Jump to content

Polvaram not of any interest for Modi, but MH gets 10 times polavaram


AnnaGaru

Recommended Posts

we discussed this deliberate attempts to stall anything in  Andhra...another worst part is Andhra was given least drought relief.....also Andhra was given least amout under AIBP sheme..

under AIBP scheme they praised AP&CBN govt for being top in result oriented irrigation but gave "least amount of money"

today AJ came up with article on same...

 

 

c41c6d5b-a148-46e5-9f6c-e59c666bb239

 

e2caade3-e920-4a8c-ba81-7be5c9bd381c

Link to comment
Share on other sites

Andhra is not part of country for this pm!!!!.....

How can they give 1 state 80,000 crores in two years stalling polavaram National project with 2018 deadline...total polavaram center grant till now is 1/10 th of MH two years money for irrigation...

Link to comment
Share on other sites

మోదీ...ఇది మోసం కాదా!
25-08-2018 02:00:39
 
636707592421241377.jpg
  • మహారాష్ట్రకు ఉదారంగా సాయం.. మనకు తీరని అన్యాయం
  • మహారాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల వరద
  • రెండేళ్లలో రూ.63 వేల కోట్లు సహాయం
  • ఈ ఏడాది రూ.13 వేల కోట్లు విడుదల
  • నేరుగా నిధులు, రుణాలతో పండగ
  • రాష్ట్రాన్ని 3 కేటగిరీలుగా విభజించి చేయూత
  • సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంపై ప్రేమ
  • నోరు తెరిచి అడగకున్నా సొమ్ములే సొమ్ములు
  • ఏపీ ఎంతగా వేడుకున్నా దిక్కులేదు
  • పేరుకే పోలవరం జాతీయ ప్రాజెక్టు
  • ఇప్పటిదాకా ఇచ్చింది రూ.9వేల కోట్లు
  • సవరించిన అంచనాలపై కొర్రీలు
  • డిజైన్ల ఆమోదమూ పెండింగ్‌లోనే
  • ఏఐబీపీ నిధులకూ అనుమతులు కరువు
  • చేసిన అరకొర సహాయానికే గొప్పలు!
 
ఆంధ్రప్రదేశ్‌కు చేసినంత సహాయం దేశంలో మరే రాష్ట్రానికీ చేయలేదంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు!
 
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన, పూర్తిగా కేంద్రమే ఖర్చు భరించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికి రూ.9 వేల కోట్లు ఇచ్చి... మిగిలిన నిధులు ఇవ్వకుండా, సవరించిన అంచనాలు ఆమోదించకుండా ‘ఇదే మహా ప్రసాదం’ అన్నట్లుగా మాట్లాడుతున్నారు!
 
నవ్యాంధ్రకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా... చేయాల్సినవి చేయకుండానే డాంబికాలకు పోతున్నారు!
 
అయితే... మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమకంటే ఇంకా తక్కువ ప్రేమ చూపుతోందని రుజువైంది. రాష్ట్రానికి పైసా పైసా రాల్చుతూ దాంతోనే పండగ చేసుకోమని చెబుతూ... తమ సొంత పార్టీ సర్కారు ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తోంది. అంతా ఇంతా కాదు... కేవలం రెండేళ్లలో వివిధ రూపాల్లో 63వేల కోట్లు సహాయం చేసింది.
 
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు! అడగడమేం ఖర్మ... వేడుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, ఒకటికి పదిసార్లు ప్రదక్షిణలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడంలేదు. కానీ... సొంత పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అడిగినా, అడగకపోయినా నిధుల వరద పారిస్తోంది. ‘ప్రాజెక్టుల పండగ చేసుకోండి’ అంటూ నిధులు కుమ్మరిస్తోంది. అంతా ఇంతా కాదు... గత రెండేళ్లలోనే మహారాష్ట్రలోని ప్రాజెక్టులకు కేంద్రం రూ.63వేల కోట్లకు పైగా సహాయం చేసింది. ఈ ‘మహా’ వితరణ చూసి ఆర్థిక నిపుణులే విస్తుపోతున్నారు. ఇది కేంద్రం నుంచి ఒక రాష్ట్రానికి జరుగుతున్న కనీవినీ ఎరుగని సహాయమని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో 83 చిన్నతరహా, మధ్య, భారీ నీటి ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు ఇస్తామని, 3.77 లక్షల హెక్టార్లకు నీరు అందిస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్రం అట్టహాసంగా ప్రకటించింది. చెప్పడమే కాదు... ఆ వెంటనే 13,651.61 కోట్ల రూపాయలను మంజూరు చేసేసింది. ఇంతా చేస్తే... మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల కోసం కేంద్రాన్ని అడగనే లేదు. మహారాష్ట్రకు నిధులు ఇవ్వడంలో భారీ ఉత్సాహాన్ని ప్రదర్శించడంతోపాటు... అందుకు కేంద్రం చూపిస్తున్న కారణాలూ బహు ఉదారంగా ఉన్నాయి. మహారాష్ట్రను... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, సాగునీరందని ప్రాంతాలు అంటూ విభజన చేసి మరీ నిధులు గుమ్మరిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఏపీలో రాయలసీమ అన్నిరకాలుగా వెనుకబడింది. వర్షాలకు నోచుకోక, పంటలు పండక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అయినా... సీమతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. మహారాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం పుష్కలంగా నిధులు ఇస్తోంది.
 
