Jump to content

karunanidhi valla di ongole antaga


Recommended Posts

ఈ ఒంగోలు గిత్తను ఎంతకు కొని ఎంతకు అమ్మాడో తెలిస్తే...
09-08-2018 13:10:27
 
636694170272093242.jpg
కర్నూలు: చాగలమర్రి గ్రామంలోని అలంసాగారి మౌలాలి అనే రైతు 18 నెలల క్రితం రూ.90 వేలకు ఒంగోలు గిత్తను కొనుగోలు చేశాడు. బుధవారం రూ.5.25 లక్షలకు విక్రయించాడు. కడప జిల్లా మైదుకూరు మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. మౌలాలి ఒంగోలు గిత్త రాష్ట్రస్థాయిలో మూడు బండలాగుడు పోటీల్లో ప్రథమ స్థానంలో, రెండు ద్వితీయ స్థానాల్లో గెలుపొంది పలువురి మన్ననలు పొందింది. దీంతో రూ.4.35 లక్షల ఆదాయం వచ్చింది.
Link to comment
Share on other sites

కరుణ పూర్వీకులది ఒంగోలేనా! 
పెళ్లూరు సంస్థానంలో కొలువులు... 
ఆ ఇద్దరూ లేకున్నా నిజం బతికుంది..

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: కరుణానిధి పూర్వీకులు తెలుగువారే... ఆయనకు ముందు రెండు తరాల కిందటివారు ఒంగోలులోనే ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెంలోనే కరుణానిధి పూర్వీకులు నివాసం ఉండేవారు. పెళ్లూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేసేవారు.. ఇవి స్వయానా కరుణానిధి చెప్పిన మాటలే... అయితే ఆ మాటలు చెప్పిన కరుణానిధిగానీ, వాటిని ఆలకించిన డిటెక్టిల్‌ నవలా రచయిత కొంపల్లి బాలకృష్ణగానీ ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ బాలకృష్ణ తన సతీమణి తేళ్ల అరుణతో ఈ విషయం చెప్పారు. వాటిని ఆమె ‘ఈనాడు’తో పంచుకున్నారు. 
కరుణానిధికి నవలలు, నవలా రచయితలు అంటే విపరీతమైన అభిమానం. అందులోనూ డిటెక్టివ్‌ నవలలను విపరీతంగా ఇష్టపడేవారు. అది 1960ల ఆరంభం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో డిటెక్టివ్‌ నవలా రచయితల సమావేశం జరిగింది. ఈ సభకు ఒంగోలు నుంచి కొంపల్లి బాలకృష్ణ హాజరయ్యారు. ఆయన డిటెక్టిల్‌ నవలా రచయిత. విద్యార్థిగా ఉంటూనే పదహారేళ్ల వయసులోనే నవలలు రాసేవారు. ఈ క్రమంలోనే ఏలూరు నుంచి ఆహ్వానం అందడంతో వెళ్లారు. ఆ సభకు కరుణానిధి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనను తాను పరిచయం చేసుకున్నారు. తాను ఒంగోలు నుంచి వచ్చానని కరుణకు చెప్పారు. వెంటనే కరుణ నవ్వుతూ... ‘ఒంగోలా... అయితే మా వాడివే. ఎలా ఉంది ఒంగోలు? మాదీ ఒంగోలే. మా ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పని చేశారు. తర్వాత పరిస్థితులు బాగాలేక మద్రాసుకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సభ అనంతరం బాలకృష్ణ ఒంగోలు వచ్చి ఆ విషయం అందరికీ చెప్పారు. ఆయన ఒంగోలులోని మంగమ్మ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యుడిగానూ పని చేశారు. తరచూ తన సన్నిహితుల వద్ద కరుణానిధి చెప్పిన మాటలను చెప్పేవారు. నాలుగేళ్ల కిందట బాలకృష్ణ మరణించారు. తాజాగా కరుణానిధి మరణించారు. కానీ బాలకృష్ణ తన సన్నిహితుల వద్ద చెప్పిన ఈ విషయాలు బయటకు వచ్చాయి. ‘బాలకృష్ణ మంచి నవలా రచయిత. ఏలూరు సభ సందర్భంగా కరుణానిధి ఆయనతో మాట్లాడారు. తమ పూర్వీకులది ఒంగోలు సమీపంలోని చెర్వుకొమ్ముపాలెమని, పెళ్లూరు ఆస్థానంలో పనిచేసేవారని’ చెప్పారు. ఈ విషయాలను తరచూ బాలకృష్ణ మా అందరితో పంచుకునేవారు’ అని బాలకృష్ణ భార్య తేళ్ల అరుణ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఆ ఎన్నికలను అవకాశంగా మలుచుకున్న కరుణనిధి
10-08-2018 10:07:13
 
