Jump to content

Pulasa


Recommended Posts

మార్కెట్‌కు గోదావరి పులసలు 
81500753420_625x300.jpg

పి.గన్నవరం : పులసల సీజన్‌ ప్రారంభమైంది... గోదావరి నుంచి రోజూ భారీగా వరద నీరు సముద్రంలో కలుస్తుండడంతో మత్స్యకారులు పులసల వేట సాగిస్తున్నారు. పి.గన్నవరంలోని మార్కెట్‌కు బుధవారం గోదావరి పులసలు విక్రయానికి వచ్చాయి. 1250 గ్రాముల బరువుగల పులస రూ.3,300, 500 గ్రాముల బరువుగల పులస రూ.1,600 చొప్పున విక్రయించారు. గోదావరికి ఎర్రనీరు తగిలి, తేట నీరయ్యే వరకు అంటే సుమారు మూడు నెలలపాటు పులసల వేట సాగుతుంది. గోదావరికి వరదనీరు తగిలి సుమారు ఇరవై రోజులవుతోంది. వరద నీరు ఓ మోస్తరుగానే వచ్చింది. నాలుగు రోజుల కిందట ధవళేశ్వరం బ్యారేజి నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సీజన్‌లో ఈ రోజు వరకు ఇదే ఎక్కువ నీరు. గోదావరి వరద నీరు సముద్రంలోకి ఎక్కువ వడిగా వెళ్లినపుడు ఆ ప్రవాహ వేగానికి పులసలు గోదావరి నదీపాయల్లోకి చేరుతాయి. వరద తగ్గినప్పటి నుంచి మత్స్యకారులు వాటిని వేటాడతారు. ధవళేశ్వరం బ్యారేజి దిగువన వశిష్ఠ,. గౌతమి, వైనతేయ గోదావరనదీపాయలున్నాయి. ఇవి వివిధ ప్రాంతాల్లో కోనసీమలో సముద్రంలో కలుస్తాయి. వరదనీరు సముద్రంలోకి కలిసే సమయంలో పులసలు ఆయా గోదావరి నదీపాయల్లోకి ఎదురీదుతూ వస్తాయి. ఇలా వరదనీటిలో లభ్యమయ్యే ఈ పులసలకు ఎనలేని రుచి వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజికి దిగువన సఖినేటిపల్లి, పి.గన్నవరం, రాజోలు, అయోధ్యలంక, పెదమల్లంక, బోడసకుర్రు, కరవాక, గోగన్నమఠం, గంటి, నారాయణలంక, కేదార్లంక, వానపల్లి, వాడపాలెం, అద్దంకివారిలంక, కోటిపల్లి, యానాం, గోడితిప్ప, ఓడలరేవు, జొన్నల్లంక, లంకలగన్నవరం, కె.ఏనుగుపల్లి, మానేపల్లి, నాగుల్లంక తదితర  ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆయా గోదావరి నదీపాయల్లో పులసల వేట సాగిస్తారు. సుమారు మూడు నెలలపాటు ధవళేశ్వరం బ్యారేజికి దిగువ మొదలుకొని కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 200 బోట్లలో సుమారు 600 మంది మత్స్యకారులు పులసల వేటలో నిమగ్నమవుతారు.

వంతెనల వద్ద ఎక్కువగా... 
కోనసీమలో కొందరు వివిధ వంతెనల వద్ద విలసలను పులసలుగా విక్రయిస్తుంటారు. ఈ తరహా వ్యాపారం ఎదుర్లంక, చించినాడ, బోడసకుర్రు, సిద్ధాంతం, రావులపాలెం తదితర వంతెనల వద్ద సాగుతుంది. వివిధ వాహనాల్లో వెళ్లే దూరప్రాంతాలకు చెందిన వారికి వీటిని పులసలుగా చెప్పి విక్రయిస్తుంటారు.

