Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
ఆ స్థానంలో టీడీపీ గెలుపు ఖాయం’
26-09-2018 13:18:20
 
636735647020612924.jpg
నడిగూడెం(సూర్యాపేట): వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. నడిగూడెం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అన్ని వర్గాల వారిని మాయమాటలతో మోసం చేసి కేసీఆర్‌ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చీకటి రాజకీయ ఒప్పందం కుదుర్చుకుని ముందస్తు ఎన్నికలకు వస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మహాకూటమి తరుపున బొల్లం మల్లయ్యయాదవ్‌ను గెలుపించుకునేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈవిలేకరుల సమావేశంలో ఎస్‌కె నురూద్దీన్‌, కురాకుల కృష్ణమూర్తి, బాణాల నాగరాజు, విఎల్‌ఎన్‌గౌడ్‌, వీరన్న, బొల్లం శ్రీను, సీతయ్య, నారాయణరెడ్డి, శ్రీను, కిరణ్‌, అచ్చయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

టీడీపీలో వేడెక్కిన రాజకీయం.. అభ్యర్థుల పోటీపై గందరగోళం
27-09-2018 13:14:16
 
636736508585744294.jpg
  • చర్చనీయాంశంగా కూకట్‌పల్లి స్థానం
  • బయటి నాయకులకు పనిచేయబోమంటున్న స్థానికులు
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం వేడెక్కింది. నిన్నటి వరకు గ్రేటర్‌లో ఒకే ఒక్క కార్పొరేటర్‌గా ఉన్న మందడి శ్రీనివాసరావుకే అసెంబ్లీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన క్యాదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి ఇక్కడినుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గందరగోళం నెలకొంది.
 
ఇక్కడి కార్పొరేటర్‌ మందడితోపాటు మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, ముద్దాపురం కృష్ణగౌడ్‌ కూడా పార్టీ అదిష్ఠానం ముందు తమ ప్రతిపాదన పెట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఫైవ్‌మెన్‌ కమిటీ ఉన్నప్పటికీ.. వారిని ఖాతరు చేస్తూ ఆ పార్టీ అగ్రనాయకులు కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌పై కన్ను వేస్తుండటంతో స్థానికంగా ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తిని రేపుతోంది. నాలుగేళ్లుగా క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న మందడిని సంప్రదించకుండా పావులు కదుపుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
 
 
గెలుపుపై ఆశలతోనే...
కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తమ సర్వే చెబుతోందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. 2014లో టీడీపీ తరఫున మాధవరం కృష్ణారావు 43వేల మెజార్టీతో గెలిచి, ఏడాది తిరగకముందే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు. దాంతో అప్పటి నుంచి టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి లేకున్నా.. ఆ తర్వాత వచ్చిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బల్దియాలో కేపీహెచ్‌బీ నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా మందడి శ్రీనివాసరావు విజయకేతనం ఎగురవేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గం సమీకరణల నేపథ్యంలో ఇక్కడి నుంచి మందడికే సీటు కేటాయించాలని పార్టీ అధిష్ఠానం వద్ద ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతోపాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
 
 
గతేడాది కూకట్‌పల్లిలో నిర్వహించిన బస్తీ బస్తీకి తెలుగుదేశం పార్టీ సైతం కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా స్థానిక కార్పొరేటర్‌వైపే మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి వస్తాయనే ప్రచారంతో పెద్దిరెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్‌ టికెట్‌ ఆశించారు. తాజాగా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుండడం, పొత్తుల నేపథ్యంలో ఈసారి కూకట్‌పల్లిలో సులువుగా గెలవచ్చనే ఉద్దేశ్యంతోనే కూకట్‌పల్లిపై ఆయన కన్నేసినట్లు చర్చ జరుగుతోంది.
 
