Jump to content

Aadhaar Number


Raaz@NBK

Recommended Posts

ట్రాయ్ చైర్మన్ ఆధార్ హ్యాక్‌ వార్తల్లో నిజం లేదు : యూఐడీఏఐ
29-07-2018 18:20:59
 
636684852564987511.jpg
న్యూఢిల్లీ : టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ ఆర్ ఎస్ శర్మ వ్యక్తిగత వివరాలు ఆధార్ సహాయంతో అక్రమంగా బయటపడినట్లు వచ్చిన వార్తలను భారత విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (యూఐడీఏఐ) తోసిపుచ్చింది. ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. శర్మ ఆధార్ నంబరు ఆధారంగా ఆయన వ్యక్తిగత వివరాలను ఆధార్ డేటాబేస్ నుంచి రాబట్టినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వివరించింది.
 
ఆర్ ఎస్ శర్మ గురించి ట్విటర్‌లో ప్రచురించిన సమాచారం ఆధార్ డేటాబేస్ లేదా యూఐడీఏఐ సర్వర్ల నుంచి పొందినది కాదని తెలిపింది. హ్యాక్ చేసినట్లు చెప్తున్న సమాచారం నిజానికి ఇప్పటికే బహిరంగంగా తెలిసినదేనని పేర్కొంది. శర్మ పబ్లిక్ సర్వెంట్ అయినందువల్ల ఆ సమాచారం ఇప్పటికే గూగుల్, ఇతర వెబ్‌సైట్లలో అందరికీ అందుబాటులో ఉందని పేర్కొంది.
 
ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ శనివారం ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆధార్ సురక్షితమని చెప్తూ ‘‘ఇది నా ఆధార్‌ నంబర్‌. చేతనైతే నా వివరాలను బయటపెట్టండి. నాకు ఏదైనా ముప్పు ఉంటుందేమో తేల్చండి’’ అంటూ ఆయన తన 12 అంకెల ఆధార్‌ నంబరును ఆన్‌లైన్‌లో పెట్టారు.
 
ఫ్రెంచి సైబర్‌ నిపుణుడు ఎలియట్‌ ఆల్డర్‌సన్‌ ఈ సవాల్‌కు స్పందించారు. శర్మకు సంబంధించిన కొన్ని వివరాలను బయటపెట్టారు. ఆయన చిరునామా‌, పుట్టిన తేదీ, ప్రత్యామ్నాయ ఫోన్‌ నెంబరు, భార్య పేరు.. మొదలైన వివరాలను వెల్లడించారు. ‘‘దయచేసి ఇలాంటి సవాళ్లు విసరొద్దు. మీరు మీ నంబరును ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తే, మీ వివరాలను కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. అందువల్ల మీకు చాలా ముప్పు. మీ వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. అయితే నేను వాటిని వెల్లడించను, కొన్నింటిని మాత్రమే బయటపెట్టాను’’ అని ఆల్డర్‌సన్‌ పేర్కొన్నారు.
 
 
Tags : Aadhaar, UIDAI, data, HACK, Trai
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...