Jump to content

Tea Seller e Tea Seller


RamaSiddhu J

Recommended Posts

  • హరిప్రసాద్‌పై ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంటులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి తొలగించారు. ఏకంగా ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం పార్లమెంటు చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణం. డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్డీయే నుంచి హరివంశ్‌నారాయణ్‌సింగ్‌ (జేడీయూ), బీకే హరిప్రసాద్‌ (కాంగ్రెస్‌) పోటీపడ్డారు. ఎన్నికలో హరివంశ్‌ గెలిచారు. ఫలితాన్ని ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ రాజ్యసభకు వచ్చారు.
 
హరివంశ్‌ను అభినందించేందుకు ప్రసంగాన్ని ప్రారంభించారు. అభ్యర్థులిద్దరి పేర్లలోనూ ‘హరి’ అని ఉండడాన్ని ఆసరాగా చేసుకుని, మోదీ తనదైన శైలిలో శ్లేషతో కూడిన చమక్కులు విసిరారు. ‘‘దోనో తరఫ్‌ హరి థే. ఏక్‌ కే ఆగే బి.కె. థా! బి.కె. హరి కోయి న బికే. యహా పే జో హరి కో బికే వో బి.కె. నహీ థా’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. బికే అన్న హిందీ పదానికి అమ్ముడు పోవడం అన్న అర్థం ఉంది. హరిప్రసాద్‌ ఇంటి పేరుతో శ్లేష చేసే క్రమంలో మోదీ ఈ పదాన్ని వాడడం వివాదానికి కారణమైంది. మోదీ అన్నది ఇదీ. ‘‘ఇరువైపులా హరి అన్న పేరుగల వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటిపేరు బి.కె. కానీ ఆయన అమ్ముడుపోలేదు (బికే). ఇక్కడ అమ్ముడు (బికే) పోయిన మరో హరి ఉన్నారు. కానీ ఆయన బి.కె. కాదు’’ అన్నది మోదీ మాటలకు వాచ్యార్థం. సభ్యులు గెలిపించలేదు అన్న అర్థంలో బికే అన్న పదాన్ని మోదీ వాడాలనుకున్నా, అది అమ్ముడు పోవడమనే అర్థంలో వెళ్లడంతో వివాదం చెలరేగింది.
 
 
అసలే ఓటమి వేదనతో ఉన్న హరిప్రసాద్‌ ప్రధాని తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని హోదాను, సభ గౌరవాన్ని మోదీ దిగజార్చారు’’ అని హరిప్రసాద్‌ ఆక్షేపించారు. మోదీ వ్యాఖ్యలు దేశానికే సిగ్గుచేటని శశిథరూర్‌ అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు గురువారమే మోదీపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చిన వెంకయ్య శుక్రవారం నిర్ణయాన్ని వెలువరించారు. ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు రాజ్యసభ సచివాలయంఽ ధ్రువీకరించింది. 
Link to comment
Share on other sites

Aripoyea deepaniki velugu ekkuva, 

just imagine: I felt ysr gadu kuda elanea noru jaradu, feared wat would be his next , finally nature took its own course, 

its a matter of time , potato Shaw in Indian toilet Tihar jail, Modi with no home food and no imported mush rooms, 

Link to comment
Share on other sites

7 hours ago, V Jagadeesh said:

Aripoyea deepaniki velugu ekkuva, 

just imagine: I felt ysr gadu kuda elanea noru jaradu, feared wat would be his next , finally nature took its own course, 

its a matter of time , potato Shaw in Indian toilet Tihar jail, Modi with no home food and no imported mush rooms, 

Many people don't really understand ... it took enormous courage from CBN to take on Modi and the cental govt ... 

CBN okka maata annadu ... ekkadiki pothunnam manam ... 

PM position lo unna manishi CBN lanti vyakthini kincha parachalsina avasaram emundi ... vellaki kaneesam values unnaya  ... 

Oka no name bjp leader SUV tho police meedha attack  chesthadu ... right in the middle of our Capital ... what are we doing about it?

Ilanti vallani tolerate cheyyatam manchidi kaadu ... for our own psyche ...

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...