Jump to content

Nagarjuna Sagar


Recommended Posts

  • Replies 99
  • Created
  • Last Reply
నీరొదులుతున్నా.. నిలకడగా
11-09-2018 08:26:53
 
636722512140862851.jpg
మాచర్ల(గుంటూరు జిల్లా): నాగార్జునసాగర్‌ నీటిమట్టం కొన్నిరోజులుగా నిలకడగా ఉంటోంది. కుడి, ఎడమ పంట కాలువల ద్వారా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతాలకు సాగునీటిని వదులుతున్నారు. అయినప్పటికీ శ్రీశైలం నుంచి తగినంత నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండడంతో నిలకడ కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో పెరిగినప్పుడు మెయిన్‌ పవర్‌హౌస్‌లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌ అన్న పేరును అధికారులు సార్థకం చేస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో రమారమి 25 వేల క్యూసెక్కులు వస్తున్న తరుణంలో విద్యుదుత్పత్తిని కుదిస్తున్నారు. మూడు నాలుగు రోజుల క్రితం శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో 68,883 క్యూసెక్కులు ఉన్నప్పుడు మెయిన్‌ పవర్‌హౌస్‌ నుంచి విద్యుదుత్పత్తికి 33,698 క్యూసెక్కులను వినియోగించుకున్నారు.
 
ఇన్‌ఫ్లో 25 వేలకు పడిపోగానే వెంటనే ఐదారు వేల క్యూసెక్కులకు మించి విద్యుదుత్పత్తి కోసం వాడడం లేదు. ఇలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని 585 పైచిలుకు నిల్వలను అట్టిపెట్టేలా చూస్తున్నారు. దీంతో అత్యవసర తాగునీటికి, ఖరీఫ్‌ సాగుకు చింతలేకుండా పోతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టాన్ని పరిశీలిస్తే సోమవారం 587.90 అడుగులు ఉంది. ఇది 306.94 టీఎంసీలకు సమానంగా చెప్పవచ్చు. ఇన్‌ఫ్లోగా పైనుంచి 25,439 క్యూసెక్కులు వస్తుండగా, కుడి, ఎడమ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరద కాలువల ద్వారా 22,680 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
Link to comment
Share on other sites

ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలొద్దు: తెలంగాణ
13-09-2018 03:29:04
 
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): బోర్డు అనుమతి లేకుండా సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఎక్కువ నీళ్లు విడిచిపెట్టనివ్వొద్దంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ హెచ్చరించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లుగా 156 టీఎంసీల నీటి విడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పింది. 2018-19 సంవత్సరానికి నీటి కేటాయింపులపై స్పష్టత రాకుండా ఏపీకి 35 టీఎంసీలు, తెలంగాణకు 82.50 టీఎంసీలు కేటాయింపులే ఉంటాయని పేర్కొంది. వాస్తవానికి 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు రావాల్సి ఉండగా.. ఏపీకి 36.87, తెలంగాణకు 63.13ు చొప్పున తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు లెక్క కట్టారు. ఈ మేరకు ఏపీకి 123.184 టీఎంసీలు, తెలంగాణకు 71.943 టీఎంసీలు వస్తాయని వెల్లడించారు.. ఏపీకి రావాల్సిన నీటి వాటా 123.184 కంటే.. 22.834 టీఎంసీలు అధికంగా.. అంటే 146.018 టీఎంసీలు వాడేసిందని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో మురళీధర్‌రావు ఆరోపించారు.
 
తెలంగాణ వాటా 71.943 టీఎంసీలలో 22.834 టీఎంసీలు తక్కువగా.. అంటే 48.109 టీఎంసీలు మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 163 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఏపీ కోరినట్లు 156 టీఎంసీల విడుదల వీలుకాదని అభ్యంతరం తెలిపింది. ఇలా చేస్తే నవంబరు నెలలో నీటి కష్టాలొస్తాయంది. 2019 జూలై దాకా నీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున ఏపీ 156 టీఎంసీలు కోరడం సముచితం కాదని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జూలై దాకా నీటి అవసరాల గురించి మురళీధర్‌రావు పేర్కొనడం చర్చనీయాంశమైంది. కాగా, కృష్ణా ట్రైబ్యునల్‌ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవనున్నాయి
Link to comment
Share on other sites