 
స్థానికులకే అవకాశం ఇవ్వాలి
కూకట్‌పల్లి నియోజకర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వస్తున్న వారికి కాకుండా పార్టీ అగ్రనాయకులు అని చెప్పి వేరే వారికి టికెట్‌ ఇస్తామంటే వారి కోసం పనిచేసే ప్రసక్తే లేదు. పార్టీ అభివృద్ధికి ఫైవ్‌మెన్‌ కమిటీ కూడా ఉంది. 2014లో టీడీపీ తరఫున గెలిచి మాధవరం కృష్ణారావు అధికార పార్టీలోకి వెళ్లినా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న స్థానికుల్లో ఒకరికి ఇవ్వాలి. - ఉప్పల పద్మాచౌదరి, కూకట్‌పల్లి ఫైవ్‌ మెన్‌ కమిటీ సభ్యురాలు
 
 
మందడి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించాలి
గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకొని టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా విజయం సాధించిన మందడి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించాలి. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేసిన కార్పొరేటర్‌ను కాదని వేరే వారికి ఇస్తే మేం పనిచేయలేం. - ఎస్కే సత్తార్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు, కేపీహెచ్‌బీ డివిజన్‌
 
 
పార్టీని నమ్ముకున్న వారికే టికెట్‌ కేటాయించాలి
ఎన్నికల సమయంలో గెలిచే సీట్లపై ఎవరెవరో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీని నమ్ముకొని ఉన్న వారికి టికెట్‌ కేటాయిస్తే తప్పకుండా విజయం సాధించేలా కృషి చేస్తాం. బయటి నాయకులకు టికెట్‌ ఇచ్చి గెలిపించమంటే క్షేత్రస్థాయిలో మేం పనిచేయలేం. - సురేష్‌బాబు, సాఫ్ట్‌వేర్‌ విభాగం, బాలాజీనగర్‌ డివిజన్‌
Link to comment
Share on other sites

టీడీపీలో కేడర్‌ ఉన్నా... లీడర్‌ లేకపాయే...
27-09-2018 13:33:53
 
636736520348867979.jpg
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లాలోని రెండు ప్రధాన నియోజకవర్గాలైన సిరిసిల్ల, వేములవాడలో వలసల కారణంగా ముఖ్య నేతలు ఇతర పార్టీల్లోకి చేరడంతో టీడీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ రెండు సెగ్మెంట్లలో ఇప్పటికీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని వీడడం లేదు. సిరిసిల్లలోని కార్మికవాడల్లో నేతకార్మికులు, పేద మధ్య తరగతి కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంది. ఎంతో మంది నా యకులు ఇక్కడి నుండే ఎది గారు. చివరికి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్‌, 2009లో రాజకీయంగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలో నిలిచినపుడు టీడీపీ పొత్తుతోనే గెలుపొందారు. ఆ తరువాత మున్సిపల్‌, గ్రామపంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం టీఆ ర్‌ఎస్‌ పార్టీలోకి వరుసగా వలస లు వెళ్లారు. 2009లో వేములవాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నమనేని రమేష్‌బాబు సైతం 2010లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. సిరిసిల్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్ట కిషోర్‌ పోటీ చేశారు. గతంలో నేరెళ్ల నియోజకవర్గాన్ని రద్దు చేసి సిరిసిల్ల సెగ్మెంట్‌గా మార్చారు. పాత సిరిసిల్ల మండలాలతో ఉన్న సెగ్మెంట్‌ వేములవాడ సెగ్మెంట్‌గా మారింది. నేరెళ్ల నియోజకవర్గంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థిగా సుద్దాల దేవయ్య రెండుసార్లు గెలుపొందాడు. 2004లో అతితక్కువ ఓట్లతో ఓడిపోయారు. సిరిసిల్ల నుంచి (ప్రస్తుతం వేములవాడ) 1983 లో టీడీపీ అభ్యర్థిగా వి. మోహన్‌రెడ్డి గెలుపొందగా ఆ తరువాత వామపక్ష పార్టీల పొత్తుతో సీపీఐ అభ్యర్థిగా సీహెచ్‌ రాజేశ్వర్‌రావు మూడుసార్లు గెలుపొందారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా రాజేశ్వర్‌రావు ఓటమి చవిచూశారు. ప్రస్తుతం వేములవాడ సెగ్మెంట్‌గా మారిన తరువాత రాజేశ్వర్‌రావు తనయుడు 2009లో గెలుపొందారు. 2014లో బీజేపీకి మద్దతిచ్చింది.
 
