Jump to content

CBN USA TOUR


sonykongara

Recommended Posts

వచ్చే నెలలో అమెరికాకు చంద్రబాబు
22-08-2018 01:11:12
 
అమరావతి, ఆగస్ట్‌ 21(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్నారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం తగ్గించి సహజ సిద్ధ సేద్యాన్ని ప్రోత్సహించడంపై సెప్టెంబరు 23 నుంచి 27 వరకు న్యూయార్క్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. దీనికి సీఎంకు ఆహ్వానం అందింది. ఏపీలో అమలుచేస్తున్న జీరో బడ్జెట్‌ వ్యవసాయం, సాగులో ఇతర అధునాతన విధానాల గురించి సీఎం అక్కడ ప్రసంగిస్తారు. తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని.. ‘పరిశ్రమలు 4.0’ నివేదికను విడుదల చేస్తారు.
Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply
ఐరాస సదస్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
29ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే సదస్సుకు హాజరుకావాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్తెయిమ్‌ ఈ మేరకు లేఖ రాశారు. సీఎం ఈ సదస్సుకు హాజరై కీలకోపన్యాసం చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం, మహిళా విభాగం, బీఎన్‌పీ పారిబాస్‌, ప్రపంచ ఆగ్రోఫారెస్ట్రీ కేంద్రం, పలు ఇతర సంస్థలు దీనికి హాజరవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం, 2024 నాటికి 60 శాతం మంది రై

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఈ నెల 23న సీఎం చంద్రబాబు అమెరికా టూర్
15-09-2018 22:43:41
 
636726482227140262.jpg
అమరావతి: ఈ నెల 23 నుంచి సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. ఐ.రా.స ఆహ్వానం మేరకు ప్రకృతి వ్యవసాయంపై ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం న్యూజెర్సీలో తెలుగు అసోసియేషన్లతో సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులు, రాజధాని నిర్మాణంపై మాట్లాడనున్నారు. అయితే సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎంపీ సీఎం రమేష్‌, అధికారులు ముందే  అమెరికాకు వెళ్లనున్నారు.
Link to comment
Share on other sites

రేపు అమెరికాకు చంద్రబాబు.. ఐరాసలో ప్రసంగం
21-09-2018 17:42:46
 
636731496088181245.jpg
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.
 
 
చంద్రబాబు పర్యటన ఇలా సాగనుంది..
22న ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో కూడా భేటీకానున్నారు. అలాగే న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్‌కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
 
 
ఈ నెల 23న 'మడోయర్ మెరైన్' ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో, రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్‌షాను చంద్రబాబు కలవనున్నారు. ఈ నెల 24న గూగుల్ ఎక్స్ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఎఫ్ సాక్ ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగం ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.
 
 
ఈ నెల 25న సునీల్ భారతి మిట్టల్‌తో చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీలో వ్యాపార అవకాశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. సిస్కో మాజీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జాన్‌తో భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.
Link to comment
Share on other sites

కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో 

 

కీర్తి మెల్కొటే :waiting: e candidate tho meeting koncham interesting ga undi..too good profile and tech world lo great personality

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:
రేపు అమెరికాకు చంద్రబాబు.. ఐరాసలో ప్రసంగం
21-09-2018 17:42:46
 
636731496088181245.jpg
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.
 
 
చంద్రబాబు పర్యటన ఇలా సాగనుంది..
22న ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో కూడా భేటీకానున్నారు. అలాగే న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్‌కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
 
 
ఈ నెల 23న 'మడోయర్ మెరైన్' ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో, రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్‌షాను చంద్రబాబు కలవనున్నారు. ఈ నెల 24న గూగుల్ ఎక్స్ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఎఫ్ సాక్ ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగం ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.
 
 
ఈ నెల 25న సునీల్ భారతి మిట్టల్‌తో చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీలో వ్యాపార అవకాశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. సిస్కో మాజీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జాన్‌తో భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.

Good to hear. But what about attending Dharmabad court? Am I missing something?

