Jump to content

Desi Cow Milk in Hyderabad


Jaitra

Recommended Posts

దివ్యా రెడ్డి...చదివింది ఇంజనీరింగ్‌....! కానీ... ఆ సబ్జెక్టుతో ఏమాత్రం సంబంధం లేని డెయిరీ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌ అయ్యారామె. ప్రస్తుతం 200 ఆవులున్న ‘గోశాల’ను ఆమె నిర్వహిస్తున్నారు. పిల్లలకు ఇస్తున్న పాలలో ప్రాణాంతకమైన రసాయనాలున్నాయని తెలిసి తన బిడ్డలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పాలను అందివ్వాలనుకున్నారామె. ఆ ప్రయత్నంలో భాగంగా పాల ఉత్పత్తిపై పరిశోధన చేశారు. అలా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం 20 ఆవులతో ప్రారంభమైన ఆమె కృషి నేడు గోశాలగా రూపుదిద్దుకుంది. ‘క్లిమామ్‌’ పేరుతో స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యి, సలాడ్స్‌, గోవు పేడతో చేసే పలు వస్తువులు అందిస్తున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లో..
 
 
‘‘చిన్నారులకు చదువులో నేర్పే తొలి పలుకులు అమ్మా...ఆవు... ! ఇవి రెండూ భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన ‘జీవన’ సత్యాలు. అమ్మ, ఆవు రెండూ మనిషి వందేళ్ల జీవితానికి ప్రాణాధారాలు. జీవితాన్ని అమృతమయం చేసే ప్రకృతి స్వరూపాలు. ‘గంగి గోవు పాలు గరిటడైనను చాలు’ అన్న ఒక్క మాట చాలు ‘గోసంపద’ గొప్పతనాన్ని చెప్పడానికి. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.
ఇలా ఎందుకంటున్నానంటే ‘గోశాల’ను ప్రారంభించాలన్న ఆలోచన నాకు ముందర లేదు. కేవలం నా పిల్లలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వడం కోసం ఆవులకు దగ్గరయ్యాను. ఇప్పుడు అవే నా లోకంగా జీవిస్తున్నా.
 
 
గో ఆధారిత వస్తువులెన్నో...
గోఆధారిత ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకోవడానికి రెండవసారి గుజరాత్‌కి వెళ్లాను. అక్కడ దాదాపు నాలుగువేల కిలోమీటర్లు తిరిగాను. రాజస్తాన్‌ బోర్డర్‌లోని పద్మేడాలో ప్రపంచంలోనే అతి పెద్ద గోశాల ఉంది. అక్కడ లక్ష ఆవులున్నాయి. అక్కడ గోఆధారిత అంటే ఆవుపేడ, మూత్రంతో చేసిన పిడకలే కాదు, వినాయకుడిలాంటి రకరకాల దేవుని విగ్రహాలు, అగరొత్తులు, సబ్బులు, యాంటీ రేడియేషన్‌ స్టిక్స్‌, క్లాక్స్‌, బొమ్మలు తయారు చేస్తారు. పద్మేడాలో వీటి తయారీకి సంబంధించి చాలామందికి శిక్షణ ఇస్తారు. ఇవి పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో సహకరిస్తాయి. సేంద్రియ వ్యవసాయానికే కాకుండా గోఆధారిత వస్తువుల వినియోగం పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. త్వరలో మా సిబ్బందిని కూడా గోఆధారిత వస్తువుల శిక్షణ కోసం పద్మేడా పంపిస్తాం..
Divya-reddy--big-size.jpg పిల్లలకు స్వచ్ఛమైన పాలకోసం...
పిల్లలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలనే ఆలోచన ‘గోశాల’ నిర్వహణకు దారితీసింది. గోశాల నిర్వహణ నాలో చాలా మార్పు తెచ్చింది. నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలో ఓర్పు, అందరి పట్ల ప్రేమతో పాటు నిండైన వ్యక్తిత్వం సైతం రూపుదిద్దుకుంది. ఒకప్పుడు ఇంటింటా గోమాతగా హారతులు అందుకున్న మన దేశీయ ఆవుల సంఖ్య క్షీణించిపోతున్నాయని తెలిసి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అర్థమైంది. అంతర్జాతీయంగా బ్రెజిల్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర ఎన్నో దేశాలలో మన దేశీయ ఆవులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ... మనం చేతులారా వాటిని పోగొట్టుకుంటున్నాం. మన దేశీ ఆవుల ‘సంపద’ను పునరుజ్జీవింపచేసుకోవాలి. ఆ అవగాహనను పెంపొందించే దిశగా మా గోశాలలోని ఆవు మూత్రం, పేడతో చేసిన సేంద్రియ ఎరువులను అందిస్తూ తోటి రైతులను చైతన్య పరుస్తున్నాం. రసాయనాలు, పురుగు మందులు వాడితే ప్రమాదకరమైన జబ్బులతోపాటు భూసారం దెబ్బతింటుందని, అది ప్రజల జీవనసరళిపై, ప్రకృతిపై ప్రభావం చూపుతుందని తెలియచెబుతున్నాం.
 
