Jump to content

TTDP


sonykongara

Recommended Posts

పార్టీ మారే ఆలోచనలో టీఆర్ఎస్ సీనియర్ నేత..?
25-08-2018 11:28:32
 
636707933153827810.jpg
  • కుత్బుల్లాపూర్‌లో ‘ముందస్తు’ వేడి
  • పార్టీ కార్యాలయం ఏర్పాటుతో రంగంలోకి దిగుతున్న టీడీపీ
  • టీఆర్‌ఎస్‌ టికెట్‌పై రాజుకుంటున్న వైరం
హైదరాబాద్, జీడిమెట్ల, (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అన్నిపార్టీలు ఎన్నికల ప్రణాళికలవైపు అడుగులు వేస్తున్నాయి. ఇతర పార్టీలోని ముఖ్యలపై కన్నేసి తమవైపు తిప్పుకునేలా హడావుడి చేస్తున్నారు. ఒకపక్క పాదయాత్రలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, మరోపక్క ఆకర్షణ్‌ పేరుతో పార్టీలు బిజీగా మారాయి.
 
టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దస్థాయిలోనే ఉంది. ఒకవైపు సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌లకే టిక్కెట్‌ ఇస్తామని ప్రకటించినా కుత్బుల్లాపూర్‌ టిక్కెట్‌పై పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తనకే టికెట్‌ వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోపక్క నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా చెప్పుకుంటున్న కొలన్‌ హన్మంత్‌రెడ్డి తనకే టిక్కెట్‌ వస్తుందన్న దీమాతో ఉన్నారు. స్థానికంగా అనేక కార్యక్రమాలను చేపడుతూ పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కెఎం.ప్రతాప్‌ తనకు కాని తన కుమారుడు కెపి.విశాల్‌కు గాని టిక్కెట్‌ ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా షాపూర్‌నగర్‌ సెంటర్‌లో మంగళవారం కెఎం.ప్రతాప్‌, ఆయన తనయుడు కెపి.విశాల్‌ల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను, తరలిపోతున్న పరిశ్రమలను కాపాడుకోవాలని, యువత ముందుకు రావాలని అని రాసిన హోర్డింగ్‌పై అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. టిక్కెట్‌ రాని పక్షంలో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూపు రాజకీయలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
 
ఎమ్మెల్యే వివేకానంద్‌ , శంబీపూర్‌ రాజును పక్కన పెట్టి నగర అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత్‌రావు, ఎంపీ మల్లారెడ్డిలతో కలిసి చర్చలు సాగించి టీడీపి, కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎస్ లోకి చేర్చుకోవడం కూడా చర్చాంశనీయంగా మారింది. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో కుత్బుల్లాపూర్‌లో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఈనెల 27న పార్టీ కార్యాలయం సందర్భంగా ధూంధాం చేయాలన్న లక్ష్యంతో టీడీపి నాయకులు ఉన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలోని టీడీపి కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా రాహుల్‌ గాంధీ సభలో స్పీచ్‌ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని కైవాసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా కుత్
Link to comment
Share on other sites

  • Replies 893
  • Created
  • Last Reply
ఆ మూడు పార్టీలు ఒక్కటిగా..ఎంపీ సీటుపైనే ఆ ఇద్దరి నేతల చూపు
26-08-2018 12:16:48
 
636708826060359784.jpg
  • కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐల మధ్య సయోధ్య..?
  • ఒకటీ, అరా సీట్లు మినహా పంపకం పూర్తి!
  • హర్షం వ్యక్తంచేస్తున్న కార్యకర్తలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి - ఖమ్మం):  ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో ముందస్తు పొత్తులపై కూడా ప్రచారం సాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏర్పడే ఈ పొత్తుల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై చూపించనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ జతకట్టగా టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తులో కాంగ్రెస్‌ పార్టీ మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాలను గెలుచు కుంది. సీపీఐ మాత్రం ఖమ్మం ఎంపీకి, వైరా కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ స్ధానాలకు పోటీచేసి అన్ని చోట్ల ఓటమి చెందింది. అయితే ఈసారి తెలుగుదేశం, బీజేపీల మధ్య మిత్రబంధం వీగిపోవడంతో టీడీపీ, కాంగ్రెస్‌ తో జతకడుతుందన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.
 
