Jump to content

Srisailam Project


Recommended Posts

  • Replies 249
  • Created
  • Last Reply
21 hours ago, Jaitra said:

Pothireddypaadu tap open chesi,Rayalaseema ki ivvandi water.

srisailam lo above 850ft vunte - free flow (12K cusecs official - unoffcial 20K +)

Handri neeva ki 810 + vunte chalu (lift pumps - total 60+ pumps - max 3K cusecs)

KC kanal - from Sunkesula - (max 4K cusecs - thru gravity)

Link to comment
Share on other sites

21 minutes ago, rk09 said:

srisailam lo above 850ft vunte - free flow (12K cusecs official - unoffcial 20K +)

Handri neeva ki 810 + vunte chalu (lift pumps - total 60+ pumps - max 3K cusecs)

KC kanal - from Sunkesula - (max 4K cusecs - thru gravity)

Thanks for the details bro

Link to comment
Share on other sites

45 minutes ago, AnnaGaru said:

IST 10PM, srisailum reached 1.9 and expected to touch 2 lakh+....:pepper:

 

mahabaleswar(krishna borth place) got 100MM rain toda:pepper:

Happy tears :Sunil Eyes tuduchukone gif: 

I pray God for these rains to continue 

Link to comment
Share on other sites

AP prajalara record flood's(not seen in last few decades in July itself) expected with more rains on Friday ......vayinchadni

:pepper:

Maharashtra released nearly 2 lakh cusecs of water into the Krishna river on Friday resulting in floods at many places in Belagavi district(Karnataka)

Hippargi barrage(just before Alamatti) is receiving 2.03 lakh cusecs, while the outflow is 2.02 lakh cusecs :pepper:. Flood alerts have been issued to villagers across Krishna, Doodhganga and Vedganga rivers(happy for us but be safe KA folks)



Read more at: https://www.deccanherald.com/state/belagavi-dist-faces-flood-682543.html

 

X9BnqV.gif

Link to comment
Share on other sites

శ్రీశైలానికి జలకళ
804 అడుగులకు చేరిన నీటిమట్టం
 తుంగభద్రకు కొనసాగుతున్న వరద
20ap-main2a.jpg

సున్నిపెంట సర్కిల్‌, బెళగావి, ధవళేశ్వరం,హొసపేటె,న్యూస్‌టుడే: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం 1,73,000 క్యూసెక్కుల ప్రవాహం నుంచి రాత్రి 7 గంటలకు 1,76,050కు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు గేజింÞ్ సిబ్బంది తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి శ్రీశైలం ఆనకట్ట నీటిమట్టం 804.70 అడుగులు, నీటి నిల్వసామర్థ్యం 31.3963 టీఎంసీలుగా నమోదైంది.

సముద్రంలోకి 3.75లక్షల క్యూసెక్కుల నీరు
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 8 అడుగులకు చేరుకుంది. ఆనకట్ట నుంచి సముద్రంలోకి 3,75,513 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 1,700, పశ్చిమ డెల్టాకు 3,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 175 గేట్లను మీటరు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.

20ap-main2b.jpg

తుంగభద్రకు తగ్గని వరద
తుంగభద్రకు వస్తున్న వరద పరిమాణంలో శుక్రవారం సాయంత్రం కొంత పెరుగుదల కనిపించింది. ఉదయం కొంత మేరకు వరద తగ్గడంతో 20 గేట్ల ద్వారా సుమారు 60 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. సాయంత్రం వరద రాక 70,416 క్యూసెక్కులకు పెరిగింది. మళ్లీ 22 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 63,118 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శివమొగ్గ జిల్లా శృంగేరి వద్ద ఉన్న తుంగా జలాశయం నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం అందాలను చూడటానికి సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

ఆలమట్టికి మరింత నీరు
మహారాష్ట్రలో భారీ వర్షాలకు కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కృష్ణానది తీవ్రరూపం దాల్చింది. చిక్కోడి, రాయబాగ్‌, అథణి తాలూకాల్లో నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. పడవ సదుపాయం కల్పించాలని గ్రామస్థులు డిమాండు చేశారు. మహారాష్ట్ర నుంచి రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలమట్టి జలాశయానికి 1,71,856 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,73,828 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆలమట్టి నీటితో నారాయణపుర జలాశయం నుంచి కూడా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయానికి 1,81,486 క్యూసెక్కుల నీరు చేరుతుండగా జలాశయం నుంచి 17,806 క్యూసెక్కుల నీరు తెలంగాణలోని జూరాల జలాశయానికి విడుదల చేస్తున్నారు.