పాలు విషతుల్యం అవుతున్నాయి...
రకరకాల రసాయనాలు, హార్మోన్‌ ఇంజక్షన్ల వల్ల బయట అందిస్తున్న పాలు విషతుల్యం అవుతున్నాయి. పైగా ప్రిజర్వేటివ్స్‌ కలిపి రెండుమూడు రోజులు నిలువ ఉన్న పాలను ప్రజలకు అందిస్తున్నారు. దీనివల్ల కేన్సర్‌ వంటి జబ్బులు బారిన పడే ప్రమాదం ఉందని తెలుసుకున్న నేను ఈ సమస్యను దాటడం ఎలా? నా పిల్లలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పాలను ఇవ్వడం ఎలా? అని ఆలోచించాను. ఆ క్రమంలోనే పాలపై అధ్యయనం చేశాను. అప్పుడు నాకు తెలిసింది ఎ2 పాలు మంచివని. అందులో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని. ఎ2 పాలు అంటే దేశీ ఆవు పాలు అని అర్థం. ఎ2 పాలనే తాగాలని ప్రపంచమంతా కోడై కూస్తోంది. పాలలో ఎ1 పాలు కూడా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్‌ పాలు. ఇందులో కేన్సర్‌ కారకాలు ఉన్నాయి. ఈ విషయం పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.
 
గుజరాత్‌ వెళ్లి..2018-05-31-at-13.51.46.jpeg.jpg
పాల పరిశోధనలో భాగంగా గుజరాత్‌ బాట పట్టాను. అక్కడ గిర్‌ ఆవులను కొన్నాం. గిర్‌ జాతి ఆవులలో ఆయుర్వేద గుణాలు బాగా ఉంటాయి. గుజరాత్‌ నుంచి తిరిగివస్తూ నేను ఒకటే అనుకున్నాను. పిల్లలకు మంచి ఆవుపాలు ఇవ్వడంతో పాటు క్షీణించి పోతున్న దేశీ ఆవుల సంఖ్యను పెంచాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. మొత్తానికి నేను చేపట్టిన ఈ పనికి నా కుటుంబం అండగా నిలబడింది. అంతకుముందు రకరకాల పంటలను పండించిన 30 ఎకరాల భూమిలో పంటలు వేయడం ఆపి గోశాల నిర్మాణాన్ని చేపట్టాం. గోశాలలోని ఆవులకు సేంద్రియ మేతనే వేస్తాం. ఆవులకు ప్రధానంగా పెట్టే గడ్డిని సేంద్రియ పద్ధతిలో పెంచి మేతగా పెడతాం. ఈ గోశాలను 2015లో హైదరాబాద్‌ శివార్లలో నెలకొల్పాం. ఇక్కడే సేంద్రియ గడ్డి మేతను పండిస్తున్నాం. ఈ దేశీ ఆవులు ఇచ్చే పాలు పిల్లలకు అమృతంతో సమానం. మరో విషయం ఏమిటంటే దేశీ ఆవులలో సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటికి మందుల వాడకం కూడా ఉండదు. గిర్‌ ఆవుల్లో విటమిన్‌-డి, కాల్షియం, తగినంత ఫ్యాట్‌ ఉంటాయి.
 
