Jump to content

అన్నింటికీ ‘భారతే’!


RamaSiddhu J

Recommended Posts

అన్నింటికీ ‘భారతే’! 
ఆమె వాటాదారు.. లేదంటే డైరెక్టర్‌ 
జగన్‌ గ్రూపు కంపెనీల వ్యవహారాలన్నీ భారతి కనుసన్నల్లోనే.. 
అన్ని అధికారిక పత్రాలపై అధీకృత సంతకందారు 
భారీగా వేతనం పొందుతున్నారు 
భారతి సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా ఇచ్చిన సొమ్ము జగన్‌ కంపెనీల్లోకి మళ్లింపు 
నిందితుల జాబితాలో కొత్తగా 10 కంపెనీలు 
ఫిర్యాదులో పేర్కొన్న ఈడీ 
ఈనాడు - హైదరాబాద్‌

10hyd-main12a.jpgజగన్‌ అక్రమాస్తుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి పేరు మొదటిసారిగా తెరపైకి వచ్చింది. ఇప్పటిదాకా సీబీఐ దాఖలుచేసిన అభియోగపత్రాల్లో కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలుచేసిన ఫిర్యాదుల్లో కానీ ఎక్కడా వై.ఎస్‌.భారతి పేరు లేదు. ఇప్పుడు భారతి (రఘురాం) సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ ఆమెను ఏకంగా నిందితురాలిగా పేర్కొంది. ఆమె పాత్రను స్పష్టంగా నిర్వచించింది. 
అంతేకాదు- సీబీఐ అభియోగ పత్రంలో లేని 10 కంపెనీల్నీ కొత్తగా నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కంపెనీల్లో చాలావాటికి ఆస్తులున్నాయే తప్ప ఎలాంటి కార్యకలాపాల్లేవని తేల్చిచెప్పింది.

ఈడీ ఫిర్యాదు(ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌)లో ఏం పేర్కొన్నారంటే... 
‘‘వై.ఎస్‌.భారతిరెడ్డి భారతి సిమెంట్స్‌ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. జగన్‌ గ్రూపు కంపెనీలన్నింటిలోనూ ఆమె డైరెక్టర్‌, లేదా ప్రధాన వాటాదారు. డైరెక్టర్‌ పదవి నుంచి జగన్‌ తప్పుకొన్నప్పటి నుంచీ విధాన నిర్ణయాలన్నింటినీ ఆమే తీసుకుంటున్నారు. నిధుల బదిలీకి సంబంధించిన చెక్‌లు, ఆడిట్‌ జరిగిన ఆస్తి అప్పుల పట్టీలు, వివిధ చట్టాల కింద దాఖలుచేయాల్సిన పత్రాల్లో సంతకం చేస్తున్నారు’’ అని ఈడీ వివరించింది.

ఆమె వేతనం చాలా ఎక్కువ 
‘‘సిమెంట్‌ పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేనప్పటికీ.. ఛైర్‌పర్సన్‌ హోదాలో వై.ఎస్‌.భారతి భారీగా వేతనం పొందుతున్నారు. ప్రధాన వాటాదారుగా ఉన్న ప్రెంచి కంపెనీ ఫర్‌ఫిసమ్‌తో సహా ఏ ఉద్యోగి, డైరెక్టర్‌ కూడా ఆమె వేతనంలో సగం కూడా పొందడంలేదు. భారతి సిమెంట్స్‌ వాటాల్ని ఫర్‌ఫిసమ్‌ కంపెనీకి విక్రయించడం ద్వారా భారీ మొత్తాలను పొందారు. ఈ మొత్తాలను భారతి జగన్‌ గ్రూపునకు చెందిన కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలించారు. జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ను కీల్వాన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా స్వాధీనం చేసుకుని ప్రధాన లబ్ధిదారుగా మారారు. వై.ఎస్‌.భారతి, జగన్‌ల అంగీకారంతో, వారి అనుమతితో- భారతి సిమెంట్స్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీష్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌లు మనీలాండరింగ్‌ నేరాలకు పాల్పడ్డాయి’’ అని ఈడీ వివరించింది.

