Jump to content

Tata Memorial Cancer Hospital,Tirupati


sonykongara

Recommended Posts

రేపు తిరుపతిలో వెయ్యి పడకల ఆసుపత్రికి భూమిపూజ
30-08-2018 13:43:20
 
తిరుమల: తిరుపతిలోని అలిపిరి సమీపంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం జరగనుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రతన్‌టాటా ఇవాళ సాయంత్రం తిరుమల చేరుకుని రేపు ఉదయం వెంకన్నను దర్శించుకుంటారని, అనంతరం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి క్యాన్సర్‌ ఆస్పత్రికి భూమి పూజ చేస్తారని ఎంపీ తెలిపారు.
Link to comment
Share on other sites

27 minutes ago, Jaitra said:

They did for political reasons,why would Tata do it?Just to respect the sentiments of people?

I would think so. Though main reason for Tata s, parsees in general to move out of Iran was religion (do not want to convert to muslim), they were purely business minded with good values of course. but later over the generations Tata s married in to Muslim, Christian and all sorts. It will be interesting to know whether he is religious person or not.

Link to comment
Share on other sites

రూ.1000 కోట్లతో క్యాన్సర్‌ ఆస్పత్రి 
తిరుపతికి చేరుకున్న రతన్‌ టాటా 
ఘనస్వాగతం పలికిని ఎంపీ కేశినేని 
ctr-gen4a.jpg

తిరుమల, రేణిగుంట, న్యూస్‌టుడే: శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.1000 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిని తిరుపతిలో నిర్మించడం అదృష్టంగా వర్ణించారు. ఆస్పత్రిని మొదటి దశలో 350 పడకలు, రెండో దశలో వేయి పడకలతో నిర్మించనున్నట్లు వివరించారు. ఆస్పత్రి కోసం తితిదే 25 ఎకరాల స్థలం కేటాయించిందని, శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్టు ఛైర్మన్‌ రతన్‌ టాటా చేతులు మీదుగా జరుగుతుందని చెప్పారు. కేన్సర్‌ వ్యాధి నివారణకు రతన్‌ టాటాతో పాటు ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని చర్యలు చేపట్టారని వివరించారు.

టాటాకు ఘనస్వాగతం 
టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రతన్‌.ఎన్‌ టాటా ప్రత్యేక విమానంలో ముంబాయి నుంచి గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రమంలో రాష్ట్ర ఎంపీలు డాక్టర్‌ శివప్రసాద్‌, కేశినేని నాని, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వాహనంలో తిరుమలకు వెళ్లారు.

Link to comment
Share on other sites

రీవారి చెంత స్వీకార్‌
01-09-2018 01:18:50
 
636713615314871912.jpg
  • తిరుపతిలో అత్యాధునిక కేన్సర్‌ చికిత్స కేంద్రం
  • రూ.600 కోట్లతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణం
  • ఏడు నెలల్లోనే అందుబాటులోకి సేవలు
  • భూమి పూజ చేసిన రతన్‌ టాటా, సీఎం
  • తిరుపతిని మెడికల్‌ హబ్‌గా మారుస్తాం
  • ప్రతి జిల్లాలో కేన్సర్‌ సెంటర్ల ఏర్పాటు
  • ప్రజా సేవలో టాటా ట్రస్టు భేష్‌: బాబు
  • ఉత్తమ సేవలు అందిస్తాం: రతన్‌ టాటా
తిరుపతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో ప్రతిష్ఠాత్మకమైన కేన్సర్‌ చికిత్స, పరిశోధన సంస్థ ఏర్పాటు దిశగా తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవ, టీటీడీ స్థలవితరణతో... వెంకన్న పాదాల చెంత, తిరుపతిలో ‘టాటా’ సంస్థ కేన్సర్‌ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరో ఏడునెలల్లోనే ఇది ప్రజలకు సేవలు అందించనుంది. అలిపిరి వద్ద ఏర్పాటు చేస్తున్న ‘శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌ రిసెర్చ్‌’ (స్వీకార్‌)కు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం భూమి పూజ చేశారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఎలక్ట్రానిక్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తిరుపతిని మెడికల్‌ హబ్‌గానూ తీర్చిదిద్దుతాం. తిరుపతిలో ఇప్పటికే స్విమ్స్‌, రుయా, బర్డ్‌ ఆస్పత్రులు, ఎస్వీ, పద్మావతి వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు కానుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. టాటా ట్రస్ట్‌ ఇప్పటికే జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లో ఈ సెంటర్లు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
 
