Jump to content

Galla Jayadev


Recommended Posts

  • Replies 116
  • Created
  • Last Reply
గల్లా ప్రసంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు
20-07-2018 14:06:44
 
636676924056354062.jpg
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలిసేలా ఎంపీ గల్లా జయదేవ్‌ చేసిన ప్రసంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. లోక్‌సభలో చర్చను తన కార్యాలయం నుంచే చూస్తున్న చంద్రబాబు అమరావతి నుంచే ఢిల్లీలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాస్తవాలను అంకెలతో సహా దేశ ప్రజలకు తెలిపామని సీఎం అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తెచ్చారన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడి ప్రసంగంలో మరింత భావోద్వేగం ఉండాలని సూచించారు. అవిశ్వాసంపై చర్చలో వీలైనంత మంది మాట్లాడాలని సీఎం తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొన్న ప్రతి సమస్య వివరించాలన్నారు. ఇదొక అద్భుత అవకాశమని, చారిత్రాత్మక సందర్భమని ఎంపీలతో సీఎం చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

గెస్ట్ లిస్టులో వైసీపీ.. నిఘా జాబితాలో టీడీపీ: ఎంపీ గల్లా
20-07-2018 13:20:11
 
636676896123818507.jpg
న్యూఢిల్లీ: ఏపీలో మిగతా పార్టీలతో బీజేపీ కుమ్మక్కై టీడీపీని అడ్డుకోవాలని చూస్తోందని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు మోదీ గెస్ట్‌ లిస్టులో ఉంటే...టీడీపీ ఎంపీలు నిఘా జాబితాలో ఉన్నారని తెలిపారు. ఆ విషయం దేశం మొత్తానికి తెలుసని ఎంపీ పేర్కొన్నారు. యూసీలు ఇవ్వలేదని.. లెక్కలు చెప్పడం లేదని కేంద్రం ఆరోపిస్తోందని...యూసీలు సమర్పించడంలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని అన్నారు. విభజన చట్టంలో అన్ని అంశాలను నేరవేర్చాలని డిమాడ్ చేస్తున్నామన్నారు. రైల్వేజోన్‌, స్టీల్ ఫ్యాక్టరీ వంటి అంశాలు పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందంటున్నారని...తప్పుకోవాలని చూస్తే ఊరుకోమని ఎంపీ గల్లా జయదేవ్ హెచ్చరించారు.
Link to comment
Share on other sites

విగ్రహాలకు కేటాయించినన్ని నిధులు కూడా ఇవ్వరా?’
20-07-2018 13:00:43
 
636676884447576741.jpg
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీ రాజధానికి రూ.1500కోట్లు కేటాయించడంపై ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలకు ఎక్కువ నిధులు కేటాయించిన కేంద్రం రాజధానికి కొంత మాత్రమే నిధులు కేటాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. పటేల్, శివాజీ విగ్రహాలకు కోసం రూ.6500కోట్లు ఇచ్చారని...ఏపీ రాజధానికి మాత్రం రూ.1500 కోట్లు కేటాయిస్తారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ నిలదీశారు. ఢిల్లీకి రెండింతల విస్తీర్ణంలో గుజరాత్‌లో దోలేరో నగరం కడుతున్నారని ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ గుర్తుచేశారు.
 
కజకిస్తాన్‌ రాజధాని అస్తానాను పరిశీలించి అలాంటి రాజధాని నిర్మించుకోండని ప్రధాని స్వయంగా చెప్పారని తెలిపారు. ఏపీ రాజధాని కోసం రూ.50 వేల కోట్ల విలువైన భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. నవీ ముంబై కోసం 40 వేల ఎకరాలు సేకరించారని...ఇప్పుడు అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఎందుకంటున్నారని గల్లా మండిపడ్డారు. కేంద్రం రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోందని, అందులో రూ.1000 కోట్లు గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిందే అని తెలిపారు. గుంటూరు లాంటి చిన్న పట్టణంలో భూగర్భ డ్రైనేజీకి రూ.1000 కోట్లు ఖర్చు అయితే...రూ.1500 కోట్లతో రాజధాని ఎలా నిర్మిస్తామని కేంద్రప్రభుత్వాన్ని ఎంపీ గల్లా జయదేవ్ నిలదీశారు.
Link to comment
Share on other sites

మోదీజీ...ఆనాడు మీరన్న మాట మర్చిపోయారా?: ఎంపీ గల్లా
20-07-2018 12:10:52
 
636676854709428739.jpg
న్యూఢిల్లీ: విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు... బీజేపీది కూడా అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఎంపీ ఏపీ సమస్యలపై మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని అన్నారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.
 
 
రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ ఆరు హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు.
 
 
ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమకు లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.
 