 
బలమైన నాయకత్వం కోసం ఎదురు చూపులు..
సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలమైన నాయకత్వం కోసం ఎదురు చూ స్తున్నారు. సిరిసిల్ల, వేములవాడలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఓటర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ వారిని నడిపించే వారు కరువయ్యారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం గా ఏర్పడిన తర్వాత కొందరు నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసినప్పటికి వారు కూడా గులాబీ గూటికి చేరిపోయారు. కానీ టీడీపీపై అభిమానాన్ని మాత్రం చాలా మంది వదులుకోవడం లేదు.
Link to comment
Share on other sites

పది అసెంబ్లీ స్థానాల్లో నాలుగు అడుగుతున్న టీడీపీ’
27-09-2018 08:07:15
 
636736324368739383.jpg
  • కూటమిలో కలవరం..
  • పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రాని స్పష్టత
  • బలాబలాల మేరకే అభ్యర్థిత్వాలంటున్న నేతలు
  • తమ పార్టీకే ఇవ్వాలని ఎవరికి వారు డిమాండ్‌
  • మూడింటిని కోరుతున్న సీపీఐ
  • ‘మిత్రుల’ డిమాండ్‌తో కాంగ్రెస్‌ ఆశావహుల్లో పెరుగుతున్న ఆందోళన
 
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి - ఖమ్మం )
అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు విపక్షాలు ఐక్యతారాగం వినిపిస్తున్నా.. ‘సీట్ల’ విషయం కూటమిని కలవలరపెడుతోంది. పొత్తులు, సీట్ల విషయం తేలకపోవడంతో విపక్ష కేడర్‌లో అనిశ్చితి నెలకొంది. ఎవరికి వారు సీట్లు మావేనన్న ధీమాలో కార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే పొత్తు ప్రభావం ఉమ్మడి జిల్లా రాజకీయాలపైనా పడుతోంది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలకు జిల్లాలో ఓటు బ్యాంకు ఉండటంతో నేతలంతా పోటీపై ఆశలు పెంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలుంటే సీట్లలో టీడీపీ 4, సీపీఐ 3 డిమాండ్‌ చేస్తుండటంతో పాటు.. ఎవరికి వారు హైదరాబాద్‌, ఢిల్లీ స్థాయిలో పైరవీలు సాగిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆందోళన కన్పిస్తోంది.
 
 
మాకంటే.. మాకు...
కాంగ్రెస్‌ పక్షాన ఎవరికి వారు తమ నియోజకవర్గం సీటు తమకే కేటాయించాలంటూ అధిష్ఠానానికి మొర పెట్టుకుంటున్నారు. బలమైన సీట్లు మావని, పొత్తులో సీపీఐ, టీడీపీకి వదలొద్దని నేతలు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ కేడర్‌ సీట్ల కోసం పట్టుపడుతూనే ఉంది. టీడీపీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలపై గురి పెట్టగా.. కాంగ్రెస్‌ పక్షాన మాత్రం సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం టీడీపీకి వదిలే విషయం లో ప్రాథమిక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం విషయంలో కాంగ్రెస్‌ నేతల నుంచి డిమాండ్‌ ఉంది.
 
 
తెరపైకి కీలక నాయకుల పేర్లు...
టీడీపీ నేత నామ నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగు తుండగా.. ఆయన రంగంలోకి దిగితే కాంగ్రెస్‌ ఈ సీటును వదిలేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే స్థానానికి కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ వైరా, కొత్తగూడెం, పినపాక సీట్ల ను డిమాండ్‌ చేస్తుండగా.. పినపాక సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గట్టి పట్టుతో ఉన్నారు. తన ప్రచారాన్ని సాగిస్తుండటంతో కాంగ్రెస్‌ ఆ సీటును వదలుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. సీపీఐ కోరుతున్న వైరా, కొత్తగూడెం సీట్లపై అటు కాంగ్రెస్‌ నేతలు కన్నేశారు. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, తోడల్లుడు యడవెల్లి కృష్ణ ఆశలు పెట్టుకున్నారు. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇవ్వొద్దని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పరిశీలకుడు కుంతియాకు విన్నవించారు. కానీ సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పట్టుబడుతున్నారు. తామెట్టి పరిస్థితుల్లో కొత్తగూడేన్ని వదులుకునే లేదంటూ తేల్చి చెబుతు న్నారు. వైరాలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థినే ఉండాలని కేడర్‌ కోరు తుండగా.. ఇప్పటికే వైరా నుంచి పలువురు ఆశావహులు అధిష్ఠానానికి మొర పెట్టుకున్నారు. ఈ పరిణామాలు సీపీఐకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్ల సర్దుబాటు జరుగుతుందని కూటమి నేతలు చెబుతున్నా.. లోపల ఎవరికి వారే అభ్యర్థిత్వాలను తమకే ఇవ్వాలంటూ పావులు కదుపుతున్నారు. అన్ని పార్టీలు తమకు బలముందంటూ.. ఆయా నియోజకవర్గాలను వదులు కోవడాని కి సిద్ధంగా లేకపోవడంతో భవిష్యత్‌లో కూటమి సీట్ల సర్దుబా టు ఎలా సాగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ నుంచి సీట్లు దక్కని నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మహాకూటమి నేతలు.
 