రూ.వేలల్లో ధర 
గోదావరి పులసలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పులస వలలో చిక్కితే మత్స్యకారులకు ఆ రోజు పండగే. ఎందుకంటే వీటి ధరలు రూ.వేలల్లో ఉంటాయి.  కిలో బరువున్న పులస రూ.మూడు వేలు పైనే పలుకుతుంది. పావుకిలో ఉంటే రూ.600 నుంచి రూ.800లకు విక్రయిస్తారు. గత ఏడాదిలో రెండు కిలోల చేపను ఆరేడు వేల రూపాయల వరకు విక్రయించారు. మార్కెట్‌కు ఈ చేపలు తక్కువగా వచ్చినపుడు కొనుగోలుదారులు ఎక్కువైతే ధర అమాంతం పెరగిపోతుంటుంది. ఒకరు బేరమాడుతుండగానే మరొకరు ధర పెంచేసి ఈ చేపను ఎగరేసుకుని పట్టుకుపోతారు. చెనల చేప(ఆడచేప), గొడ్డుచేప(పోతు చేప) ఇలా వివిధ పేర్లతో వీటిని విక్రయిస్తారు. చెనల చేపకు డిమాండు ఎక్కువగా ఉంటుంది. అయితే... కొందరు చెనల చేపకంటే గొడ్డు చేపకే ప్రాధాన్యమిస్తారు. దానికంటే దీనికి ఎక్కువ రుచి ఉంటుందని మరీ చెప్పి విక్రయిస్తారు.

అసలు ముసుగులో విలస.. 
గోదావరి పులసల సీజన్‌లో ఒడిశా పులసలు విరివిగా అమ్ముడవుతుంటాయి. చేపలు విక్రయించే కొందరు అక్కడి నుంచి విలసలు తీసుకొచ్చి వాటిని గోదావరి పులసలుగా నమ్మించి విక్రయిస్తారు. ఒడిశా నుంచి రోజూ వ్యాన్‌లో ఈ చేపలు యానాం, అమలాపురం, రావులపాలెం, రాజోలు వంటి ప్రాంతాలకు ప్రత్యేక బాక్సుల్లో వస్తుంటాయి. వాటిని ఇక్కడ చేపలు విక్రయించే కొందరు వ్యాపారులు కొనుగోలు చేసి గోదావరి పులసలుగా అమ్మేస్తుంటారు. గోదావరినదిలో లభించే పులసను ఐస్‌లో ఉంచరు. ఎందుకంటే అది దొరికితే వెంటనే అమ్ముడైపోతుంది. పైపెచ్చు ఐస్‌లో పెడితే చప్పబడిపోతుంది.

Link to comment
Share on other sites

For those in USA: if you want to taste Pulasa, you can buy it from any Bangla stores selling fish. Ask for Hilsa. Its anywhere between $10-$20 per pound depending on where you are. Cheaper than in India!

Link to comment
Share on other sites

@RKumar 

Not sure about Bangalore. Talk to Bengali friends and find from where they buy Hilsa. Hilsa is pulasa. Its not easy to identify difference between pulasa n vilasa. Both are same. Vilasa in sea after entering river becomes pulasa.  one blind identification is if you don’t find eggs in the fish, it is not pulasa. 

Link to comment
Share on other sites

One common question..... we are catching the fish that is full of eggs.... that means we are destroying the fish that enter Godavari for breeding ? Just asking.... do these fish spawn multiple times after entering the Godavari river? Or just one spawn ?

 

and also, will they return back to sea after spawning ? Or will they die after spawning ? 

 

Just curious to know

Link to comment
Share on other sites

Just searched online and found out that this species is overfished (mainly from Bangladesh). Earlier there was a off period where fishermen never fished in a season where the juveniles will flow to sea.... they used to ban fishing on those periods just to make sure young fish go back to sea and come back next season for spawning.... but now no one cares about that ban and started catching medium sized fishes also 

Link to comment
Share on other sites

@sskmaestro 

Whichever escapes from us, goes back to Sea after spawning.  If we think about it, that makes me sad. Here in US, Bangla ( Bangladeshi ) stores offer variety of frozen fish including Hilsa. Wild salmon also is another fish that travels from sea to river to spawn.

Boccha ( Catla), Ragindi ( Rohu ) are fresh water fish that we are so used to in Andhra. No Indian store sells them except Bangla stores. But the one they sell are very big. Ranging from 6lbs to 10lbs. 3 or 4 friends can buy one big fish and share. Good thing is they cut the fish to the order. 

