Jump to content

Galla Jayadev


Recommended Posts

  • Replies 116
  • Created
  • Last Reply

TDP MP Jayadeva Galla is grilling Narendra Modi right in front of him. 
Pin drop silence in the Parliament from both sides. 

Democracy at display. This was missing for the last 4 Years. 

#NoConfidenceMotion was much needed just for the sake of this debate.

Link to comment
Share on other sites

Mr Modi while campaigning in Andhra Pradesh had said 'Congress killed the mother & saved the child. Had I have been there, I would have saved the mother too'. People of AP have waited for 4 long yrs for him to save their mother: Jayadev Galla, TDP in Lok Sabha #NoConfidenceMotion

Link to comment
Share on other sites

మోదీ.. మీరిచ్చిన హామీలు మరిచారా?
ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరింది మీ పార్టీ కాదా?
విభజనలో సగం పాపం మీకూ ఉంది
లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ ప్రారంభించిన గల్లా జయదేవ్‌‌
11262120BRK81A.JPG

దిల్లీ: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌‌ చర్చను ప్రారంభించారు. తొలుత ‘భరత్‌ అనే నేను’ సినిమా స్టోరీ లైన్‌ను ఆయన వినిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో చూపించారని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలందరికీ ధన్యవాదాలు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన నాకు ఇంత గొప్ప అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అపనమ్మకం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, న్యాయపరమైన డిమాండ్లు, ధర్మపోరాటం అనే నాలుగు అంశాలపై ఏపీ అవిశ్వాసం ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం జాతీయ సమస్య. ఆధిపత్యానికి, నైతికతకు జరుగుతున్న పోరాటం ఇది. అంతేగానీ కేంద్రానికి, ఏపీకి మధ్య ధర్మపోరాటం కాదు. దేశంలో భాగమైన ఏపీకి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
 
కొత్తగా ఏర్పడింది తెలంగాణ కాదు.. ఏపీ

రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌... తెలంగాణ కాదు. విభజనలో భాగంగా ఆస్తులు తెలంగాణకు.. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారు.విభజన తర్వాత ఆ‌ నగరం తెలంగాణలోనే ఉండిపోయింది. దీంతో ప్రధాన ఆదాయ వనరును ఏపీ కోల్పోయింది. ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌తో పాటు భాజపా ప్రధాన పాత్ర పోషించింది. ఇదే సభలో ఆ బిల్లును ఎలా ఆమోదించారో దేశం మొత్తం చూసింది. సమైఖ్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే వెనుకబడి ఉంది. వ్యవసాయంలో కాస్త మెరుగ్గా ఉన్నా.. పారిశ్రామిక, సేవల రంగంలో అట్టడుగునే ఉంది. తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడే ఉంది.

మోదీ.. మీరిచ్చిన హామీలు గుర్తులేవా..?

కాంగ్రెస్‌ తెలుగుతల్లిని రెండుగా చీల్చి రాష్ట్ర విభజన చేసిందని మోదీ అప్పట్లో అన్నారు. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని వ్యాఖ్యానించారు. అయితే విభజన పాపంలో భాజపాకు సగం పాత్ర ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా?. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని మీ పార్టీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా?. తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా?. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం చెబుతోంది. ఇది పూర్తిగా అసంబద్ధం. మేమెప్పుడూ అలా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు చెప్పారు. ప్రధాని, ఆర్థిక మంత్రి అవాస్తవ విషయాలను గమనించాలి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి.

పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు.. రాజధానికి వెయ్యి కోట్లా..

భాజపా మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప.. దక్షిణాది రాష్ట్రాలతో కాదు. పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్‌-90 కింద ఇచ్చేవి. ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు ఇచ్చారు. మా రాజధాని నిర్మాణానికి ఇచ్చింది మాత్రం వెయ్యి కోట్లు. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. దిల్లీ కంటే పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధానే స్వయంగా హామీ ఇచ్చారు. ఆయనిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి ఉదారంగా భూములిచ్చారు.

 

సమయం విషయంలోనూ వివక్ష వద్దు

గల్లా జయదేవ్‌ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కలగజేసుకుని.. ప్రసంగం ముగించాలని సూచించారు. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నారని అన్నారు. దీనిపై జయదేవ్‌ స్పందిస్తూ.. సమయం విషయంలోనూ తమను వివక్షకు గురి చేయొద్దని కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...