమదాగి ఉంది. తండ్రి ఓ శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణించి తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను దోచుకుంటే, ఆ వాహనాన్ని కొడుకే నడిపి శెభాష్ అనిపించుకున్నారు. వేలాది కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషిచేశారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నంత కాలం తెరవెనుకకు మాత్రమే పరిమితమైన హరికృష్ణ, అనంతర ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక పదవులు చేపట్టారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనానికి సారథిగా వ్యవహరించారు. 1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు తొమ్మిది నెలలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలా 40,000 కిలోమీటర్లు చైతన్య రథం నడిపి, ఎన్టీఆర్ పర్యటనను విజయవంతం చేశారు.
 
Link to comment
Share on other sites

3 hours ago, MadhuNTR said:

Few of our db members posted that Haranna bacame active in TDP after 1984 episode or was he there since TDP party initial days. Can any one confirm?

1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు తొమ్మిది నెలలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలా 40,000 కిలోమీటర్లు చైతన్య రథం నడిపి, ఎన్టీఆర్ పర్యటనను విజయవంతం చేశారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...