Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
ఆ సీటును టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో వదలుకోవద్దు’
18-09-2018 11:52:45
 
636728683626535026.jpg
మహబూబాబాద్‌: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణను మానుకోట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో బానోత్‌ మోహన్‌లాల్‌, లక్ష్మిదేవి దంపతులు రమణను కలుసుకున్నారు. పొత్తులో భాగంగా మహబూబాబాద్‌ అసెంబ్లీ సీటును టీడీపీకే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహబాద్‌లో టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దని కోరారు. 
మరోపక్క టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భూక్య సునిత మంగిలాల్‌ టీటీడీపీ అధ్యక్షుడు రమణను కలుసుకుని వినతిపత్రాన్ని అందజేశారు. మానుకోట సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించి అనేక ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్న తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమాం, నెల్లికుదురు, కేసముద్రం మండలాల అధ్యక్షులు ఐలయ్య, రమేష్‌, అర్బన్‌ అధ్యక్ష, కార్యదర్శులు దిడుగు సుబ్బారావు, కట్ల వెంకన్న, ఉన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి వెళ్లిన నేతలకు చంద్రబాబు భరోసా ఇదే..
18-09-2018 10:36:44
 
636728638008998236.jpg
  • చంద్రబాబు వద్దకు నగర నేతలు
  • కొన్ని స్థానాలపై చర్చ 
  • వదిలేది లేదంటున్న కాంగ్రెస్‌
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): విపక్షాలు మహా కూటమి కట్టడంతో గ్రేటర్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పలు నియోజకవర్గాల కోసం కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. 24 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. కొన్ని స్థానాలకు సంబంధించి సూత్రప్రాయ చర్చల్లో ఓ అవగాహనకు వచ్చారని తెలిసింది. దీంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. టికెట్‌ పక్కన పెడితే.. కనీసం తమకు కావలసిన నియోజకవర్గమైనా తమ పార్టీకి వస్తుందా..? లేదా..? అని నేతలు టెన్షన్‌ పడుతున్నారు. నగరంలో బలంగా ఉండే టీడీపీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని స్థానాల కోసం కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, టీడీపీ పట్టుపడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి పలు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతోంది. ఏఐసీసీ ఆమోదంతో టీపీసీసీ విడుదల చేసే మొదటి జాబితాలోనే వారి పేర్లుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు నేతలు అమరావతికి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసినట్టు సమాచారం.
 
ఆ నియోజకవర్గాలపై...
నగరంలోని పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు ఇప్పటి వరకు అవకాశం రాకున్నా టీడీపీలోనే ఉన్నారు. ఈ సారి తప్పకుండా అవకాశం దక్కుతుందన్న వారి ఆకాంక్షలకు పొత్తు రూపంలో గండి పడే ప్రమాదం ఏర్పడింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల కోసం రెండు పార్టీలు పట్టుబడుతుండడం... అవి తమకే కావాలని కాంగ్రెస్‌ స్పష్టంగా చెప్పిందన్న ప్రచారం నేపథ్యంలో ఆయా స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. పార్టీ అధినేతను కలిసి పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ‘మీ మాటకు కట్టుబడి గతంలో త్యాగాలు చేశాం. చివరి నిమిషంలో సర్ధుబాటు చేసినా సహకరించాం. మిమ్మల్ని నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నాం. ఈ సారి అవకాశం రాకుంటే కేడర్‌ కూడా మా వెంట ఉండే పరిస్థితి లేదు. మేం బాధ్యులుగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేలా చూడండి’ అని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ‘ఎవరికి ఎన్ని సీట్లు అన్న దానిపై స్పష్టత వచ్చిన అనంతరం.... మీకు తప్పకుండా న్యాయం చేస్తా...’ అని చంద్రబాబు హామీ ఇచ్చారని ఓ నాయకుడు తెలిపారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

EYjA9XD.jpg

villu eddaru okappudu TDP valle,krishna rao kukatpally municipality vice chairman ga unnappudu,harish reddy KPHB ward Councillor,GHMC lo kalisaka,  GHMC 2009 lo KPHB seat ivvaledu ani independent ga poti chesadu, odipoyadu,taruvatha congi lo join ayyadu,  telangana movement start ayyaka, TRS lo join ayyadu,dandamudi sobhanadri garu chanipoayaka jarigna by election lo malli poti chesi odipoyadu,2014 GHMC lo balaji nagar nundi vadi wife win ayyindi,ippudu MLA seat adugutunnadu.