ముడుపులతో సంపద సృష్టించుకున్న జగన్‌ 
ముడుపుల రూపంలో వసూలైన సొమ్మును జగన్‌ తన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలోకి తెచ్చుకున్నారని ఈడీ పేర్కొంది. ఆ సొమ్ముతో జగన్‌, అతని కుటుంబ సభ్యులు, గ్రూపు కంపెనీలు సంపదను సృష్టించుకున్నాయని వివరించింది. ‘‘జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, జనని ఇన్‌ఫ్రా, కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ తదితరాల్లో ప్రధాన వాటాదారుగా, డైరెక్టర్‌గా జగన్‌ కొనసాగారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో భూములు, పారిశ్రామిక పార్కులను కేటాయించడం ద్వారా కంపెనీలు, వ్యక్తుల నుంచి నీకది నాకిది(క్విడ్‌ప్రోకో) రూపంలో జగన్‌ తన గ్రూపు కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టారు’’ అని పేర్కొంది. తండ్రి సమ్మతితో విజయసాయిరెడ్డి, ఇతర ప్రభుత్వాధికారుల సాయంతో కుట్రపన్ని నిమ్మగడ్డ ప్రసాద్‌, ఎన్‌.శ్రీనివాసన్‌, పునీత్‌దాల్మియాలకు లబ్ధి చేకూర్చి రూ.442.82 కోట్లను పెట్టుబడుల రూపంలో పొందినట్లు వివరించింది.  జగతి, భారతిలోకి పెట్టుబడుల్ని రాబట్టడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. జగన్‌ సహ విద్యార్థి, ప్రస్తుతం భారతి సిమెంట్స్‌తోపాటు పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్న జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారంది.

నిందితుల జాబితాలో కొత్తగా జగన్‌ కంపెనీలు 
రఘురాం(భారతి) సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ దాఖలుచేసిన నిందితుల జాబితాలో 8 మంది వ్యక్తులుండగా.. కంపెనీ మాత్రం భారతి సిమెంట్స్‌ ఒక్కటే. కానీ ఈడీ దాఖలుచేసిన ఫిర్యాదులో అదనంగా 10 కంపెనీలు చేరాయి.

అవి.. 
జగన్‌కు చెందిన సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీష్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌. 


నేరపూరిత సొమ్ముతో ఈ కంపెనీలకు ఉన్న సంబంధాన్ని ఈడీ వివరించిన తీరు ఇదీ..

* సిలికాన్‌ బిల్డర్స్‌: ఇది క్లాసిక్‌ రియాలిటీ అనుబంధ సంస్థ. నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన కంపెనీల నుంచి వచ్చిన సొమ్ము రూ.57 కోట్లు క్లాసిక్‌ రియాలిటీ నుంచి పెట్టుబడుల రూపంలో సిలికాన్‌ బిల్డర్స్‌ పొందింది. ఈ సొమ్ముతో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసింది. నిమ్మగడ్డ, భారతి, జగన్‌ల నుంచి వచ్చిన సొమ్ముతో భారతి సిమెంట్స్‌ వాటాలను కొనుగోలుచేసి భారీ ఎత్తున డివిడెండ్‌ పొందింది. నేరపూరితంగా వచ్చిన సొమ్ముతో బెంగళూరు సదాశివనగర్‌లో రూ.9.6 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశారు. వాటాలు, డిపాజిట్‌లవంటి చరాస్తుల రూపంలో రూ.15.77 కోట్లు సమకూర్చుకున్నారు.

* సండూర్‌ పవర్‌ కంపెనీ: సండూర్‌ కంపెనీలోకి 2005-06లో 2ఐ క్యాపిటల్‌, ప్లూరి ఎమర్జింగ్‌ అనే రెండు మారిషస్‌ కంపెనీల నుంచి రూ.124.60 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. భారతి సిమెంట్స్‌ వాటాల ద్వారా వచ్చిన రూ.416.20 కోట్లతో మారిషన్‌ కంపెనీల నుంచి వాటాలను జగన్‌ తిరిగి కొనుగోలు చేశారని ఈడీ ఆరోపించింది. ఆస్తి అప్పుల పట్టీలో యంత్రాలు, యంత్రసామగ్రి కింద రూ.118.49 కోట్లు చూపించారు.

* క్లాసిక్‌ రియాలిటీ: ఈ కంపెనీ పేరు మీద బెంగళూరులోని ‘కామర్స్‌ ఎట్‌ మంత్రి’ భవనం ఉంది. ఇది అద్దెలు వసూలు చేయడం మినహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. ఇందులో నివిష్‌ ఇన్‌ఫ్రా, షాలోం ఇన్‌ఫ్రా, మార్వెల్‌ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్‌ హోటల్స్‌ విలీనమయ్యాయి. ఇవన్నీ భారతి సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును పొందినవేనని ఈడీ తేల్చింది.

