Jump to content

మోడీ కక్ష సాధింపు బహిర్గతం... పోలవరం కాంట్రాక్టర్ల పై ఐటి దాడులు...


sonykongara

Recommended Posts

మోడీ కక్ష సాధింపు బహిర్గతం... పోలవరం కాంట్రాక్టర్ల పై ఐటి దాడులు...

   
polavaram-11082018-1.jpg
share.png

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై పరోక్షంగా దెబ్బతీసే కార్యక్రమాన్ని చేపట్టిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ వైదొలగిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం విదితమే. అయితే ఏపిలోని రాష్ట్ర ప్రభుత్వం పై వివిధ రకాలైన ఒత్తిడిని తీసుకురావడంతో పాటు వేధింపులు కూడా జోడించాలన్నదే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

 

polavaram 11082018 2

దీనికి ప్రధానకారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టిన పలు కాంట్రాక్టు సంస్థలపై గత వారం రోజులుగా 'రహస్య ఐటీ దాడులు నిర్వహించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కడానికి వీలు లేదని ఐటీ శాఖ అధికారులు ఆయా కాంట్రాక్టర్లకు “హుకుం' కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్వహిస్తున్న బడా కాంట్రాక్టర్ల పైనే ఐటి శాఖ దృష్టిసారించిందని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కొందరు సిఎం చంద్రబాబును వేధింపులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి తనిఖీలు చేయిస్తున్నారని తెలిసింది.

polavaram 11082018 3

దీంతో ఐటి అధికారుల దాడులతో ఆయా కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు వీలు లేకుండా చేస్తున్నారని టిడిపి సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఎపిలోని రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన దాడులు చేయిస్తున్నారని పార్టీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగిన తరువాతనే ఇటువంటి సరికొత్త దాడులకు పాల్పడుతున్నారని నిర్ధారిస్తున్నారు. మరోపక్క కేంద్రంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేలా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడిగా పార్లమెంట్ ఉభయసభల్లో చేస్తున్న ఆందోళనలను తిప్పికొట్టేందుక ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

polavaram 11082018 4

ప్రధాన మంత్రి మోడీకి వ్యతిరేకంగా గళమెత్తిన టిడిపి ఎంపిలను కట్టడి చేయడానికే రాష్ట్రంలో ఐటీశాఖ భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎపి సిఎం చంద్రబాబును నేరుగా ఢీకొనే సత్తా బీజేపీకి లేకనే ఇటువంటి దొంగచాటు వ్యవహారాలకు పాల్పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పోలవరం' ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పై బీజేపీ పెద్దలు నేరుగా గురిపెట్టారని, దీనిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మొదలుకొని జాతీయస్థాయి నేతల వరకూ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆయా కాంట్రాక్టు పై జరుగుతున్న రహస్య దాడులపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

polavaram 11082018 5

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఆయా కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించుకొని, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి జాతీయ మీడియా ద్వారా బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుతం ఐటి దాడులు ఎదుర్కొన్న కొంతమంది కాంట్రాక్టర్లు ఐటి శాఖ ఉన్నతాధికారులకు లెక్కలతో సహా పూర్తి సమాచారాన్ని అందించారని అమరావతీ సచివాలయంలోని ఆర్థికశాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వీరిలో కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం తాము చట్టబద్ధంగానే పనులు నిర్వహిస్తున్నామని, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధంగానే వ్యవహరిస్తోందని, దీనిలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని తేల్చిచెప్పినట్లు సమాచారం.

polavaram 11082018 6

తమకు ఇచ్చిన సాగునీటి కాంట్రాక్టుల వల్ల తమకు నష్టం వచ్చిందని, అయినా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనులు కొనసాగిస్తున్నామని, సాగునీటి కార్యాలయాలన్నీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉండటం వల్ల అక్కడే 'ఈ ఐటి శాఖ రహస్య దాడులు" జరిగాయని తెలిసింది. దీనికి తోడుగా తెలంగాణ కీలకమైన ప్రాజెక్టులన చేస్తున్నప్పటికీ ఆయా సంస్థల పై ఐటీశాఖ అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి దాడులు నిర్వహించలేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో పనలు నిర్వహిస్తున్న సాగునీటి కాంట్రాక్టర్ల నే ఐటి శాఖ దాడులు చేపట్టిందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రాష్ట్రంలో ఐటిశాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీశాఖ అధికారులకు కనీస సమాచారం అదించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా జరిగిన ఈ వ్యవహారంతో రాష్ట్ర ఐటీశాఖ అధికారులు కూడా అవాక్కయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. న్యూస్ సోర్స్ : ఆంధ్రప్రభ