636694924329918501.jpg
  • జాతీయ పార్టీగా డీఎంకే
  • 1972 ఎన్నికల్లో పొన్నూరులో డీఎంకే పోటీ
  • పలు చోట్ల గట్టి పోటీనిచ్చిన అభ్యర్థులు
పొన్నూరు టౌన్‌: డీఎంకే పార్టీని జాతీయ పార్టీగా నిలపాలనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విస్తరించటానికి 1970 దశకంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా 1972 ఎన్నికలను ఆయన అవకాశంగా మలుచుకున్నారు. రైతాంగ ఉద్యమనేత ఆచార్య ఎన్జీ రంగా చెన్నై పచ్చపాస్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ద్రవిడ ఉద్యమనేత అన్నాదొరై ఆయనకు శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఎన్జీ రంగా స్వస్థలమైన పొన్నూరు కేంద్రంగా రాష్ట్రంలో డీఎంకే పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేసింది. నిడుబ్రోలుకు చెందిన కొసరాజు వెంకట్రాయుడు క రుణానిధిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ద్రవిడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ పరిస్థితుల్లో 1972 ఎన్నికల్లో పొన్నూరు, చిత్తూరు, పుత్తూరు, నగరి, నెల్లూరుతో పాటు నేటి తెలంగాణలోని సూ ర్యాపేటలో డీఎంకే అభ్యర్థులు పోటీ చేశారు. ఆత్మగౌరవ నినాదం, పేదలకు కిలో బియ్యం పథకం నచ్చిన యువత గ్రామాల్లో డీఎంకే పార్టీకి విశేషంగా ఆకర్షితులై ఓట్లు వేశారు. పొన్నూరులో డీఎంకే తరుపున పోటీ చేసిన నన్నపనేని గంగాధరరావుకు ఆ ఎన్నికల్లో 3600 ఓట్లు లభించాయి. నెల్లూరులో పోటీ చేసిన మస్తాన్‌రెడ్డికి 6 వేల ఓట్లు, చి త్తూరులో పోటీ చేసిన మురుగేషన్‌కు 15 వేల ఓట్లు లభించాయి. డీఎంకే అభ్యర్థులు ఎటువంటి ఖర్చు, ప్రచారం లేకుండానే వేల సంఖ్యలో ఓట్లు సాధించటంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకునే అవకాశాలకు డీఎంకే నాంది పలికిందని నాడు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే తదనంతర కాలంలో కరుణానిధి, ఎంజీఆర్‌ల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు పొడచూపటంతో ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. పొన్నూరు వంటి ప్రాంతంలో డీఎంకే నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన కొసరాజు వెంకట్రాయుడు కరుణానిధిపై అభిమానం, ప్రేమతో తన రెండో కుమారుడికి కరుణానిధి అనే పేరు పెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంపై ఆయన అభిమానులు సంతాపం తెలిపారు
Link to comment
Share on other sites

21 hours ago, sonykongara said:
ఈ ఒంగోలు గిత్తను ఎంతకు కొని ఎంతకు అమ్మాడో తెలిస్తే...
09-08-2018 13:10:27
 
636694170272093242.jpg
కర్నూలు: చాగలమర్రి గ్రామంలోని అలంసాగారి మౌలాలి అనే రైతు 18 నెలల క్రితం రూ.90 వేలకు ఒంగోలు గిత్తను కొనుగోలు చేశాడు. బుధవారం రూ.5.25 లక్షలకు విక్రయించాడు. కడప జిల్లా మైదుకూరు మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. మౌలాలి ఒంగోలు గిత్త రాష్ట్రస్థాయిలో మూడు బండలాగుడు పోటీల్లో ప్రథమ స్థానంలో, రెండు ద్వితీయ స్థానాల్లో గెలుపొంది పలువురి మన్ననలు పొందింది. దీంతో రూ.4.35 లక్షల ఆదాయం వచ్చింది.

e paper ollani mamool ga tannakudadu.... purchase cost minus selling cost = profit entra metta mohallaraaa..... atanu 90k ki 1 year or 1.5 year old ni koni untadu.... plus all these 18 months, danni mepi training ivvataniki chaala cost avtundi.... 

plus banda laagudu compitation lo prizes vacagayi antey.... training and maintainence ki tadisi mopedu avvuddi.... my Uncle was partner for 2 pairs of Ongole bulls and it’s a costly hobby

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...