Jump to content

పల్నాడులో కొనసాగుతున్న 144 సెక్షన్‌


RamaSiddhu J

Recommended Posts

పల్నాడు: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపురాయి మైనింగ్‌ పరిశీలనకు వెళ్తున్న వైకాపా నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దాచేపల్లి, గురజాలలో వైకాపా నేతల పర్యటన దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సరావుపేలో వైకాపా నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహేశ్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మంలం గామాలపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తిని గృహ నిర్బంధం చేశారు. మంగళగిరి టోల్‌గేట్‌ వద్ద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకుని దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైకాపా నేతల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్లలో 144 సెక్షన్‌ విధించారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందుl ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచారు.

దాచేపల్లి, గురజాల ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలను అధికార పక్ష నేతలు కొల్లగొడుతున్నారంటూ వైకాపా నేతలు కొంతకాలంగా పెద్దయెత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కొందరికి హైకోర్టు నోటీసులు జారీచేయడంతో వైకాపా నేతలు ఆరోపణల జోరు పెంచారు. దీనిలో భాగంగానే వైకాపా నిజనిర్ధారణ బృందం పేరుతో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సమాయత్తమయ్యారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వైకాపా నేతలు, కార్యకర్తలు ఎవరూ బయటకు రాకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్లలో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యల వల్ల పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం జరగలేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...