Jump to content

మాట తప్పని, మడమ తిప్పని జగన్ రెండు రోజుల్లో కాపుల రిజర్వేషన్


Recommended Posts

12 minutes ago, Pruthvi@NBK said:

Ninna veedu edo ante strategy anukunnam ?? 

  

ivala clarity vachesindi. Maroka chakkani self goal jaffa dwara. 

stratagey na bonga...self goal...vadu anuchukuntadu kani lopala chala "kopan"...a roju burst ayyadu just...

 

YCP Kapu leaders andaru meeting petti "edemma daridrudu mana chetha karchupuettichadu innalu...ippudu East lo trip ayipogane plate marchadu ni dobbulu"

EAST lo YCP kapu leader ane vadu "manam ipudu evadi votes techukovali ane big question mark" ayyindi situation jaggadi self goal ki..

 

KOps ni total ga vadilesadu.....In politics you never make open strategy of leaving a caste 

 

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

stratagey na bonga...self goal...vadu anuchukuntadu kani lopala chala "kopan"...a roju burst ayyadu just...

 

YCP Kapu leaders andaru meeting petti "edemma daridrudu mana chetha karchupuettichadu innalu...ippudu East lo trip ayipogane plate marchadu ni dobbulu"

EAST lo YCP kapu leader ane vadu "manam ipudu evadi votes techukovali ane big question mark" ayyindi situation jaggadi self goal ki..

 

KOps ni total ga vadilesadu.....In politics you never make open strategy of leaving a caste 

 

True !! Oka caste ni purtiga vadilesi BC votes vastay ani anukodam murkatvam. Jaffa lost trust in Kaps and BCs won’t trust because of today’s U turn. EG lo 50 days trip positivity ni 2 days lo assam ki parcel chesadu. 

Link to comment
Share on other sites

కాకినాడ: ‘‘ఇన్నాళ్లూపడ్డ కష్టమంతా తుడిచిపెట్టుకుపోయింది... పది రోజుల క్రితం సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు... నాలుగు రోజుల క్రితం జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్‌ హామీ ఇవ్వలేనని చెప్పడం.... ఈ రెండు అంశాలతో ఇంత కాలం పడ్డ శ్రమంతా బూడిదలోపోసిన పన్నీరైపోయింది’ అంటూ వైసీపీ ఆశావహులంతా తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆశలలో విహరిస్తున్న వైసీపీ కాపు నేతలు జగన్‌ అనుసరిస్తున్న వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ సాధ్యం కాదంటూ జగన్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. 
 
ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని, అది పూర్తిగా కేంద్రం పరిధిలో అంశమని జగ్గంపేట బహిరంగ సభలో జగన్‌ స్పష్టం చేయడంపై కాపు సామాజికవర్గంలో ఆగ్రహావేశాలకు కారణమైందని ఆ పార్టీకి చెందిన కో-ఆర్డినేటర్లు, ఆశావహులు కలత చెందుతున్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడిన తమ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రం పరిధిలో అంశమంటూ తేల్చిచెప్పడం ద్వారా పార్టీ పట్ల జనంలో అపనమ్మకం ఏర్పడిందని అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
పుండు మీద కారం చల్లినట్టు
‘నలుగురు పెళ్లాలు.. కొత్త కారు మార్చినట్టు పెళ్లాలను మారుస్తారు..’ అంటూ ఈ నెల 23న సామర్లకోటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్‌ వ్యక్తిగతంగా చేసిన విమర్శల దుమారం చల్లారకముందే.. జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్ల హామీ ఇవ్వలేనంటూకుండబద్దలుకొట్టారు. తద్వారా వైసీపీ ఆశావహులు, క్యాడర్‌పై పుండుమీద కారంచల్లినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
కాపు ప్రాబల్యం ఉన్నచోటే వ్యాఖ్యలు
కాగా సామర్లకోట, జగ్గంపేటలలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. 2014 ఎన్నికల్లో పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ తరపున కాపులే తలపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇరు పార్టీల తరపున కాపు సామాజికవర్గీయులే పోటీలో ఉండే పరిస్థితి. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నా జగన్‌ ధైర్యంగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహంలో భాగమేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు.
 
కాపులపై యూటర్న్‌తో బీసీల్లో ఆందోళన
జగ్గంపేట బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారు. మంగళవారం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ జగన్‌ మాట మార్చారని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. కాపు సామాజికవర్గం నుంచి ఎదురవుతున్న తీవ్ర నిరసనలతో జగన్‌ వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్‌ హామీ ఇవ్వలేనని జగ్గంపేటలో జగన్‌ చేసిన ప్రకటన తర్వాత బీసీ సామాజికవర్గంలో వైసీపీపట్ల కాస్త మొగ్గు కన్పించింది. ఇదే తరుణంలో వైసీపీలో బీసీ కీలక నేతలు.. కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లో బీసీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మళ్లీ కాపుల హామీపై మాటమార్చడంతో బీసీ నేతలు.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వైఖరిపై మరోమారు ఆలోచనలోపడ్డారు.
 
కాపులలో వ్యతిరేకత పెరుగుతుండటంతో జగన్‌ యూటర్న్‌ తీసుకుంటే... ఇపుడు బీసీలంతా జగన్‌ వైఖరిని తూర్పారబడతారు.. అంటూ వైసీపీకి చెందిన ప్రముఖ బీసీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిణామాలు రాజకీయంగా ఇంకెన్ని మలుపులకు కారణాలవుతాయోనంటూ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...