 
చేతికి ఎముకే లేదు..
మహారాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం 25 శాతం నిధులు నేరుగా ఇస్తూ... 75 శాతం నాబార్డు రుణాన్ని కూడా తానే చెల్లించేందుకూ సిద్ధపడింది. గత ఏడాది బడ్జెట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పథకాల కోసం రూ.6489 కోట్లను ప్రతిపాదించింది. కానీ, కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని ఏకంగా రూ.59,162 కోట్లుగా చూపించింది. ఇందులో ప్రధాన మంత్రి కృషి సంచాయ్‌ యోజన (పీఎంకేఎ్‌సవై) కింద నాబార్డు రుణం రూ.12,770, కేంద్ర సహాయం కింద రూ.3830 కోట్లు... కలిసి రూ.16,600 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. రైతు ఆత్మహత్యలున్న ప్రాంతాలలో సాగునీటి పథకాలను అమలు చేసేందుకు నాబార్డు రుణం రూ.15,522 కోట్లు, కేంద్ర సాయం రూ.5174 కోట్లు మొత్తం రూ. 28,696 కోట్లను మంజూరు చేసింది. ఇది కాకుండా... సాగు నీటి పథకాల కోసం ప్రత్యేకంగా మరో 2000 కోట్ల నాబార్డు రుణ సాయాన్ని కూడా అందించింది. మహారాష్ట్రలోని స్థానిక బ్యాంకుల నుంచి రూ.10,306 కోట్లను మంజూరు చేయించింది. వెరసి మహారాష్ట్రకు వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 50,182 కోట్ల సహాయం అందింది. మరో 83 ప్రాజెక్టుల కోసం రూ.13,651.61 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్రం మంజూరు చేసింది. అంటే.. ఈ రెండేళ్లలోనే రూ.63,813.61 కోట్లను మంజూరు చేసింది.
 
 
మన రాష్ట్రం పరిస్థితి ఇలా..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013-14 సవరణ అంచనాలు రూ.58,916.06 కోట్లకు ఆమోదముద్ర వేయాలంటూ ఏడాదిన్నరగా కేంద్రాన్ని కోరుతున్నా ఫలితం లేదు. కాంక్రీట్‌ పనులు, భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో, గత నెల 11న కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు.. పోలవరం తుదిఅంచనాలు, డిజైన్లను తక్షణమే ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. కానీ అతీగతీ లేదు.
 
 
ఏఐబీపీ నిధులూ అంతే...
రాష్ట్రంలో ఏఐబీపీ కింద వంశధార రెండో దశ, సోమశిల, మడ్డువలస, ఎర్రకాలువ రిజర్వాయరు, అన్నమయ్య చెరువు, స్వర్ణముఖి బ్రిడ్జి, కానుపూరు కెనాల్‌ స్కీమ్‌, ముసురుమిల్లి రిజర్వాయరు, తారకరామ తీర్థ సాగర్‌, వెలుగోడు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి 40 శాతం నిధులు రావాల్సి ఉంది. వాస్తవానికి ఏఐబీపీ కింద.. 90 శాతం నిధులు రావాలి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక దీనిని కేంద్ర వాటా 40 శాతానికి కుదించింది. ఇది కాకుండా క్యాడ్‌వామ్‌ కింద మరో రూ.320 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ నిధులు కూడా విడుదల కాలేదు. పీఎంకేఎ్‌సవై కింద రాష్ట్రంలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలంటూ అభ్యర్థనల మీద అభ్యర్థనలు పెడుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...