దూడలకు పేర్లు పెడతాం...
మా గోశాలలో మొట్ట మొదటగా పుట్టిన దూడకు ‘పుష్కరి’ అని పేరు పెట్టాం. ఎందుకంటే అది పుష్కరాల సమయంలో పుట్టింది. బయటవారిని గోశాలలో అడుగుపెట్టనీయం. వాటి ప్రపంచంలో అవి హాయిగా ఉండే వాతావరణాన్ని గోశాలలో కల్పించాం. పాలను చేతితోనే పితుకుతాం తప్పించి మిషన్లు వాడం. ఎందుకంటే యంత్రాల వినియోగం వల్ల అవి గాయపడతాయి. గోశాలలో దూడకు పాలిచ్చిన తర్వాతే ఆవుల నుంచి పాలు తీస్తాం. ఆవుల బ్రీడింగ్‌ను కూడా మేం సహజంగా జరిగేలా చూస్తాం. బుల్స్‌ను కూడా కొంటాం. ప్రకృతి సిద్ధంగా బ్రీడింగ్‌ జరుగుతుంది.
 
ఇతర ఉత్పత్తులు...
‘క్లిమామ్‌’ పేరిట ఆరోగ్యకరమైన పాలతోపాటు పాల నుంచి తయారయ్యే ఉత్పత్తులను కూడా అందిస్తాం. స్వచ్ఛమైన వెన్న, నెయ్యిని సంప్రదాయ పద్ధతిలో చేసి ఇస్తాం. గత వేసవి నుంచి మా క్లయింట్స్‌ సలాడ్లను కోరడంతో వాటిని కూడా అందిస్తున్నాం. ఇవే కాదు డయాబెటిస్‌, కేన్సర్‌, మోకాళ్ల నొప్పులు వంటి జబ్బులతో బాధపడేవారు ఉదయపు గోమూత్రాన్ని ఇవ్వమని అడుగుతుంటారు. అది కూడా అందిస్తాం. పాలు పితికిన మూడు గంటలలోపు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోఉన్న వినియోగదారులకు అందజేస్తాం. అలా చేయడం వల్ల తాజాగా ఉండడమే కాదు ఆ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కూడా. ఆవు పాలే కాదు ఆవుకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల వల్లా ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా బతకాలంటే మన దేశీయ ఆవులను పది కాలాలపాటు బతికించుకోవాలి. లేకపోతే ప్రకృతి దెబ్బతింటుంది. ప్రకృతి దెబ్బతింటే మానవ జీవన గతి గాడి తప్పుతుంది.
 
బిజినె్‌సలా చూడలేదు...
నేను చేస్తున్న పనిని ఎన్నడూ బిజినె్‌సలా చూడలేదు. లాభాల గురించి ఆలోచించ లేదు. అలా అని మా సేవలను విస్తరించే ఆలోచనలు లేకపోలేదు కానీ దానికి సమయం పడుతుంది. గోశాల నిర్వహణ కోసం బ్యాంకు రుణం తీసుకున్నాను. గోశాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదే. కానీ ఆ పని నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. అందుకే లాభాల కన్నా సామాజిక కోణంలోంచి ఈ పనిని చూస్తున్నాను. గోశాలను సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం వల్ల వెంటనే ప్రగతి కనిపించకపోయినా దీర్ఘకాలంలో మంచి లాభాలు ఉంటాయి. చాలామంది తల్లులు ‘ఈ పాలు తాగి వారి పిల్లలు ఎంతో ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నార’ని చెప్తుంటారు. ఆ సంతృప్తి చాలు కదా.
Link to comment
Share on other sites

26 minutes ago, Suresh_Ongole said:

Accepted bro. In india life is not like early days. No hikes in salaries. Now almost every one is in savings  mode. Salaried people cannot afford that except if we have second income. 

Ok bro

Link to comment
Share on other sites

5 minutes ago, chsrk said:

We are also using Desi Cow milk....buying it in Kuchikayalapudi village near GDV...@Rs.50/litre....Related image

villlage price is different and city price is different.

in my village my parents sell them to milk society based fat content . they will get around 30 rupees/litre

 

Link to comment
Share on other sites

7 minutes ago, BalayyaTarak said:

One of the advantages of living in town/villages instead of cities. Lot of costs will cutdown

 

12 minutes ago, ravindras said:

villlage price is different and city price is different.

in my village my parents sell them to milk society based fat content . they will get around 30 rupees/litre

 

Related image

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...