Jump to content

కేరళ సహాయక చర్యల్లో ఏపీ


sonykongara

Recommended Posts

కేరళ సీఎంకు చంద్రబాబు ఫోన్
18-08-2018 17:10:15
 
636702090170238827.jpg
అమరావతి: కేరళ సీఎం విజయన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని బాబు చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి సిబ్బంది మరబోట్లు, పడవలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను మంగళగిరి నుంచి కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. ఆహార పదార్ధాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను ప్రభుత్వం పంపనుంది.
 
 
ఇప్పటికే చంద్రబాబు కేరళకు రూ.10కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపంలోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏపీ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. donation.cmdrf.kerala.gov.in ద్వారా సాయం చేయాలని కోరారు.
Link to comment
Share on other sites

కేరళకు ఏపీ 10 కోట్ల విరాళం
18-08-2018 03:46:16
 
636701607774971716.jpg
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రూ.10కోట్ల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందిస్తామని శుక్రవారం వెల్లడించారు. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపంలోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏపీ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. donation.cmdrf.kerala.gov.in  ద్వారా సాయం చేయాలని కోరారు.
 
కేరళకు కేసీఆర్‌ 25 కోట్ల సాయం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాల నుంచి ఆపన్నహస్తాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కేరళకు రూ. 25 కోట్లను తక్షణ సాయంగా అందించనున్నట్లు ప్రకటించారు. వెంటనే ఈ డబ్బును కేరళకు అందించాలని సీఎస్‌ ఎస్‌.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను ఆ రాష్ట్రానికి పంపాలనీ ఆదేశించారు. కాగా, కేరళ వరద బాధితులకు తెలంగాణ కాంగ్రెస్‌ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. బాధితులకు సహాయం అందించేందుకు కేరళ కాంగ్రెస్‌ సేవాదళ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఆయన తన ట్విటర్‌ అకౌంట్లో శుక్రవారం పెట్టారు. హెల్ప్‌లైన్‌ నంబర్లు: తిరువనంతపురం(0471 2730045), కొల్లం(0474 2794002), పతనంతిట్ట(0468 2322515), అలప్పూజ(0477 2238630), కొట్టాయం(0481 2562201). మరోవైపు.. కేరళలోని వరద బాధితులను ఆదుకునేందుకు 19 నుంచి 26 వరకు ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

రళ సహాయక చర్యల్లో ఏపీ
18-08-2018 19:14:26
 
636702164680387573.jpg
అమరావతి: కేరళ సహాయక చర్యలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక బృందాలు పంపింది. సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బృందాలు పాల్గొనున్నాయి. 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, జిల్లా ఫైర్ అధికారి ఒకరు, అసిస్టెంట్ ఫైర్ అధికారి, ఐదుగురు స్టేషన్ ఫైర్ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారి ఒకరు, బోట్ మెకానిక్, స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఒకరు, 12 మోటార్ బోట్లు మరియు ఇతర రక్షణా పరికరాలతో కూడిన బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ బృందాలు బయలుదేరాయి.
Link to comment
Share on other sites

కేరళకు కేంద్రం చేసిన సాయం చాలా చిన్నది: చంద్రబాబు
20-08-2018 19:30:31
 
636703902338981000.jpg
 
అమరావతి: కుండపోత వర్షాలు, వరద బీభత్సంతో అల్లాడిపోయిన కేరళకు కేంద్రం చేసిన సాయం చాలా చిన్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేరళకు వరద సాయంపై సీఎం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కేంద్రం మొక్కుబడి సాయం చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. తక్షణమే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేరళ ప్రజలకు కేంద్రం అండగా నిలవాలని ఆయన సూచించారు. కర్ణాటకలోనూ వరద బాధితులకు కేంద్రం సాయం చేయాలన్నారు.
 
విశాఖ హుద్‌హుద్‌ తుపాన్ సమయంలోనూ ఏపీకి కేంద్రం నామామాత్రపు సాయం చేసిందని చంద్రబాబు చెప్పారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్రం అండగా ఉండాలని అన్నారు. కేరళలో పరిస్థితిని జాతీయవిపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళలో వరదల ఉధృతికి 400 మంది మృతిచెందారని, 1200 మందిని మత్స్యకారులు కాపాడారని ఆయన అన్నారు. కేరళలో బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. కేరళకు ఆంధ్రప్రదేశ్ తరపున రూ.10 కోట్లు విరాళం ప్రకటించామన్నారు. అలాగే కేరళకు 2 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. నగదు, ఇతరత్రా మొత్తం కలిపి కేరళకు రూ.50 కోట్ల సాయం చేస్తున్నామని, ఉద్యోగులు కూడా తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...