Link to comment
Share on other sites

27 minutes ago, MCR said:

@sskmaestro 

Whichever escapes from us, goes back to Sea after spawning.  If we think about it, that makes me sad. Here in US, Bangla ( Bangladeshi ) stores offer variety of frozen fish including Hilsa. Wild salmon also is another fish that travels from sea to river to spawn.

Boccha ( Catla), Ragindi ( Rohu ) are fresh water fish that we are so used to in Andhra. No Indian store sells them except Bangla stores. But the one they sell are very big. Ranging from 6lbs to 10lbs. 3 or 4 friends can buy one big fish and share. Good thing is they cut the fish to the order. 

I am not against hunting Pulasa. It’s Nature’s gift to fish lovers. But what makes me sad is hunting it outside breeding season. Remember one thing nobody spends time and money to cultivate these fish....  And the blame has to be on Bangladesh for over fishing their National fish! Surprisingly, Pulasa export is more than 1% of Bangladesh GDP.

Link to comment
Share on other sites

On 7/27/2018 at 10:34 PM, sskmaestro said:

I am not against hunting Pulasa. It’s Nature’s gift to fish lovers. But what makes me sad is hunting it outside breeding season. Remember one thing nobody spends time and money to cultivate these fish....  And the blame has to be on Bangladesh for over fishing their National fish! Surprisingly, Pulasa export is more than 1% of Bangladesh GDP.

Fisherman here voluntarily ban fishing in rainy season as it is the breading season of fishes. AP government in my sincere opinion should ban the fishing of Pulasa during this season. This is madness. I also understand they deliver the stocks from Bengal and Bangladesh to AP for a better price to cash Pulasa madness.

Link to comment
Share on other sites

పులసొచ్చిందోచ్‌!

 