Link to comment
Share on other sites

2 minutes ago, Jaitra said:

This news should come on front pages of Eenadu and AJ,anthey janam ummuthaaru Modi meedha

Triveni valla meda chesaru last month,I&T valla meda matram 1o to 1 days eenadu, leda Aj lo chusarnu appude lite ga koottindi

Link to comment
Share on other sites

Eee corporate kuda ala cheppadu ala cheppe lekka aitheee mana jaggu perminent ga jail lone unde vadu.that too last year for this govt assalu chepparu pichi pushpalu idi eppudu telusukuntarooo

TDP implementing Strategy perfectly manam satruvu ni koditheee satruvukeee tagalali but satruvu manalni koditheee adi jananiki tagalali 

Pichi flowers completely cornered emcheyyalooo teliyaka eee pichi kadhalu chesthunnaru

Link to comment
Share on other sites

Operations against shell companies continue; RoC inspects Navayuga Engineering Company head office

Express has learnt that the team, which was inspecting the office, received instructions from Delhi to abort the raid midway.

Published: 28th July 2018 04:51 AM

 

HYDERABAD: Continuing operations for the third consecutive day, against suspected shell companies involved in money laundering, officials of Registrar of Companies inspected the head office of infrastructure company Navayuga Engineering Company Limited and reportedly seized documents.

However, officials refused to comment on the development. It also wasn’t clear if any suspicious activity was found. When contacted, NECL refused to talk about it.  

Express has learnt that the team, which was inspecting the office, received instructions from Delhi to abort the raid midway. Express had earlier reported that a politically well-connected individual was on RoC radar, which functions under MoC Affairs.

The High Court pulled up the secretaries of law and Assembly, saying they had deliberately violated the court order setting aside the expulsion of the two MLAs from Assembly and the gazette notification on a vacancy for Nalgonda and Alampur (SC) Assembly constituencies represented by Komatireddy and Sampath respectively.

“Prima facie, the court’s order has been willfully and deliberately violated by the Assembly secretary and law secretary. Contemnors have to appear before the court. Even the SPs of the two districts (Nalgonda and Jogulamba Gadwal) have indulged in contempt of court by not implementing the court order in providing gunmen to the two MLAs. The constitution is supreme to all.”

Justice B Siva Sankara Rao came down heavily on both the secretaries for wilful disobedience.
“Is it not the duty of the legislature secretary to ensure payment of salaries and perks to both the MLAs upon court direction. How can the orders be blatantly violated? Being a judicial officer, the law secretary is bound to prepare a note on the court’s order and warn the government of the consequences of disobedience,” he remarked.

The judge asked the petitioners’ counsel Jandhyala Ravishankar as to why he had not made the SPs as parties to the contempt case though they failed to implement the court order by restoring the gunmen to the two MLAs.

The judge further asked whether the names of the two MLAs figured in the list sent every month by the Assembly secretary to the Election commission. The counsel replied that their names were not on the list. The SPs AV Ranganath (Nalgonda) and Rema Rajeshwari (Gadwal) failed to restore the security cover, he said. Reacting, the judge said, “How dare the SPs did not restore the security to both the MLAs. The court will examine impleading them as respondents to the case.”

The judge said, “Prima facie, I find there is disobedience of the court order. Nobody is higher than the court.”

http://www.newindianexpress.com/states/telangana/2018/jul/28/operations-against-shell-companies-continue-roc-inspects-navayuga-engineering-company-head-office-1849670.html

 

Link to comment
Share on other sites

ఏపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీపై సీజీఎస్టీ దాడులు

హైదరాబాద్: గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన హైదరాబాద్ కార్పోరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆయన పన్నులు కట్టకుండా ఎగవేశారని చెబుతూ ఈ దాడులకు దిగారు. భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో తెలుగదేశం ఎంపీ కార్యాలయంపై దాడులు జరగడం విశేషం. రాయపాటికి చెందిన ఇంజనీరింగ్ మరియు నిర్మాణం కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ 2012లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను బేగంపేట్, కమలాపురికాలనీలో ఉన్నాయి. అంతేకాదు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఈ దాడులు జరగడం చూస్తే ఇది రాజకీయ కక్షచర్య సాధింపేనని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున తమ సిబ్బంది కూడా పట్టించుకోలేదని ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో వారంతా షాక్‌కు గురయ్యారని రాయపాటి తెలిపారు. మరోవైపు ట్రాన్స్‌ట్రాయ్ సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయి సిబ్బంది మాత్రం ఇతర వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు.

