Jump to content

Nagarjuna Sagar


Recommended Posts

  • Replies 99
  • Created
  • Last Reply
మసకబారిన మాగాణం 
మూడేళ్లుగా సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు అందని సాగునీరు 
వరి రైతుకు రూ.3,260 కోట్ల ఉత్పత్తి నష్టం 
బీళ్లుగా మారిన 95వేల ఎకరాలు 
అధికశాతం మెట్టగా మారిన వైనం 
పత్తి, కంది, సజ్జ, జూట్‌ వైపు మొగ్గు 
గిట్టుబాటు  ధరలు దక్కని తీరు 
తిండిగింజల నుంచి పశువుల మేత దాకా కొనుక్కోవాల్సిందే.. 
29ap-main12a.jpg
మూడేళ్ల నుంచీ సాగునీరు లేక నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు మాగాణిలో 95వేల ఎకరాల వరకు బీడుగా మారింది. అందులో నిలువెత్తు కంపచెట్లు పెరిగాయి. మాగాణి కాస్త మెట్టగా మారిపోతోంది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల బాట పట్టినా అవీ కలిసి రావడం లేదు. పత్తికి గులాబీరంగు పురుగు, కంది, జూట్‌ తదితర పంటలకు ధర దక్కడం లేదు. మూడేళ్లుగా నీరివ్వకపోవడం వల్ల ఆయకట్టు పరిధిలోని 61 మండలాల రైతులు రూ.3,260 కోట్ల వరి ఉత్పత్తిని నష్టపోయారు. ధాన్యపు రాశులతో కళకళలాడే నట్టిళ్లలోకి.. పట్టణాల నుంచి తెచ్చిన పాతిక కిలోల బియ్యం బస్తాలు వచ్చాయి. పాడి పశువులకు మేత లేక లారీలలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. వ్యవసాయ కూలీలు ఉపాధి వెదుక్కుంటూ పట్టణాలకు వలస పోతున్నారు.

నీరందక కుడికాలువ ఆయకట్టులోని మాగాణిలో 22 శాతం బీడుగా మారింది. పశువులు   మేపడానికే ఉపయోగపడుతున్నాయి. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రొంపిచర్ల ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లో  సమస్య అధికంగా ఉంది.


మాగాణి నుంచి పత్తికి..
దర్శి మండలంలో మూడేళ్లుగా ఆయకట్టులో మెట్ట పంటలసాగు పెరుగుతూ వస్తోంది. గట్లు పగలగొట్టి మెట్టగా మార్చాలంటే ఎకరాకు రూ.2వేలకు పైనే ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, గురజాల, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల పరిధిలో మాగాణి భూముల్లో పత్తి, మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. నీరొచ్చినప్పుడు వీటిని మళ్లీ మాగాణిగా మార్చాలంటే ఎకరాకు రూ.5వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గుంటూరు జిల్లా కొమెరపూడి రైతు ఎర్రా శివయ్య వివరించారు.

నాడు 4.25 లక్షల క్వింటాళ్ల  ధాన్యం.. నేడు 1.31 లక్షల క్వింటాళ్ల కందులు 
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి ప్రాంతంలో కంది, జూట్‌, సజ్జ ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంగులూరు, మేదరమెట్ల, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో జూట్‌ వేసినా కొనేవారే కరవయ్యారు. ఈ జిల్లాలోని మండలాన్నే తీసుకుంటే మూడొంతులు సాగర్‌ ఆయకట్టు పరిధిలోనిదే. మూడేళ్లుగా నీళ్లు లేక ఈ ఒక్క మండలంలోనే ఏడాదికి రూ.65.87 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ బోర్లు, బావుల కిందనే నాట్లు పడుతున్నాయి. మాగాణి సాగు అధికంగా ఉండే గ్రామాల్లో ఒకటైన రాజంపల్లిలో 90 శాతం విస్తీర్ణం కంది కిందకు వచ్చింది. గతంలో ఏటా పదెకరాలు వరి వేసి 300 బస్తాల వరకు పండించే మాదల శ్రీనివాసరావుకు గతేడాది కంది వేస్తే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అదీ మద్దతు ధరపై అమ్మితే పెట్టుబడులైనా వచ్చాయని వివరించారు. కందికి వేరుపురుగు ఆశించి నష్టపోతున్నామని రైతులు గుర్రం ప్రసాద్‌, తోట ఏడుకొండలు, బి.శ్రీనివాసులు తదితరులు వివరించారు.