ఏండీ... బాగున్నారా...నా పేరు ఇలసండి! మీరు పులసని పిలుచుకుంటారు కదండీ అదండీ నేను. నేనెక్కడో న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో పుట్టినా ... ఆ గోదారోళ్ల వల్ల బాగా పేరెల్లిపోయానండి వాళ్ల వల్ల ఇప్పుడు తెలుగోళ్లంతా మేము వాళ్ల సొంత సేపలని అనుకుంటుంటారండి పెళ్లాల మెళ్లో పుస్తెలమ్మయినా మమ్మల్ని కొనుక్కు తినాలని అనుకుంటారంటండీ...అంతగొప్ప రుచంటండీ మాది
మేం ఒక్కళ్లం చిక్కినా అండీ... పండగ చేసేస్కుంటారండీ ఆ గోదావరి మరకాల్లోళ్లు (జాలర్లు). మేం దొరికిన రోజు చూడండి ఇక మార్కెట్‌లో ఎంత తొడతొక్కిడి ఉంటాదో. మాక్కావాలంటే మాక్కావాలంటూ యేలకు యేలు పెట్టి తీస్కెళ్తుంటారండీ. ఆయ్‌... మంచి రేటిస్తామని ఎక్కడెక్కడి నుంచో పోన్లొస్తుంటాయండీ. గోదారి జిల్లాల్లో కొత్త అల్లుళ్లయితే మాకా చేప పులుసు కావాల్సిందేనని మంకు పట్టు పడతారంటండీ.. నిజం సెప్పాలంటేనండీ... మేం సముద్రంలో ఉన్నప్పుడు మామూలు సేపలమేనండీ. మరి ఇంత గొప్ప రుసి ఎక్కడి నుంచి  వచ్చిందనుకుంటున్నారు... ఆ గోదారి తల్లి వల్లేనండీ. ఎక్కడో న్యూజీలాండ్‌ నుంచి ఈదుకుంటూ వస్తామాండీ... ఈ గోదారి దగ్గరకు రాగానే ఆ నీళ్లలో ఈదాలనే కోరిక పుట్టదాండీ మాకు. ఈ నీళ్లలో ఈదుతూ ఈదుతూ... ఆ ఎర్రనీళ్లు తాగుతూ తాగుతూ కాస్త ఒళ్లు సేస్తామండి. మా పొట్ట కింద సెన పెరుగుద్ది కదండీ... అదండీ ఇంత రుసికి అసలు కారణం. అదంతా గోదారి నీళ్లల్లో ఉండే పోషకాల వల్లేనంటండీ అట్టా ఈదుతూ ఈదుతూ ధవళేశ్వరం వరకూ ఈదుతామండీ ఇక్కడ జాలర్లు పట్టేసుకుని మీకు అమ్మేస్తారండీ ఇంకా ముందే యానాం, కోటిపల్లిల్లో కూడా అప్పుడప్పుడు వల్లో పడుతుంటాం కానీ, అక్కడంత రుసిగా ఉండమండీ... ఎంత ఎర్రనీళ్లు తాగితే అంత రుసన్నమాట...
గోదారికి వరదొచ్చే ఆగస్టు, సెప్టెంబరు నుంచి దీపాళి అమాస వెళ్లే వరకు అయితే మాకు పండగండీ.. ఆ వరద నీళ్లలో ఈదుతూ కేరింతలు కొడతామండీ...అదే టయింలో మీ వాళ్లు మమ్మల్ని పట్టేసుకుని కూరొండుకు తినేస్తారండీ...
ఇప్పుడు కాదులేగానండీ...
ఒకప్పుడు చూడాలండి మా దర్జా...
మేము, మా చుట్టాలం చాలామందిమి ఇక్కడకు వచ్చే వాళ్లమండీ...
కానీ ఈ మధ్య మా వాళ్లెవరూ ఇటు రావడం లేదండీ
గోదారి సముద్రంలో కలిసే ప్రాంతంలో చమురు కోసం తవ్వకాలు చేస్తున్నారంట కదండీ
ఆ తవ్వకాల అదురుకి మా వాళ్లందరూ బెదిరిపోయి అటు ఒడిశానో, బంగ్లాదేశో యెళ్లి అక్కడోళ్లకు చిక్కుతున్నారండీ.
ఇంకా చాలా దేశాల్లో మేం దొరుకుతుంటామండి
కొన్ని దేశాల్లో అయితే మమ్మల్ని వాళ్ల దేశపు సేపగా ఎన్నుకున్నారంటండీ
ఎన్ని దేశాల్లో మేం ఉన్నా... ఎన్ని నదుల్లో ఈదినా ఆ గోదారి నీళ్లలో ఉండే రుసి మాకెక్కడా దొరకదండీ... ఈ నీళ్లను తాగిన మా రుసి మీరెక్కడా దొరకదండీ...
అందుకే మమ్మల్ని మీ తెలుగోళ్ల సేపగా ప్రకటించమని కోరుతున్నామండీ...
ఎందుకంటే మీ గోదారంటే మాకు ఇష్టం... మేమంటే మీకు ప్రాణవండీ...
సరేనండయితే...
మా గురించి మరికొన్ని విశేషాలు ఇనేసెళ్లిపోండి...

 
అద్భుతమైన రుచితో భోజనప్రియులను ఆకర్షించే గోదావరి పులసకు సముద్రంలో దొరికే ఇలసకు తేడాను కనుక్కోవడం కొత్తవారికి సాధ్యం కాదు. ఎందుకంటే రూపురేఖలన్నీ ఒకేలా ఉంటాయి. ఇదే అదనుగా ఇలసలను తీసుకొచ్చి గోదావరి నదీతీర ప్రాంతాల్లో పులసలుగా చెప్పి విక్రయిస్తుంటారు. సీజన్‌లో క్రమం తప్పకుండా కొనుగోలు చేసేవారు పులసలను ఇట్టే గుర్తుపట్టేస్తారు. సముద్రంలో దొరికే చేపలకు ఛాయ తక్కువగా ఉంటే... గోదావరి పులస తెల్లగా ఎండలో వెండిలా ధగధగా మెరిసిపోతుంటుంది.

