Jump to content

కాసేపట్లో చంద్రబాబుతో ఉండవల్లి భేటీ


Recommended Posts

కాసేపట్లో చంద్రబాబుతో ఉండవల్లి భేటీ
16-07-2018 18:18:17
 
636673618979259081.jpg
అమరావతి:  కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎంవో ఆహ్వానం మేరకు ఏపీ సచివాలయానికి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీకానున్నారు. విభజన హామీలు, పార్లమెంట్‌లో పోరాటంపై గతంలో సీఎంకు ఉండవల్లి లేఖ రాశారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో సీఎంవో కార్యాలయం నుంచి ఉండవల్లికి పిలుపురావడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే చంద్రబాబు సచివాలయానికి వెళ్తారని, ఆ తర్వాత ఉండవల్లి భేటీ అవుతారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

2 minutes ago, nbk@myHeart said:

Dooshinchina notitho pogidichukunte aa kicke verappa ?

 

1 minute ago, OneAndOnlyMKC said:

Nenu meeku Munde chepanu kada Chandra babu apara chanukyudu antadu andulo ayanni kotte vaade ledu antaadu :P

baaga ekkuva expect chesthannattunnaru undavalli deggara ninchi...Brahmi  gifs साठॠà¤à¤®à¥à¤ परिणाम

Link to comment
Share on other sites

6 minutes ago, OneAndOnlyMKC said:

Nenu meeku Munde chepanu kada Chandra babu apara chanukyudu antadu andulo ayanni kotte vaade ledu antaadu :P

By mistake, veedini teesukunte covert operations strong ga work avuthayi BJP, YRUS and pawan batch. Each and every TDP step vallaki mundhey telisipothundhi. 

Link to comment
Share on other sites

Just now, Uravakonda said:

By mistake, veedini teesukunte covert operations strong ga work avuthayi BJP, YRUS and pawan batch. Each and every TDP step vallaki mundhey telisipothundhi. 

Porapatuna theeskunna vaadiki antha importance iche scene ledu.... 

Link to comment
Share on other sites

ఆసక్తి రేపుతున్న చంద్రబాబు, ఉండవల్లి భేటీ
16-07-2018 20:33:52
 
636673700331202340.jpg
 
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ అయ్యారు. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై కొద్ది రోజుల క్రితం సీఎంకు లేఖ రాశారు. సీఎం కార్యాలయం ఆహ్వానం మేరకు ఉండవల్లి అమరావతికి వచ్చారు. గత కొంతకాలం ఏపీ ప్రత్యేక హోదాపై ఆయన అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో హోదా విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. విభజన హామీలపై ఆయన టీవీ డిబెట్లలో పాల్గొంటూ తన వాదనను వినిపిస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు, ఖర్చులకి సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీలో ఉండవల్లి కీలకపాత్ర వహించారు.
 
 
బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులోభాగంగా ప్రత్యేక హోదాపై దేశంలోని బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖలు రాశారు. ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు. విభజన హామీలు వివరించారు. గత సమావేశాల్లో అవిశ్వాసం పెట్టినా చర్చకు రానీయలేదని బాబు పేర్కొన్నారు. 8 పేజీలతో లేఖలో విభజన హామీలు, ఇప్పటివరకు చేసిన పనులు, చేయాల్సిన పనులను చంద్రబాబు పొందుపర్చారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు ఇప్పటికే పలు పార్టీల ఎంపీలను కలుస్తున్నారు. టీడీపీ కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబుతో ఉండవల్లి భేటీ కావడం చర్చనీయాంశమైంది.
 
 
 
మరోవైపు మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానుంది. ఈ భేటీకి అన్ని పార్టీల నుంచి ఫ్లోర్‌లీడర్లు హాజరుకానున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు కేంద్రమంత్రులు, ఎంపీలకు విందు ఇవ్వడం ఆనవాయితిగా వస్తోంది. అందులోభాగంగా రేపు రాత్రికి ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. పార్లమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటికే అన్నీ పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపారు. ప్రధాని ఇస్తున్న విందుకు వెళ్లబోమని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం తెగేసి చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...