Link to comment
Share on other sites

అమృతకు కోటి రూపాయలు ఇస్తాం: ఎల్.రమణ

నల్గొండ: మహాకూటమి అధికారంలోకి వస్తే అమృతకు కోటి రూపాయల ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని పరామర్శించి, ప్రణయ్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అమృత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. తండ్రి మారుతీరావు ఆస్తుల్లో సగం.. అమృత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. అమృత ఆరోపించిన ప్రతివ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎల్.రమణ అన్నారు. 

Link to comment
Share on other sites

4 hours ago, Siddhugwotham said:

అమృతకు కోటి రూపాయలు ఇస్తాం: ఎల్.రమణ

నల్గొండ: మహాకూటమి అధికారంలోకి వస్తే అమృతకు కోటి రూపాయల ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని పరామర్శించి, ప్రణయ్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అమృత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. తండ్రి మారుతీరావు ఆస్తుల్లో సగం.. అమృత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. అమృత ఆరోపించిన ప్రతివ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎల్.రమణ అన్నారు. 

Ilaanti matters lo involve avvakapovadam better 

Link to comment
Share on other sites

6 hours ago, swarnandhra said:

gula ekkuva vunte 1 cr icchukomanu no problem. Father property lo 50% ivvamani demand enti. Is n't that a legal matter ?

 

3 hours ago, adithya369 said:

she don't have rights on her father's property legally as it is not inherited property 

Aa pilla mogudini champinanduku nasta parihaaramgaa ippisthe what's wrong? Aina thandri asthi lo equal share ammaayiki koodaa ivvaali ani cheppina NTR party lo unna manam why arguing on this ?

Link to comment
Share on other sites

13 hours ago, Siddhugwotham said:

అమృతకు కోటి రూపాయలు ఇస్తాం: ఎల్.రమణ

నల్గొండ: మహాకూటమి అధికారంలోకి వస్తే అమృతకు కోటి రూపాయల ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని పరామర్శించి, ప్రణయ్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అమృత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. తండ్రి మారుతీరావు ఆస్తుల్లో సగం.. అమృత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. అమృత ఆరోపించిన ప్రతివ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎల్.రమణ అన్నారు. 

e laddulo statements istene ..... janalaki vollu mandedi ..... anthaduradaga unte L Ramana account lo nundi evvali....

state lo elantivi weekly okati jarugutundi .... vallantha bhootulu tittukuntaru ....chi

anduke e ramana anni sarlu odipoyedi ....

iste erragadda and miryala kalipi ivvali .... leda mukoni kurchovali

Link to comment
Share on other sites

9 hours ago, nbk@myHeart said:

 

Aa pilla mogudini champinanduku nasta parihaaramgaa ippisthe what's wrong? Aina thandri asthi lo equal share ammaayiki koodaa ivvaali ani cheppina NTR party lo unna manam why arguing on this ?

#1 India is not under Sharia law to orbitrate blood money. 

#2 AnnaGaru cheppindi, inheritance lo ammayilaki kuda abbayi la laga equal share ravaali annaru gaani, Indian laws ki against ga father "swarjitam" lo pillalaki share ivvali ani pettaledu. oka vela ala petti vunna, aa pettindi anna garu ayina, I oppose such thing.

Link to comment
Share on other sites

9 hours ago, nbk@myHeart said:

Aa pilla mogudini champinanduku nasta parihaaramgaa ippisthe what's wrong? Aina thandri asthi lo equal share ammaayiki koodaa ivvaali ani cheppina NTR party lo unna manam why arguing on this ?

