Jump to content

Holitech


Recommended Posts

ఏపిలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ... 1400 కోట్ల పెట్టుబడి, 6 వేల ఉద్యోగాలు... 6 వ తారీఖున ఎంఓయి...

   

company-04082018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ కి మరో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ రాబోతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కానీ మొదటి సారి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ రాబోతుంది. ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ తయారీ లో వినియోగించే కెమెరా మాడ్యూల్స్,టిఎఫ్టి స్క్రీన్స్ తయారు చెయ్యబోతుంది. తిరుపతిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో ఏర్పాటు కాబోతోంది. రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంది. 1400 కోట్ల పెట్టుబడి ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టనుంది. నేరుగా 6 వేల మందికి ఈ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ కంపెనీ మొదటి సారి మన దేశంలో పెట్టుబడి పెట్టబోతుంది. అధునాతన సాంకేతికత,పరిశోధన మరియు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు కంపెనీ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డేవేలప్మెంట్ కూడా ఈ కంపెనీ ఏర్పాటు చెయ్యబోతుంది...

 

ఢిల్లీ లోని నోయిడా రీజియన్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి తీవ్రమైన పోటీ ఎదురైన కంపెనీ చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గుచూపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ బృందం ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు రెండుసార్లు చైనాకి పర్యటించింది. మరో సారి మంత్రి నారా లోకేష్ స్వయంగా కంపెనీ ప్రతినిధులని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించి ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని ఆహ్వానించారు. ఈ కంపెనీ దేశంలో ఉన్న అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు విడిభాగలు సప్లై చేసే అవకాశం ఉంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఆగస్ట్ 6 వ తారీఖున ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి సమక్షంలో అనంతరం ముఖ్యమంత్రి గ్రీవెన్ హాల్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఈ ప్రెస్ మీట్ లో కంపెనీ ప్రతినిధులు పాల్గొని కంపెనీ ఏర్పాటు వివరాలు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 20 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ లో 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.మరో పక్క తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది.రిలయన్స్ జియో సమగ్ర ప్రొజెక్ట్ రిపోర్ట్ తయారు అయ్యింది.125 ఎకరాల్లో జియో మొబైల్స్,ఎలక్ట్రానిక్స్ తయారీ మెగా కంపెనీ త్వరలోనే ఏర్పాటు కాబోతోంది.

ఇటీవల కాలంలోనే ఫ్లెక్స్ ట్రానిక్స్,ఇన్వెకాస్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి.అలాగే లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది...ఈ రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.అనేక కంపెనీల ప్రతినిధులను దేశంలోని వివిధ నగరాలు,వివిధ దేశాల్లోనూ,వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులోనూ వివిధ కంపెనీలను కలిసి రాష్ట్రం గురించి వివరించారు.దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.వచ్చే నెల నుండి ప్రతి నెలా ఒకటి లేదా రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రానున్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం.ఎంఓయూ కన్వెర్షన్ లో దేశంలో నెంబర్ 2 లో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.... ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ కంపెనీ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి...6 వ తారీఖున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కార్యక్రమంలో కంపెనీ వివరాలు వెల్లడించనున్నారు.

Link to comment
Share on other sites

తిరుపతిలో రిలయన్స్‌ ఎలక్ట్రా‌నిక్‌ సెజ్‌
02-08-2018 03:42:37
 
636687781579605267.jpg
  • 80 శాతం జియో ఫోన్లు అక్కడే తయారీ.. 125 ఎకరాల భూమి కేటాయింపు
  • అమరావతిలో 10 ఐటి కంపెనీలు ప్రారంభం
అమరావతి (ఆంధ్రజ్యోతి): మంగళగిరి ఐటి పార్కు, గన్నవరం మేధా టవర్స్‌, విజయవాడల్లో ఏర్పాటుకాబోయే 10 ఐటి కంపెనీలను బుధవారం తాడేపల్లిలోని ఎపిఎన్‌ఆర్‌టి భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐటి మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటి రంగ ప్రగతిపై మాట్లాడారు. ఎన్నికల నాటికి ఐటిలో లక్ష మందికి, ఎలక్ట్రా‌నిక్స్‌లో 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతిలో రిలయన్స్‌ ఎలక్ట్రా‌నిక్స్‌ సెజ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ డిపిఆర్‌ సమర్పించిందన్నారు. 125ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తామన్నారు. రిలయన్స్‌ తయారుచేసే జియో ఫోన్లు, టీవీలు, సెట్‌టాప్‌ బాక్సుల్లో 80ు ఇక్కడే తయారవుతాయన్నారు. ఆనాడు రాళ్లు, రప్పల మధ్యలో చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించారన్నారు. ఇప్పుడు ఎపిలో ఐదు సైబరాబాద్‌లు ఏర్పాటుచేయాలని, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నవాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలని సిఎం దిశానిర్దేశం చేశారని లోకేశ్‌ తెలిపారు. కాగా, వివిధ కంపెనీలు, సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వాస్తవ రూపంలో తీసుకురావడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉందని లోకేశ్‌ తెలిపారు. 216 ఒప్పందాలను అమలు చేసి గుజరాత్‌ నంబర్‌వన్‌గా ఉంటే, 214 ఒప్పందాలను అమలు చేసి ఏపీ రెండోస్థానంలో ఉందన్నారు.
 
