Jump to content

Parliamentary Standing Committee Meets On AP Reorganisation Act


Recommended Posts

విభజన చట్టం అమలుపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం
27-07-2018 16:15:59
 
636683049586807448.jpg
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీల అమలుపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం చిదంబరం నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీకి విభజన చట్టం అమలు స్థితిగతులపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన, అలాగే 9, 10 షెడ్యూల్లో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్టీసీ ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, dusukochadu said:

Ee chidambaram gadu vaadu chesina gabbu em vasana vastundi ani committe pettada?

No.1 reason for division veedu

aa criminal case lo bokka lo eppudu thostharo ani waiting

Link to comment
Share on other sites

Though division is painful.,, and loss , some thing good is happening.,, Polavaram would hav been a dream for another century 

de centralized development.,,

some industries to Ap and seems.,,, 

 

ee ee papam lo bjp ki kuda equal bagam vundi.,,

 

what they are doing now. Killing mother knowingly.,,,,

Link to comment
Share on other sites

  • 5 weeks later...
కేంద్ర అధికారులపై మండిపడ్డ చిదంబరం
30-08-2018 19:24:41
 
636712538829823337.jpg
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై అమలు తీరుపై పార్లమెంటరీ హోంశాఖ ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. చిదంబరం నేతృత్వంలో గురువారం పార్లమెంటరీ హోంశాఖ ప్లానింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు తీరుపై సమీక్ష జరిపారు. కేంద్ర హోం, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 108లో మూడేళ్లలో సమస్యలు పరిష్కరించాలని ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను చిదంబరం ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటుపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన హామీల అమలులో చిత్తశుద్ధి కరువైందని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ప్రశ్నలకు స్పందించిన అధికారులు.. రైల్వేజోన్‌, ఆర్థికలోటు భర్తీ, ప్రత్యేకహోదా అంశాలు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. కాగా, ఏపీకి రైల్వేజోన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని బీజేడీ ఎంపీ పట్సానీ స్పష్టం చేశారు. విభజన హామీల అమలు తీరుపై త్వరలో నివేదిక తయారు చేయాలని కమిటీ నిర్ణయించింది.
Link to comment
Share on other sites

11 minutes ago, swarnandhra said:

this is constitutional body. pk di pedda farce. but I agree, end result is same☹️

Parliamentary standing committee report can be considered to fast track the progress if a pro-CBN govt comes next.

 

PK is Jr Modiz Mr Jr Feku

Link to comment
Share on other sites

అమలు ఇలాగేనా?
31-08-2018 03:18:33
 
636712823149013776.jpg
  • పార్లమెంటు చట్టాన్నే పట్టించుకోరా?
  • అధికారాలున్నా ఎందుకు చేయరు?
  • నిధులు ఎందుకు ఇవ్వడం లేదు?
  • మూడేళ్లలో అన్నీ పరిష్కరించాలి!
  • మరి... ఇంకా ఏం చేస్తున్నారు!
  • ‘లోటు’ మీరు చెప్పిందే ఆఖరా?
  • మరింత ఇచ్చే అవకాశముందా?
  • విభజన హామీలపై చిదంబరం ప్రశ్నలు
  • కేంద్ర అధికారుల తడబాటు
  • వాడివేడిగా పార్లమెంటరీ కమిటీ భేటీ
  • హోదాపై నిలదీసిన రామ్మోహన్‌
  • రెవెన్యూ లోటు, జోన్‌పైనా నిలదీత
  • జోన్‌పై అభ్యంతరం లేదన్న బీజేడీ
 
‘విభజన హామీల అమలు ఎందాకా వచ్చింది? ఏమిటీ నిర్లక్ష్యం?’ అంటూ శరపరంపరగా ఎదురైన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక కేంద్ర ఆర్థిక, హోంశాఖ అధికారులు నీళ్లు నమిలారు. ‘చేస్తున్నాం, పరిశీలనలో ఉంది’ అంటూ జవాబులు దాటవేశారు.
 
 
న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం అమలు స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం ఢిల్లీలో సమావేశమైంది. అధికారులపై కమిటీ చైర్మన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన చట్టంలోని ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ... ఏది ఎందాక వచ్చింది, నెరవేర్చడంలో ఇబ్బంది ఏమిటి, ఎందుకు అమలు చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ తీరు బాగలేదు. ఏది అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. వ్యవహారాలు నడిపించేది ఇలాగేనా? అన్ని అధికారాలున్నా ఎందుకు చేయడం లేదు? పార్లమెంటు ఆమోదించిన చట్టం అమలు చేసే బాధ్యత మీకు లేదా?’’ అని చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కమిటీ సభ్యులు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, బీజేడీ ఎంపీ ప్రసన్న కుమార్‌ పట్‌సాని, ఎస్పీ ఎంపీ నీరజ్‌ శేఖర్‌ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
 