 
తిరుపతిలో ఏర్పాటు కాబోయే కేన్సర్‌ ఆస్పత్రి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తుందని... దక్షిణ భారత దేశానికంతా కేంద్రంగా ఉంటుందని చెప్పారు. రూ.600 కోట్లతో నిర్మాణం కానున్న ఈ కేన్సర్‌ ఆస్పత్రిలో అధునాతన పరికరాలు, టెలీరేడియాలజీ, టెలీమెడిసిన్‌, కీమోథెరపీ తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. రోగులతో పాటు వచ్చే సహాయకుల కోసం ప్రత్యేకంగా ధర్మశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 వేల మంది కేన్సర్‌ బాధితులున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందనే అంచనాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
50 ఏళ్లు దాటిన పురుషులు, 35 ఏళ్లు దాటిన మహిళలు ముందుగానే కేన్సర్‌ పరీక్షలు చేయించుకుంటే దాని బారి నుంచి బయటపడేందుకు అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి కూడా క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందారని, ముందుగా ఈ వ్యాధిని గుర్తించలేకపోయారని ఆవేదన చెందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో రతన్‌ టాటా ముందున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ‘‘డబ్బు సంపాదించడమే కాదు దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా తెలియాలి. బిల్‌గేట్స్‌ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నారు.
 
రతన్‌ టాటాది అందరికంటే అగ్రస్థానం. టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే 124 ఆస్పత్రులు నడుస్తున్నాయి’’ అని చంద్రబాబు కొనియాడారు. పంచాయతీరాజ్‌ శాఖ సౌజన్యంతో 260 గ్రామాల్లో టాటా ట్రస్ట్‌ అభివృద్ధి పనులు చేసిందన్నారు. ‘టేక్‌ హోమ్‌ రేషన్‌’ పథకాన్ని కూడా టాటాకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. దేశంలోనే భద్రమైన నగరాల్లో రెండో స్థానం పొందిన తిరుపతి.. భవిష్యత్తులోనూ సేఫ్‌గానే ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
 
 
అత్యాధునిక సేవలు: రతన్‌టాటా
తిరుపతి ‘స్వీకార్‌’లో అత్యాధునిక వైద్యసేవలు అందిస్తామని రతన్‌ టాటా తెలిపారు. కేన్సర్‌ వ్యాధి భయంకరమైనదని, దీనినుంచి బయటపడి ప్రజలు మంచి జీవితాన్ని గడపాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. కాగా, రతన్‌టాటా శుక్రవారం తిరుమలేశుని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి నిజపాద దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వాదం పలుకగా, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూప్రసాదాలు, చిత్రపటాన్ని బహూుకరించారు.
Link to comment
Share on other sites

క్యాన్సర్‌కు టాటా!
ఇక నుంచి గ్రామాల్లో  స్క్రీనింగ్‌ పరీక్షలు
అందరిలో అవగాహన రావాలి
ప్రతి జిల్లాలోనూ క్యాన్సర్‌ ఆస్పత్రి
టాటా ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ఆస్పత్రి
భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు, టాటా ట్రస్టు  ఛైర్మన్‌ రతన్‌ టాటా
31ap-main1a.jpg
రాష్ట్రంలో ఏటా 50 వేల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు...రాబోయే కాలంలో ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో టాటా ట్రస్టు వంటి ఉన్నతమైన సేవాసంస్థలు ముందుకొచ్చి రాష్ట్రంలో ఇంత పెద్ద క్యాన్సర్‌ ఆస్పత్రితో పాటు పరిశోధనా కేంద్రాన్ని  నెలకొల్పడం ఆనందంగా ఉంది. పేదలకు 40 శాతం ఉచితంగా వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇది రాష్ట్రం నుంచి క్యాన్సర్‌ తరిమికొట్టేందుకు తొలి అడుగు.
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
క్యాన్సర్‌ భూతం ప్రస్తుతం ప్రపంచాన్ని భయ పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో ఈ జబ్బు ఎందరినో బలి తీసుకుంటోంది. ట్రస్టు తరఫున నిర్మించబోయే ఆస్పత్రుల ద్వారా క్యాన్సర్‌పై నిత్య పోరాటం చేస్తాం. ఆస్పత్రి నిర్మిస్తామనగానే తోడ్పాటునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.
- రతన్‌ టాటా

