Jump to content

Center to reject UAE 700Cr help to Kerala?


sskmaestro

Recommended Posts

https://www.news18.com/news/india/centre-unlikely-to-accept-uaes-rs-700-crore-flood-relief-offer-for-kerala-1852631.html?ref=m_hp_top_pos_1

 

 

emira modi ji nee valla upayogam.... you will declare 2k fund.... finally will give 200 Cr... avatalodu 1M USD help istanu antey vaddantav!

 

Gujarath earth quake appudu ekkadekkada nuncho finds vachayi kada.... I am in school and whole school took dabbas and roamed home to home and gave 5k to PMRF in those days...

Link to comment
Share on other sites

1 hour ago, chanti149 said:

Y so..?

1. UAE didn't make a formal offer yet

2. MEA didn't officially discuss yet

3. India had rejected foreign assistance after the 2004 tsunami and 2013 Uttarakhand flood, lets see if this policy will change.

Link to comment
Share on other sites

6 hours ago, Vinay NTR said:

India did not reject friend aid in 2013. Adukkuntunatttu undi ani, NGO dwara ivvamannaru. Japan gave 150 million and build so many houses  

adukkoka inkemi undi india lo. 56 inch chest gadni nammukunte budide kerala vallaki migeledi. aid voddani naala gas ammi aa 700 Cr ee 56 inch gaadu isthadu anukuntunnava. 50 Cr kuda ivvadu veedu chivariki.. :roflmao:

Link to comment
Share on other sites

రూ.700కోట్లను కేంద్రం ఎందుకు తిరస్కరిస్తోంది?

11263722BRK-KKK1.JPG

దిల్లీ: కేరళలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వంద మిలియన్‌ డాలర్లు (రూ.700కోట్లు) సాయం అందిస్తామని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని తిరస్కరించే అకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేరళను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తామని కేంద్రం చెప్తోంది. అయితే విదేశీ సాయం తీసుకునే అంశంపై తుది నిర్ణయం మాత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతానికి తమ విభాగానికి ఎలాంటి ఆఫర్లు, ప్రతిపాదనలు రాలేదని ఎంఈఏ తెలిపింది.

భారత్‌ గత కొన్నేళ్ల నుంచి విపత్తుల సమయంలో ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదు. ఆ విధానాన్ని కేంద్రం ఇప్పుడు మార్చాలని అనుకోవట్లేదని తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వరదల సమయంలోనూ, కశ్మీర్ వరదల సమయంలో కూడా కేంద్రం విదేశాల నుంచి సహాయాన్ని తీసుకోలేదు. 2013లో ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో రష్యా సాయం చేస్తానని ప్రతిపాదనలు చేసింది కానీ భారత్‌ అంగీకరించలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని, అవసరమైతేనే విదేశీ సాయం తీసుకోవాలని భారత్‌ గతంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయత్నాల ద్వారానే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయులు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నేరుగా ఆర్థిక సాయం చేయొచ్చు అని కేంద్రం తెలిపింది. రిజస్టర్‌ అయిన ఎన్జీవోలకు పంపే సహాయ నిధులకు మాత్రమే పన్ను ఉండదని, రిజిస్టర్‌ కాని ఎన్జీవోలకు పంపే నిధులపై పన్ను పడుతుందని అధికారులు స్పష్టంచేశారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూఏఈ యువరాజు డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని, రాష్ట్రానికి తాము అందించే సాయం గురించి తెలిపారని వెల్లడించారు. యువరాజుకు విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేరళకు, యూఏఈతో ప్రత్యేక బంధముందని, మలయాళీలకు అది మరో ఇల్లు లాంటిదని ట్వీట్‌ చేశారు. యూఏఈలో పనిచేసే భారతీయుల్లో దాదాపు 80శాతం కేరళకు చెందినవారే ఉండడం గమనార్హం. మాల్దీవులు ప్రభుత్వం కేరళకు 50వేల డాలర్లు (రూ.35లక్షలు) సాయం ఆఫర్‌ చేసింది. ఐరాస కూడా సాయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ భారత్‌ వీటిని అంగీరించకపోవచ్చని సమాచారం.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లిందని విజయన్‌ తెలిపారు. కాగా ఆయన కేంద్రాన్ని రూ.2600కోట్లు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రూ.600కోట్ల తక్షణ సాయం అందజేసింది. రాష్ట్రంలో వరదల కారణంగా రెండు వందల మందికి పైగా మరణించారు. దాదాపు 14లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Link to comment
Share on other sites

Just now, Uravakonda said:

Nothing wrong. Bayati shakthulu mana desham lo base form chesukuntam ante oppukom. 

But central should do much better than this.

but problem is Modi allowed foreign entities donations to parties...is that not a influence?

Link to comment
Share on other sites

4 hours ago, AnnaGaru said:

but problem is Modi allowed foreign entities donations to parties...is that not a influence?

Allow cheyakoodadhu avi kooda.

Some how BJP sketch vesi money and mafia ready ga pettukoni undhi. Manam eesari inkocham hard ga cheyali.

Elagu CBN central lo BJP ni dhimpaali ani cheppadu kabatti more eyes on TDP now.

Link to comment
Share on other sites

8 hours ago, Uravakonda said:

Nothing wrong. Bayati shakthulu mana desham lo base form chesukuntam ante oppukom. 

But central should do much better than this.

there is a difference between regular aid and aid when there is a natural disaster...

Link to comment
Share on other sites

విదేశీ సాయం వద్దు.. స్పష్టం చేసిన విదేశాంగ శాఖ

12401623BRK-RA1.JPG

దిల్లీ: విపత్తుల విషయంలో విదేశీ సాయం వద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు విదేశాలు సాయం చేస్తామని ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. యూఏఈ రూ.700 కోట్ల సాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ సాయాన్ని కేంద్రం తిరస్కరించనుందని, దీనిపై విదేశాంగ శాఖ (ఎంఈఏ)స్పష్టత ఇవ్వాలని వచ్చిన వార్తలతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం, విదేశీ సాయాన్ని అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ వెల్లడించారు. దేశీయ ప్రయత్నాల ద్వారానే కేరళ రాష్ట్రాన్ని పునరిద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

కేరళకు యూఏఈ రూ.700కోట్లు, ఖతార్‌ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35లక్షల సాయాన్ని ప్రకటించాయి. భారత ప్రభుత్వం ఆయా దేశాల ఉదారత్వానికి ధన్యవాదాలు తెలిపింది. కానీ వాటిని అంగీకరించమని వెల్లడించింది. ప్రధాన మంత్రి సహాయ నిధికి, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్‌ఆర్‌ఐలు, అంతర్జాతీయ ఫౌండేషన్లు, సంస్థలు సహాయం చేయొచ్చని రవీష్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే కేంద్రం నిర్ణయంతో కేరళ వాసులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా యూఏఈ సహాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీని కలిసి విదేశీ సాయం అందుకోవడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని కోరతామని విజయన్‌ తెలిపారు. కేరళలో దాదాపు పక్షం రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లిందని విజయన్‌ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు, రవాణా వ్యవస్థ నాశనమైపోయాయి. దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...