Jump to content

Rafael scam: Seems it is true anta


LuvNTR

Recommended Posts

మోదీది దేశద్రోహం!
22-09-2018 02:00:10
 
636731784080163992.jpg
  • నిజం బయటపెట్టినందుకు హోలాండ్‌కు థ్యాంక్స్‌: రాహుల్‌
  • పణంగా దేశ భద్రత?: కేజ్రీవాల్‌
  • నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సిందే: స్వామి
  • సైనికుల రక్తాన్ని అగౌరవపర్చారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ‘రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే’నని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ బాంబు పేల్చడంతో విపక్షాలన్నీ మోదీ సర్కారుపై భగ్గుమన్నాయి. దేశ చరిత్రలోనే రాఫెల్‌ ఒప్పందం అతిపెద్ద కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్‌.. ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. మోదీ దేశాన్ని మోసం చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తానే స్వయంగా వేల కోట్ల రూపాయల డీల్‌ను అనిల్‌ అంబానీకి అప్పగించారని ఆరోపించారు. ట్విటర్‌ వేదికగా ‘రాఫెల్‌ ఒప్పందంపై నిజాన్ని బయటపెట్టినందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆయన వ్యాఖ్యలతో.. మోదీ వ్యక్తిగతంగా ఆ ఒప్పందాన్ని అనిల్‌ అంబానీకి అప్పగించినట్లు మనందరికీ తెలిసింది. ప్రధాని దేశద్రోహానికి పాల్పడ్డారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు.’ అని తీవ్రంగా విమర్శించారు.
 
హోలాండ్‌ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి.. రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందన్న వ్యాఖ్యలు నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ఎన్డీయే హయాంలో ఒక్క యుద్ధవిమానం రాలేదని, అబద్ధాలు మాత్రమే చెప్పిందని చిదంబరం ఆరోపించారు. హోలాండ్‌ మాట్లాడిన మాటలపై స్పందనగా ఇంకా ఏ అబద్ధం చెబుతుందోనని ఎద్దేవా చేశారు. మోదీ సర్కారు రాఫెల్‌ ఒప్పందంలో కీలకమైన వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను పణంగా పెట్టాలని చూస్తోందా? అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ‘మోదీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. దేశ ప్రజల్ని తప్పు దారి పట్టించింది. నిజాలన్నీ బయటకు రావాలి. రక్షణ పరికరాల తయారీలో అనుభవం లేని ఒక కార్పొరేట్‌ ఇంటికి భారత ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇస్తోంది.’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.
Link to comment
Share on other sites

  • Replies 65
  • Created
  • Last Reply
అంతా దాపరికమే!
22-09-2018 02:10:54
 
636731790517863846.jpg
  • రాఫెల్‌ కొత్త ఒప్పందం... అత్యంత రహస్యం
  • ముఖ్యులకు సైతం ముందు తెలియదు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: వివాదాస్పద రాఫెల్‌ ఒప్పందంపై మొదటి నుంచీ అనేక సందేహాలు... దాపరికాలే! వేల కోట్ల డీల్‌పై మోదీ సర్కారు దాగుడుమూతలు, దాటవేతే తప్ప స్పష్టంగా సమాధానం చెప్పింది లేదు. ఫ్రాన్స్‌ నుంచి 126 రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనాలన్నది యూపీఏ-2 హయాం నాటి ఒప్పందం. కానీ, వాటి ధరను భారీగా పెంచేసి 36 విమానాలను మాత్రమే కొనే విధంగా మోదీ ప్రభుత్వం ఆ డీల్‌ను మార్చేసింది. కొత్త ఒప్పందం గురించి ప్రధాని మోదీ 2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌ పర్యటనలో హడావిడిగా ప్రకటించారు. దేశ భద్రత, ప్రజాధనంతో ముడిపడిన ఇంతటి కీలక అంశంలో ఆయన పలు వ్యవస్థాగత పద్ధతులను విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు ముందు పరిణామాలు పరిశీలిస్తే పారదర్శకత ఎలా లోపించిందో వెల్లడవుతుందని ఈ డీల్‌ను లోతుగా పరిశీలిస్తున్న నిపుణులు అంటున్నారు. ఒప్పందం మార్పు విషయంలో తగిన అనుమతులు పొందడం కానీ, మంత్రివర్గంలో చర్చించడం కానీ జరగలేదని వారు ఆరోపిస్తున్నారు.
 
