Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

నూతన నౌకాశ్రయంపై కేంద్ర కమిటీ

Recommended Posts

నూతన నౌకాశ్రయంపై కేంద్ర కమిటీ

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో నూతన నౌకాశ్రయం ఎక్కడ నిర్మించాలో ఖరారు చేయడానికి కేంద్రం ముగ్గురు నిపుణులతో కమిటీ వేసింది. తొలుత నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రయం నిర్మించాలని భావించిన సంగతి తెలిసిందే. దానిపై అధ్యయనం చేసిన నీతిఆయోగ్‌ అధికారులు ఆ పోర్టు లాభదాయకం కాదని తేల్చేశారు. దుగరాజపట్నానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు, 80 కిలోమీటర్ల దూరంలోనే ఎన్నోర్‌, జేఎన్‌పీటీ పోర్టులు ఉన్నాయని, అవి సగటున 65 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కొత్త పోర్టు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నౌకాశ్రయం నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. రాజీవ ఆర్‌ సిన్హా నేతృత్వంలోని కమిటీ ఆరు నెలలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుంది.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×