గోదారమ్మపైనే ఆశ.. 
29ap-main12b.jpg
కృష్ణా జలాల రాక కరవైన పరిస్థితుల్లో ప్రభుత్వం గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతులకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించింది. గోదావరి వరద కాలంలో 73 టీఎంసీలు తెచ్చేలా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా తొలిదశ పేరుతో రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్లు పిలిచింది. గోదావరి నుంచి వరద జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటికే ప్రకాశం బ్యారేజికి తెచ్చి కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల ద్వారా మరో 7000 క్యూసెక్కులు అదనంగా తీసుకువచ్చి సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ప్రకాశం బ్యారేజి ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతల ద్వారా అయిదు దశల్లో ఎత్తిపోసి నకరికల్లు మండలం నరసింగపాడు వద్ద సాగర్‌ కుడికాలువలో కలుపుతారు. జులై నెలాఖరుకల్లా గుత్తేదారులను ఖరారు చేసి ఆగస్టులో శంకుస్థాపన చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ కాలానికి ఈ నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సాగర్‌ ఆయకట్టులో పలువురు రైతులతో మాట్లాడినపుడు ఈ ప్రాజెక్టుపైనే ఎక్కువ మంది ఆసక్తి కనబర్చారు. ఇది పూర్తయితే సాగుకు ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
లక్షల బస్తాలు పండించిన ఊళ్లోనే..
ఆయకట్టు పరిధిలోని వందలాది గ్రామాల్లో ఎటు చూసినా ధాన్యం నిల్వలుండేవి. వరి వేసే ప్రతి రైతు ఇంట్లోనూ 20 బస్తాలకు పైగా తిండిగింజల కోసం ఉంచి మిగిలినవి విక్రయించేవారు. సాగు లేకపోవడంతో ఇప్పుడు 90 శాతం రైతులు నెలనెలా బియ్యం  కొనుక్కుంటున్నారు.
29ap-main12c.jpg29ap-main12e.jpg
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి.. మొత్తం 4 వేల ఎకరాల విస్తీర్ణంలో 3 వేల ఎకరాలు మాగాణి ఉండేది. ఖరీఫ్‌, రబీల్లో కలిపి మొత్తం 1.30 లక్షల బస్తాల ధాన్యం పండించిన గ్రామం ఇది.. కూలీలకు చేతినిండా పని దొరికేది. ఇప్పుడీ ఊళ్లోని కిరాణా దుకాణాల్లో పట్టణం నుంచి బియ్యం తెచ్చి అమ్ముతున్నారు. ‘‘పంట లేనప్పుడు ఏం చేస్తాం.. నెలకు 40 కిలోల బియ్యం కొనుక్కుంటున్నాం.’’ అని గతంలో ఏటా 150 బస్తాలు పైగా అమ్మే చల్లా అర్జునరెడ్డి, ముప్పాళ్ల రైతు దొంతి కృష్ణారెడ్డిలు వివరించారు. ‘‘కొమెరపూడిలో వరి పంటపై ఎరువులు, పురుగు మందుల వ్యాపారం రూ.3కోట్లకు పైగా జరుగుతుంది. మూడేళ్లు పాటు సాగర్‌ నీరివ్వకపోవడంతో వ్యాపారం రూ.30లక్షలకు పడిపోయిందని’’ వ్యాపారి తటవర్తి సత్యనారాయణ పేర్కొన్నారు.
జలసిరుల కోసం.. మేడపి తహ.. తహ.. 
29ap-main12f.jpg
సాగర్‌ నీరు రాకపోవడంతో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలో 80 శాతం మాగాణి పొలం మెట్టగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ జలసిరిని అందిపుచ్చుకుని కంది, మొక్కజొన్న, సజ్జ, పత్తితోపాటు కూరగాయలు, పండ్లతోటలు వేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 76 ఎన్టీఆర్‌ జలసిరి బోర్లు వేసి మోటార్లు బిగించారు. ఇదే సమయంలో 70 పైగా విద్యుత్తు ఆధారిత బోర్లు కూడా అమర్చారు.