మూడు పార్టీలు ఒక్కటిగా..
గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఒంటరిగా పోటీచేయగా సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే విజయం సాధించారు. ఎంపీ స్థానంలో పోటీచేసిన నామ నాగేశ్వరరావుతోపాటు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా అభ్యర్థులు పరాజయం పొందారు. ఈసారి బీజేపీతో స్నేహబంధం తొలగిన తర్వాత జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐలు కూటమిగా బరిలోకి దిగుతాయన్న ప్రచారం జరుగు తోంది. రాష్ట్రస్థాయిలో చర్చలు, పొత్తులు ప్రారంభం కాకపోయినా జిల్లాలో మాత్రం సీట్లు సర్దుబాటు జరిగినట్టు ప్రచారం నడుస్తోంది. టీడీపీ ఖమ్మం ఎంపీ సీటుతో పాటు అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.
 
ఎంపీ సీటు ఎవరికో..
అయితే కాంగ్రెస్‌లో ఒక వర్గం పొత్తులకు అనుకూలంగా ఉండగా మరో వర్గం వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మం పార్లమెంటు సీటును గతసారి వదులుకుని నష్టపోయామని, ఈసారి తామే పోటీచేస్తా మని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతు న్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామ నాగేశ్వరరావు ఖమ్మం సీటును టీడీపీ నుంచి ఆశిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రేణుకాచౌదరి కూడా ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఇద్దరు ఖమ్మంపైనే దృష్టి సారించడంతో పొత్తులు, సీట్ల సర్దుబాటులో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
 
తోడళ్లుళ్ల నడుమ పోటీ
కొత్తగూడెం సీటు విషయంలో కూడా కాంగ్రెస్‌లో రెండు వర్గాలు నువ్వా? నేనా అన్నట్టుగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, తోడల్లుడు యడవల్లి కృష్ణ ఆశిస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఉంది. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌ పొత్తుతో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం చేస్తే కాంగ్రెస్సే పోటీచేయాలని పొత్తు వద్దంటూ ఫిర్యాదు చేస్తున్నారు.
 
సత్తుపల్లి బరిలో ఎవరు..?
సత్తుపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌ పోటీ చేశారు. పొత్తు కుదిరి ఆ స్థానాన్ని వదిలితే సంబాని పోటీచేసేందుకు ఎక్కడ కేటాయిస్తా రన్నది ప్రశ్నగా మారింది. పొత్తులపై ఊహాగానాలు జోరుగానే ఉన్నా ఆ వెనుకనే పొత్తుల వల్ల ఇబ్బందులు, ఓట్ల బదిలీలో ఏర్పడే సమస్యలు కూడా చర్చలు పార్టీ కేడర్ల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రకటన కాంగ్రెస్‌ అధిష్ఠా నం తీసుకున్న నిర్ణయంపైనే జిల్లా పొత్తులు, సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. అప్పటి వరకు ఈ ఉత్కంఠత జిల్లాలో కొనసాగే అవకాశం ఉంది.
 
లెక్కలు తేలాల్సి ఉందా..?
కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం, మధిర, పాలేరు, ఇల్లెందు, పినపాక ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. సీపీఐ కొత్తగూడెంతోపాటు వైరా సీటుపైన కన్నేసింది. పినపాక సీటును కూడా అడుగుతున్నప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు కాంగ్రెస్‌ సీటు అడుగుతున్నందున ఈసారి పినపాక సీపీఐకి ఇవ్వరన్న ప్రచారం ఉంది. మూడోసీటు ప్రత్యామ్నాయంగా వేరే జిల్లాలో కానీ, భద్రాచలం సీటును కానీ కేటాయించే పరిస్థితి ఉంది. ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కో సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మూడు పార్టీల మధ్య పొత్తులపై సీట్ల సర్దుబాటుపై ఊహాగానాలు జిల్లాలో ప్రచారంలో ఉన్నాయి.
Link to comment
Share on other sites

kashmir ni pakistan lo kalapali anukune vallatone potupettukuna party ne support chesina vallu... Congress & tdp party pothu paina enduku kopam... Though i want tdp to contest alone... But i don't understand the logic of their anger  ?