Tags : galla jayadev, tdp mp, pm modi, no confidence motion, Lok S
Link to comment
Share on other sites

నాలుగు కారణాల వల్ల అవిశ్వాసం పెట్టాం: గల్లా
20-07-2018 11:37:17
 
636676834388123935.jpg
న్యూఢిల్లీ: టీడీపీ నాలుగు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోవడం మొదటి కారణమని, నమ్మకం లేకపోవడం రెండో కారణమని తెలిపారు. ఏపీకి ప్రాధాన్యం దక్కకపోవడం మూడో కారణమని, ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్ష నాలుగో కారణమని గల్లా జయదేవ్ వివరించారు.
Link to comment
Share on other sites

కుదరదన్న స్పీకర్.. రికార్డులు చూసుకోమన్న గల్లా!
20-07-2018 11:57:45
 
636676846668320026.jpg
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో మాట్లాడుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అడ్డు తగిలారు. మీకు ఎంత సమయం కేటాయించానని ప్రశ్నించారు. తనకు మరింత సమయం కావాలని గల్లా సమాధానమివ్వగా.. కుదరదని స్పీకర్ చెప్పారు. మరో 5నిమిషాల్లో ముగించాలని సూచించారు. గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు గంట కంటే తక్కువగా ఎవరూ చర్చ జరపలేదని, తాను రికార్డులను పరిశీలించే మాట్లాడుతున్నానని గల్లా చెప్పారు. హిస్టరీ గురించి మాట్లాడటం కాదని.. వర్తమానం గురించి మాట్లాడండని గల్లాకు స్పీకర్ చెప్పారు.
 
 
Link to comment
Share on other sites

ఆర్థిక మంత్రి జైట్లీపై పార్లమెంట్‌లో గల్లా కామెంట్
20-07-2018 13:15:53
 
636676893546269619.jpg
ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురించి ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. "పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక ఇస్తామని మోసం చేశారు. ఆర్టికల్ 4 ప్రకారం ప్రత్యేక హోదాను పార్లమెంటే ఇవ్వొచ్చు. ఫైనాన్స్ కమిషన్‌ను అడ్డం పెట్టుకొని నిరాకరించడం ద్రోహం. ఏపీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ దారుణంగా మోసం చేశారు" అని గల్లా చెప్పుకొచ్చారు.
 
 
అనంతరం అరుణ్ జైట్లీ గురించి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఏ ఫైనాన్స్ కమిషన్‌ చెప్పలేదని ఆర్థిక సంఘం అధికారులే తేల్చి చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఏపీకి ఇచ్చిన 900 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామని.. దీనికి సంబంధించిన యూసీలు కూడా కేంద్రానికి ఇచ్చేశామన్నారు. అభివృద్ధికి అండగా ఉండమంటే.. అవినీతికే కేంద్రం అండగా ఉంటోందని గల్లా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Link to comment
Share on other sites

మేం భారతదేశంలో భాగం కాదా..?: గల్లా
20-07-2018 12:12:40
 
636676855618094806.jpg
ఢిల్లీ: ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూస్తుంటే మేం భారతదేశంలో భాగం కాదా? అని అనిపిస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడిన ఆయన.. " ఆస్తులు తెలంగాణకు... అప్పులు ఆంధ్రాకు ఇచ్చారు. విద్యుత్‌ను వినియోగం ఆధారంగా అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారు. జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడంతో ఏపీకి 34 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీకి కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. న్యాయమైన డిమాండ్లు... ధర్మపోరాటం అంశాలపై జరుగుతున్న చర్చ ఇది.
 
 
విభజన తర్వాత ఏపీనే కొత్త రాష్ట్రం.. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు. విద్యాసంస్థలు, జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయి. రాజధాని కూడా తెలంగాణలోనే ఉంది. రాజధాని లేదు.. ఆదాయంలో లోటు ఉంది. ఏపీ అనిశ్చితిలో ఉంది. అన్యాయంగా గొంతు నొక్కి విభజన బిల్లు పాస్‌ చేశారు. ఏపీకి అన్యాయం చేశారు. ఇప్పుడైనా న్యాయం చేయండి" అని కేంద్రాన్ని గల్లా జయదేవ్‌ కోరారు.
 