కూలీలు.. సిమెంటు పనులకు 
వరిసాగుంటే ఎకరాకు 40 మంది వరకు కూలీల అవసరం ఉండేది. ఇప్పుడు వారందరికీ పని దూరమైంది. దీంతో కూలీలు ఇప్పుడు పట్టణాల్లో సిమెంటు, అపార్టుమెంట్ల నిర్మాణ పనులకు వెళ్తున్నారని కొమెరపూడి రైతు చల్లా కొండారెడ్డి పేర్కొన్నారు.

పశువుల మేతకూ కష్టాలే 
ఇంటికి నాలుగైదు మేలుజాతి పశువులతో.. పాల ఉత్పత్తి అధికంగా ఉండే ఈ గ్రామాల్లో ఇప్పుడు ఎకరా వరిగడ్డిని రూ.12వేల చొప్పున కొనుక్కోవాల్సి వస్తోందని దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం రైతు మేడం పద్మారెడ్డి వివరించారు.

కౌలుకూ వెనకడుగు.. 
బొల్లాపల్లి వెల్లటూరులో వేణుగోపాలస్వామి దేవాలయ భూములు వేలం వేస్తే 18 ఎకరాలకు గతంలో రూ.1.18 లక్షలు పలికిన భూములు ఈ ఏడాది రూ.42 వేలకే తీసుకున్నారు. కోటప్పకొండ భూములు ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాక మూడుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

ఎక్కువ నష్టపోయింది ఇక్కడి రైతాంగమే.. 
రాష్ట్ర విభజన తర్వాత.. సాగుపరంగా నాగార్జునసాగర్‌ కుడికాలువ రైతాంగమే ఎక్కువగా నష్టపోయింది. దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి నీరు తెచ్చి ఇస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి సరఫరా జరుగుతోంది. మధ్యలో ఉన్న కుడికాలువ ఆయకట్టులోనే మాగాణి సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది.

29ap-main12d.jpg 
29ap-main12g.jpg 
29ap-main12h.jpg 
29ap-main12i.jpg
 
 
Link to comment
Share on other sites

56 minutes ago, Peter Griffin said:

motham SRISAILAM,NS,Pulichintala, nindataniki 240 TMC kavali :nerd:

Total 175 TMC bro kavali bro

Srisailam lo 12 TMC

NS 126 TMC

Pulichintala 37 TMC

 

Prathi dam lo Full capacity ki 5-6 TMC fill cheyyaru.. so full capacity ki -5 TMC cheyandi

 

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 hours ago, Seniorfan said:

asale neellu levu ani edusthunte.....NS lo electricity enduku generate chesthunnaru ?? full ayye varaku agachhu kada?

Tg Dora donga yeshalu

Link to comment
Share on other sites

45 minutes ago, Seniorfan said:

Ippudu delta ki requirement vundha? pattiseema cover chesthundhi kada..

ippdu power generation ekkada chesaru 10 days before chesaru power generation 

 

pattiseema water ela sarripotay only 7500 cusecs kada so pulichinthala lo vunna  2 tmc use chesukonnaru + sagar nundi around 2tmc use chesaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...