Jump to content

మోదీ కొత్త ఓటు బ్యాంకు ఎన్నారైలు ??


AnnaGaru

Recommended Posts

http://nri.andhrajyothy.com/latestnews/secret-reason-behind-modi-foreign-tours-25460

మోదీ కొత్త ఓటు బ్యాంకు ఎన్నారైలు

636696592393240743.jpg

కోటి ఓట్లకు గాలం

ఎన్నారైలకు పరోక్ష ఓటింగ్‌ ద్వారా భారీగా ఓట్లకు గాలం
84 దేశాల్లో పర్యటనల వ్యూహం ఇదే
ఒక్కో నియోజకవర్గంలో 21వేల మంది టార్గెట్‌
 
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీ పర్యటనలంటే ఎందుకంత మోజు? సగటున ఏడాదికి 20 దేశాలను ఎందుకు చుట్టి వస్తున్నారు? పెట్టుబడుల ప్రవాహం కోసమా? ఆయా దేశాలతో సంబంధాల పటిష్ఠానికా? ఇవేవీ కావు.. ఆయన దృష్టంతా ప్రవాస భారతీయుల ఓట్లపైనే. ఆయన లక్ష్యమంతా వారి మద్దతు సాధించడమే. ఇది ఇపుడు ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తూ ఓ బిల్లును లోక్‌సభలో గత గురువారం ఆమోదించారు. దీని ఉద్దేశం విదేశాల్లో ఉన్న భారతీయులు పరోక్షంగా ఇక్కడ ఓటు వేసేందుకు వీలు కల్పించడం. ఇందులో ఆంతర్యాన్ని సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. తరచి చూస్తే విషయం బోధపడుతుంది. ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో ఏకంగా 84 దేశాల్లో పర్యటించారు. వీటికి అయిన మొత్తం ఖర్చు రూ. 1,484 కోట్లు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో తిరిగి రావడం అనవసరమని విపక్షాలు పదేపదే దాడిచేశాయి.
 
కానీ ఆయన వ్యూహం వేరు.. వెళ్లిన ప్రతీచోటా భారత సంతతివారిని, ఎన్నారైలనూ కలవడం మోదీ షెడ్యూల్‌లో ఓ ముఖ్యాంశం. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఆయన సభలకు వచ్చేవారు. తన ఆలోచనలను, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వారితో పంచుకునేవారు. ఇలా వారితో ఓ మానసిక అనుబంధాన్ని ఆయన పెంచుకోగలిగారు. వివిధ దేశాల్లో సగటున కోటీ పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నట్లు ఓ అంచనా. మొత్తం 543 నియోజకవర్గాలకూ విభజిస్తే వీరి సంఖ్య- ఒక్కో నియోజకవర్గానికి 21,000 మందిగా తేలుతుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. చాలా చోట్ల ఫలితాన్ని ప్రభావితం చేయగలదు. ఈ ప్రవాసులంతా వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తే అది బీజేపీకి ఎంత లాభం? అంతేకాదు.. ఈ ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు.
 
అది కూడా పార్టీకి లాభిస్తుంది. అందుకే వీళ్ల ఓట్లపై ప్రధాని మోదీ చాలాకాలం క్రితమే కన్నేశారు. వెళ్లిన ప్రతి దేశంలోనూ ప్రవాసీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేలాది మంది ఎన్నారైలలో జాతీయవాద అజెండాను బలంగా తీసుకెళ్లారు. ప్రాక్సీ ఓటింగ్‌ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయించుకొనే) సౌకర్యం ఇన్నేళ్లూ కేవలం రక్షణ సిబ్బందికి మాత్రమే ఉండేది. ఎన్నారైలు ఇన్నాళ్లూ తాము ఓటరుగా రిజిస్టర్‌ చేయించుకున్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉండేది. ఇపుడు వారు తమ తరఫున ఓటు వేసే ప్రతినిధిని నియమించుకోవచ్చు. ఎన్నారైలను విశేషంగా ఆయన ఆకట్టుకున్నారని, వారి ఓట్లు బీజేపీ అభ్యర్థులకే పడతాయని పార్టీ నేతలంటున్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, Naren_EGDT said:

Can they vote in any constituency they want ?  Parents native place constituency untada based on aadhar ?

Recent gaa chadivina dani prakaram passport address annaru, which is going to be not so strong point.

 

sexond voter card I guess

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...