Jump to content

తప్పకుండా చూడండి.


Saichandra

Recommended Posts

హైటెక్ పాలనే కాదు, మా చంద్రబాబులో ఇలాంటి మానవీయ కోణం కూడా ఉంది... ఇలాంటి ఘటనలు ఎన్నో.. అందుకే మళ్ళీ రావాలి అనేది...

మాతృత్వం ఒక తియ్యని అనుభూతి..తల్లి కాబోతున్నాను అనే ఒక అనుభూతి మాటల్లో కొలవలేనిది. మంచి భర్త, ప్రశాంతమైన జీవితం, నవ్వుతూ, తుళ్ళుతూ గడిచిపోయే దాంపత్యం. తల్లి కాబోతుంది అనే పండగ వాతావరణం. దానికి తోడు కవల పిల్లలు .. రెట్టింపు ఆనందం .. అంతా ఆనందంగా గడిచిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక అపశృతి. తొమ్మిదినెలలు అమ్మ కడుపులో చల్లగా ఉండాల్సిన బిడ్డలు, అనుకోకుండా ఏడవనెలలోనే డెలివరీ కావటం. అవయవాలు అన్నీ ఏర్పడ్డాయి కానీ ఇంకా బలం పుంజుకోలేదు. ,మూడు నెలల పాటు ఇంక్యుబేటర్ లో ఉంచాలి, ఆసుపత్రిలోనే ఉండాలి... దాదాపుగా అరవై లక్షలు అవుతుంది అన్నారు. మధ్యతరగతి కుటుంబం అరవై లక్షలు ఖర్చుపెట్టుకోగల స్థోమత లేదు.. కళ్ళముందు ఇద్దరు కవల పిల్లలు.. ఒక్కసారి అమ్మ స్థానం తల్లడిల్లిపోయింది. దుఃఖం వెల్లువలా పొంగింది. దాచుకున్న సేవింగ్స్, బంధువల సహాయం, అన్ని కలిపి ఒక ముప్పై లక్షల వరకు పొగయ్యాయి,.. మరో ముప్పై లక్శలు కావాలి. ఏం చెయాలో అర్ధం కానీ పరిస్థితి. చుట్టూ చీకటి, అప్పుడు చిరుదివ్వెలా కనిపించింది సి.యం రిలీఫ్ ఫండ్ ! వెంటనే పరిస్థితిని అధికారులకు నివేదించారు. ప్రభుత్వ యంత్రాంగం కదిలింది, హాస్పిటల్ వర్గాలతో మాట్లాడారు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు.  మరో పదిలక్షల వరకు హాస్పిటల్ బిల్లులో తగ్గించారు. హాస్పిటల్ వర్గాలు కూడా చాలెంజ్ గా తీసుకున్నాయి, కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడాయి. ఇప్పుడు ఆ అమ్మ ముఖంలో సంతోషం. నాన్న  ముఖంలో ఆనందం. మృత్యుంజయులయిన ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ.. కేరింతలు కొడుతూ .. ఇళ్లంతా తిరుగుతుంటే .. అమ్మ మనసు ఉప్పొంగిపోతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...