20212లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.4717 కోట్లు పనులకు 14శాతం టెండర్లు వేసి దక్కించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీనీ ప్రభుత్వం తప్పించాల్సి వచ్చింది. అదే సమయంలో ట్రాన్స్ ట్రాయ్‌కు అప్పగించిన పనులు నవయుగ చేతికి మారాయి. ఆసమయంలో రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని నరసారావు పేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cgst-raids-on-ap-mp-rayapati-s-corporate-offices-231489.html
 

Link to comment
Share on other sites

ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో అధికారుల సోదాలు..
11-08-2018 16:56:44
 
636696034038861246.jpg
అమరావతి: నరసరావుపేట ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో సీజీఎస్‌టీ విభాగం అధికారుల సోదాలు నిర్వహించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పన్ను ఎగవేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో తెల్లవారుజాము వరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలవరం నిర్మాణ కాంట్రాక్ట్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కాంగ్రెస్‌ హయాంలోనే దక్కించుకుంది. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నందుకే కంపెనీలో సోదాలు జరిగాయాని ట్రాన్స్‌ట్రాయ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు కంపెనీలో సోదాలు జరిగిన మాట వాస్తవమేనని ఎంపీ రాయపాటి నిర్ధారించారు.
Link to comment
Share on other sites

కన్నాపై రాయపాటి సంచలన వ్యాఖ్యలు
11-08-2018 20:43:26
 
636696170059374135.jpg
అవరావతి: ఏపీలో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ అని ఎంపీ రాయపాటి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కన్నా గెలవలేరని ఆయన విమర్శించారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో సీజీఎస్‌టీ విభాగం అధికారులు సోదాల చేశారు. ఈ సందర్భంగా స్పందించిన రాయపాటి కక్ష సాధింపు చర్యగానే తమ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమ కంపెనీకి బకాయిలు రావాలని తెలిపారు. బకాయిలు వస్తే కేంద్రానికి జీఎస్టీ కడతామన్నారు. తమ కంపెనీలో తనిఖీల వల్ల పోలవరం నిర్మాణానికి ఏ ఇబ్బంది ఉండదని, కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు మొండిగా పోలవరం నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. సీబీఐ, ఈడీని అడ్డుపెట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తి బీసీనంటూ కుల ప్రస్తావన చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు. చంద్రబాబు అవకాశమిస్తే తమ అబ్బాయి రంగబాబుని పోటీకి సిద్ధం చేస్తానన్నారు. 
Link to comment
Share on other sites

12 hours ago, sonykongara said:

మోడీ కక్ష సాధింపు బహిర్గతం... పోలవరం కాంట్రాక్టర్ల పై ఐటి దాడులు...

polavaram 11082018 4

ప్రధాన మంత్రి మోడీకి వ్యతిరేకంగా గళమెత్తిన టిడిపి ఎంపిలను కట్టడి చేయడానికే రాష్ట్రంలో ఐటీశాఖ భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎపి సిఎం చంద్రబాబును నేరుగా ఢీకొనే సత్తా బీజేపీకి లేకనే ఇటువంటి దొంగచాటు వ్యవహారాలకు పాల్పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పోలవరం' ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పై బీజేపీ పెద్దలు నేరుగా గురిపెట్టారని, దీనిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మొదలుకొని జాతీయస్థాయి నేతల వరకూ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆయా కాంట్రాక్టు పై జరుగుతున్న రహస్య దాడులపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

polavaram 11082018 5

ee boku XX la face lu chudandi okasari ...

you actually think these buffoons can lead the country? Seriously? 

Think again.

 

Link to comment
Share on other sites

vellani chusthe pakkintlo marvadi saaate  (I don't know how to spell this shiit) laaga kanipinchatla?

parama chethha XX lla unnaru ... thuu 

 

gujju mundakodulni nammi evaraina history lo bagupaddara ... think ...

