Jump to content

Railway Zone


sonykongara

Recommended Posts

రైల్వేజోన్‌ ఇచ్చేయండి
మాకే అభ్యంతరంలేదు
స్థాయీ సంఘం ముందు కుండబద్దలు కొట్టిన ఒడిశా ఎంపీ
పెండింగ్‌ అంశాలపై అధికారులను నిలదీసిన రామ్మోహన్‌నాయుడు
విభజన చట్టం అమలు సరిగాలేదని చిదంబరం తీవ్ర అసంతృప్తి
ఈనాడు - దిల్లీ
30ap-main5a.jpg

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడానికి తమకేమీ అభ్యంతరంలేదని ఒడిశా అధికార బిజూ జనతాదళ్‌(బీజేడీ) సీనియర్‌ ఎంపీ ప్రసన్నకుమార్‌ పట్సానీ పార్లమెంటు స్థాయీసంఘం ముందే కుండబద్దలు కొట్టారు. ‘‘విశాఖపట్నం మంచి నగరం. దానికి కొత్త రైల్వేజోన్‌ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరంలేదు. రైల్వేశాఖ దగ్గర కూడా డబ్బులున్నాయి. జోన్‌ ఏర్పాటుచేయడానికి ఇంకెందుకు ఆలస్యం’’అని కేంద్ర రైల్వేశాఖ అధికారులను అందరి ముందు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలుపై గురువారం సాయంత్రం పార్లమెంటు భవనంలోని 63వ నంబర్‌ మందిరంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో పార్లమెంటు స్థాయీసంఘం సమీక్ష నిర్వహించింది. ఇందులో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతోపాటు, 13 కేంద్రమంత్రిత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.

రైల్వేజోన్‌ను మేం వ్యతిరేకించడంలేదు
విభజన చట్టం అమలు సమీక్ష సమయంలో రైల్వేజోన్‌ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్న కుమార్‌ పట్సానీ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌ను తామేమీ వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు. అప్పుడు రామ్మోహన్‌నాయుడు జోక్యం చేసుకుంటూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఇద్దరూ ఇక్కడే ఉన్నాం... ఇద్దరూ ముక్తకంఠంతో జోన్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నప్పుడు మీరెందుకు నిర్ణయం  తీసుకోరని రైల్వే అధికారులను ప్రశ్నించారు. అందుకు ఆ శాఖ తరుఫున హాజరైన డైరక్టర్‌ స్థాయి అధికారులు స్పందిస్తూ రైల్వేజోన్‌ ఆర్థికంగా లాభదాయకం కాదని నివేదిక వచ్చిందని, అయినప్పటికీ తమ మంత్రి దానిపై కసరత్తు చేస్తున్నారని పాత సమాధానమే ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న అధికారులను స్థాయీ సంఘం సభ్యులంతా పెండింగ్‌ అంశాల అమలు తీరుపై ఆరాతీశారు.

నాలుగున్నరేళ్లయినా అమలేది?: విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లోని సంస్థల ఏర్పాటు, మౌలికవసతుల కల్పన, రెవెన్యూలోటు భర్తీ, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ అమలు, పన్నురాయితీల కల్పన, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం, శాసనసభ స్థానాల పెంపు, హైకోర్టు విభజన, రాజధాని నిర్మాణానికి కేంద్రసాయం, కృష్ణా నదీయాజమాన్య మండలి పనితీరుపై చిదంబరం ప్రశ్నలు సంధించారు. విభజన చట్టం అమల్లోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన ఎందుకు పూర్తికాలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యను రాష్ట్రాలు పరిష్కరించుకోలేనప్పుడు దానిపై నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీచేసే అధికారం మీకు ఉంది కదా? దాన్ని ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది.

14వ ఆర్థికసంఘం సిఫార్సులు ఎలా వర్తింపజేస్తారు?: ప్రత్యేకహోదా, రెవెన్యూలోటు భర్తీ గురించి రామ్మోహన్‌నాయుడు ఆర్థికశాఖ అధికారులపై ప్రశ్నలు సంధించారు. పీఆర్‌సీ బకాయిలను, వివిధ పెండింగ్‌ బిల్లులను రెవెన్యూలోటులోకి ఎందుకు తీసుకోలేదని అడిగారు. ప్రత్యేకహోదా ఇస్తామని 2014లో చెబితే 2015లో వచ్చిన 14వ ఆర్థికసంఘం సిఫార్సులను ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రకటించిన 15% పన్నురాయితీలను ఏడు జిల్లాలకే పరిమితం చేశారని, వీటివల్ల ఆ జిల్లాల్లో ఏం పరిశ్రమలు వచ్చాయి? ఇంతవరకు ఎంత పన్నురాయితీని పరిశ్రమలు పొందాయో చెప్పాలని రామ్మోహన్‌నాయుడు అడిగారు. ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ అమలు చేస్తామని నాటి ప్రధాని చెప్పారని, దాన్ని పక్కనపెట్టి యేడాదికి రూ.350 కోట్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. ఇటీవల విడుదల చేసి వెనక్కు తీసుకున్న రూ.350 కోట్ల గురించి అడగ్గా... తాము ఆమోదం కోసం వేచిచూస్తున్నామని అధికారులు బదులిచ్చారు.

హైకోర్టు భవనం విభజనకు సుముఖం: హైకోర్టు విభజన గురించి చర్చ జరిగినప్పుడు... ఇప్పుడున్న భవనాన్నే రెండుగా విభజించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
త్వరలో విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానసేవలు: విజయవాడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమానాల సేవలు ప్రారంభం అవుతాయని పౌరవిమానయాన అధికారులు వెల్లడించారు. తిరుపతి నుంచి నడపడానికి ఇంకా ఎవ్వరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమానాల సేవలు ప్రారంభం అవుతాయని పౌరవిమానయాన అధికారులు వెల్లడించారు. తిరుపతి నుంచి నడపడానికి ఇంకా ఎవ్వరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...