Link to comment
Share on other sites

టీడీపీ-కాంగ్రెస్ పొత్తుతో బరిలోకి దిగనున్న ఇద్దరు టీడీపీ నేతలు
28-08-2018 13:49:36
 
636710609771296491.jpg
  • కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ పొత్తుతో బరిలోకి దిగనున్న రమణ, పెద్దిరెడ్డి
  • కోరుట్ల, హుజూరాబాద్‌లో ధీటైన అభ్యర్థులని ప్రచారం
  • జిల్లాలో ఊపందుకున్న చర్చ
రాష్ట్రమంతటా ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈసారి టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లా నుంచి టీడీపీ సీనియర్‌ నాయకులైన ఎల్‌ రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి ఎన్నికల్లో పోటీపడే అవకాశం ఉంది. ఉద్యమ సమయంలో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ నుంచి భారీగా నాయకులు ఇతర పార్టీల్లో చేరారు. వీరిద్దరూ మాత్రం పార్టీని వీడకుండా తెలుగుదేశం అస్థిత్వాన్ని ఈ ప్రాంతంలో నిలుపుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎల్‌ రమణ కోరుట్ల నుంచి, పెద్దిరెడ్డి హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల అయినా అక్కడి నుంచి కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. దీంతో ఆయన కోరుట్ల నుంచి పోటీ చేస్తే అక్కడి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. హుజూరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఆశావహులు చాలా మంది ఉన్నా వారిలో ఎవ్వరూ మంత్రి ఈటల రాజేందర్‌కు పోటీ ఇచ్చే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయిస్తే పోరు రసవత్తరంగా మారతుందని అనుకుంటున్నారు.
 
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)
తెలంగాణ ఉద్యమకాలంలో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నేతల వలసలతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు మాత్రం ఆ పార్టీ అస్థిత్వాన్ని చాటుతూ రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తులుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయ తెరపైకి వచ్చి ఆసక్తికర చర్చలకు దారితీశారు. వారే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి. వీరిద్దరు జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినవారే. ఇద్దరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రులుగా చక్రం తిప్పినవారే. ఒకరు పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో, మరొకరు జగిత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలుపొంది రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లోని వ్యక్తులుగా మిగిలిపోయారు.
 
 
పార్టీని నమ్ముకుని..
తెలంగాణ ఉద్యమం ఉధృతం జరుగుతున్న కాలంలో పలువురు క్రియాశీల నేతలు తెలుగుదేశం పార్టీని వీడితే, మరికొందరు ఇటీవల రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ పార్టీలో కలిశారు. దీంతో జిల్లాలో పార్టీ బలహీనపడి పోయినా ఈ ఇద్దరు నేతలు మాత్రం తమను రాజకీయంగా ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీని వీడేది లేదంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎల్‌ రమణ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులుకాగా పెద్దిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పార్టీ పదవులు నిర్వహిస్తున్నా వీరి మాతృ జిల్లా అయిన పాత కరీంనగర్‌ జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయింది. సహచరులందరు పార్టీని వదిలినా వారు అలాగే ఉండి ఇటీవలనే జిల్లా కమిటీలను పునరుద్ధరించి రాజకీయ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.
 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో..
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 6, 7న అసెంబ్లీ రద్దును ప్రకటించి నవంబర్‌ నెలలో ముం దస్తు ఎన్నికలకు వెళ్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరు మళ్లీ జిల్లా, రాష్ట్ర రాజకీయ చర్చల్లోని వ్యక్తులుగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు రాజకీయ అవగాహనకు వచ్చి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సతో పోటీ పడతాయని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందుకు సా నుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కాం గ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేసిన పక్షంలో ఎల్‌ రమణ, పెద్దిరెడ్డి ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా చెబుతున్నారు.
 
