Jump to content

Nagarjuna Sagar


Recommended Posts

  • Replies 99
  • Created
  • Last Reply

inka next monsoon rains varaku agalemo sagar nindalante

 

S.NO.ReservoirFull Reservoir Level in Ft.Date and TimeLevel in feetStorage in T.M.C.Instant Inflow in CusecsInstant Outflow in Cusecs

1SRISAILAM              885.00  27-08-2018 6:00 PM   883.5   207.41  1,42,244  1,01,149

2NAGARJUNA SAGAR  590.00  27-08-2018 6:00 PM   574.2   267.11  72,986    9,086

3Dr.KLRS Pulichintala  175.00  27-08-2018 6:00 PM   136.35  8.34    2,777   0

Link to comment
Share on other sites

14.83లక్షల ఎకరాల సాగు
మూడేళ్ల తర్వాత సాగర మాగాణి ఆయకట్టుకు నీరు
  సెప్టెంబరు తొలి వారంలో  విడుదలకు ప్రణాళిక
ఈనాడు - గుంటూరు
29ap-main4a.jpg

మూడేళ్ల తర్వాత ఆశావహ పరిణామం.. నాగార్జున సాగర్‌ కాలువల కింద వరిసాగుకు నీటిని విడుదల చేయాలనే నిర్ణయం.. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని జలాశయాలకు ప్రవాహాలు సంతృప్తికరంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాగర్‌, శ్రీశైలం జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరువ కావడంతో ఖరీఫ్‌ సీజన్‌లో కాలువల కింద ఆయకట్టుకు సాగునీటి భరోసా లభించింది. సాగర్‌ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ఎడమ కాలువ కింద కృష్ణా జిల్లాలో సాగునీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ప్రతిపాదనలు పంపింది. అనుమతించిన వెంటనే కాలువలకు నీటిని విడుదల చేస్తుంది. సకాలంలో వరిసాగుకు కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. మూడేళ్లుగా వరి పంటకు సాగునీరు విడుదల చేయకపోవడంతో సాగర్‌ కుడికాలువ పరిధిలో రైతులు తిండిగింజలూ కొనుగోలు చేయాల్సి వచ్చింది. కాలువల్లో ప్రవాహం లేక భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగింది. 1200 అడుగుల లోతుకు అడుగంటాయి. వేసవిలో   పశువులకు మేత లేక పొరుగు జిల్లాలకు పశువులతో వలసలు వెళ్లారు. కాలువలకు నీటివిడుదల లేక మాగాణి పంటల స్థానంలో సజ్జ, కంది, అపరాలు పంటలు సాగుచేశారు. అపరాలకు ధరలు లేక, ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతుండగా.. తాజాగా జలాశయాల నుంచి నీటివిడుదలకు నిర్ణయించడంతో రైతులు ఆనందంగా సాగుకు సిద్ధమవుతున్నారు. కాలువల కింద వరిపంట సాగయితే రైతులతోపాటు కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సాగర్‌ ఎడమ కాలువ కింద రెండో జోన్‌లో సెప్టెంబరు తొలి వారంలో వరిసాగుకు నీరిస్తారు. మూడో జోన్‌ కింద నవంబరు 15 తర్వాత ఆరుతడి పంటలకు సాగునీరు అందించేలా జలవనరులశాఖ ప్రణాళికకు రూపమిచ్చింది. నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద ఆయకట్టు, తాగునీటి అవసరాలకు 132 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఈ మేరకు జలవనరులశాఖ కేఆర్‌ఎంబీకి ప్రతిపాదనలు పంపింది. అయితే గుర్తించిన దానితోపాటు అనధికారికంగా అదనపు ఆయకట్టుకు సాగునీరు వినియోగించుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితులతో కేటాయింపులకు మించి నీటిని కొన్నిసార్లు అదనంగా వాడుకుంటున్నారు. 2014-15లో 132 టీఎంసీలకుగాను 158 టీఎంసీల నీటిని వినియోగించారు.

29ap-main4b.jpg
Link to comment
Share on other sites

నాగార్జున సాగర్‌కు జలకళ.. గేట్లు ఎత్తివేసే అవకాశం!
31-08-2018 13:38:11
 
636713194931258839.jpg
నాగార్జున సాగర్‌కు జలకళ సంతరించుకుంది. దీంతో శుక్రవారం అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వరద ప్రవాహన్ని బట్టి ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని వదలడంతో సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ఇది 585 అడుగులకు చేరే అవకాశం ఉంది.
 
దిగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. పైన ఉన్న అల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. దిగువకు లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్షా 35వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా దిగువకు లక్షా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జురాలకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, దిగువకు 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది.
Link to comment
Share on other sites

Thats good news. Pulichinthala kuda nimpukovatchu

But , why not releasing at full capacity to Sagar right? still its only 5k (as per print media news)

Instead its going to Pulichinthala - today 29K inflow

 

Link to comment
Share on other sites

Eenadu - Guntur Edition

శ్రీశైలం లాంచీ  సర్వీసుకు సన్నాహాలు

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే:  ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సర్వీసును నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీశైలం పర్యటక డివిజన్‌ మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌ గురువారం తెలిపారు. వి.పి.సౌత్‌లో ఆయన సాగర్‌ డీవీఎం బాబ్జీతో కలిసి లాంచీలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలానికి లాంచి సర్వీసు తిప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అటవీశాఖ అనుమతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో ఎత్తిపోతల్లో లైటింగ్‌ సిస్టమ్‌ను పునః ప్రారంభించినట్లు డీవీఎం అన్నారు. వారి వెంట ఎత్తిపోతల మేనేజర్‌ వంశీ, సూపర్‌వైజర్లు భాస్కరావు, స్వామి, సుందరరావు, వినయతుల్లా తదితరులున్నారు.

 

Only runs until 570 ft

Link to comment
Share on other sites

13 hours ago, rk09 said:

Thats good news. Pulichinthala kuda nimpukovatchu

But , why not releasing at full capacity to Sagar right? still its only 5k (as per print media news)

Instead its going to Pulichinthala - today 29K inflow

 

It's going from tail pond not directly from sagar.... they built tail pond to store water used for power generation.. that water can go back to dam when needed(using reverse pumping).. now the dam is close to full capacity they are releasing water from tail pond to pulichintala

Link to comment
Share on other sites

సాగర్‌కు జలకళ!
01-09-2018 00:37:48
 
636713590698381528.jpg
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి నిలకడగా కొనసాగుతున్న ప్రవాహంతో జలాశయం నిండుకుండలా మారింది. మూడురోజులుగా ఇక్కడి నీటిమట్టం రోజుకో అడుగు చొప్పున పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 312.05టీఎంసీలు కాగా, శుక్రవారం రాత్రికి 583అడుగుల వద్ద 290.2255 టీఎంసీల నీరు చేరింది. మరో రెండు అడుగుల మేర నీరు చేరితే సాగర్‌ క్రస్ట్‌గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టుకు 84,,900క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
 
 
ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి, రెండు రోజుల్లో సాగర్‌ గేట్లను ఎత్తే అవకాశం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక్కడినుంచి 8యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేసి 35వేల క్యూసెక్కుల నీటిని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద ఉన్న టెయిల్‌పాండ్‌కు విడుదల చేస్తున్నారు. భారీగా వరద నీరు వస్తుండటంతో టెయిల్‌పాండ్‌ 5క్రస్ట్‌గేట్లను శుక్రవారం తొలిసారిగా ఎత్తి పులిచింతల ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేశారు.
 
9srisailam1.jpg 
శ్రీశైలం క్రస్ట్ గేటు నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు
 
9tailpond2.jpg 
సత్రశాల వద్ద సాగర్ టెయిల్ పాండ్ నుంచి కృష్ణమ్మ పరుగులు 
Link to comment
Share on other sites

1 hour ago, vadlamudi sp said:

It's going from tail pond not directly from sagar.... they built tail pond to store water used for power generation.. that water can go back to dam when needed(using reverse pumping).. now the dam is close to full capacity they are releasing water from tail pond to pulichintala

TG is not using reverse pumping

but my concern is, why they are not increasing discharge capacity to right canal? its still below 5K

Link to comment
Share on other sites

పులిచింతల వైపు కృష్ణమ్మ 
ఈ ఏడాది పూర్తిస్థాయి  నీటినిల్వకు ప్రణాళిక 
సాగర్‌ టెయిల్‌పాండ్‌  5 గేట్లు ఎత్తివేత 
కృష్ణానదిలో పెరుగుతున్న నీటి ప్రవాహం 
31ap-main18a.jpg

ఈనాడు-గుంటూరు, మాచర్ల, రెంటచింతల, న్యూస్‌టుడే: కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో నదిలో నీటిప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరువ కావడంతో దిగువకు నీటివిడుదల మొదలైంది. నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌ దిగువన ఉన్న సత్రశాల టెయిల్‌పాండ్‌ డ్యామ్‌ నిండిపోవడంతో శుక్రవారం 5గేట్లు ఎత్తి పులిచింతలకు విడుదల చేశారు. అనుకున్న సమయానికన్నా ముందుగానే ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు ఎస్‌ఈ శేషారెడ్డి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా గతంలో 33 టీఎంసీలు నిల్వచేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 115 కిలోమీటర్ల మేర నది ప్రయాణిస్తుంది. దీంతో ఉదయం విడుదల చేసిన నీరు ఇంకా పులిచింతలకు ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. శుక్రవారం సాయంత్రానికి 29,399 క్యూసెక్కుల నీరు చేరుతుండగా కృష్ణాడెల్టా అవసరాలకు 5094 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

శ్రీశైలానికి పెరుగుతున్న వరదనీరు 
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,29,350 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల, తుంగభద్ర నుంచి 2లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదలైంది. ఈ నీరు దిగువకు విడుదల చేస్తారు. శ్రీశైలం గరిష్ఠమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.1 అడుగులతో 205.23టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా 582.5 అడుగులు నీటినిల్వతో 290.23 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి వరదనీటి నిర్వహణ చేపడుతారు. సాగర్‌ కుడి, ఎడమ కాలువలకు 10వేల క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1500క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 22 టీఎంసీలు మాత్రమే నిల్వచేసే వెసులుబాటు ఉంది. ఎగువనుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి 585 అడుగులకు నీరు చేరిన తర్వాత గేట్ల ఆపరేటింగ్‌పై నిర్ణయం తీసుకుంటారని జలవనరులశాఖ ఇంజినీరు చెప్పారు. విద్యుదుత్పత్తి, కాలువలకు కలిపి 50 వేల క్యూసెక్కులకు మించి విడుదల చేసే అవకాశం లేనందున వరద పెరిగితే గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తారు.

