Jump to content

హోదా కోసం ఆత్మబలిదానం.. చంద్రబాబుకు లేఖ రాసి...


sonykongara

Recommended Posts

హోదా కోసం ఆత్మబలిదానం.. చంద్రబాబుకు లేఖ రాసి...
20-08-2018 12:59:18
 
636703667607174538.jpg
  • ఒంగోలులో ప్రైవేట్‌ గుమస్తా బలవన్మరణం
  • జేబులో సూసైడ్‌ నోట్‌
  • కేంద్రం అన్యాయం చేసిందని ఆవేదన
ఒంగోలు: ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఒం గోలులో పైడికొండల యానాదయ్య (47) పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. దశరాజుపల్లికి వెళ్లే రోడ్డులో ఫ్లైఓవర్‌ కింద ఆయన మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. జేబులో ఉన్న సూసైడ్‌ నోట్‌ ఆధారంగా హోదా కోసమే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేటకు చెందిన యానాదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని కమ్మపాలెంలో ఉంటున్నాడు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని సిమెంటు కొట్లో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఆదివారం రాత్రి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని బాటసారి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అతని జేబులో సూసైడ్‌ నోట్‌ దొరికింది. అది ఈనెల 6వతేదీన రాసినట్లు ఉంది.
 
 
సూసైడ్‌ నోట్‌లో ఇలా..
నవ్యాంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారికి,
‘ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉండే పైడికొండలు యానాదయ్య అను నేను రాస్తున్నది ఏమనగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చిన్నచూపు చూసింది. కట్టుబట్టలతో బయటకు పంపించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వస్తుందని ఎదురుచూసినా బీజేపీ మోసం చేసింది. నాకు జరిగిన అన్యాయం మా పిల్లలకు జరగకూడదని మన నాయకులంతా కలసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారని, నా బలి దానంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆశిస్తూ సెలవు’ అని రాసి ఉంది. నా బిడ్డలకు టీడీపీ తరఫున మీరే పెద్ద దిక్కుగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌ను ఆ లేఖలో కోరారు. సంఘటనా స్థలంలో పురుగు మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. తాలూకా ఎస్సై రాజారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

not for ss...personal financial issues undi untai..he used ss ...ss kosam sache antha silly fellows unnaru antey inka eelani evadu kapadaleru

Yes, I too feel the same

govt ila suicide cheskune vallaki other than farmers due to heavy loan burden dabbulu ivvakunda unte better ichina should not be publicised.

Link to comment
Share on other sites

2 hours ago, Chandasasanudu said:

not for ss...personal financial issues undi untai..he used ss ...ss kosam sache antha silly fellows unnaru antey inka eelani evadu kapadaleru

Just checked with friends.. Your guess is 100% correct and componsation sake his family members would have placed the suicide note. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...