Jump to content

NTR at Ee Maya Peremito || Pics and Full Speech


NAGA_NTR

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply

కదిలించేసిన ఎన్టీఆర్ ప్రసంగం

thumb.jpg

ప్రస్తుత టాలీవుడ్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ ను మించిన వక్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అతను వేదికెక్కి మైకు అందుకున్నాడంటే అందరూ అరెస్ట్ అయిపోయి అతడి మాటలకు ముగ్ధులైపోవాల్సిందే. మనసుకు హత్తుకునేలా మాట్లాడటంలో అతడికి తిరుగులేదు. గతంలో ఎన్నోసార్లు అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు తారక్. తాజాగా ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్.. మరోసారి తన ప్రసంగంతో అందరినీ కట్టిపడేశాడు. తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన విజయ్ మాస్టర్ గురించి.. ఫైటర్లు.. ఫైట్ మాస్టర్ల కష్టం గురించి ఎన్టీఆర్ కదిలించే మాటలు చెప్పాడు.

ముందు హీరోలు ఫైట్లు అద్భుతంగా చేస్తున్నట్లు కనిపిస్తాం కానీ.. తెరవెనుక అసలు హీరోలు ఫైటర్లు.. ఫైట్ మాస్టర్లే అని ఎన్టీఆర్ చెప్పాడు. వాళ్లు డబ్బుల కోసం ప్రాణాలకు తెగించి కష్టపడతారన్నాడు. తనకు కెరీర్ ఆరంభం నుంచి విజయ్ మాస్టర్ అండగా నిలిచాడని.. ఫైట్లు ఎలా చేయాలి.. అందులో టెక్నిక్ ఏంటి.. గాయాల పాలవకుండా ఎలా మేనేజ్ చేయాలి.. ఈ విషయాలన్నీ ఆయనే నేర్పించినట్లు తారక్ చెప్పాడు.  విజయ్ మాస్టర్ కుటుంబంతో వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉందని.. ఆ కుటుంబం తనను బిడ్డలా చూసుకుందని తారక్ తెలిపాడు. తాను ఒకప్పుడు అంత లావుండటానికి పరోక్షంగా విజయ్ కుటుంబం కూడా కారణమన్నాడు. తన కోసం భారీగా వండి తీసుకొచ్చేవాళ్లని.. అవి తిని తినీ లావెక్కానని ఎన్టీఆర్ చమత్కరించాడు. తనకు మూలిగలు (నల్లి) అంటే చాలా ఇష్టమని.. అవి వండుకుని వచ్చేవాళ్లని చెప్పాడు. విజయ్ మాస్టర్ అంత గొప్ప అందగాడు కాదని.. పైగా ఎప్పుడూ రిస్కులే చేసేవాడని.. అలాంటి వ్యక్తిని ఆయన భార్య ఎలా నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుందో అర్థం కాలేదని ఎన్టీఆర్ అనడంతో ఆడిటోరియంలో నవ్వుల జల్లు కురిసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...