Jump to content

Seems Biggest Self Goal by Jaffas


Recommended Posts

న్యూఢిల్లీ, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం.. దాన్ని లోక్‌సభ స్పీకర్‌ చర్చకు అనుమతించడం.. పార్లమెంటులో టీడీపీ ఎంపీల హడావుడి వంటి పరిణామాలతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఇలాంటి కీలక సమయంలో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు లేకపోవడంతో నేతలు మధనపడుతున్నారు. రాజీనామా చేసి తప్పు చేశామన్న అపరాధ భావన మాజీ ఎంపీల్లోనూ వ్యక్తమవుతోంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనూ టీడీపీ, వైసీసీ పోటాపోటీగా వేర్వేరుగా అవిశ్వాసానికి నోటీసులిచ్చినా.. చర్చకు రాని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న ఐదుగురు వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి రాజీనామా చేశారు. గత నెల 21న వాటిని స్పీకర్‌ ఆమోదించారు. అయితే వర్షాకాల సమావేశాల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారాయి. సమావేశాల మొదటి రోజే టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతిచ్చారు.
 
ఈ పరిణామాన్ని ఊహించని వైసీపీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. అవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం గత సమావేశాల్లో చర్చకు రానివ్వకుండా అడ్డుకుని.. ఇప్పుడు అనూహ్యంగా అంగీకరించడంపై వారు అసహనంగా ఉన్నారు. తమను కలిసిన విలేకరులు, సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘అనవసరంగా రాజీనామా చేశామా అని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రబిందువుగా శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ కోసం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇంత కీలక సమయంలో లోక్‌సభలో మా పార్టీ గళాన్ని వినిపించలేకపోతున్నాం. మేమూ సభలో ఉంటే బాగుండేది. నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడేం చేస్తాం’ అని ఓ సీనియర్‌ మాజీ ఎంపీ వాపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు సాధనకు టీడీపీ మాత్రమే పోరాడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆయన విశ్లేషించారు. కాగా.. మేకపాటి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఢిల్లీలోనే ఉండి పరిస్థితులను గమనిస్తున్నారు.
 
 
కాగా.. వైసీసీ నుంచి టీడీపీ, టీఆర్‌ఎ్‌సలలోకి ఫిరాయించిన నలుగురు ఎంపీలు ఎస్‌పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుక లోక్‌సభ రికార్డుల ప్రకారం ఇంకా అధికారికంగా వైసీపీ ఎంపీలుగానే కొనసాగుతున్నారు. వీరికి విప్‌ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయిందని మాజీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
ఒంటరిగా బాబును ఓడించలేం!
చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఒంటరిగా ఓడించడం అంత సులభం కాదని వైసీపీ మాజీ ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపితేనే ఆ పార్టీని ఓడించడం సాధ్యమవుతుందని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జగన్‌, పవన్‌ మధ్య అవగాహన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అనుభవం, ఎన్నికల నిర్వహణ విషయంలో పోటీపడడం కష్టమని తెలిపారు. సరైన రాజకీయ ఎత్తుగడలు వేస్తేనే విజయం సాధ్యమని చెప్పారు. వైసీపీలో విశ్వసనీయ నేతలు చేరడం అవసరమని అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

ee NCM valla okati maathram proove ayindi. National Level lo ee okka english daily kuda TDP ni kaani AP Problems kaani highlight seyyaledu. Pathetic situation that They mentioned Congress and Sonia so many times in NCM articles. TDP word is not mentioned anywhere. NDTV ayithe completely congress ki ammudu poyindi.

Link to comment
Share on other sites

33 minutes ago, Siddhugwotham said:

Telugu Media didn't highlight TDP's move in Today's headlines.

Andhra Prabha -- Reiterates that YSRCP allegations in approving NCM after their MP's resignation.

Andhra Bhoomi -- No use for CBN..

Ivi kuda chaduthunnara inka

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...