 
ఊపందుకోని విపక్ష ప్రచారం..
పొత్తులు, సీట్ల విషయంలో స్పష్టత రాకపోవడంతో... విపక్ష నాయకుల ప్రచారపర్వం ఊపందుకోలేదు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రచారాన్ని ప్రారంభించగా... సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంటవీరయ్య ప్రచారం సాగిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పొత్తులు, సీట్లపై స్పష్టత కోసం నేతలు ఎదురుచూస్తున్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, Bezawadabullo said:

malli kachara gaadu vote for note bayataki theesadu kadha.....

CBN gaaru eppudu return avthunnaru USA nundi?

cbn di emundi,cbn ki hc orders unnayi cbn name charhe sheet lo veyyakarledu ani,sc lo case nadustundi,appati daka it or acb evaru emi cheyyadaniki ledu 

Link to comment
Share on other sites

మారుతున్న శేరిలింగంపల్లి ముఖచిత్రం
29-09-2018 12:13:59
 
636738200410859334.jpg
  • సత్ఫలితాలు ఇస్తున్న బుజ్జగింపులు
  • స్పష్టం కాని జగదీశ్వర్‌ గౌడ్‌ వైఖరి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ నియోజకవర్గ అసమ్మతి నేతలను తనవైపు తిప్పుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన టీఆర్‌ఎస్‌ శ్రేణులను, ఉద్యమకారులను, కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యమకారుల్లో ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకునేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డితో కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్లు, సీనియర్‌ నాయకులతో సమావేశమై చిన్నచిన్న బేధాభ్రిపాయాలను పక్కన పెట్టి పార్టీ విజ యం కోసం పని చేయాలని కోరుతూ, అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. చిన్నచిన్న ఇబ్బందులను త్వరలోనే అధిగమిస్తామని గాంధీ చెబుతున్నారు.
 
అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం
ఆయన నియోజకవర్గంలోని తన సామాజిక వర్గంలోని బలమైన వ్యక్తులను కలిసి సహకరించాలని కోరారు. వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న ముఖ్యనాయకులతో పాటు స్వచ్ఛంద సం స్థలు, అసోసియేషన్లు, కులసంఘాలను స్వ యంగా కలుసుకుని అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఇటీవల మంచి రోజు చూసుకొని ప్రచారాన్ని ప్రా రంభించిన ఆయన పార్టీకి దూరం ఉంటున్న వారందరినీ కలుపుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
జగదీశ్వర్‌గౌడ్‌ దారెటు..
మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, అతని సతీమణి హఫీజ్‌పేట కార్పొరేటర్‌ పూజితల వ్యూహం ఏమిటన్నది అర్థం కాని విషయంగా మారింది. జగదీశ్వర్‌గౌడ్‌ శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించారు. టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకే దక్కడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ జగదీశ్వర్‌గౌడ్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తాన ని ప్రకటించారు. అప్పటి పార్టీ సీనియర్‌ నేత దానం బుజ్జగించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌గా ఉన్న జగదీశ్వర్‌గౌడ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన మాదాపూర్‌ నుంచి, తన సతీమణి పూజితను హఫీజ్‌పేట నుంచి పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించారు.
అప్పటి నుంచి ఆయనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అయ్యింది. తాను ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నట్లు పలుమార్లు అధిష్ఠానానికి సంకేతాలు సైతం పంపించారు. తా జాగా టికెట్‌ గాంధీకి దక్కడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో పాటు, పలుమార్లు పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలా, ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్‌ పై పోటీ చేయాలా? అన్న మీమాంసలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఓ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి ప్రయత్నాలు కూడా చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
 
