Jump to content

ఎన్నికలకు ఏడాది ముందే.. ఎర!


sonykongara

Recommended Posts

ఎన్నికలకు ఏడాది ముందే.. ఎర! 
మహిళా సంఘాల ఖాతాల్లోకి డబ్బులు 
చంద్రగిరి నియోజకవర్గంలో కలకలం 
ctr-gen6a.jpg
తిరుపతి: మహిళా సంఘాలను పర్యవేక్షించే సంఘమిత్రల ఖాతాల్లో ఆయాచితంగా డబ్బులు వచ్చి పడటం చంద్రగిరి నియోజకవర్గంలో కలకలం రేపింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మహిళా సంఘాలను ప్రభావితం చేసేలా ఈ డబ్బులు వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా గ్రూపుల సమన్వయం చేసే సంఘమిత్రల బ్యాంకు ఖాతాల్లోకి పది రోజుల క్రితమే రూ.2 వేలు చొప్పున జమయ్యాయి. ఆలస్యంగా విషయం బయటకు పొక్కడంతో తిరుపతి రూరల్‌ మండలంలోని 36 మంది సంఘమిత్రలు బుధవారం ఎం.ఆర్‌.పల్లిలోని వెలుగు కార్యాలయంలో సమావేశమై ఈ మొత్తాన్ని తీసుకోవద్దంటూ తీర్మానించారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోని సంఘమిత్రలు సైతం తమ ఖాతాల్లో పడిన డబ్బును వాపసు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఇదీ నేపథ్యం.. 
నియోజకవర్గంలోని తిరుపతి రూరల్‌, చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని  మొత్తం డ్వాక్రా సంఘాలకు కలిపి 210 వరకు సంఘమిత్రలు ఉన్నారు. ఒక్కో సంఘమిత్ర కింద 200 మంది మహిళలు గ్రూపుల్లో ఉంటారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంకు ఖాతాతో పాటు.. అన్నీ సంఘాలకు కలిపి ఉమ్మడిగా ఓ ఖాతా ఉంటుంది. ఇటీవల 175 మంది సంఘమిత్రల ఖాతాల్లో ఎమ్మెల్యే భార్య లక్ష్మికాంత పేరిట ఉన్న కెనరా బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు జమయ్యాయి. గమనించిన సంఘమిత్రల్లో కొందరు ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘమిత్రలకు రూ.3 వేల చొప్పున గౌరవవేతనం ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే భార్య వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు జమ కావడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలోని సంఘమిత్రలు అత్యవసరంగా సమావేశమై డబ్బులు వెనక్కి ఇవ్వాలని తీర్మానించారు.

నిబంధనలు ఏం చెప్తున్నాయి? 
సంఘమిత్రలు బయటి వ్యక్తుల నుంచి తమ ఉమ్మడి ఖాతాలోకి డబ్బును తీసుకోవచ్చు. సభలు, సమావేశాలు జరిపినప్పుడు సంఘాలకు స్పాన్సర్‌ చేయడానికి ఎవరైనా ఆర్థిక సాయం చేయొచ్చు. వీటిని వార్షిక మదింపులో లెక్కగట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖాతాల్లో డబ్బు చేరడం వెనుక ఇలాంటి సహేతుక కారణాల్లేవు. పైగా వేసిన వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉంది. డబ్బు కొందరు సంఘమిత్రల వ్యక్తిగత ఖాతాల్లో చేరగా.. మరికొందరికి ఉమ్మడి ఖాతాల్లో జమైంది. ఇదంతా ఎమ్మెల్యే అనుచరుల ద్వారా జరిగిందని తెలేస్తోందతి. ప్రభుత్వం మహిళా సంఘాలకు సరైన రుణాలు ఇవ్వని కారణంగా.. ఇకపై ప్రతినెలా తామే రూ.2 వేల చొప్పున వేస్తామని కొన్నిచోట్ల అనుచరులు ప్రకటనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉందన్న సంగతి స్పష్టమవుతోందని, అప్రమత్తమై సంఘమిత్రలకు పలు సూచనలు చేశామని అధికారులు చెబుతున్నారు. వీరికి సంఘమిత్రల వ్యక్తిగత ఖాతాల వివరాలు ఎలా తెలిశాయో ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారితో సమావేశం కావాలని యోచిస్తున్నారు.

వారే ఆదుకోమన్నారు... 
ఇటీవల మా ఇంటికి 30 మంది సంఘమిత్రలు వచ్చారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, వెట్టిచాకిరి ఎక్కువగా ఉందని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వారితో 7 రకాల పనులు చేయించుకుంటోంది. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. నేనే వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చాను. నా నియోజకవర్గంలోని సంఘమిత్రలకు నెలవారీగా రూ.2వేలు ఇవ్వాలని అనుకున్నాం.  అంటే నెలకు రూ.4లక్షల ఖర్చు అవుతుంది. కాని వారు సంతోషంగా ఉంటారనే నా భార్య ఖాతా నుంచి డబ్బులు వేశాం.

- చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే

 

 
 
 
 

రాజకీయం

Link to comment
Share on other sites

oka pakka same groups meeda alla gaadu raddu cheyyandi ani court ki poyi cheppud debbalu tinnadu.....

 

నవంబర్ 23,2017న ‘సాధికారమిత్ర’లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీని వల్ల పంచాయతీల వ్యవస్థ దెబ్బ తింటుందని, అందుకే వీరిని రద్దు చెయ్యాలని కోరారు.

https://www.amaravativoice.com/avnews/news/high-court-dismisses-alla-petition-on-sadhikaramitra

Link to comment
Share on other sites

20 minutes ago, ravikia said:

2009 Elections appudu KVP and co background lo ide chesaru anta. All monies trasnfered to relevant peoples accounts

Not surprising at all...they have excelled in robbing the people money through creative ways and doing white collar crimes. 

Considering that they have obviously used new ways of using money in elections.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...