Ee issue ni support chesevaallu vunnaru &  oppose chesevaallu vunnaaru,  right or wrong,  better not to involve in this matter 

Link to comment
Share on other sites

తెరపైకి కల్యాణ్ రామ్ పేరు.. టీడీపీలోనూ ఉత్కంఠ
21-09-2018 11:30:14
 
636731262117216586.jpg
టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అసమ్మతి సెగలు.. ఇతర పార్టీల్లో తెరపైకి కొత్త పేర్లు..
ప్రతి రోజూ.. రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. శేరిలింగంపల్లిలో
క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏంటి..? టీడీపీలో హఠాత్తుగా తెరపైకి వచ్చిన ప్రముఖులు ఎవరు..? గాంధీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా..? అసమ్మతులను చల్లార్చడంలో ఎంత వరకూ సఫలీకృతులయ్యారు..? అనే అంశాలపై స్పెషల్‌ రిపోర్ట్‌
  • అసమ్మతిని చల్లార్చడంలో గాంధీ తలమునకలు
  • టికెట్‌ వేట కొనసాగిస్తున్న కార్పొరేటర్‌
  • టీడీపీలో తెరపైకి కొత్తపేర్లు
  • ఆశావహుల గుండెల్లో రైళ్లు
  • కాంగ్రెస్‌, బీజేపీలోను ఉత్కంఠే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాజకీయ వేడి రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ అసమతి సెగలను చల్లార్చేందుకు తన సర్వశక్తులనూ ఒడుతున్నారు. అధిష్ఠానంలోని కీలకమైన వ్యక్తులు, ముఖ్యనాయకులతో సంప్రదింపులు, సమావేశాల ద్వారా సగం అసమ్మతి నుంచి బయటపడ్డా కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు ఆయన అనుచరగణంలోని ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరకు వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. మరో పక్క కొంతమంది కార్పొరేటర్లు వారం రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ గాంధీ తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీనివా్‌సరెడ్డి సమక్షంలో గాంధీతో కలిసి సదవగాహనకు వచ్చినా.. కొందరు మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇదే బాటలో కొందరు ఉద్యమకారులు, రాష్ట్ర యువజన నాయకుడు కోమండ్ల శ్రీనివా్‌సరెడ్డి, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శంకర్‌గౌడ్‌ కూడా తమ అసంతృప్తిని తన అనుచరులతో కలిసి వెళ్లగక్కు తున్నారు. వీరిని కూడా సమన్వయం చేసుకోవడానికి గాంధీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీటన్నింటినీ దాటి గాంధీ ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారా.. అని పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
 
తెరపైకి పారిశ్రామికవేత్త...
చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు, పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత, భవ్యాగ్రూపు సంస్థల అధినేత వినిగళ్ల ఆనందప్రసాద్‌ కూడా టికెట్‌ రేసులో ఉన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుల్లో కొందరు చెబుతున్నారు. ఆనంద ప్రసాద్‌ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
 
Untitled-5.77877.jpgకాంగ్రెస్ లోనూ ఉత్కంఠే...
కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తు ఖరారైనప్పటికీ టికెట్‌ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు భిక్షపతియాదవ్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే టీడీపీకి అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం కావడం, 2014 ఎన్నికల్లో 78 వేలకు పైగా మెజార్టీ ఇక్కడ రావడంతో పొత్తులో ఆ పార్టీకే ఇక్కడ టికెట్‌ దక్కుతుందని టీడీపీ శ్రేణులు గట్టిగా వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
 
బీజేపీలోనూ...
ప్రస్తుతం నియోజకవర్గంలో కసిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు జ్ఞానేంద్రప్రసాద్‌ మరో ఇద్దరు యువనేతలు బీజేపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
 
 
Untitled-6.jpg3333.jpgటీడీపీలోనూ ఉత్కంఠే...
టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ మొవ్వా సత్యనారాయణ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల అభ్యర్థన మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పిలుపుతో టీడీపీలో చేరారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి 2015 వరకు పార్టీ కేడర్‌తో ఉన్న అనుబంధంతో మొవ్వా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. హఠాత్తుగా గురువారం సినీ నటుడు కళ్యాణ్‌రామ్‌ పేరు తెరపైకి రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో టీడీపీ కేడర్‌తో విజయవాడ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తనకు టికెట్‌ ఇవ్వాలని మొవ్వా కోరినట్లు తెలిసింది. ఇదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌, రాష్ట్ర నాయకుడు భానుప్రసాద్‌ కూడా అధినేత చంద్రబాబుకు ప్రొఫైల్‌ అందజేశారు.
Link to comment
Share on other sites

మహాకూటమి తొలి దశ చర్చలు పూర్తి.. అభ్యర్థులు వీరే!
21-09-2018 20:31:56
 
636731587134333531.jpg
మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయి. పొత్తులు, పోటీ స్థానాలపై తమ ప్రతిపాదనలను టీకాంగ్రెస్‌కు అందించాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేసి సీట్ల సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని నిర్ణయించాయి.
 