Tags : mp galla jayadev, all india, Andhrapradesh
Link to comment
Share on other sites

గల్లా ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్‌

02190420BRK-111.JPG

హైదరాబాద్‌: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రం తీరును ఎండగట్టిన తెదేపా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గల్లా ప్రసంగంపై ఆయన స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గల్లా జయదేవ్‌ సమగ్రంగా చూపించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష మేరకే మేం ఈ పోరాటం చేస్తున్నాం. ఏపీ ప్రత్యేక హోదా కింద 2014లో ప్రధాని మోదీ ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని పూర్తి చేయమని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై గల్లా గళమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గల్లా మాట్లాడుతూ మీరు ఇచ్చిన హామీలను మరిచిపోతారా? అంటూ భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

Link to comment
Share on other sites

మోదీ.. మీరిచ్చిన హామీలు మరిచారా?
ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరింది మీ పార్టీ కాదా?
విభజనలో సగం పాపం మీకూ ఉంది
లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ ప్రారంభించిన గల్లా జయదేవ్‌‌
11262120BRK81A.JPG

దిల్లీ: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌‌ చర్చను ప్రారంభించారు. తొలుత ‘భరత్‌ అనే నేను’ సినిమా స్టోరీ లైన్‌ను ఆయన వినిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో చూపించారని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలందరికీ ధన్యవాదాలు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన నాకు ఇంత గొప్ప అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అపనమ్మకం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, న్యాయపరమైన డిమాండ్లు, ధర్మపోరాటం అనే నాలుగు అంశాలపై ఏపీ అవిశ్వాసం ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం జాతీయ సమస్య. ఆధిపత్యానికి, నైతికతకు జరుగుతున్న పోరాటం ఇది. అంతేగానీ కేంద్రానికి, ఏపీకి మధ్య ధర్మపోరాటం కాదు. దేశంలో భాగమైన ఏపీకి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
 
కొత్తగా ఏర్పడింది తెలంగాణ కాదు.. ఏపీ

రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌... తెలంగాణ కాదు. విభజనలో భాగంగా ఆస్తులు తెలంగాణకు.. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారు.విభజన తర్వాత ఆ‌ నగరం తెలంగాణలోనే ఉండిపోయింది. దీంతో ప్రధాన ఆదాయ వనరును ఏపీ కోల్పోయింది. ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌తో పాటు భాజపా ప్రధాన పాత్ర పోషించింది. ఇదే సభలో ఆ బిల్లును ఎలా ఆమోదించారో దేశం మొత్తం చూసింది. సమైఖ్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే వెనుకబడి ఉంది. వ్యవసాయంలో కాస్త మెరుగ్గా ఉన్నా.. పారిశ్రామిక, సేవల రంగంలో అట్టడుగునే ఉంది. తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడే ఉంది.

మోదీ.. మీరిచ్చిన హామీలు గుర్తులేవా..?

కాంగ్రెస్‌ తెలుగుతల్లిని రెండుగా చీల్చి రాష్ట్ర విభజన చేసిందని మోదీ అప్పట్లో అన్నారు. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని వ్యాఖ్యానించారు. అయితే విభజన పాపంలో భాజపాకు సగం పాత్ర ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా?. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని మీ పార్టీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా?. తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా?. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం చెబుతోంది. ఇది పూర్తిగా అసంబద్ధం. మేమెప్పుడూ అలా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు చెప్పారు. ప్రధాని, ఆర్థిక మంత్రి అవాస్తవ విషయాలను గమనించాలి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి.

పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు.. రాజధానికి వెయ్యి కోట్లా..

భాజపా మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప.. దక్షిణాది రాష్ట్రాలతో కాదు. పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్‌-90 కింద ఇచ్చేవి. ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు ఇచ్చారు. మా రాజధాని నిర్మాణానికి ఇచ్చింది మాత్రం వెయ్యి కోట్లు. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. దిల్లీ కంటే పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధానే స్వయంగా హామీ ఇచ్చారు. ఆయనిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి ఉదారంగా భూములిచ్చారు.

 

సమయం విషయంలోనూ వివక్ష వద్దు

గల్లా జయదేవ్‌ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కలగజేసుకుని.. ప్రసంగం ముగించాలని సూచించారు. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నారని అన్నారు. దీనిపై జయదేవ్‌ స్పందిస్తూ.. సమయం విషయంలోనూ తమను వివక్షకు గురి చేయొద్దని కోరారు.

 

Link to comment
Share on other sites

Galla chala risk situation lo unnadu.....Galla is trying for "electric car" battery mfg and Modi(known for targeting and he showed that to anyone against him) can hit them bad.....

This man went face-to-face against Modi 2nd time.....modi gaadiki english ardam kaadu kani Galla chese damage capability ardam ayyindi...

Link to comment
Share on other sites

2 minutes ago, AnnaGaru said:

Galla chala risk situation lo unnadu.....Galla is trying to for "electric car" battery mfg and Modi can hit them bad.....

This man went face-to-face against Modi 2nd time.....modi gaadiki english ardam kaadu kani Galla chese damage capability ardam ayyindi...

Bayapadalsindi emundile brother, Modi/ BJP is not permanent int hat seat and fear is the first villain for one self to reach next level heights.

