Jump to content

vamsadhara-hiramandalam reservoir


sonykongara

Recommended Posts

ఫలించిన ‘వంశధారా’వ్రతం!
15-08-2018 03:16:18
 
636698997790846201.jpg
  • పంద్రాగస్టు రోజున హిరమండలం రిజర్వాయర్‌లోకి వరద నీరు
  • సీఎం చంద్రబాబు పట్టుదల.. నెరవేరిన సిక్కోలువాసుల కల
  • నేడు సీఎంతో ప్రారంభం!
శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశారు. ఎన్నో ఏళ్లుగా మూలనపడిన వంశధార ప్రాజెక్టును ఎట్టకేలకు కార్యరూపంలోకి తెచ్చారు. బుధవారం జిల్లాలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు సీఎం హాజరవుతున్న రోజునే ‘హిరమండలం రిజర్వాయర్‌’లోకి వంశధార జలాలు ప్రవహించనున్నాయి. ఈ మేరకు భామిని మండలంలో వంశధారను ఆనుకుని ఉన్న కాట్రగడ సైడ్‌వియర్‌ వద్ద గంగమ్మతల్లికి పూజలు నిర్వహించి ట్రయల్‌ రన్‌ ద్వారా నీటిని విడిచిపెట్టారు.
 
 
నేటి రాత్రికి చేరనున్న జలాలు
భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధార నదిపై సైడ్‌వియర్‌ నుంచి 33 కిలోమీటర్ల కాలువ ద్వారా బుధవారం రాత్రికి ఈ జలాలు ప్రాజెక్టులో కీలకమైన హిరమండలం జలాశయానికి చేరుకోనున్నాయి. వరద తక్కువగా ఉండడంతో ప్రాజెక్టు ఫ్లడ్‌కెనాల్‌ ద్వారా ప్రస్తుతానికి 1,000 క్యుసెక్కుల నీటిని మాత్రమే ట్రయల్‌రన్‌లో మళ్లించారు. ఈలోపు ఒడిశాలో భారీ వర్షాలు కురిసి వంశధార నదిలో వరద పెరిగితే 5 టీఎంసీల సామర్థ్యానికి పెంచనున్నారు. ప్రాజెక్టు కల సాకారమవడంతో శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహంలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, అధికారులు కేక్‌ కట్‌చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభు త్వం.. ఆగిపోయిన వంశధార ప్రాజెక్టుపై సమీక్షించింది. ఇది పూర్తయితే ఖరీ్‌ఫలో జిల్లాలో 2.03 లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఒక పంటతోపాటు అంతే విస్తీర్ణంలో రెండో పంట రబీకీ నిరివ్వవచ్చని భావించారు. ప్రాజెక్టు పునఃప్రారంభానికి సీఎం పచ్చజెండా ఊపారు. రూ.933 కోట్ల పాత ప్రాజెక్టు అంచనాలస్థానే కొత్త రేట్లతో కలిపి, జీవో 35 ద్వారా రూ.1618 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు నిర్వాసితుల సమస్య జఠిలమెనా వెనక్కి తగ్గలేదు. నిర్వాసితులు కోరుకున్నట్లు పరిహారం ఇవ్వడం తో 19 గ్రామాల నిర్వాసితులు స్వచ్ఛందంగా ఊళ్లను ఖాళీ చేశారు. కాగా, సిక్కోలులో జరిగే పంద్రాగస్టు వేడుకలకు వస్తున్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