 
హోదాపై నిలదీసిన రామ్మోహన్‌
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు... ఎప్పట్లాగానే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల హోదా ఇవ్వలేకపోయామని అధికారులు బదులిచ్చారు. దీనిపై రామ్మోహన్‌ నాయుడు తీవ్రంగా స్పందించారు. ‘‘ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఇంకా రానే రాలేదు. పార్లమెంటులో హామీ ఇచ్చిన తర్వాత ఎప్పటికో ఆ సిఫారసులు వచ్చాయి. అయినా, హోదా ఇవ్వవద్దని తాము ఎక్కడా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులే అనేక సందర్భాల్లో చెప్పారు. పైగా... ఆర్థిక సంఘం సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనలేవీ లేవు. తిరస్కరించే అధికారం కూడా ఉంటుంది. పరిస్థితులు ఇలా ఉండగా... నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదు?’’ అని రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించినట్లు తెలిసింది. రెవెన్యూ లోటు లెక్కలు కుదించడంపైనా కేంద్ర అధికారులు పాతపాటే వినిపించారు.
 
 
‘‘రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలకు ఖర్చయిన నిధులను కూడా చేర్చి లోటు మొత్తాన్ని పెంచింది. అంత ఇవ్వలేం. నిజంగా లోటు ఎంత ఉంటుందో లెక్కించాం. అందులో చాలా వరకు చెల్లించేశాం’’ అని చెప్పారు. ‘అంటే మీరు చెప్పిందే ఆఖరా? ఇంకా ఏమైనా పెంచే అవకాశం ఉందా?’ అని చిదంబరం ప్రశ్నించగా, అధికారులు మౌనం వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు జోక్యం చేసుకొని... రెవెన్యూ లోటులో పాత బకాయిలు, పీఆర్‌సీ బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను చేర్చలేదని తెలిపారు. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినట్లు సమాచారం.
 
 
అలాగే, విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని, కొత్త విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ఎంపికలను ఇచ్చామని, ఇంకా రాష్ట్రం నుంచి సమాధానం రాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ విషయంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌లో కేంద్ర వాటాను ఏపీ విషయంలో ఎందుకు భరించడంలేదని చిదంబరం ప్రశ్నించారు. విద్యా సంస్థల శాశ్వత భవనాల నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై రామ్మోహన్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ‘‘ఇప్పుడు మీరు ఇస్తున్న లెక్కన నిధులు ఇస్తే ఆ నిర్మాణాలు ఏళ్లు గడిచినా పూర్తి కావు. ఏ విద్యా సంస్థ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో నిర్దిష్టంగా తేదీలు చెప్పండి’’ అని కోరారు.
 
 
ఇలాగేతై కష్టం... ఆపై మీ ఇష్టం!
విభజన హామీల అమలుకు నిధులు ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. స్థాయీ సంఘం సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని, తద్వారా అవి రికార్డుల్లో నమోదవుతాయని ఆదేశించారు. మొత్తంగా... ఏ ఒక్క అంశంపైనా ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు. ‘‘హామీల అమలు ప్రక్రియ నడుస్తోందని మీరు చెబుతున్నారు. సరే... మీరు చెప్పింది రాసుకున్నాం. నివేదిక ఎలా రూపొందించాలో మాకు తెలుసు’’ అని అంటూ చిదంబరం ఈ సమావేశాన్ని ముగించారు.
 
 
అభ్యంతరం లేదు!: జోన్‌పై బీజేడీ
విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని అధికారులు వివరించారు. దీనిపై బీజేడీ ఎంపీ పట్‌సానీ స్పందిస్తూ... ‘‘విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం లేదు. జోన్‌ ఇచ్చేయండి’’ అని సూచించారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇంతకాలం ఒడిసా అభ్యంతరం చెబుతోందనే సాకు చూపించారు. ఇప్పుడు ఆ రాష్ట్రమే అభ్యంతరం లేదంటోంది. జోన్‌ ఇచ్చేసేయండి. ఈ అంశంపై సానుకూలంగా ముందుకెళ్లండి’’ అని కోరారు.
 
 
మూడును ఆరు చేయాల్సింది!
షెడ్యూల్‌ 9,10 సంస్థల విభజనలో జాప్యంతోపాటు పలు వివాదాలు తలెత్తడంపై చిదంబరం తీవ్రంగా స్పందించారు. ‘‘విభజన చట్టం అమల్లో ఇబ్బందులు తలెత్తితే వాటిని మూడేళ్లలోపు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పరిష్కరించవచ్చు. విభజన చట్టంలోని సెక్షన్‌ 108 ఇదే చెబుతోంది. మూడేళ్లు గడిచిపోయాయి. మూడేళ్లను ఆరేళ్లుగా పార్లమెంటులో చట్టాన్ని సవరించుకోవాల్సింది. అప్పుడు మేం కూడా మిమ్మల్ని ఇలా అడిగే అవకాశం ఉండేది కాదు’’ అని ఎద్దేవా చేసినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...