Vallu ese biksha kaadu manaki kavalsindi ... 

Link to comment
Share on other sites

మీడియాపై మోదీ నిఘా!
13-08-2018 01:36:13
 
636697209708366060.jpg
  • సరిగా కవరేజీ ఇవ్వని వారికి హెచ్చరికలు
  • యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి ఉద్వాసన
  • పర్యవేక్షణ మాటున మీడియా నియంత్రణ!
  • రోజూ చానళ్లలో ఎంతసేపు చూపిస్తున్నారు?
  • పత్రికల్లో ఎంత కవరేజీ ఇస్తున్నారు?
  • బీజేపీకి అనుకూలమా.. ప్రతికూలమా?
  • దేశమంతా ప్రతి క్షణమూ డేగకన్ను
  • సీబీఐ కార్యాలయం పక్కనే నిఘా ఆఫీసు
  • 200 మంది జర్నలిస్టులతో సునిశిత పరిశీలన
  • బీజేపీ పాత కార్యాలయంలో మరో బృందం
  • 250 మందితో నిరంతర పర్యవేక్షణ
  • ఆందోళనలో యాజమాన్యాలు, ఎడిటర్లు
 
న్యూఢిల్లీ, ఆగస్టు 12: అది ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం.. దాని పక్కనే కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉండే శాస్త్రిభవన్‌.. ఇక్కడే ‘సూచనా భవన్‌’ ఉంది.. అందులో పదో అంతస్తు.. 200 మందికిపైగా సిబ్బందితో నిత్యం కిటకిటలాడుతోంది.. వారిలో అత్యధికులు జర్నలిస్టులు.. చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులు కూడా ఉన్నారు.. వారిలో ఒక సీనియర్‌ జర్నలిస్టు.. పొరుగునే ఉన్న నోయిడాలోని ఓ చానల్‌ ఎడిటర్‌కు ఫోన్‌ చేశారు. పాతపరిచయం గుర్తుచేశారు.. నవ్వుతూ పలకరించారు.. మాటల్లోకి దించారు..
 
 
జర్నలిస్టు: మీ చానల్‌ ఆయన్ను ఎక్కువ చూపించడం లేదే!
ఎడిటర్‌: ఎవరిని తక్కువగా చూపుతున్నామంటున్నారు..!
జ: ఇంకెవరినండీ.. మన ప్రధాని మోదీని.
ఎ: ఏం మాట్లాడుతున్నారు మీరు? మా చానల్లో ఆయన్నే ఎక్కువగా చూపిస్తుంటాం.
జ: మీకది ఎక్కువగా అనిపించవచ్చు. మమ్మల్ని అడగండి చెబుతాం. చానళ్లను సునిశితంగా పర్యవేక్షిస్తున్నది మేమే. మీ రిపోర్టులు చూస్తుంటాం. మీ చానల్‌ ర్యాంకింగ్‌లో ఎక్కడో మధ్యలో ఉంది.
ఎ: ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా.. ఇక ప్రధానికి ఎక్కువ కవరేజీ ఇస్తాం.
జ: మీకేది మంచిదనిపిస్తే అలా చేయండి.
ఎ: ఇది సూచనా.. వార్నింగా..?
దేశంలో ఇప్పుడు అనేక చానళ్లు, పత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బంది ఇది. అన్ని వార్తా చానళ్లు, పత్రికలపై మోదీ సర్కారు 24 గంటలూ.. ప్రతి క్షణం నిఘా పెడుతోంది. సూచనాభవన్‌లో ఇందుకోసం ఏకంగా వార్‌రూమే ఏర్పాటుచేసింది. 200 మంది జర్నలిస్టులతో ఈ పర్యవేక్షణ సాగిస్తోంది. ఏ చానల్‌ వైఖరి ఎలా ఉంది.. ఏం వార్తలు ప్రసారం చేస్తోంది.. అందులో మోదీ వ్యతిరేకత, అనుకూలత ఎంత? ఏ జర్నలిస్టు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు... ఎవరు అనుకూలంగా అస్మదీయుల జాబితాలో ఉన్నారు.. పత్రికల్లో మోదీకి ఎంత కవరేజీ ఇస్తున్నారు.. నెగటివ్‌గా రాస్తున్నారా.. రాసేవారెవరు.. ఇలాంటి వివరాలన్నీ తమ బాస్‌లకు తెలియజేయడమే వీరి పని. వీరిలో ఐఐటీ, ఐఐఎంలలో చదివినవారు కూడా ఉండడం విశేషం. తక్కువ కవరేజీ ఇస్తున్నవారికి ఈ పర్యవేక్షక బృందం నుంచి తక్షణమే ఫోన్‌ వెళ్తుంది.. హెచ్చరికలతో కూడిన సలహాలు ఉంటాయి. అదే సమయంలో ఆ మీడియా యజమానికి నివేదిక కూడా అందుతుంది.. ఆయన వెంటనే ఎడిటర్‌పై మండిపడతారు. మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినందుకు రెండు వారాల క్రితం ఓ టీవీ చానల్‌కు చెందిన ఇద్దరు యాంకర్లు, మేనేజింగ్‌ ఎడిటర్‌ తమ పదవులకు ‘రాజీనామా’ చేయాల్సి వచ్చింది.
 