నాడు మోదీ పర్యటనకు ఒక రోజు ముందు విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘రాఫెల్‌పై ఫ్రెంచ్‌ కంపెనీ, రక్షణ శాఖ, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి రక్షణ శాఖ కాంట్రాక్టు అంశాలను దేశాధినేతల పర్యటనల్లో చొప్పించం’’ అని జైశంకర్‌ చెప్పారు. కానీ, మోదీ ఫ్రాన్స్‌ నుంచి తిరుగుముఖం పడుతూ హడావిడిగా 36 రాఫెల్‌ విమానాల కొనుగోలు గురించి ప్రకటించారు. అంటే, రక్షణ శాఖలో అత్యున్నత అధికారికే ప్రధాని విదేశీ పర్యటన వివరాలు తెలియవని అర్థమవుతోందని చెబుతున్నారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పర్రికర్‌కు కూడా కొత్త రాఫెల్‌ డీల్‌ గురించి మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు కొద్ది రోజుల ముందు మాత్రమే తెలిసింది. ఆ ఒప్పందం గుట్టుమట్లు తెలియని పర్రికర్‌ దాన్ని సమర్థించడానికి నానా పాట్లు పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి ఎంత దాపరికం ఉందో తెలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. విమానాల సంఖ్యలో కోత గురించి దసాల్ట్‌ ఏవియేషన్‌ సీఈవో, చైర్మన్‌కు సైతం తెలియదనడానికి 2015 మార్చి 27న ఫ్రాన్స్‌ వార్తా సంస్థ కథనం మరో నిదర్శనం.
 
ఆ రోజు ‘‘126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం 95 శాతం పూర్తయింది’’ అని ఆయన పేర్కొన్నారు. కానీ, పక్షంలోనే ఆ పరిస్థితి తలకిందులు అయింది. రెండు వారాల్లోనే 95 శాతం సున్నాకు ఎలా వచ్చిందో మోదీ చెప్పాలన్న డిమాండ్‌పై మౌనమే తప్ప సమాధానం లేదు. గత ప్రభుత్వం రాఫెల్‌ నుంచి హెచ్‌ఏఎల్‌ను తప్పించడం, రక్షణ శాఖ పేలవమైన వ్యవహారాల వల్లే అప్పట్లో ఒప్పందం కార్యరూపం దాల్చలేదన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వాదనను కాంగ్రెసే కాదు... ఇటీవల పదవీ విరమణ చేసిన హెచ్‌ఏఎల్‌ అధిపతి టి.సువర్ణరాజు సైతం తప్పుబడుతుండడం గమనార్హం. రాఫెల్‌ను తయారుచేసే సత్తా ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో హెచ్‌ఏఎల్‌పై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వాదన డొల్ల అని తేలిపోయిందని అంటున్నారు.
Link to comment
Share on other sites

looks like going the #dubaioffer way?

Ofcourse tomorrow newspapers wont cover this as usual

 

 @ANI

FollowFollow @ANI

More

FLASH: From Agency AFP, when asked whether India had put pressure on Reliance and Dassault to work together, Ex France President Hollande said he was unaware and "only Dassault can comment on this".

Link to comment
Share on other sites

2 minutes ago, Kiran said:

looks like going the #dubaioffer way?

Ofcourse tomorrow newspapers wont cover this as usual

 

 @ANI

FollowFollow @ANI

More

FLASH: From Agency AFP, when asked whether India had put pressure on Reliance and Dassault to work together, Ex France President Hollande said he was unaware and "only Dassault can comment on this".

All I hear is excuses ... blah blah blah blah ... meah ...

no offense though.

 

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...