బలపడిన అల్పపీడనం
ఈనాడు, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉందని తెలిపింది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కలిసి కదులుతోంది. ఆదివారంలోగా వాయుగుండంగా బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది క్రమంగా భూభాగంవైపు కదులుతుందని తెలిపారు. దీని ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. రానున్న 4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. ఉత్తర మధ్యప్రదేశ్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌ను ఆనుకుని మరో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు.
Link to comment
Share on other sites

రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి
22-07-2018 08:57:49
 
636678466685220099.jpg
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో- 1,86,527 క్యూసెక్కులుగా ఉంది. కాగా.. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 834 అడుగులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 53.85 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది.
Link to comment
Share on other sites

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి
22-07-2018 14:11:16
 
636678654755656704.jpg
ఆంధ్రజ్యోతి: ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ బిరబిరమంటూ పరుగులెడుతోంది. ఆల్మట్టి నుంచి, నారాయణపూర్, అక్కడ నుంచి జూరాల నుంచి ఉరుకుల పరుగులతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 12 గంటల్లో 10 టీఎంసీలకుపైగా వరద ప్రవాహం వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ ఇన్‌ఫ్లో 2.38లక్షల క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 825 అడుగులకు చేరుకుంది. మరో మూడు రోజుల పాటు వరద కొనసాగే అవకాశముంది.
 
శ్రీశైలం నిండాక కానీ సాగర్‌కు నీరు వెళ్లే అవకాశం లేదు. 10 రోజులుగా కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువన ఉన్న జలాశయాలు ఒక్కొక్కటిగా నిండుతున్నాయి. వాటి గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణమ్మ శ్రీశైలానికి పోటెత్తింది. సాగర్‌కు నీరు విడుదల కావాలంటే వరద ప్రవాహం చాలా రోజులు కొనసాగాల్సి ఉంటుంది.
 
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 52 వేల 450 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ నుంచి 45 వేల క్యూసెక్కులు కలిపి లక్షా 97 వేల 450 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. రోజుకు సగటున 15 నుంచి 17 టీఎంసీల వరకు నీరొస్తోంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 10 నుంచి 15 రోజుల్లోగా ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు చేరుతుందని, ఆ తర్వాత వచ్చే వరదను గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
23-07-2018 08:24:48
 
636679310872393213.jpg
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2.46 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్‌ ఫ్లో నిల్‌గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 846.5 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 72.78 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
Link to comment
Share on other sites

రీశైలం ప్రాజెక్టుకు జలకళ
23-07-2018 17:53:53
 
636679652327693409.jpg
శ్రీశైలం: జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం మొన్నటి వరకు నీకు లేక వెళవెళబోయింది. అయితే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్మట్టి, నారాయణపూర్, జురాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,29,165 క్యూసెక్కులు. కాగా ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే 10రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుంది. శ్రీశైలం జలాశయం నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 75 టీఎంసీల నీరు ఉంది. కర్ణాటక, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. అక్కడి నుంచి దిగువన ఉన్న జురాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. జురాల నుంచి శ్రీశైలం జలాశయానికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

రీశైలానికి జలకళ
25-07-2018 03:21:53
 
636680857131536555.jpg
  • 856 అడుగులకు చేరిన నీటిమట్టం
విశాఖపట్నం/కర్నూలు, జూలై 24(ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు, సుంకేసుల జలాశయం నుంచి శ్రీశైలంలోకి 2,14,687 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో 856 అడుగుల వద్దకు నీటి నిల్వ చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. రోజుకు సగటున 15-16 టీఎంసీలు జలాశయంలో చేరుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు వరద ప్రవాహం మరింత పెరిగింది. దీంతో, 22 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 68,014 క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణా బ్యాక్‌ వాటర్‌లో సంగమేశ్వర క్షేత్రం జలాధివాసానికి చేరువలో ఉంది. ఇదిలావుంటే, నైరుతి రుతుపవనాలు బలహీన పడడంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఎండ ప్రభావంతో సాయంత్రానికి జల్లులు పడ్డాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...