 
ఎడిటర్‌.. ట్రైనీగా..
చానళ్లు, పత్రికలపై పర్యవేక్షణ బీజేపీ పాత ప్రధాన కార్యాలయం నుంచి కూడా జరుగుతుండడం ఇంకో ఆందోళనకర అంశం. ఢిల్లీ అశోకా రోడ్‌లోని ఈ కార్యాలయంలో మరో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి పని కూడా రోజూ బీజేపీ అనుకూల, ప్రతికూల చానళ్లు, పత్రికలు, జర్నలిస్టులను గుర్తించడం.. తమ పైవారి దృష్టికి తీసుకెళ్లడం.. అక్కడి నుంచి సూచనలు జారీ కావడం.. దాదాపుగా ఇది నిత్యకృత్యంగా మారిందని సీనియర్‌ జర్నలిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సభలకు జనం ఎలా హాజరయ్యారు..
 
 
ఆయన ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది.. తదితర వివరాలు అడుగుతూనే.. సోషల్‌ మీడియాలో బీజేపీ అనుకూల కథనాలు వండివార్చడం వీరి పని. వీరికి ఒక ఎక్సెల్‌ షీట్‌ ఇస్తారు. దానిపై బీజేపీ అనుకూల చానళ్లు ఏవి.. ప్రతికూలమెవరో నమోదు చేయాలి. టీవీ చర్చల్లో ఏ పార్టీ ప్రతినిధి బాగా మాట్లాడారో గుర్తించాలి. ఉదాహరణకు ఓ చానల్‌ ఉన్మాద మూక హత్యల గురించి ప్రైమ్‌టైంలో ప్రసారం చేస్తోందనుకోండి. బీజేపీకి వ్యతిరేకంగా సదరు చానల్‌ వ్యవహరిస్తోందన్న మాట. ఎక్సెల్‌ షీట్‌లో మేం అదే నమోదు చేస్తాం. అలాగే బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక చానళ్ల తీరు ఎలా ఉందో మేం పసిగడతాం’ అని ఓ మీడియా మేనేజర్‌ వెల్లడించారు.
 
 
ఒకవేళ వార్‌రూంల నుంచి వచ్చే సూచనలను ఒకవేళ ఎవరైనా పట్టించుకోకపోతే సదరు చానల్‌/పత్రిక ఎడిటర్‌కు ‘స్నేహపూర్వక’ హెచ్చరిక జారీ అవుతుంది. ‘పరిస్థితి తీవ్రత మీకు తెలియడం లేదు. మీరు సంపాదకుడు.. వార్తను నిర్ణయించాల్సింది మీరే. కానీ దేశానికి ఏది అవసరమో కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేశ ప్రయోజనాలు మీకు పట్టడం లేదు. కాలం మారుతోందని మీరు గ్రహించాలి. పాతకాలపు ఆలోచనలకు కాలం చెల్లుతోంది. మీరు తెలివిగలవారు. మంచిచెడులు ఆలోచించే సామర్థ్యం మీకు ఉంది. మా పట్ల సానుకూలంగా ఉండండి’ అని ఫోన్లో సుతిమెత్తగా హెచ్చరిస్తారు. మాట వినని చానళ్లను బ్లాక్‌లిస్ట్ లో పెట్టేస్తారు.
 
