Jump to content

AP Govt turns a helping hand for small budget films


sonykongara

Recommended Posts

ఏపీలో చిన్న సినిమాలకు పెద్ద ఊరట
04464421BRK112AMBICA.JPG

అమరావతి: చిన్న బడ్జెట్‌ సినిమా నిర్మాతలకు శుభవార్త. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ... చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సినిమాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో ..రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

 
సినీ పరిశ్రమకు శుభవార్త
21-08-2018 17:25:28
 
636704691307852175.jpg
అమరావతి: సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వనుంది. రూ.4కోట్ల లోపు సినిమా తీస్తే చిన్న సినిమాగా పరిగణిస్తామని ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. సినిమాపై వచ్చే పన్ను మొత్తం వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ 9 శాతం పన్ను రద్దు చేస్తామని చెప్పారు. పన్ను రాయితీలు, లోకేషన్లు ఉచితంగా ఇస్తామని అంబికా కృష్ణ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...