* సరస్వతి పవర్‌: ఈ కంపెనీకి నిమ్మగడ్డ గ్రూపు కంపెనీల సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్లించారు. దీనికి రూ.31.84 కోట్ల స్థిరాస్తులు, రూ.49.55 లక్షల చరాస్తులున్నాయి.

* క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా: ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు ఈ కంపెనీకి లేవు. నేరపూరిత సొమ్ము ద్వారా హకీంపేటలో రూ.24.89 కోట్లతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపించింది.

* యుటోపియా ఇన్‌ఫ్రా: ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు ఈ కంపెనీకి లేవు. నేరపూరిత సొమ్ము ద్వారా హకీంపేటలో రూ.25.07 కోట్లతో స్థిరాస్తులు కొనుగోలుచేసింది.

* హరీష్‌ ఇన్‌ఫ్రా: మారిషస్‌ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ముతో సండూర్‌ కంపెనీ తన అప్పుల్ని తీర్చడంతోపాటు హరీష్‌ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది. హరీష్‌ ఇన్‌ఫ్రా హకీంపేటలో రూ.4.11 కోట్ల విలువైన ప్లాట్‌, కడప జిల్లా మామిళ్లపల్లిలో రూ.47.10 లక్షలతో 7.85 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు లేని ఈ కంపెనీకి రూ.8.46 కోట్ల స్థిరాస్తులున్నాయి.

* సిలికాన్‌‌ ఇన్‌ఫ్రా: ఇందులోకి సండూర్‌తోపాటు ముంబయి, గుజరాత్‌, కోల్‌కతా, గుజరాత్‌ల్లోని డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయి. దీనికి రూ.6.54 కోట్ల ఆస్తులున్నాయి.

* రేవన్‌ ఇన్‌ఫ్రా: సండూర్‌ నుంచి పెట్టుబడులు వచ్చాయి. బెంగళూరు దేవన్‌హళ్లిలో రూ.79 కోట్లతో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

* భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌: బెంగళూరు దేవరబసీనహల్లిలో 59,070 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. రూ.2.60 కోట్ల స్థిరాస్తి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల రూపంలో రూ.98.50 లక్షలున్నాయి.

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

Operation Garuda lo inko chapter open chesaaru Baffas..Dynamic writers Sarai and Puran screen play tho...

yes its an open book, new development vachinappudalla we can say new chapter :lol2:

Link to comment
Share on other sites

edi pedda game AP meda potti shha garu survey chesadu, jagan, pk emi punjukunnttu ledu ani telisindi, last week kanna gadini pichi adigaru,BJP tho jagan,pk kummaku news janala loki  baga poyindi ani cheppadu anta, dani ki counter ga edi chesthunaru, jaffa sentiment drama vesthadu, pk gadu kuda bjp ni bhutulu tidtadu edi antha game potti rami reddy,muralidhar rao,dam madhav game plan

Link to comment
Share on other sites

3 minutes ago, fan no 1 said:

Looks like a plan to save Jagan by diverting all cases to her. Now if she goes to prison for some reason, lady sentiment workout ayyiddi and also Jagan will be saved from going to jail na feeling 

vade pampamani cheppina chebutadu

Link to comment
Share on other sites

రెండు వారాల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో, జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఒక ఎంపి చర్చించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ వంద సీట్లకు పోటీ చేస్తే, మిగిలిన 75 సీట్లలో తాము, జనసేన పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించి, దానివల్ల అంతా మునిగిపోతామని, ముఖ్యంగా తన పార్టీ దెబ్బతింటుందని, తన లక్ష్యం నెరవేరదని దూత పాత్ర పోషిస్తున్న సదరు ఎంపీకి స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

11 minutes ago, fan no 1 said:

Looks like a plan to save Jagan by diverting all cases to her. Now if she goes to prison for some reason, lady sentiment workout ayyiddi and also Jagan will be saved from going to jail na feeling 

Game plan yemo BJP ki YCP ki sambandam ledu chattam tana pani tanu chesukupotunnadi ani show cheyyatam kosam thanikella bharani gifs àäøàäþàäààÃÂ¥ àäàäîàÃ¥àä àäêàäðàäÿàäãàäþàäî

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...