Jump to content

కరుణానిధి


Recommended Posts

చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో పరామర్శించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

 

‘కలైజ్ఞర్‌ కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడా. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పా. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

 

కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఏడీఎంకే నేత వైగో, ఇతర నేతలు కరుణ నివాసానికి చేరుకుని పరామర్శించారు.

కరుణానిధి మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌తో పాటు జ్వరంతో బాధపడుతున్నారని గురువారం వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గోపాలపురంలోని ఆయన నివాసంలో 24 గంటలపాటు ప్రత్యేక వైద్యసిబ్బందితో అనుక్షణం వైద్యసేవలు అందిస్తున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆయన్ని కలిసేందుకు ఎవరినీ అనుమతించవద్దని కుటుంబసభ్యులకు సూచించారు. అయితే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరూ వదంతులు నమ్మొద్దని కోరారు.

Link to comment
Share on other sites

చెన్నై: డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ గోపాలపురంలోని తన నివాసానికి రావాలని స్టాలిన్‌ కబురు పెట్టడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన వారితో సమావేశమయ్యారు.

మరోవైపు కరుణానిధి అనారోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే సహా ఇతర పార్టీల నేతలు కరుణానిధి ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కరుణానిధి బాటలోనే మనమంతా నడవాలి: స్టాలిన్‌

డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. కరుణానిధి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని నడిపించారని... ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలని సూచించారు. కరుణానిధి అధ్యక్షతన పార్టీ ఘన విజయాలు నమోదు చేసిందన్నారు. ప్రజా జీవితంలో 80 ఏళ్లు, పార్టీ పత్రిక సంపాదకుడిగా 75 ఏళ్లుగా కొనసాగుతున్నారని.. కళా రంగంలో 70ఏళ్లు, శాసనసభలో 60 ఏళ్లుగా ఉంటూ అరుదైన గుర్తింపు పొందారని తెలిపారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులందరికీ స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Link to comment
Share on other sites

ala ante Tana edugudala kosam matam peru tho ento mandi pranalu teesina moorkhapu Mooonda koduku Modi gaadu.  modi gadi kanna paapishtodu ledu kada current politics lo. ala ani Modi gaadu pote enta unte enta ani analemu kada. 

 

Link to comment
Share on other sites

13 hours ago, JVC said:

ala ante Tana edugudala kosam matam peru tho ento mandi pranalu teesina moorkhapu Mooonda koduku Modi gaadu.  modi gadi kanna paapishtodu ledu kada current politics lo. ala ani Modi gaadu pote enta unte enta ani analemu kada. 

 

Enduku analemu, anachu. Evadi perspective vaadidi. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...