మొత్తం మీద .. ఒక వేళ పోటీ చేస్తే గెలవగలనా, ఓడిపోతే రాజకీయ భవిష్యత్‌ ఏమిటీ, ఇంత గొడవ పడి పార్టీలో ఉంటే భవిష్యత్‌ ఉంటుందా... అన్న ఆలోచనల్లో జగదీశ్వర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

కేసీఆర్‌తో చర్చల వివరాలను వెల్లడించిన చంద్రబాబు
07-10-2018 11:35:24
 
636745089210179031.jpg
హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమికి బీజం ఎలా పడింది..? కేసీఆర్ - చంద్రబాబు పొత్తులపై మాట్లాడుకున్నారా..? కేంద్రం జోక్యం చేసుకుందా..? ఎందుకు రాజకీయ పరిణామాలు మారిపోయాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనను కోరినట్లు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో జరిగిన చర్చల ప్రక్రియ వివరాలను టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు వివరించారు. 'తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే దక్షిణాదిలో ఆధిక్యం చూపవచ్చునని, ఢిల్లీలో కూడా తెలుగువారి ప్రాభవానికి ఉపయోగపడుతుందని తాను సూచించినట్లు తెలిపారు. ముందు సానుకూలంగానే కేసీఆర్ స్పందించారని... ఆలోచించి చెబుతానన్నారనీ.. కానీ, వారం తర్వాత కలవలేనని చెప్పినట్లు చంద్రబాబు వెల్లడించారు. కేసీఆర్ ను మరెవరో ప్రభావితం చేస్తున్నారని అప్పుడే అర్ధమైందని.. ఆ సమయంలోనే మరో షరతు పెట్టారన్నారు. టీడీపీ పోటీ చేయాలనుకొంటే ఒంటరిగా చేయాలని, కాంగ్రెస్‌తో కలవొద్దని షరతులు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. టీఆర్ఎస్ బీజేపీ చేతిలో ఇరుక్కొని తమకు షరతులు పెడితే ఎలా? అని.. దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
 
 
అంతే కాదు...తెలంగాణలో తాము చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్‌ మరో మాట అన్నట్లు తెలిసింది. అయితే.. కేసీఆర్ మాటను నమ్మలేక.. టీడీపీకి తెలంగాణలో ఏ వ్యూహం అవసరమో ఆ వ్యూహంలో వెళ్ళామని అన్నారు. టీజేఎస్, సీపీఐతో చర్చలు జరుపుతున్నప్పుడు కాంగ్రెస్ వచ్చిందని.. అంతా కలిసి మహాకూటమిగా ఏర్పడినట్లు చంద్రబాబు వివరించారు.
 
చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. తన కేబినెట్‌లో కేసీఆర్‌కు మంత్రిగా అవకాశం ఇచ్చానని.. ఆయనకు ఇవ్వాల్సిన గౌవరం ఎప్పుడూ తగ్గించలేదని కూడా చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఆయన వాడే భాషను ప్రజలు సమర్థిస్తారని అనుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.
 
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం కొంత ఉందన్న అభిప్రాయం టీడీపీ అధినేత వ్యక్తం చేశారు. బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఎలక్షన్‌ షెడ్యూల్‌లో రాజస్థాన్‌ ఎన్నికను చివరకు తెచ్చారని, దీనివల్ల ఆ ఎన్నిక ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడకుండా చూసుకోగలిగారనేది చంద్రబాబు అభిప్రాయం. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే షెడ్యూల్‌ విడుదల కావడంపై ఈ సమావేశంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం వల్ల ఇక ఏపీ ఎన్నికలు ముందు వస్తాయన్న ఊహాగానాలకు తెర పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'తెలంగాణ ఎన్నికలు ఆపి లోక్‌సభ ఎన్నికలు ముందుకు తెస్తారని కొంత ప్రచారం జరిగింది. అది జరిగితే ఏపీ ఎన్నికలు కూడా ముందుకు వచ్చేవి. ఇక ఇప్పుడు ఆ అవకాశం లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌, మే నెలల్లోనే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.
Link to comment
Share on other sites