సోమవారం భారీ ప్రకటన
సోమవారం ఒక భారీ ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీతో ఒప్పందం ఉండనుందని లోకేష్‌ తెలిపారు. ప్రపంచంలోని 4 పెద్ద ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీలను ఎపికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటికే కొన్ని వచ్చాయని, మిగిలినవీ రాబోతున్నట్లు పేర్కొన్నారు.
 
  •  
Link to comment
Share on other sites

సోమవారం భారీ ప్రకటన
సోమవారం ఒక భారీ ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీతో ఒప్పందం ఉండనుందని లోకేష్‌ తెలిపారు. ప్రపంచంలోని 4 పెద్ద ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీలను ఎపికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటికే కొన్ని వచ్చాయని, మిగిలినవీ రాబోతున్నట్లు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

రాష్ట్రానికి భారీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ 
తిరుపతి ఈఎంసీ-2లో రూ.1400 కోట్ల పెట్టుబడులు 
6 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు 
రేపు సీఎం, ఐటీ మంత్రితో కంపెనీ ప్రతినిధుల భేటీ 
ఇతర రాష్ట్రాల నుంచి పోటీ కారణంగా కంపెనీ పేరు గోప్యంగా ఉంచిన ప్రభుత్వం 
ఈనాడు - అమరావతి

మొబైల్‌ ఫోన్ల రంగంలో వినియోగించే కెమెరా మాడ్యూళ్లు, టీఎప్టీ స్క్రీన్లు తయారుచేసే భారీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకానుంది. తద్వారా దేశంలోని అన్ని మొబైల్‌ తయారీ కంపెనీలకు విడి భాగాలను సరఫరా చేసే అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు దిగుమతి చేసుకొని వీటిని కూర్చి(అసెంబ్లింగ్‌) రకరకాల వస్తువులకు రూపమిచ్చే కంపెనీలే వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)-2లో రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1400 కోట్ల పెట్టుబడితో ఈ భారీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఏర్పాటవుతుంది. 6వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ కారణంగా కంపెనీ వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కంపెనీ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి లోకేశ్‌లతో భేటీ కానున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కంపెనీ ఏర్పాటు, పెట్టుబడుల వివరాలను వెల్లడించనున్నారు. దిల్లీలోని నోయిడా రీజియన్‌, మహారాష్ట్ర..ఈ కంపెనీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించుకునేందుకు గట్టి పోటీనిచ్చాయి. రాష్ట్రానికి రప్పించేందుకు ఏపీ ఐటీశాఖ అధికారుల బృందం రెండుసార్లు  చైనాలో పర్యటించింది. మరోసారి మంత్రి లోకేశ్‌ కంపెనీ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను వివరించారు.

ఇప్పటికే ఎన్నో సంస్థల ఏర్పాటు..  ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు కంపెనీలు ఏర్పాటై అనేకమందికి ఉపాధి లభిస్తోంది.ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, డిక్సన్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయి. కార్బన్‌ కూడా త్వరలో ప్రారంభం కానుంది. 125 ఎకరాల్లో తిరుపతిలో జియో మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ మెగా కంపెనీ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ప్లెక్స్‌ట్రానిక్స్‌, ఇన్వెకాస్‌ వంటివి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. లిథియం ఐయాస్‌ బ్యాటరీ తయారీ కంపెనీ ‘మునోత్‌’ కూడా రాష్ట్రానికి రాబోతుందని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి భారీ ఎలక్ట్రానిక్‌ కంపెనీ
05-08-2018 02:29:14
 