31ap-main18b.jpg

పులిచింతలలో పూర్తయిన పునరావాసం: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొన్నిగ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు పూర్తయినందున ప్రాజెక్టులో గరిష్ఠ నీటినిల్వకు మార్గం సుగమమైందని గుంటూరు జిల్లా సంయుక్తపాలనాధికారి ఏఎండీ. ఇంతియాజ్‌ తెలిపారు. నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నందున ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఖాళీచేయాలని రెవెన్యూవర్గాలకు సమాచారం ఇచ్చామని పులిచింతల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు జె.రమేష్‌బాబు చెప్పారు. మూడురోజుల్లో నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసేందుకు కసరత్తు పూర్తిచేశామన్నారు. పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం వల్ల కృష్ణాడెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీటికి భరోసా లభిస్తుంది.

Link to comment
Share on other sites

నేడు తెరుచుకోనున్న సాగర్‌ గేట్లు 
నిండుకుండలా జలాశయం 
శ్రీశైలానికి 1.80లక్షల క్యూసెక్కుల వరద 
1ap-state1a.jpg

ఈనాడు, హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: కృష్ణానది పరవళ్లతో నాగార్జునసాగర్‌  తొణికిసలాడుతోంది. దీంతో జలాశయం నుంచి ఆదివారం ఉదయం ఎనిమిదిగంటలకు గేట్లు తెరిచి వరదను టెయిల్‌పాండ్‌వైపునకు విడుదల చేయనున్నారు. శనివారం రాత్రికి జలాశయంలో నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 296 టీఎంసీలను దాటింది. ఎగువ నుంచి 1.55 లక్షల క్యూసెక్కులు వస్తుండగా విద్యుదుత్పత్తి, కాలువలు కలుపుకొని 45 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలోకి 1.80 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల నుంచి లక్ష క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయం నీటితో కళకళలాడుతోంది. విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌వైపునకు 1.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ భాగంలో ఆలమట్టి వద్ద వరద తగ్గుముఖం పట్టింది. 70 వేల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 45 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి కూడా 45 వేల క్యూసెక్కులే వస్తున్నాయి. దిగువకు 24 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. గోదావరి పరివాహకంలో పరిస్థితిలో మార్పు లేదు.

Link to comment
Share on other sites

నేడు సాగర్‌ గేట్ల ఎత్తివేత
02-09-2018 02:24:20
 
636714518622700443.jpg
  • 585 అడుగులకు చేరుకున్న నీటిమట్టం..
  • నాలుగేళ్ల తర్వాత తెరుచుకోనున్న గేట్లు
  • ఎగువనుంచి కొనసాగుతున్న భారీ వరద
  • పులిచింతలలో 15మెగావాట్ల విద్యుదుత్పత్తి
  • శ్రీశైలానికి 1.33లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • జూరాల 11గేట్ల ద్వారా నీటి విడుదల
ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌: నాలుగేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ డ్యాం గేట్లు తెరుచుకోనున్నాయి. ఎగువ నుంచి జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది. దీంతో ఆదివారం ఉదయం 8గంటల సమయంలో 5గేట్లు 10అడుగుల మేర ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడానికి తెలంగాణ అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. భారీ వరదలు రావడంతో 2014 సెప్టెంబరు 26న సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05టీఎంసీలు కాగా ప్రస్తుతం 295.4155టీఎంసీల నిల్వ ఉంది. జలాశయానికి 1,40,513 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 44,120క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పులిచింతల ప్రాజెక్టుపై నిర్మించిన విద్యుత్‌కేంద్రం ద్వారా శనివారం ఉదయం విద్యుదుత్పాదన ప్రారంభమైంది.
 
ప్రాజెక్టు నీటిమట్టం 142అడుగులకు చేరడంతో మొదటి యూనిట్‌ ఇన్‌టేక్‌ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో ఎస్‌ఈ సద్గుణ్‌ కూమార్‌ తెలిపారు. నీటిమట్టం 173అడుగులకు చేరితే పూర్తిస్థాయిలో 120మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు 35,998క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా అవుట్‌ఫ్లో 5,019క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.57టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.73టీఎంసీల నీరు చేరింది. ఇప్పటికే డెల్టాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13లక్షల ఎకరాలకు సాగు నీరందింస్తున్నారు. ఈ నీటి విడుదలను కొనసాగిస్తూనే పులిచింతలలో కృష్ణాజలాలను మార్చి వరకూ నిల్వచేస్తే తాగునీటి అవసరాలను కూడా తీర్చవచ్చని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...