ఖమ్మం పర్యటనకు బాలయ్య వెళ్లడానికి అసలు కారణం తెలిస్తే..
06-10-2018 10:33:15
 
636744194679924085.jpg
ఎక్కడ చూసినా నిరాశ! నిస్పృహ!! పట్టించుకున్న నాథుడు లేడు.. గుండెల నిండా అభిమానం ఉంది.. జెండా ఎగురవేయాలన్న తపన ఉంది.. కానీ వెనుక ఉండి, ధైర్యంచెప్పి నడిపించే నాయకుడే లేడు.. ఇదీ నిన్నమొన్నటివరకూ ఖమ్మం జిల్లాలో తెలుగు తమ్ముళ్ళ దైన్యస్థితి! ఈ పరిస్థితుల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లకు బాలయ్య ఎలాంటి భరోసా ఇచ్చారు? ఏమి ధైర్యం చెప్పారు? తన పర్యటన ద్వారా వారిలో ఎలాంటి ఉత్సాహం నింపారు? ఆసక్తికర కథనం ఇప్పుడు తెలుసుకోండి.
 
 
      నిన్నమొన్నటి వరకూ నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడిన ఖమ్మం జిల్లా టీడీపీ కార్యకర్తలలో ఇప్పుడు నూతనోత్సాహం ఉరకలు వేస్తోంది. ఇదే స్పీడుతో తమ్ముళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సినీహీరో, ఎన్‌టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తాజా పర్యటనే ఈ పరిణామాలకు కారణం! బాలకృష్ణ తన టూర్‌లో ఆద్యంతం కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గుండెనిండా ధైర్యం నూరిపోశారు. "తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ.. కష్టజీవుల పార్టీ, నిరుపేదల పార్టీ అని మరోసారి రుజువయ్యింది'' అని తన పర్యటనకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ సంతోషంగా చెప్పారు.
 
 
      ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా టీడీపీకి జవసత్వాలు నింపాలని ఆ పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ప్లాన్ చేశారు. అందుకోసం జిల్లాలో ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో మధిర నుంచి సత్తుపల్లి వరకు పలుచోట్ల ఎన్‌టీఆర్ విగ్రహాల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయ్యింది. టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎన్‌టీఆర్ విగ్రహాల ఆవిష్కరణకు రావాల్సిందిగా వారు కోరారు. ఎన్‌టీఆర్ బయోపిక్ నిర్మాణంలో బిజీబిజీగా ఉన్న బాలకృష్ణ తనకు కొద్దిగా సమయం కావాలని ఖమ్మం నేతలకు సూచించారు. అయినప్పటికీ నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఆయనను వదిలిపెట్టలేదు. ఖమ్మంలో పార్టీ పరిస్థితి గురించి వివరించి.. స్థానిక టీడీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలంటే ఖమ్మం రాక తప్పదని బాలయ్యబాబుకి నచ్చచెప్పారు. అంతేకాకుండా- తను మూడోసారి పోటీచేస్తున్న సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తే అది తన గెలుపునకు దోహదపడుతుందని సండ్ర వెంకటవీరయ్య బాలయ్యకు వివరించారు. గత ఎన్నికలలో ఖమ్మంజిల్లాలో బాలయ్య పర్యటించిన ప్రాంతాల్లో తప్పకుండా ఆ ప్రభావం కనిపించిందనీ, అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు ఆడుగుతున్నామనీ సండ్ర, నామా నాగేశ్వరరావు బాలయ్య వద్ద పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పర్యటనకు బాలకృష్ణ ఒకే చెప్పారు.
 