కోరుట్ల నుంచి రమణ..
ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరితే ఎల్‌ రమణ కోరుట్ల నియోజకవర్గం నుంచి, పెద్దిరెడ్డి హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఈ విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ మద్దతుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోటీగా ధీటైన వ్యక్తులుగా నిలుస్తారని, అప్పుడు అధికార పార్టీ సర్వ శక్తులు ఒడ్డాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఎల్‌ రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల అయినా జగిత్యాలలో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ సీఎల్పీ ఉపనేతగా కూడా ఉన్నారు. ఆయన మళ్లీ ఎన్నికలు జరిగినా తప్పక గెలుపొందుతారని పార్టీ ధీమాతో ఉన్నది.
ఈ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి జీవన్‌రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి గెలిచిన వ్యక్తిగా తిరుగులేని రికార్డు సంపాదించుకున్నారు. ఆయనకు ఆ స్థానం పక్కా కావడంతో ఎల్‌ రమణ శాసనసభ్యుడిగా పోటీ చేయాలంటే పక్క నియోజకవర్గమైన కోరుట్లను ఎంచుకోవాల్సి వస్తుం ది. కోరుట్ల నియోజకవర్గంలో కూడా రమణ సామాజికవర్గం బలంగా ఉండడంతోపాటు ఆయనకు విస్తృత పరిచయాలు తోడుగా ఉన్నాయి.
 
రమణ జగిత్యాల నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 1995లో కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లారు. శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్‌ శాసనసభ్యుడు కె విద్యాసాగర్‌రావు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఈయన 2009లో, 2010 ఉప ఎన్నికలో, 2014లో మూడుసార్లు ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయనకు పోటీగా ఎల్‌ రమణ పోటీ చేసినా ధీటైన అభ్యర్థే అవుతాడనే ప్రచారం అప్పుడే ఊపందుకున్నది.
 

హుజూరాబాద్‌ నుంచి పెద్దిరెడ్డి
హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ తిరుగులేని శక్తిగా ఉన్నారు. ఆయన కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి ఆ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ అనుకుంటుండగా ఇనుగాల పెద్దిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
 
ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో గెలుపొంది చంద్రబాబు హ యాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరా రు. కొద్ది నెలలుగా ఆయన బీజేపీలో చేరి హుజురాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, లేని పక్షంలో కరీంనగర్‌ ఎంపీగా బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమోకాని మళ్లీ ఆ ప్రచారానికి తెరపడి ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఈ స్థానం కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్‌ పోటీ పడుతున్నా వీరెవరు ఈటల రాజేందర్‌కు సమ ఉజ్జీలు కారనే అభిప్రా యం నియోజకవర్గంలో ఉంది. పెద్దిరెడ్డి అయితేనే ఆయనకు గట్టి పోటీ ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచా రం ప్రారంభమయింది. ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని టీడీపీకి వదిలేసే అవకాశం ఉంద ని దాంతో పెద్దిరెడ్డి ఈటలకు పోటీగా రంగంలోకి వస్తారని చెబుతున్నారు. టీడీపీకి బలాబలాలు ఎలా ఉన్నా ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చల్లోని వ్యక్తులయ్యారు.
Link to comment
Share on other sites

ఇక టీడీపీ నేతలు శివార్లలో త మ పార్టీ పూర్వవైభవం కోసం కష్టపడుతున్నారు. సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ ఇటీవల కొందరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఇలా అన్ని పార్టీలూ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించాయి.

Link to comment
Share on other sites

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ: లోకేశ్‌
05-09-2018 02:42:59
 
636717121787357518.jpg
అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఏపీ మంత్రి లోకేశ్‌ తెలిపారు. అయితే, పొత్తులపై పార్టీ పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో నాయకులు వెళ్లినా.. కార్యకర్తలు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘ఎప్పుడైనా హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పెడితే కనీసం ఐదువేల మంది వస్తున్నారు. పార్టీ కార్యాలయం సరిపోవడం లేదు. ప్రతి గ్రామంలోను బలమైన కార్యకర్తలున్న పార్టీ టీడీపీ’ అని పేర్కొన్నారు. కాగా, ముందస్తు ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు 8న తెలంగాణ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీతోపాటు పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఎజెండా రూపొందించేందుకు బుధవారం సమావేశం కానున్నట్లు టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు రమణ తెలిపారు.
Link to comment
Share on other sites

కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేయగానే, తెలంగాణలో చంద్రబాబు అమలు చేసే ప్లాన్ ఇదే !