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిలు క‌లిసి ప్ర‌జాకూటమిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టికే నిర్ణయించాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు పూర్తి చేసుకున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌కు కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతను అప్పగించారు. కూటమి ఏర్పాటుకోసం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకోసం కూటమి పక్షాలు సహా కాంగ్రెస్ పరిస్థితి, అభ్యర్థుల బలంపైనా సర్వే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు.
 
సర్వే కోసం తాము పోటీ చేయద‌లిచిన సీట్ల‌పై టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదిత జాబితాను కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీ 15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. టీజేఎస్ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులు పెట్టినట్లు సమాచారం. మహాకూటమికి కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని, దానికి కోదండరాంను చైర్మన్ చేయాలన్న కండిషన్ పెడుతున్నారు.
 
 
అదలా ఉంచితే పొత్తుల్లో ముఖ్య భూమిక పోషిస్తోన్న టీడీపీ ఏ స్థానాలను కోరుతున్నదనేది ఇప్పుడు టాపిక్‌గా మారింది. టీడీపీ 30 స్ధానాలు కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతోంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్ధుల పేర్ల‌ను కాంగ్రెస్ పెద్ద‌ల ముందుంచారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్లలంద‌రికి టికెట్లు ద‌క్కెలా జాబితా రూపొందించారు.
 
జాబితా ఈ ర‌కంగా ఉండనుంది
దేవరకద్ర - రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. మక్తల్ - కొత్తకోట దయాకర్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ ), మాజీ ఎమ్మెల్యే. రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు. శేరిలింగంపల్లి -మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి లేదా మొవ్వ సత్యనారాయణ. కూకట్‌పల్లి- శ్రీనివాసరావు , కార్పొరేటర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ - ఎం.ఎన్.శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు. సికింద్రాబాద్ - కూన వెంకటేష్‌గౌడ్. ఉప్పల్- వీరేందర్‌గౌడ్. ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు. కోరుట్ల-ఎల్ .రమణ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.
 
 
హుజూరాబాద్ - ఇనగాల పెద్దిరెడ్డి , మాజీ మంత్రి. ఆర్మూర్ - ఏలేటి అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్యే. పరకాల లేదా వరంగల్ వెస్ట్ - రేవూరి ప్రకాష్‌రెడ్డి. ఆలేరు - శోభారాణి, తెలంగాణ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. కోదాడ - బొల్లం మల్లయ్యయాదవ్. మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త, కమ్మ సామాజిక వర్గం). ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ. సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే.
 
 
 
ఈ సీట్ల కోసం గట్టిగా ప‌ట్టుబ‌ట్టాల‌ని టీడీపీ భావిస్తోంది. ఈ సీట్ల‌లో క‌నీసం 15 సీట్ల‌లో పోటీ చేయాల‌ని నిర్ణయించింది. గ‌త ఎన్నిక‌ల్లో 15 సీట్ల‌ను గెలిచిన టీడీపీ ఈసారి ఖ‌చ్చితంగా గెలిచే సీట్ల‌నే తీసుకోవాల‌ని అనుకుంటుంది. అందుకే 19 పేర్ల‌తో జాబితాను కాంగ్రెస్‌కు అంద‌చేసింది. ఇక సీపీఐ 12 స్థానాలు, టీజేఎస్ 25 స్థానాల జాబితాను అందజేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఒకటి రెండు రోజుల్లో సర్వే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలకు కూర్చునే అవకాశం ఉంది.
 
 
Tags : Congress, TDP, CPI, tjs, Telangana
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...