636690329560202389.jpg
  • రేపు సీఎం సమక్షంలో ఎంవోయూ
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి త్వరలో భారీ ఎలకా్ట్రనిక్‌ కంపెనీ రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం ఆ కంపెనీతో కీలక అవగాహనా ఒప్పందం కుదరనుంది. అయితే, సదరు కంపెనీని దక్కించుకోవాలని ఇతర రాష్ట్రాలూ పోటీ పడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఇప్పటిదాకా దేశంలో ఎలకా్ట్రనిక్‌ అసెంబ్లింగ్‌ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ రాబోతోందని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణ కిశోర్‌ వెల్లడించారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే మాడ్యూల్స్‌, టీఎఫ్టీ స్కీన్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ -2లో ఏర్పాటు కానున్న ఈ కంపెనీ వివరాలను సీఎం సమక్షంలో ఎంవోయూను ఖరారు చేసుకొనే సమయంలో వెల్లడిస్తామని కృష్ణ కిశోర్‌ వివరించారు. ఈ కంపెనీ రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతుందని చెప్పారు. ‘‘1,400 కోట్ల రూపాయల పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువస్తుంది. ఆరువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా వేగంగా రూపుదిద్దుకొంటున్నదని, ఈ రంగంలో ఇప్పటి వరకూ 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘‘మొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌లో 15,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్యరింగ్‌ క్లస్టర్‌లో సెల్‌కాన్‌, డిక్సన్‌ వచ్చాయి. త్వరలోనే కార్బన్‌ కూడా రానుంది. 125 ఎకరాల్లో జియో మొబైల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ మెగా కంపెనీ కూడా ఏర్పాటు కానున్నది. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ఇన్వెకాస్‌ రాష్ట్రంతో ఇటీవలే ఒప్పందం చేసుకుంది. లిథియం ఐయాన్‌ బ్యాటరీ తయారీ కంపెనీ మనోత్‌ కూడా ఏపీకి రానున్నది’’ అని కృష్ణకిశోర్‌ తెలిపారు. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో రెండు లక్షల మందికి ఉద్యోగాల కల్పనేలక్ష్యంగా మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం అనేక కంపెనీల ప్రతినిధులతో, ఎకనామిక్స్‌ ఫోరాలలో లోకేశ్‌ సంప్రదింపులు జరుపుతూ వచ్చారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో నంబర్‌ వన్‌ స్థానం దక్కడం, ఎంఓయూ కన్వెర్షన్‌లో రెండో స్థానంలో ఉండడంతో పెట్టుబడి అవకాశాలు పెరిగాయని వివరించారు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా ఒకటి రెండు కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Link to comment
Share on other sites

వస్తోంది హోలీటెక్‌!
06-08-2018 02:04:42
 
636691178808103479.jpg
  • తిరుపతిలో కర్మాగారం ఏర్పాటు
  • రూ.1,400 కోట్ల పెట్టుబడి
  • ఆరు వేల మందికి ఉపాధి
  • 660 కోట్లతో ‘బెస్ట్‌’ కంపెనీ కూడా
  • నేడు సీఎం సమక్షంలో ఒప్పందాలు
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రానున్న మరో ప్రపంచ ప్రఖ్యాత ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ పేరు విశ్వసనీయంగా తెలిసింది. అది చైనాకు చెందిన హోలీటెక్‌ సంస్థ అని సమాచారం. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది. ఫలితంగా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది. అయితే ఇతర రాష్ట్రాలు కూడా దీనికోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దాని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం బయటకు వెల్లడించలేదు. హోలీటెక్‌ ప్రతినిధులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
 
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలన్నీ.. అసెంబ్లింగ్‌ చేసేవి మాత్రమే. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. ఇప్పుడు తొలిసారి దేశంలో హోలీటెక్‌ రూపంలో ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ లాంటి ప్రసిద్ధ కంపెనీలు తరలిరాగా.. ఇప్పుడీ జాబితాలో హోలీటెక్‌ కూడా చేరింది.
 