 
     వెంటనే నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య తగిన వ్యూహాన్ని రూపొందించారు. మధిర నుంచి సత్తుపల్లి వరకు రూట్‌మ్యాప్ సిద్ధంచేశారు. బాలకృష్ణను ఖమ్మం తీసుకువచ్చారు. టీడీపీ నేతల స్కెచ్ పక్కాగా వర్కవుట్ అయ్యింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన రాయపట్నంలో బాలకృష్ణ అడుగుపెట్టింది మొదలు సత్తుపల్లి వరకు అశేష జనసందోహం ఆయనకు ఘనస్వాగతం పలికింది. అడుగడుగునా బాలయ్య పట్ల అభిమానం చాటుకుంది. ఊహించని విధంగా ప్రజలు బాలకృష్ణ పర్యటనకు తరలిరావటంతో టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యపోయాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన బాలయ్య పర్యటన అర్ధరాత్రి వరకు కొనసాగింది. అప్పటివరకు ప్రజలు బాలయ్య కోసం రోడ్లపై గంటల తరబడి నిరీక్షించారు. మధిర, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి ప్రాంతాలలో బాలయ్యను చూసేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు మహిళలు సైతం పెద్దసంఖ్యలో వచ్చారు. నిజానికి.. వాహనాలు సమకూర్చి, అంతోఇంతో చేతిలో పెడితేకాని రాజకీయ సభలకు జనాలు రారు. కానీ బాలకృష్ణ పర్యటనకు తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావటంతో టీడీపీ నాయకుల ఆనందం ఇంతాఅంతా కాదు!
 
 
     బాలకృష్ణ తన పర్యటనలో ఎన్‌టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం హయంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఖమ్మం ఏ విధంగా పురోగమించిందో వివరించారు. టీడీపీ అనేది ప్రజల పార్టీ అనీ, ఆడపడుచుల పార్టీ అనీ.. ఈ సంగతి సభలకు వచ్చిన అశేష జనవాహినిని చూస్తే తెలుస్తోందని బాలకృష్ణ చెప్పారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కార్యకర్తలు పాటుపడాలనీ, తాను అండగా ఉంటాననీ బాలకృష్ణ భరోసా ఇచ్చారు.
 
 
     తొలుత సత్తుపల్లిలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. స్థానికంగా ఏర్పాటైన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం సత్తపల్లిలో బసచేసిన బాలకృష్ణ ఆ మరుసటి రోజు ఉదయం ఖమ్మంజిల్లా టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా పార్టీ మారకుండా టీడీపీపై పూర్తి విశ్వాసంతో ఉన్న మీ అందరికీ నేను అండగా ఉంటానని మాటిచ్చారు. పార్టీని కొందరు నాయకులు వదిలి వెళ్లినా చెక్కుచెదరని నమ్మకంతో పనిచేయటం మీ గొప్పతనమని బాలయ్య ప్రశంసించారు. ఇలా జిల్లా తెలుగు తమ్ముళ్లకు ఎంతో మనోధైర్యం నూరిపోశారు.
 
 
       బాలకృష్ణ ప్రశంసలతోపాటు ఆయన పర్యటన విజయవంతం కావడంతో ఖమ్మం జిల్లా టీడీపీలో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తమ వ్యూహం ఫలించిందని జిల్లా టీడీపీ ముఖ్యనేతలు ఎంతో సంబరపడుతున్నారు. ఈ ఉత్సాహం ఎన్నికల వరకు కొనసాగితే తప్పక మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ పెద్దలు ఆశిస్తున్నారు. ఇదండీ ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అసలు కారణం..!
Link to comment
Share on other sites

‘సికింద్రాబాద్‌ టీడీపీ టికెట్ ఆయనకివ్వండి’
09-10-2018 12:14:51
 
636746841605168290.jpg
హైదరాబాద్‌: టీడీపీ నగర బీసీ సెల్‌ అధ్యక్షుడు సీ. బద్రినాథ్‌యాదవ్‌కు సికింద్రాబాద్‌ నుంచి పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించాలని బీసీ సెల్‌ నాయకులు కోరారు. సోమవారం పార్టీ సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి సీహెచ్‌ జగదీష్‌, అనిల్‌, రజనీకాంత్‌, సాంబశివరావు, రఘు, వెంకటేష్‌, నారాయణ తదితరులు విజ్ఞప్తి చేశారు. బీసీ సెల్‌ తరపున బద్రీనాథ్‌ యాదవ్‌ను బరిలో దించితే గెలిపిస్తామన్నారు. బద్రీనాథ్‌ బయోడేటాను రావులకు అందజేశారు. విషయాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు బీసీ సెల్‌ నాయకులు తెలిపారు.
Link to comment
Share on other sites

19న సైకిలెక్కనున్న నందీశ్వర్‌గౌడ్
15-10-2018 15:22:30
 
636752137951986893.jpg
హైదరాబాద్: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సైకిలెక్కనున్నారు. ఈ నెల 19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయాల కోసమే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే దానికి ఎన్టీఆరే కారణమన్నారు. తెలంగాణలో టీడీపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. మహాకూటమిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు.
 