Link to comment
Share on other sites

ఐరాస వేదికపై.. ఆంధ్రుల వాణి!
22-09-2018 03:13:52
 
636731828302120959.jpg
  • రాష్ట్రంలో ప్రకృతి సేద్యంపై 25న సీఎం ప్రసంగం
  • పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు
  • నేడు అమెరికా బయల్దేరుతున్న చంద్రబాబు
  • 23 నుంచి 26వ తేదీ దాకా పర్యటన
  • 28న రాష్ట్రానికి పునరాగమనం 
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంకురించిన ప్రకృతి సేద్యం.. ప్రపంచ వేదికైన ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. ఫలితంగా దీనిపై ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లభించింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రఽధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక-బ్లూంబెర్గ్‌ నిర్వహించే ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. 25వ తేదీన తెల్లవారుజామున మూడుగంటలకు(భారత కాలమాన ప్రకారం) ఆయన ఆ సదస్సులో ప్రసంగిస్తారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చిస్తారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరిస్తారు. రైతుల ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్యరహిత సాగును ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. మరోవైపు.. తన పర్యటనలో భాగంగా పలువురు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో సీఎం భేటీ కానున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి అమెరికా బయల్దేరి వెళ్తారు. 23వ తేదీ నుంచి 26వ తేదీదాకా పర్యటించి.. 28న తిరిగిరానున్నారు.
 
పెట్టుబడుల సాధన లక్ష్యంగా..
ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా తొలిరోజు (23న) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌తో సమావేశమవుతారు. తర్వాత ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌, అరూబా నెట్‌వర్క్స్‌ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో చర్చలు జరుపుతారు. న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థుల సదస్సుకు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు. రెండోరోజు (24న) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యూఎన్‌ ఉమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ ఫుమ్‌జిల్‌తో భేటీ అవుతారు. రిటైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పరిబస్‌ సీఈవో జీన్‌ లారెంటో బొన్నాఫేతో చర్చలు జరుపుతారు. తర్వాత ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌ను, రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ షాను వేర్వేరుగా కలుస్తారు.
 
అనంతరం వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ అధిపతి ఎరిక్‌ సోలీమ్‌తో సమావేశం ఉంటుంది. 25న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. ఇందులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. ఇక మూడో రోజు ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక సమన్వయకర్త టాటియానా లెబస్కీకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి-ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే బహుళపక్ష సమావేశంలో పాల్గొని ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత’ అనే అంశంపై సంయుక్త పత్రాన్ని సమర్పిస్తారు. వైర్‌లెస్‌ ఆప్టికల్స్‌ కమ్యూనికేషన్స్‌ రంగ దిగ్గజం-గూగుల్‌ ఎక్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు టామ్‌ మూర్‌, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సాక్‌) ప్రాజెక్టు అధిపతి మహేశ్‌ కృష్ణస్వామితోనూ సమావేశమవుతారు. తర్వాత ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ రంగానికి చెందిన పెట్టుబడిదారులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు.
 
అదేరోజు సాయంత్రం వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ అసోసియేషన్‌తో జరిపే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం యూఎ్‌స-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదికకు చెందిన 25 మంది ఉన్నత శ్రేణి ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఉంటుంది. నాలుగో రోజు (26న) కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు, నెట్‌వర్కింగ్‌ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. భారతీయ టెలిక్యూమనికేషన్‌ దిగ్గజం సునీల్‌ భారతీ మిట్టల్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత చంద్రబాబు బృందం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుంది. ‘సాంకేతిక యుగంలో పరిపాలన’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అదేరోజు యూఎ్‌స-ఇండియా వాణిజ్యమండలి, సీఐఐ, ఏపీ ప్రభుత్వాలు కలిసి నిర్వహించే బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలపై ప్రసంగిస్తారు. భారత రాయభార కార్యాలయంలో సిస్కో మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌తో భేటీ అవుతారు. అనంతరం బయల్దేరి 28వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకుంటారు.
 