మరోవైపు.. భారత్‌ ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ‘బెస్ట్‌’.. రాష్ట్రంలో బ్యాటరీల తయారీ కర్మాగారం పెట్టనుంది. రూ.660 కోట్లతో దీన్ని స్థాపిస్తారు. ఫలితంగా మూడేళ్లలో మూడువేల ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న లిథియం అయాన్‌ బ్యాటరీలకు భిన్నంగా ఈ కొత్త బ్యాటరీ ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. బ్యాటరీ పెట్టేందుకు పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదు. ఒక క్యూబిక్‌ మీటర్‌ స్థలంలోనే మెగావాట్‌ పవర్‌ ఉన్న బ్యాటరీని పెట్టుకోవచ్చు. ఆస్ర్టేలియాకు చెందిన ప్యాట్రిక్‌ గ్లిన్‌ దీనిని ఆవిష్కరించారు. సీఎం సమక్షంలో సోమవారం ఈ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నారు.
Link to comment
Share on other sites

33 minutes ago, sonykongara said:
వస్తోంది హోలీటెక్‌!
06-08-2018 02:04:42
 
636691178808103479.jpg
  • తిరుపతిలో కర్మాగారం ఏర్పాటు
  • రూ.1,400 కోట్ల పెట్టుబడి
  • ఆరు వేల మందికి ఉపాధి
  • 660 కోట్లతో ‘బెస్ట్‌’ కంపెనీ కూడా
  • నేడు సీఎం సమక్షంలో ఒప్పందాలు
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రానున్న మరో ప్రపంచ ప్రఖ్యాత ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ పేరు విశ్వసనీయంగా తెలిసింది. అది చైనాకు చెందిన హోలీటెక్‌ సంస్థ అని సమాచారం. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది. ఫలితంగా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది. అయితే ఇతర రాష్ట్రాలు కూడా దీనికోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దాని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం బయటకు వెల్లడించలేదు. హోలీటెక్‌ ప్రతినిధులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
 
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలన్నీ.. అసెంబ్లింగ్‌ చేసేవి మాత్రమే. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. ఇప్పుడు తొలిసారి దేశంలో హోలీటెక్‌ రూపంలో ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ లాంటి ప్రసిద్ధ కంపెనీలు తరలిరాగా.. ఇప్పుడీ జాబితాలో హోలీటెక్‌ కూడా చేరింది.
 
మరోవైపు.. భారత్‌ ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ‘బెస్ట్‌’.. రాష్ట్రంలో బ్యాటరీల తయారీ కర్మాగారం పెట్టనుంది. రూ.660 కోట్లతో దీన్ని స్థాపిస్తారు. ఫలితంగా మూడేళ్లలో మూడువేల ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న లిథియం అయాన్‌ బ్యాటరీలకు భిన్నంగా ఈ కొత్త బ్యాటరీ ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. బ్యాటరీ పెట్టేందుకు పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదు. ఒక క్యూబిక్‌ మీటర్‌ స్థలంలోనే మెగావాట్‌ పవర్‌ ఉన్న బ్యాటరీని పెట్టుకోవచ్చు. ఆస్ర్టేలియాకు చెందిన ప్యాట్రిక్‌ గ్లిన్‌ దీనిని ఆవిష్కరించారు. సీఎం సమక్షంలో సోమవారం ఈ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నారు.

Veedi customer list lo canon, Samsung, panasonic kuda unayi ga

Link to comment
Share on other sites

12 minutes ago, Raaz@NBK said:

Idhi kuda Sricity aa ?? 

Godavari or Prakasam district lo petochu ga..

Chitoor lo unna electronic cluster lo pedutunaru factory... Godavari lo food processing units.. Prakasham lo paper unit plan chesaru land ivatam ledu ga akkada janam vallaki kavalsina dabbulu ichi teesukovali lands apati daka kochem opika pattali 

Link to comment
Share on other sites

14 minutes ago, Raaz@NBK said:

 

Etu Krishna and Guntur district ki capital ani oka biscuit vesaru.. HCL (not full pledged) tapp Gaint companys inkem raledhu.. Enni International schools and colleges pedithe em labham Earn chesevallu lekapothe..

eppudu maa rayala seema padi edo okati antavu enduku. mee kittaki capital undi. adi saalu. all industries maake padmavati maake. :lol2:

Link to comment
Share on other sites

4 minutes ago, LuvNTR said:

eppudu maa rayala seema padi edo okati antavu enduku. mee kittaki capital undi. adi saalu. all industries maake padmavati maake. :lol2:

Ananthapuram lo pettina parledhu aa Chittor n Nellore lo Entha chesina 5 seats kante ekkuva ivvaru.. only govt jobs chesedhaniki ayithe 54k acres endhuku.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...