వంశధార ఫేజ్‌-2కు భారీగా వరద నీరు
17-08-2018 03:43:18
 
636700741995129912.jpg
  • ఆనందంలో యంత్రాంగం...ప్రత్యేక పూజలు, హారతులు
హిరమండలం, ఆగస్టు 16: శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ జలకళతో తొణికిసలాడుతోంది. మంగళవారం భామిని మండలం సింగిడి సైడ్‌వీయర్‌ ద్వారా వరద కాలువలోకి నీటి మళ్లింపు ట్రయల్‌ రన్‌ విజయవంతమైన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి 33 కిలోమీటర్ల మేర ప్రవహించి రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. గురువారం రిజర్వాయర్‌లోకి నీరు చేరుతున్న ఎన్ని రామన్నపేట వద్ద అధికారులు హారతులిచ్చి పూజలు చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
బాహుదాలోకి వంశ‘ధార’! 
ఉత్తరాంధ్రలో మరో అనుసంధానం 
  రూ.4440 కోట్లతో ప్రాజెక్టు నివేదిక సిద్ధం 
  లక్ష ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు, 54 వేల ఎకరాల స్థిరీకరణ 
ఈనాడు - అమరావతి 
29ap-main10a.jpg

ఉత్తరాంధ్రలో మరో నదీ అనుసంధానానికి రంగం సిద్ధమయింది. వంశధారలో వృథాగా పోతున్న వరద జలాలను బాహుదా నదికి మళ్లించి.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దులో కరవు నేలకు నీటిని అందించనున్నారు. 2015లో శ్రీకాకుళం జిల్లా పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ ఆలోచన పురుడు పోసుకుంది. అనంతరం ఆ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేసి, పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తాజాగా సిద్ధం చేశారు. మొత్తం 25 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునేలా హిరమండలం జలాశయం నుంచి 118 కిలోమీటర్ల మేర ఒక హైలెవెల్‌ కాలువ తవ్వి ఆ నీటిని ఇచ్ఛాపురం వరకు మళ్లిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం వంశధారలో 87.50 టీఎంసీల వరద జలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అనుసంధానానికి రూ.4440 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా లెక్కించారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటే దాదాపు 2 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 1,06,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. నాలుగు మండలాల్లోని 54 వేల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది.

హిరమండలం నుంచి... 
ప్రస్తుతం వంశధార రెండో భాగం రెండో దశలో భాగంగా హిరమండలం జలాశయానికి నీరు తీసుకువస్తున్నారు. ఈ జలాశయంలో 19.5 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచే కాలువ తవ్వి బాహుదా నది వరకు తీసుకువెళ్తారు. హిరమండలం మండలంలోని పెద్ద సంకిలి గ్రామం నుంచి ఈ కాలువ ప్రారంభమవుతుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. 55వ కిలోమీటరు వరకు కాలువ తవ్వకానికి రూ.1938 కోట్లు, ఆ తర్వాత 118.50 కి.మీ. వరకు తవ్వకానికి మరో రూ.2502 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాలువ మధ్యలో మొత్తం ఏడు చోట్ల వయాడక్టులు నిర్మించాల్సి ఉంటుంది. 17చోట్ల రెండు వరుసల వంతెనలు, 15 చోట్ల ఒక వరుస వంతెనలు, 35 చోట్ల అండర్‌ టన్నెళ్లు నిర్మించాలి.

నాలుగు కొత్త జలాశయాలు 
ఈ పథకంలో భాగంగా 4 చోట్ల కొత్త జలాశయాలు నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 6.10 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా వీటిని నిర్మిస్తారు. పెద్దలోగిడి, రంగసాగరం, రేగులపాడు, హంసరాలి వద్ద ఈ కొత్త జలాశయాలు ఏర్పాటు చేస్తారు. ఇవి కాకుండా రంగ సాగరం, అసర్ల సాగరంలలో ఇప్పుడున్న జలాశయాల సామర్థ్యాన్ని 1.97 టీఎంసీల స్థాయికి పెంచుతారు. 


నివేదికను పరిశీలిస్తున్నాం

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను జలవనరులశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. నిపుణుల కమిటీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. వారి అభిప్రాయాలు జోడించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. ఉన్నతస్థాయిలో చర్చించిన తర్వాత ప్రాజెక్టుకు పాలనామోదం లభిస్తుందని భావిస్తున్నాం.

- ఎం.సురేంద్రరెడ్డి, ఎస్‌ఈ, వంశధార ప్రాజెక్టు
29ap-main10b.jpg
Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...