Jump to content

Twist...!


SREE_123

Recommended Posts

చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు: రమణ దీక్షితులు 
18-07-2018 03:31:34
 
636674814954123184.jpg
  • ఆయన మనసులో ఏమీ లేదు!
  • సీఎం చంద్రబాబు శ్రీవారి భక్తుడే
  •  భక్తులు కోర్టుకెక్కుతారని ఆశించాను
  •  సాటి అర్చకుల్లోనూ మద్దతు దక్కలేదు: రమణ దీక్షితులు
చెన్నై, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏమీ లేదని... కొందరి ప్రోద్బలంతోనే తనపట్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు తెలిపారు. తాను గతంలో చేసిన ఆరోపణలపై భక్తుల నుంచి స్పందన కరువైందని, కొండమీదున్న సాటి అర్చకుల మద్దతుకూడా లభించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన చెన్నైలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మహా సంప్రోక్షణ సందర్భంగా దర్శనాలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. గతంలో తాను చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అన్నారు. వీలైనంత వరకు, పరిమిత సంఖ్యలోనైనా దర్శనాలకు అనుమతించాలని సీఎం అప్పటికే ఆదేశించారని విలేకరులు రమణ దీక్షితులు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించగ్గా... సీబీఐ విచారణ జరపాలని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ‘‘బోర్డులో ఉన్న వారంతా రాజకీయ నేతలే. ఎలాంటి దైవచింతన, సంస్కారం, దేవాలయాలపై నమ్మకం, హిందూ సంప్రదాయాలపై విశ్వాసం లేనివారే. అధికారులు కూడా అహంకారం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నవారే కానీ సేవాభావంతో వచ్చిన వారు కాదు’’ అని అన్నారు. సీఎంను కలిసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నించానని.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి కూడా వెనక్కి తిప్పిపంపారని ఆరోపించారు. ‘ఇప్పుడిచ్చినా కలుస్తా. సీఎం చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎస్వీ యూనివర్సిటీలో నాకు జూనియర్‌. నాకు బాగా పరిచయమైన వ్యక్తి. కొంతమంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు. మేమంతా స్వామివారి భక్తులమే. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకోవాలి’ అని తెలిపారు.
Link to comment
Share on other sites

Every one must watch this video and decide how desperate these people are and going any low level...
Jaffa,PK,IYR e.t.c they are trying their best to instigate people with whatever they can think of

but sad part of whole story is, RD garu falling for these cheap tricks on Tirumala seeing these guys backup

Ysr has done lot of damage to Tirumala and Jaff did not had any respect till he lost election(in 2012 same jaffa showed full attitude and slogans going tirumala)


After the interview sakshi is totally disappointed and stopped telecasting...I found this in youtube only

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...