ఈనాడు - తిరుపతి

క్యాన్సర్‌ను నివారించడం కాదు... ముందుగా గుర్తించేందుకు అందరికీ తగిన అవగాహన రావాలి. క్యాన్సర్‌ ఒకటి, రెండు స్టేజీల్లో ఉన్నపుడు గుర్తిస్తే చికిత్స అందించి నివారించవచ్చు. అయితే మన రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం మంది అడ్వాన్స్‌డ్‌ స్టేజీకు వచ్చిన తర్వాతే గుర్తిస్తున్నారు. దీనివల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. గురువారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సతీమణి క్యాన్సర్‌తోనే చనిపోయారు. ఇక నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలను చేపడతాం. అందరిలోనూ అవగాహన తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో టాటా ట్రస్టు, అలమేలు ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో నిర్మితమయ్యే 376 పడకల శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ (స్వీకార్‌) సెంటర్‌కు ఆయన  టాటా ట్రస్టు ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో క్యాన్సర్‌ ఆస్పత్రులను ప్రత్యేకంగా నిర్మిస్తామన్నారు. వాటిని తిరుపతిలోని వేంకటేశ్వర పరిశోధన కేంద్రంతో అనుసంధానిస్తామన్నారు. పేదలు ఇక్కడుండి చికిత్స తీసుకునేలా సత్రాలను నిర్మించడం ఎంతో ఉదాత్తమైన ఆశయమన్నారు. ప్రభుత్వాలు సైతం చేయలేని పనులను టాటా ట్రస్టు చేస్తోందని ముఖ్యమంత్రి కొనియాడారు. రానున్న రోజుల్లో తిరుపతి మెడికల్‌ హబ్‌గా తయారుకాబోతుందన్నారు. ‘దేశంలో తాను  అత్యంత గౌరవించే వ్యక్తుల్లో రతన్‌ టాటా ఒకరు. ఆయనకు సంపాదించడం తెలుసు... దాన్ని సద్వినియోగం చేయడంలోనూ ఆయన ఆనందం పొందుతారు. తాను స్వయంగా కృష్ణా జిల్లాలో టాటా ట్రస్టు దత్తత తీసుకొన్న 265 పంచాయతీల్లో జరుగుతున్న పనులను చూశాను. ఎంతో ఉత్తమంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
31ap-main1b.jpg
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ ఆస్పత్రిగా ‘స్వీకార్‌’
తిరుపతి, న్యూస్‌టుడే: స్వికార్‌ను తితిదే అందించిన 25 ఎకరాల సువిశాల స్థలంలో  దాదాపు రూ.600 కోట్లతో నిర్మాణం కానుంది. మెడికల్‌ అంకాలజీ, సర్జికల్‌ అంకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ సేవలను పూర్తిస్థాయిలో అందిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి కానుంది. ఇందులో మొదటి దశ పనులు వచ్చే సంవత్సరం 2019 మార్చి కల్లా పూర్తి చేసి ఓపీ సేవలను ప్రారంభించేందుకు టాటాట్రస్ట్‌ ప్రతినిధులు చర్యలు చేపట్టినట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్టీఆర్‌ వైద్యసేవ, ఎన్టీఆర్‌ ఆరోగ్యరక్ష, కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయుష్మాన్‌భవ కార్యక్రమాల ద్వారా రోగులకు ఉచితంగా వైద్యసేవలను ఈ ఆసుపత్రిలో అందిస్తారు. మిగిలిన వారికి తక్కువ ధరలో సేవలు అందనున్నాయి. క్యాన్సర్‌ పరిశోధనలను అంతర్జాతీయ సంస్థలతో కలిసి టాటాట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్వీకార్‌ చేపట్టనుంది. అమెరికాతోపాటు ప్రముఖ వైద్యసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...