 
ప్రభుత్వంతో అనవసరంగా పెట్టుకోవడం ఎందుకనుకునే యజమానులు.. ఇప్పుడు తామే ఎడిటర్లుగా వ్యవహరిస్తూ.. అపార అనుభవం ఉన్న ఎడిటర్లను ట్రైనీలుగా చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన జీతం పుచ్చుకుని ఎడిటర్లు మౌనంగానైనా ఉండాలి.. ప్రస్తుత ‘నిఘా’కు తగినట్లుగా తమను తాము మలచుకుంటే సరేసరి. లేదంటే ఉద్వాసన ఖాయం. నిజానికి, తొలుత మోదీ కవరేజీ గురించే నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ గురించి కూడా నివేదికలు ఇస్తున్నారు. ఈ అంశంపై దూరదర్శన్‌పై మండిపడి, దానిని ప్రక్షాళన చేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేటు చానళ్లపై పడ్డారు.
 
 
2008లోనే నిఘా మొదలు..
చానళ్లు/పత్రికలపై నిఘా కొత్తేమీ కాదని కొందరు సీనియర్‌ జర్నలిస్టులు అంటున్నారు. యూపీఏ సర్కారు హయాంలో 2008లోనే ఈ పర్యవేక్షణ మొదలైందని చెబుతున్నారు. గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం మన్మోహన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భారత్‌ నిర్మాణ్‌ యోజన’, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి చానళ్లు ఎలా కవర్‌ చేస్తున్నాయో తెలుసుకునేది. అయితే మన్మోహన్‌గానీ, నాటి సమాచార మంత్రి అంబికా సోనీ గానీ తమ ఇమేజీ పెంచుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. అప్పట్లో మనీశ్‌ తివారీ సమాచార మంత్రి అయ్యాక మాత్రం ‘పర్యవేక్షణ’ పెరిగింది. 2014 నుంచి పర్యవేక్షణలో పెను మార్పులు వచ్చాయి. నిఘా స్థాయికి చేరింది.
 
 
20 నుంచి 200..
సూచనాభవన్‌లో గతంలో పర్యవేక్షణకు 15-20 మంది ఉండేవారు. దానిని 200కి పెంచారు. వీరిని ఆరు నెలల కాంట్రాక్టుపై తీసుకుంటున్నారు. అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వీళ్లు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. వారంలో ఒక రోజు సెలవు. అత్యవసరమైతే ఆ రోజు కూడా పనిచేయాల్సి ఉంటుంది. మొదటి నాలుగు గంటలూ వీళ్లు తమకు అప్పజెప్పిన రాష్ట్రాలకు చెందిన పత్రికలను చదువుతారు. తర్వాతి నాలుగు గంటలు నిర్దేశిత టీవీ చానళ్లను చూస్తారు. చివరి నాలుగు గంటల్లో జర్నలిస్టుల ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ లను పరిశీలిస్తారు.
 
 
ఈ మధ్యలోనే తాము పర్యవేక్షించిన అంశాలపై నివేదికలు కూడా ఇస్తారు. వాటి ఆధారంగా వారి సీనియర్లు రంగంలోకి దిగుతారన్న మాట. పర్యవేక్షక విభాగంలో పనిచేస్తున్న ఆయుష్‌ అనే హరియాణా యువకుడి వద్ద వందల మంది జర్నలిస్టుల జాబితా ఉంది. ‘ఇటీవల ఓ టీవీ జర్నలిస్టు.. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశారు. దీంతో ఆమెను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాం’ అని ఆయన తెలిపారు.
 
 
సెల్‌ఫోన్లు బంద్‌..
ఈ 200 మందిలో ఎవరూ నిఘా సమాచారం గురించి లీక్‌ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చెబితే ఉద్వాసనే. ఇటీవల దీని వివరాలు కొంచెం బయటకు పొక్కడంతో ఈ సిబ్బందిపైనే ఇప్పుడు నిఘా పెట్టారు. ఆఫీసులోకి అడుగుపెట్టేటప్పుడు వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను బయట సెక్యూరిటీలో అప్పగించాలి. తిరిగి వెళ్లేటప్పుడే ఇస్తారు. లోపల పనిచేసేటపుడు అక్కడి పనిని ఎవరూ ఫొటోలు/వీడియో తీయరాదు. బయటి వ్యక్తులతో సంభాషించకూడదు. అన్నీ గుప్తంగా సాగాలి. ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియకూడదు. ఈ వివరాలన్నీ ‘ఏబీపీ’ న్యూస్‌ చానల్‌ నుంచి ఇటీవల రాజీనామా చేసిన ప్రముఖ యాంకర్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పాయ్‌ ఓ వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇమేజీ పెంచుకోవడానికి మోదీ-అమిత్‌షా ఇంత భారీఎత్తున పర్యవేక్షణ, నిఘా పెడుతూ.. మీడియాను గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన గట్టిగానే విమర్శలు చేశారు.
 