Super User
05 September 2018
Hits: 60
 
cbn-05092018.jpg
share.png

తెలంగాణలో రాష్ట్రంలోరాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసి, ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయిచినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే తెలంగాణలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వ్యూహం పాటించాలన్న విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇప్పటికే టీటీడీపీ నేతలతో భేటి జరిపినట్టు సమాచారం. కేసిఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటించిన వెంటనే తెలంగాణలో విస్తృతంగా పర్యటించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.

 

cbn 05092018 2

తెలంగాణలో టీటీడీపీలో బలమైన నేతలు లేకపోయినా,బలమైన కేడర్ మాత్రం ఉందని, చంద్రబాబు బలంగా నమ్ముతున్నారని, అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయనే స్వయంగా కదలాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రబుత్వాన్ని ను ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఒక్కటే మార్గమని నాయకులూ చంద్రబాబుబుకి సూచిస్తున్నారట. ఒక వేళ అదే కనుక జరిగి తెలంగాణలో, టీటీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అటువంటి పరిస్థితి లో ఏపీలో ఏం చేయాలన్నదానిపైనా చంద్రబాబు తన వర్గాలతో ఇప్పటికే చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

cbn 05092018 3

చంద్రబాబు, తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్టు అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే ఎటువంటి వ్యూహాన్నైనా అమలుచేయాలని, అప్పటివరకూ ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలను తనకు తెలియచేయాలని తెలంగాణ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పాలనా పరంగా, రాజకీయంగా ఎటువుంటి ఇబ్బంది లేకుండా, చంద్రబాబు పావులు కదపనున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్, జగన్, కెసిఆర్ కి సపోర్ట్ ఇస్తూ ఉండటం కూడా పరిగణలోకి తీసుకుని, తగు విధంగా, అక్కడ రాజకీయం చెయ్యనున్నారు. అయితే, ఈ తరుణంలో బీజేపీని కూడా వదిలిపెట్టకూడదని, బీజేపీ తెలంగాణాకు కూడా అన్యాయం చేసిన విధానం, కెసిఆర్ సరిగ్గా పోరాడకపోవటం కూడా, ప్రజలకు వివరించనున్నారు అని తెలుస్తుంది.

 

Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

తెలుగుదేశం తోనే కాంగ్రెస్ ఇరవై ఐదు అసెంబ్లీ రెండు పార్లమెంటు సీట్లలో తెలుగుదేశం.

2 aa 5 iste  easyga kotteyachu 

Malkajgiri 

Serilingam palli

Khammam

Mahaboobnagar

Nalgonda

Vitilo TDP super strong if cong supports 

Link to comment
Share on other sites

4 minutes ago, KING007 said:

25 & 2???

Ee matram daaniki direct pothhu enduku, lopayakari oppandam chesukunte chaalu ga...

 

2 minutes ago, Andhrudu said:

2 aa 5 iste  easyga kotteyachu 

Malkajgiri 

Serilingam palli 

Khammam

Mahaboobnagar

Nalgonda

serilingampally   seat ledu ga

Link to comment
Share on other sites

ఎన్నికలపై అలర్ట్ అయిన టీటీడీపీ
05-09-2018 17:53:17
 
636717667969888724.jpg
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం రాజకీయ వేడిని రాజేసింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అందుకు తగ్గట్లుగా తమ తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న టీటీడీపీ కూడా ఎన్నికల నేపథ్యంలో అలర్ట్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 8న హైదరాబాద్‌ రానున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో పొత్తుల అంశంపై టీ.కాంగ్రెస్ నేతలతోనూ చంద్రబాబు భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...