Jump to content

కర్ణాటక సీఎం కోడలిగా బెజవాడ అమ్మాయి.


sonykongara

Recommended Posts

ర్ణాటక సీఎం కోడలిగా బెజవాడ అమ్మాయి.!
01-09-2018 08:23:09
 
636713869913259488.jpg
విజయవాడ: అన్నీ ఓకే అయితే... కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోడలిగా బెజవాడ అమ్మాయి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుమారస్వామి శుక్రవారం ఉదయం నగరానికి వచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు అని అధికారికంగా వెల్లడించినా ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం కొడుకు నిఖిల్‌ గౌడకు పెళ్లి కుమార్తెను చూడటమేనని తెలిసింది. విజయవాడకు చెందిన ప్రముఖ పాదరక్షల కంపెనీ యజమాని కోటేశ్వరరావు కుమార్తెను చూసేందుకు కుమారస్వామి సతీసమేతంగా వచ్చినట్లు చెబుతున్నారు. కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.
 
పాదరక్షల కంపెనీ యజమాని కోటేశ్వరరావు ఇంట్లోనే కుమారస్వామి దంపతులు భోజనం చేశారు. పాదరక్షల కంపెనీ యజమాని కుమార్తెకు, కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో వీరిద్దరికీ వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కుమారస్వామి శుక్రవారం కాబోయే కోడలిని చూసుకునేందుకు విజయవాడ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లిచూపుల సమాచారాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయంటున్నారు. నిఖిల్‌ గౌడ.. దేవగౌడకు ముద్దుల మనవడు. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మితమైన జాగ్వార్‌ సినిమాతో 2016లో నిఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేశారు. భారీ ఖర్చుతో ఈ సినిమాను కుమారస్వామి స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్‌ రెండు కన్నడ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.
Link to comment
Share on other sites

సీఎం కుమారుడి నిశ్చితార్థంపై క్లారిటీ వచ్చేసింది..
01-09-2018 11:12:54
 
636713971759177539.jpg
బెంగళూరు: సీఎం కుమారస్వామి తన ఏకైక కుమారుడు, సినీ హీరో నిఖిల్‌ కుమార్‌ నిశ్చితార్థాన్ని ఖరారు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పర్యటన సాగించారనే వదంతులు బెంగళూరు నగరంలో హల్‌చల్‌ చేశాయి. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం కుమారస్వామి నేరుగా విజయవాడకు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం విజయవాడ కనకదుర్గ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత దేశ వ్యాప్తంగా పేరొందిన ప్రాఫిట్‌ షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. కుమారుడు నిఖిల్‌తో కోటేశ్వరరావు కుమార్తె నిశ్చితార్థం మాట్లాడుకునేందుకు సీఎం దంపతులు వెళ్లారనే వదంతులు హల్‌చల్‌ చేశాయి. సోషల్‌మీడియా, టీవీలలోనూ ప్రధానంగా కథనాలు వినిపించాయి.
 
 
ఇదే విషయమై ప్రాఫిట్‌ షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు అటువంటిదేమీ లేదని విజయవాడకు వచ్చినందుకు భోజనానికి ఆహ్వానించామని, పెళ్లి ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా నిఖిల్‌కు 2015లో కన్నడ సినీ నిర్మాత కె.సి.ఎన్‌.గౌడ కుమార్తెతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరిరువురూ ఎంబీఏలో క్లాస్‌మేట్స్‌. అయితే వివాహం ఎందుకు జాప్యమైందో తెలియరాలేదు.
Link to comment
Share on other sites

23 hours ago, niceguy said:

Zamindaaru gaaru Meeru kuda edo oka CM kuthurni loving sesi set sesthe paper lo news vasthadi..Palaana CM alludu gaa Vijayawada abbayi Razayya ani..

Telangana CM kuturini trying ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...