 
నందీశ్వర్ గౌడ్.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్‌లోకి కాకుండా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మహాకూటమిలో భాగంగా పటాన్‌చెరు టికెట్ టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరితే ఆ టికెట్ తనకు దక్కే అవకాశం ఉందని నందీశ్వర్ గౌడ్ ముందస్తుగా అంచనా వేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రా ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

టీడీపీలో ఉత్కంఠ.. ఈ సారైనా కల నెరవేరేనా..?
19-10-2018 12:09:59
 
636755479433264964.jpg
హైదరాబాద్: టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ముషీరాబాద్‌లో ఒకే ఒక్కసారి పార్టీ పోటీ చేసింది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వివిధ పార్టీలతో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు నియోజకవర్గం సీటును కేటాయించాల్సి వస్తోంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ తదితర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లోనైనా టీడీపీకి ముషీరాబాద్‌ సీటు కేటాయిస్తారా లేదా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సీటు కోసం పార్టీ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణను కలిసి విజ్ఞప్తి చేశారు.
 
 
త్యాగం చేస్తూనే ఉన్నారు...
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తెలుగుదేశానికి బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ 1983 నుంచి 2014 వరకు వివిధ పార్టీలతో సీట్ల సర్దుబాటులో నియోజకవర్గం పార్టీ నేతలకు అగ్ర నాయకులు ‘సారీ’తో సరిపెడుతున్నారు. 1983లో శ్రీపతిరాజేశ్వర్‌రావు ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాయిని నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటులో జనతాపార్టీ నుంచి మరో సారి నాయిని నర్సింహారెడ్డికి ముషీరాబాద్‌ టికెట్‌ కేటాయించడంతో ఆయన విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పార్టీల పొత్తుల్లో నాయిని పోటీ చేయగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి విజయం సాధించారు. 1994లో ఏర్పడిన మహాకూటమిలో నాయినికి టికెట్‌ కేటాయించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీకి టికెట్‌ కేటాయించడంతో డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విజయం సాధించారు. 2004లో సీట్ల సర్ధుబాట్లలో మరోసారి డా.కె.లక్ష్మణ్‌కు టికెట్‌ కేటాయించడంతో అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి గెలిచి మంత్రి అయ్యారు.
 
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, సీపీఐ పొత్తు ఉండగా అందులో వీరయ్యకు టికెట్‌ కేటాయించడంతో పరాజయం పాలయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినప్పటికీ ముషీరాబాద్‌ టీడీపీ బీ ఫామ్‌ను ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావుకు అందజేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీ ఫామ్‌ను విరమించుకోవాలని సూచించడంతో నాయినికి ఎమ్మెన్‌ మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.మణెమ్మ విజయం సాధించారు. 2014లో బీజేపీ, టీడీపీ సీట్ల సర్దుబాటులో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు సీటు కేటాయించడంతో 28 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇలా ప్రతి సారీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తులు ఉండడంతో నియోజకవర్గం టీడీపీ నాయకులకు టికెట్‌ దక్కకుండా అన్యాయం జరుగుతుందని నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. ఈ సారి కచ్చితంగా టీడీపీకి కేటాయించాలని పట్టుబడుతున్నారు.
Link to comment
Share on other sites

నేడు టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
19-10-2018 08:40:34
 
636755353497835425.jpg
హైదరాబాద్: పఠాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ‌భవన్‌లో తెలంగాణ టీడీపీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. నందీశ్వర్‌గౌడ్‌తో పాటు పలువురు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
 
 
 కాగా.. నందీశ్వర్‌గౌడ్ పఠాన్‌చెరు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఈయన అమరావతిలో కలిశారు. టీఆర్ఎస్‌ ఎంపీ డి. శ్రీనివాసులుకు అనుంగు శిష్యుడిగా ఈయన గుర్తింపు పొందారు. అప్పట్లో డీఎస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో.. నందీశ్వర్‌ బీజేపీలో చేరారు. గత నెలలో డీఎస్‌తో పాటు నందీశ్వర్‌ గౌడ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...