 

పాతరోజుల్లో అయితే కుమ్ముటాముదం అని ఉండేది. దాన్ని కూర దించేముందు నాలుగు చుక్కలు వేసేవారు. ఈ ఆముదాన్ని ఇంట్లోనే తయారుచేసుకుంటారు. ఇంకొందరయితే ఆవకాయలో ఉండే ఎర్రని నూనెని కూడా ఇందులో వేస్తారు. అది కూడా కూర రుచిని పెంచుతుంది. 
ఈ చేపలు గోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతాల నుంచి నదిలోకి ప్రవేశిస్తాయి. అంతర్వేదిపాలెం, బెండమూర్లంక, ఓడలరేవు, యానాం ప్రాంతాల్లోని సంగమ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. అలా వాటి ప్రయాణం ధవళేశ్వరం వద్ద ఉన్న బ్యారేజ్‌ వరకూ ఉంటుంది. గోదావరి తీపినీటిలో సంతానోత్పత్తి కోసం నదిలో ఎంతో దూరం ఎదురు ఈదుకుంటూ వెళ్లే ఈ మత్స్యరాజం లార్వాను నీటిలో వదులుతుంది. తరువాత పులస జీవితచక్రం పూర్తవుతుంది. నీటిలో ఉన్న లార్వా గుడ్లు చేప పిల్లలుగా మారి తిరిగి సముద్ర జలాల్లోకి చేరుకుంటాయి. సముద్రంలో దొరికే ఇలసతో పోల్చితే గోదావరికి వచ్చిన పులస అయిదారు రెట్ల ఎక్కువ ధర పలుకుతాయి. ఎందుకంటే చేప ఒకటే అయినా సముద్రంలో లభించే వాటితో పోల్చితే గోదావరిలో దొరికే పులస రుచే వేరని చెప్తారు. కిలో, కిలోన్నర బరువులో దొరికే ఈ చేప ధర అసాధారణంగా ఉంటుంది. రూ.2 వేల నుంచి రూ.5వేలు పెట్టడానికి కూడా సిద్ధపడుతుంటారు.

- మేకల నాగేశ్వర్రావు, రాజమండ్రి
* ఈ కూరలో అల్లం, కొత్తిమీర వేసుకోకూడదు. ఇవి కూర రుచిని పొగొట్టేస్తాయి కాబట్టి. వీటిని దూరంగానే ఉంచాలి.
* గోదావరి జిలాల్లో రామల దాకలు, పులస దాకలు అని ఉంటాయి. ఇవి వెడల్పుగా ఉంటాయి. వీటిల్లో వండితే చేప విరగకుండా ముక్క చెదరకుండా వస్తుంది. నాలిక గరిటె, గుంట గరిటె అని ఉంటాయి. పులుసు తీయడానికి గుంట గరిటెలు, ముక్కలు తీయడానికి వెడల్పుగా ఉండే నాలిక గరిటెలు వాడతారు. 

కూర తయారీ

 

తయారీ విధానం: పులస చేప- కేజీ, ఏదైనా గానుగ నూనె- 200గ్రా, బెండకాయలు- ఎనిమిది, పచ్చిమిర్చి పెద్దవి- ఎనిమిది, ఉల్లిపాయలు- నాలుగు, ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, వెల్లుల్లిగడ్డ- ఒకటి, వెన్నపూస- 100గ్రా, చింతపండు- 150 గ్రా, కారం- రెండు పెద్ద చెంచాలు, కల్లుప్పు- తగినంత 
తయారీ: సాధారణంగా పులసలని మట్టిదాకల్లోనే వండాలంటారు. దాంట్లోనే ఆ రుచి వస్తుందని అంటారు. మీ వీలుని బట్టి పాత్రను ఎంచుకున్న తర్వాత నూనె పోసి వేడిచేసుకోవాలి. అందులో ముందుగా బెండకాయలు, పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయరేకలు వేసి రుబ్బుకోవాలి. నూనెలో వీటిని కమ్మని వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత చేపముక్కలు వేసి వేయించుకోవాలి. పసుపు, కారం, కల్లుప్పు వేసి ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో పులుసుతో పాటూ లీటర్‌ నీళ్లు పడతాయి. ఈ పులుసు మరుగుతున్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కనీసం అరగంటపాటు సన్నసెగమీద మగ్గించాలి. కూర దగ్గరకు వస్తున్నప్పుడు వెన్నపూస వేసుకోవాలి. 

