Jump to content
Sign in to follow this  
minion

Galla and Ramu

Recommended Posts

ఇద్దరూ ఇద్దరే!
22-07-2018 02:20:43
 
636678228451884968.jpg
  • జయదేవ్‌, రామ్మోహన్‌లపై ప్రశంసల వర్షం
  • అమెరికాలోనే పుట్టి పెరిగిన జయదేవ్‌
  • ఆంగ్లంపై పూర్తి పట్టు.. మాటలో స్పష్టత
  • ఢిల్లీలో చదువుకున్న రామ్మోహన్‌
  • ‘లోకల్‌ హిందీ’తో సభలో దడదడ
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఐదొందల మందికి పైగా సభ్యులు! దేశం చూపంతా పార్లమెంటుపైనే! సభలో ప్రధానమంత్రి సహా అనేకమంది మహామహులు! అలాంటి వేదికపై అందరి దృష్టిని ఆకట్టుకునేలా ప్రసంగించడమంటే మాటలు కాదు! ఏదో ఒకటి చదివి వినిపించడం వేరు! పరిమితంగా ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఎవరికి తగలాలో వారికి సూటిగా తగిలేలా వాగ్బాణాలు సంధించడం వేరు! పైగా... పార్లమెంటులో హిందీ లేదా ఆంగ్లంలో మాట్లాడితేనే లక్ష్యం నెరవేరుతుంది. ఇలాంటి ప్రసంగ కళ ఉన్న ఏపీ నేతలకు కొరత ఉందనేది నిజం! గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు రూపంలో ఈ లోటు తీరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
వీళ్లిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం ఒకరు ఇంగ్లీషులో, మరొకరు హిందీలో రాష్ట్ర వాదనలను సమర్థంగా వినిపించారు. గల్లా జయదేవ్‌ బాల్యం, చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. దీంతో ఆయనకు ఆంగ్లంపై మంచి పట్టుంది. అమెరికా యాస కలిసిన ఆయన ఇంగ్లిషు, వాడే పదజాలం, ఉచ్ఛారణ సూటిగా ఘాటుగా ఉంటా యి. బడ్జెట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తక్కువ సమయంలోనే ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. గల్లాలోని ‘స్పీకర్‌’ తొలిసారి అందరికీ పరిచయమైంది అప్పుడే. ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అంటూ సూటిగా నిలదీసిన తొలి నాయకుడు కూడా ఆయనే. నిజానికి ‘మిస్టర్‌’ అనేది ఒక గౌరవ వాచకం. అమెరికాలో ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అని సంబోధిస్తారు.
 
అదే విధంగా ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అని గల్లా జయదేవ్‌ పిలిచారు. శుక్రవారం సుమారు గంటపాటు గల్లా ప్రసంగించారు. గణాంకాలను వివరిస్తూనే భావోద్వేగ అంశాలను చక్కగా ప్రస్తావిస్తూ ఏపీ సమస్యలను దేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇక... హిందీలో అనర్గళంగా మాట్లాడే ఎంపీలు గతంలో తెలుగుదేశం పార్టీకి అంతగా ఉండేవారు కాదు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంత ఎంపీల్లో పలువురికి హిందీలో కొందరు బాగా మాట్లాడేవారు. కానీ... ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటులో హిందీలో దడదడలాడించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. గణాంకాలను చెప్పేందుకు మాత్రమే ఆయన కాగితాలను చూశా రు.
 
మిగిలిన సందర్భంలో తీవ్రమైన హావభావాలు ప్రదర్శిస్తూ, చేతులను కదిలిస్తూ, అప్పుడప్పుడు బల్లగుద్ది మరీ ప్రధానమంత్రిని, హోంమంత్రిని నిలదీసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. రామ్మోహన్‌నాయుడు మాట్లాడిన 12 నిమిషాలు సభ మొత్తం ఆయనపైనే దృష్టి కేంద్రీకరించింది. ‘మనోడికి హిందీ ఇంత బాగా ఎలా వచ్చింది?’ అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తాయి. అసలు విషయమేమిటంటే... రామ్మోహన్‌ నాయుడు పాఠశాల చదువు ఢిల్లీలో సాగింది. అక్కడ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన చదువుకున్నారు. దీంతో ‘ఢిల్లీ లోకల్‌ ఫ్లేవర్‌’ ఉన్న హిందీ బాగా అబ్బింది. ‘మీ ప్రసంగాన్ని మీరు పూర్తి చేయండి’ అని స్పీకర్‌ సూచించగా... ‘ఓకే మేడమ్‌’ అనేలా ‘చలీయే మేడమ్‌’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. ఢిల్లీలో పాఠశాల చదువు తర్వాత రామ్మోహన్‌ నాయుడు అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. దీంతో ఆయనకు ఇంగ్లీషుపైనా పట్టు ఉంది. అయితే... ఒకరితో ఇంగ్లీషులో, మరొకరితో హిందీలో మాట్లాడించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.
 
గతంలో ఇలా...
జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పలుమార్లు కీలక పాత్ర పోషించింది. 1984లో 30 సీట్లు సాధించి ప్రతిపక్షంలో పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత దాదాపు అదే స్థాయిలో 1999లో 29స్థానాలను గెలిచింది. 1998, 1999ఎన్నికల్లో బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. అప్పట్లో దివంగత ఎర్రన్నాయుడు... హిందీ, ఇంగ్లిష్‌ కలగలిపి ప్రసంగించేవారు. భాషకు తన హవా భావాలను కూడా జోడించి అందరికీ అర్థమయ్యేలా సమస్యను వివరించగలిగేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్‌ నాయుడు ‘తండ్రికి మించిన తనయుడు’లా పార్లమెంటులో ప్రసంగ ధాటిని ప్రదర్శించడం విశేషం.

Share this post


Link to post
Share on other sites
1 hour ago, Madineni DHFT said:

Pawala gadu English matladithe mamuluga undadhu etakaram.... Vadu vadi sentence formation vammoooo.... 

:roflmao:

Teenmar YouTube print.. after high h r u dialogue I switched off the movie.. 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×