 
న్యూజెర్సీ బహిరంగ సభలో..
ఈ పర్యటనలో భాగంగా 23న తెలుగుదేశం పార్టీ న్యూజెర్సీలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నాలుగున్నరేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, అమలుచేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్‌ లక్ష్యాలను వివరిస్తారు. న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ప్రవాసాంధ్రులు ఈ సభను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, ఐదుగురు అధికారులు వెళ్లనున్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

పెట్టుబడులే లక్ష్యం 
నేడు అమెరికాకు ముఖ్యమంత్రి 23 నుంచి 27 వరకు పర్యాటన 
  ఐరాసలో ప్రకృతి సేద్యంపై కీలకోపన్యాసం 
  ప్రవాసాంధ్రుల సభలో ప్రసంగం 
ఈనాడు - అమరావతి 
21ap-main5a.jpg

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అమెరికా బయలుదేరుతున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేస్తారు. ఈ నెల 25న తెల్లవారుజామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, వాణిజ్య వేత్తలతో భేటీ అవుతారు.

ముఖ్యమంత్రి పర్యటన సాగేదిలా..! 
మొదటి రోజు: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌తో సమావేశమవుతారు. అనంతరం ఇంటెలిజెంట్‌ ఎడ్జ్‌, అరూబా నెట్‌వర్క్స్‌ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో భేటీ. ఆ తర్వాత న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ)లో స్టూడెంట్‌ సెనేట్‌కు వెళతారు. అదే రోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో విస్తృత సమావేశంలో పాల్గొంటారు.

రెండో రోజు.. 
సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థ మడోయర్‌ మెరైన్‌ ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. ఆ తర్వాత ఐరాస ప్రధాన కార్యాలయంలో యూఎన్‌ ఉమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫుమ్‌జిలే మలాంబో నూకాతో సమావేశమవుతారు. రీటెయిల్‌ బ్యాంకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పరిబాస్‌ సీఈఓ జీన్‌ లారెంట్‌ బొన్నాఫేతో చర్చలు జరుపుతారు. అనంతరం ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌తో భేటీ అవుతారు. రాక్‌ఫెలర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌షాను కలుస్తారు. ఐరాస పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోలీమ్‌తో సమావేశం అనంతరం ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొంటారు.

మూడో రోజు.. 
ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిరాభివృద్ధి-ప్రభావ సదస్సు’లో ఆయన పాల్గొంటారు. 
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి, ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే సమావేశంలో పాల్గొని ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత’ అన్న అంశంపై సంయుక్త పత్రాన్ని సమర్పిస్తారు. వైర్‌లెస్‌ ఆప్టికల్స్‌ కమ్యూనికేషన్స్‌ రంగ దిగ్గజం గూగుల్‌ ఎక్స్‌ ఉపాధ్యక్షుడు టామ్‌ మూరే, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సాక్‌) ప్రాజెక్ట్‌ హెడ్‌ మహేశ్‌ కృష్ణస్వామితో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ రంగానికి చెందిన పెట్టుబడిదారులతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదికకు చెందిన 25 మంది ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు. 

నాలుగో రోజు.. 
భారత టెలికం దిగ్గజం సునీల్‌ భారతి మిట్టల్‌తో సమావేశవుతారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు.  అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి, సీఐఐ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో జరిగే బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ భేటీలో ప్రసంగిస్తారు.

న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల భారీ సభ 
ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు నాట్స్‌ డైరెక్టర్‌ మన్నవ మోహనకృష్ణ, సంస్థ ప్రతినిధి కలపాతపు బుచ్చిరామప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ఈ సభ జరుగుతుందని, పార్టీ శ్రేణులకు సీఎం దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు.

*అమెరికా పర్యటనకు ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం శనివారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి... తిరిగి ఈ నెల 28న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌కు వస్తుంది. ముఖ్యమంత్రి వెంట వెళుతున్నవారిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ తదితరులున్నారు.

Link to comment
Share on other sites

Krishna District TDP @krishna_tdp 12m12 minutes ago

 
 

CM @ncbn met Dr. Noori Dattatreya, a renowned Radiation Oncologist who is keen to work closely with the State govt to train AP’s doctors in modern practices and technology for treating cancer. The trained doctors could then treat patients even in the remotest parts of the State.

DnzLIffX0AUj0Tc.jpg
DnzLIwVX0AEZ62P.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...