- అడ్డగళ్ల భగత్‌సింగ్, న్యూస్‌టుడే, పి.గన్నవరం
 
 

మరిన్ని

Link to comment
Share on other sites

Puasa taste peaks untadi - cook time lo 5-6 houses varaku smell vastadi. Correct pulasa aithe. That smell gives more taste to fish.

 

Goddu chepa (male) tastes better than sona chepa *(female)

 

And other bro worrying ob their breeding. Valaki dorikevi 20% max. Flooding godavari lo fishing easy kadu.

 

 

Vilasa means samudram lo unde pulasa.

 

Ice lo petti vastay vilasa to godavari district. If you want to taste correct puasa don't go to market go to river and take them directly from fisherman.

 

Tinna tarvata kuda hand aa keka smell untadi.

 

Bangalore lo more stores lo dorukutundi called as Hilsa. Idi pulasa kadu vilasa.costs around 750/kg

 

Link to comment
Share on other sites

7 hours ago, Naren_EGDT said:

Puasa taste peaks untadi - cook time lo 5-6 houses varaku smell vastadi. Correct pulasa aithe. That smell gives more taste to fish.

 

Goddu chepa (male) tastes better than sona chepa *(female)

 

And other bro worrying ob their breeding. Valaki dorikevi 20% max. Flooding godavari lo fishing easy kadu.

 

 

Vilasa means samudram lo unde pulasa.

 

Ice lo petti vastay vilasa to godavari district. If you want to taste correct puasa don't go to market go to river and take them directly from fisherman.

 

Tinna tarvata kuda hand aa keka smell untadi.

 

Bangalore lo more stores lo dorukutundi called as Hilsa. Idi pulasa kadu vilasa.costs around 750/kg

 

Vilsa also same taste annai?? 

So Hilsa US lo kuda dorukudda??  US batch confirm..

@AP_RaituBidda

Link to comment
Share on other sites

@AP_RaituBidda @niceguy 

dorukutundi. go to any bangla(bangladeshi) stores and ask for hilsa. Per pound it can be anywhere between 10$ (in LA: Aladin sweets and market and in Austin: Desi Meat Market)  to 20$(in San Diego: Ariana produce and cuisine). A lot cheaper than in India. Some afghan/indian stores also sell hilsa.

it won't be more than 4 pounds in size.

Link to comment
Share on other sites

27 minutes ago, MCR said:

@AP_RaituBidda @niceguy 

dorukutundi. go to any bangla(bangladeshi) stores and ask for hilsa. Per pound it can be anywhere between 10$ (in LA: Aladin sweets and market and in Austin: Desi Meat Market)  to 20$(in San Diego: Ariana produce and cuisine). A lot cheaper than in India. Some afghan/indian stores also sell hilsa.

it won't be more than 4 pounds in size.

I know pina  post   lo cheppaga  dorukutundi ani

Link to comment
Share on other sites

18 minutes ago, Hello26 said:

 

dorukuddi ani meeru and others answered. But, Is the taste of Pulasa = taste of Vilasa is also one of his questions (mine too)...experts, please answer

Same pulasa laane untundi nenu Chala saarlu  intiki techi cook chesaa and  tinna kooda

Link to comment
Share on other sites

1 hour ago, Naren_EGDT said:

No .. vilasa taste less than pulasa.
Asalu taste vachedi when it enters godavari river flooding red water.

 

 

Vilasa kuda godavari lo dorkiddi non flood time lo sea nunchi river ki vachevi.

 

 

 

 

Godavari Pulasa specialist Naren uncle...itta pulasa gurinchi publicity cheyyatame kaakunda.....

mee godavari ki pilichi pulasa tho athidhyam ivvochchuga...Brahmi pleaseee.gif

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పులసలొచ్చేశాయ్‌.. ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
26-08-2018 11:59:44
 
636708815820482329.jpg
దేవీపట్నం, తూ.గో.: మండల కేంద్రమైన దేవీపట్నం మల్లాడి రామకృష్ణ అనే మత్స్యకారుడికి శనివారం మధ్యాహ్నం వేటకు వెళ్ల గా దేవీపట్నం, అగ్రహారం గ్రామాల మధ్య 11 పులస చేపలు లభ్యమయ్యాయి. వీటి ధర సుమారు రూ.30వేలు వర
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...