  • 2 weeks later...
శ్రీశైలం విహార యాత్రకు ఏర్పాట్లు పూర్తి

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ యాత్రకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యాత్రకు నాగసిరి లాంచీని ముస్తాబు చేస్తున్నారు. సాగర్‌ నుంచి శ్రీశైలం వెళ్లి, తిరిగి సాగర్‌ వచ్చేందుకు పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2800లు, సాగర్‌ నుంచి శ్రీశైలం (ఒన్‌వే) వెళ్లేందుకు పెద్దలకు రూ.1290, పిల్లలకు రూ.1032 టిక్కెట్‌ ధర నిర్ణయించారు. ఉదయం 9గంటలకు విజయపురిసౌత్‌ నుంచి లాంచీ యాత్ర ప్రారంభమవుతుంది.  10 గంటలకు నాగార్జునకొండకు చేరుకుంటుంది. అక్కడ మ్యూజియం సందర్శించాక, అనంతరం శ్రీశైలం బయల్దేరుంది. జెండాపెంట,  కయ్యా, పావురాలగుట్ట, ఆలటం మీదుగా సాయంత్రం 4.30 గంటలకు శ్రీశైలంలోని లింగాలగట్టుకు లాంచీ చేరుకుంటుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏపీ టూరిజం హరితహోటల్‌కు చేరుస్తారు. అక్కడ బస ఉంటుంది. ఉదయం శ్రీశైల మల్లికార్జునుని దర్శనం, అనంతరం బ్రేక్‌పాస్ట్‌, తర్వాత శ్రీశైలంలో బోటింగ్‌ పర్యటన ఉంటుంది. అనంతరం లింగాలగట్టుకు  పర్యటకులు చేరుకుని అక్కడ నుంచి లాంచీలో సాగర్‌కు పయనమవుతారు. సాయంత్రం 4గంటలకు విజయపురి సౌత్‌కు చేరుకుంటారు. రూ.లాంచీలో అల్పాహారం, భోజనం అందజేస్తారు. దీంతో పాటు బస, దర్శనం, రోప్‌వే, బోటింగ్‌ షికారు సౌకర్యం కల్పిస్తారు. ఒన్‌వే ప్యాకేజీలో భోజనం, స్నాక్స్‌ మాత్రం ఉంటుంది. ఏర్పాట్లు పూర్తవడంతో రెండు మూడు రోజుల్లో సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ టూర్‌ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
లాహిరి.. లాహిరి.. లాహిరిలో..!
04-10-2018 04:24:47
 
636742238870830758.jpg
  •  కృష్ణానదిలో బోటు ప్రయాణం
  •  సాగర్‌ నుంచి శ్రీశైలానికి టూర్‌
  •  10 నుంచి సర్వీసు ప్రారంభం
శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబరు 3: నదీ ప్రయాణాన్ని ఆస్వాదించే వారికి ఇది శుభవార్త. నాగార్జుసాగర్‌ నుంచి శ్రీశైలానికి కృష్ణానదిలో బోటు ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచీ ఈ సర్వీసు మొదలు కానుంది. పర్యాటకులకు నల్లమల, కృష్ణానది అందాలను చూపించడంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్ఠాదశ శక్తిపీఠమైన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబాదేవి దర్శనాన్ని కల్పించనున్నారు. వారంలో రెండు రోజులు బుధవారం, శుక్రవారం ఈ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 80 సీట్లు కలిగిన అగస్త్య బోటు 80, వంద సీట్లు సామర్థ్యం ఉన్న నాగసిరి బోటును సిద్ధం చేశారు.
 
నాగార్జునసాగర్‌ నుంచి బయలుదేరిన లాంచీ నాగార్జునకొండ(మ్యూజియం)ను సందర్శించి, దిండి ప్రాజెక్టు, జెండా పెంట, నక్కంటివాగు, పావురాలపెంట, ఎస్‌ టర్నింగ్‌, ఖయ్యాం, ఆలాటం, ఇనుపరాయకొండ, వజ్రాలమడుగు, టెయిల్‌పాండ్‌ డ్యాం మీదుగా శ్రీశైలం సమీపంలోని లింగాలగట్టుకు చేరుకుంటుంది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీలో ప్రయాణానికి రానుపోను టికెట్టు ధర పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,800గా నిర్ణయించారు. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి సాగర్‌కు (వన్‌ వే)టికెట్టు ధర పెద్దలకు, పిల్లలకు రూ.1,290గా ఖరారు చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...