 
ప్రైమ్‌ బులెటిన్లే టార్గెట్‌
వార్తా చానళ్లలో ప్రైమ్‌టైం బులెటిన్‌లకు ప్రేక్షకాదరణ ఎక్కువ. ఆసక్తికరమైన వార్తలన్నీ అప్పుడే వస్తుంటాయి.. ఆ సందర్భంగా యాంకర్లు చేసే వ్యాఖ్యలు, సదరు సంఘటన.. రాజకీయ పరిణామంపై ఆ చానల్‌ వైఖరి ఏమిటో పసిగట్టి ఈ పర్యవేక్షక బృందం నిత్యం నివేదిక పంపుతోంది. ఇందులో ఆయా యాంకర్ల పేర్లు, ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఆ నివేదికల ఆధారంగా ఆయా చానళ్లకు రేటింగ్‌ ఇస్తుంటారు. టీఆర్‌పీ కోసమే చానళ్లు పోటాపోటీగా పలు సంచలన వార్తలు, పరిశోధనాత్మక వార్తలు ఇస్తుంటే.. వాటి ‘క్వాలిటీ’ని బట్టి ఈ పర్యవేక్షక బృందాలు ఆ చానళ్లకు రేటింగ్‌ ఇస్తుండడం గమనార్హం.
 
 
సోషల్‌ మీడియా బృందమే కీలకం
పత్రికల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఏమొస్తోందో ఈ బృందం నిఘా పెడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఏ వార్త చక్కర్లు కొడుతోంది, అది తమకు అనుకూలమా, ప్రతికూలమా.. ఒకవేళ ప్రతికూలమైతే -వైరల్‌ అయిన ఆ వార్తకు కౌంటర్‌ను ఎలా ప్రచారం చేయాలి.. అవసరమైతే టీవీల్లో చర్చా కార్యక్రమాలు ఎలా ప్లాంట్‌ చేయాలి, ప్రింట్‌ మీడియాలో ఎలాంటి కథనం రావాలి.... మొదలైనవి ఈ బృందం నిర్ణయిస్తుంది. సమాజంలో వివిధ స్థాయుల వ్యక్తులు పెట్టే రాజకీయ పోస్టులపై నిఘా ఎక్కువ ఉంటుంది.
 
 
ప్రభావశీల వ్యక్తులు గానీ, సీనియర్‌ జర్నలిస్టులు గానీ బీజేపీ-అనుకూల విధానంపై ఒక పోస్టు పెడితే దాన్ని పెద్దఎత్తున షేర్‌ చేసే కార్యక్రమమూ సాగుతుంది. రాహుల్‌ గానీ లేక కాంగ్రెస్‌ నేతలెవరైనా గానీ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసినా లేక తప్పటడుగు వేసినా దాన్ని శరవేగంగా తీసుకెళ్లే పని చేపడతారు. కొన్ని కౌంటర్లను అప్పటికప్పుడే సృష్టిస్తారు. కార్టూన్లు, కేరికేచర్లు, తత్సంబంధమైన బాలీవుడ్‌ పాటల పంక్తులూ రెడీమేడ్‌గా వాడే సౌలభ్యం ఉంటుంది. ఎక్సెల్‌ షీట్లు రోజుకు కొన్ని వందల పేజీల మేర తయారవుతాయి. వాటిని క్రోడీకరించి-నిర్దిష్ట రూపం ఇచ్చే బృందం ఇంకొకటి ఉంటుంది. ప్రతి నివేదికా అమిత్‌ షా కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ మళ్లీ వడపోత సాగుతుంది. నిరంతర యజ్ఞంలా ఇది సాగుతోంది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...