Link to comment
Share on other sites

టీడీపీ ఎంపీ గల్లా స్పీచ్‌కు ఎన్ని లైక్స్ వచ్చాయో తెలిస్తే...
22-07-2018 08:43:59
 
636678458378934036.jpg
  • హోదాపై మోదీని నిలదీశారు
  • గుంటూరు మిర్చిఘాటు చూపించారు
  • వివరణాత్మకంగా... విశ్లేషణాత్మకంగా ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటారు
  • టీడీపీ శ్రేణులు, అభిమానుల ప్రశంసలు
  • సోషల్‌ మీడియాలో హల్‌చల్‌
రాజకీయ కుటుంబ నేపథ్యం... అయినా 2014ముందు వరకు రాజకీయాల ఊసేలేదు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి... వ్యాపారరంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ చైతన్యవంతమైన గుంటూరునే వేదికగా చేసుకుని... సరికొత్త ప్రచార సరళితో 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగి విజేతగా నిలిచారు... గల్లా జయదేవ్‌. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టినా.. సమస్యలను అవగతం చేసుకుంటూ వివిధ సందర్భాల్లో తన వాణిని వినిపిస్తూ రాటుదేలారు.
 
గుంటూరు (ఆంధ్రజ్యోతి): తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్రప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగించిన తీరు... ఔరా అనిపించేలా కొనసాగింది. గుంటూరు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో... అంతే ఘాటుగా... సూటిగా ప్రధాని మోదీని నిలదీసిన వైనం... కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని వివరించిన తీరు గుంటూరు జిల్లా వాసులనే కాకుండా 5 కోట్ల ఆంధ్రులను ఆకట్టుకుంది. ఎక్కడా తడబడకుండా కేంద్రంపై అవిశ్వాసం ఎందుకు పెట్టాల్సివచ్చిందీ వివరణాత్మకంగా... రాష్ట్రానికి ప్రత్యే హోదా ఎందుకు ఇవ్వాలో విశ్లేషణాత్మకంగా ఆంగ్లభాషలో గల్లా అనర్గళ ప్రసంగం నవ్యాంధ్ర ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.
 
 
మొన్నటి బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఎంపీ గల్లా ప్రసంగం రాష్ట్రప్రజలను ఆకట్టుకుంది. అలాగే, నిన్నటి అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీని నిలదీస్తూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గల్లా ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగిందని అంటున్నారు. నిబంధనల మేరకు అవిశ్వాసంపై టీడీపీకి 13 నిమిషాలు మాత్రమే సమయమిచ్చినా... గల్లా సుమారు గంట సేపు అనర్గళంగా... రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్‌, బీజేపీ) చేసిన మోసంపై నిప్పులు చెరిగారని టీడీపీ శ్రేణులు, మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు జేజేలు పలుకుతున్నారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించే అవకాశం సీనియర్‌ నాయకులకు వస్తుందని.. అలాంటిది అందివచ్చిన అవకాశాన్ని ఎంపీ గల్లా జయదేవ్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని వారు అభినందనలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా ఆంగ్లంలో మాట్లాడేందుకు గల్లా జయదేవ్‌ను, హిందీలో ప్రసంగించేందుకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడులను ఎంపిక చేశారని, తద్వారా మన రాష్ట్ర సమస్యలను భారతావని దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
 
సోషల్‌ మీడియాలో ‘జయ’దేవ్‌
ఎంపీ గల్లా జయదేవ్‌ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జయదేవ్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయన ఫొటోలు, లోక్‌సభలో ప్రసంగ పాఠం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో హల్‌చల్‌ చేశాయి. జయదేవ్‌ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో లైకుల మోతమోగుతోంది. శనివారం మధ్యాహ్నానికి ట్విట్టర్‌ ద్వారా 2.40లక్షల మంది, ఫేస్‌బుక్‌ ద్వారా 2.30 లక్షల మంది, యూట్యూబ్‌లో ఆయన ప్రసాంగినికి 3.33 లక్షల మంది లైకులు కొట్టినట్లు సమాచారం. మొత్తం మీద గల్లా ప్రసంగాన్ని వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 80-90లక్షలమంది వీక్షించి లైకులు కొట్టినట్లు తెలుస్తోంది.
 
 
అభిమానుల్లో జోష్‌..
ఎంపీ జయదేవ్‌ అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ప్రతినిధిగా లోక్‌సభలో మాట్లాడబోతున్నట్లు ఒకరోజు ముందే ఖరారవడంతో ఆయన అభిమానులు శుక్రవారం టీవీలకు అతుక్కుపోయారు. జయదేవ్‌ తనదైన శైలిలో గంటసేపు ఆంగ్లంలో చేసిన ప్రసం గం... గుంటూరు మిర్చి ఘాటును లోక్‌సభకు చూపించినట్లుగా సాగిందని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు అంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...