Jump to content

kavali lakshannarra kotlu


katti

Recommended Posts

 

 

కావాలి లక్షన్నర కోట్లు
ప్రాజెక్టుల పూర్తికి భారీగా నిధులు అవసరం
  అంచనా వ్యయాలు ఇంకా పెరిగే అవకాశం
  పాలనా అనుమతుల విలువ రూ.2,08,000 కోట్లు
  ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు   రూ.84,000 కోట్లు
  మూడు,నాలుగేళ్లలో పూర్తి చేయాలని  ప్రభుత్వ లక్ష్యం
  ఏడాదికి సరాసరి చేయాల్సిన ఖర్చు  రూ.40,000 కోట్లు
ఈనాడు - హైదరాబాద్‌
12ts-main1a.jpg
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే కనీసం మరో రూ.లక్షా యాభైవేల కోట్లు అవసరమని అంచనా. ఇప్పటికే చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో చేసిన వ్యయం పోనూ తాజా అంచనాల ప్రకారమే ఈ మేరకు నిధులు అవసరం. నిర్మాణంలో జాప్యం..పనుల్లో మార్పులు, భూసేకరణ, పునరావాసానికి పెరిగే వ్యయం ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా వ్యయం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన పనులు, చేసిన వ్యయం..మిగతా పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమన్న దానిపై ప్రభుత్వం ఇటీవల కసరత్తు చేసినట్లు తెలిసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని వచ్చే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన బడ్జెట్‌ పూర్తిగా ఖర్చుచేయడంతో పాటు ప్రతి ఏడాది సరాసరిన రూ.40వేల కోట్లు ఖర్చు చేయగలిగితేనే సాధ్యమవుతుంది. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు, పునరాకృతి ద్వారా,కొత్తగా చేపట్టినవి ఇలా అన్నింటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వేగంగా కాళేశ్వరం..
కాళేశ్వరంతో సహా కొన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా జరగుతుండగా, పాలమూరు-రంగారెడ్డితో సహా మరికొన్నింటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒప్పందం గడువులోగా సగం పనులు కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ఇతర ప్రాజెక్టుల పనులు ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేపట్టిన భారీ, మధ్యతరహా పథకాలు, రెండు ప్రాజెక్టుల ఆధునికీకరణ.. ఇలా అన్నీ కలిపితే ప్రభుత్వం ఇచ్చిన పరిపాలనా అనుమతే రూ.రెండు లక్షల ఎనిమిదివేల కోట్లు ఉంది. ఇందులో కొన్నిసవరణల కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం ఇంకా పెరగనుంది. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా ఇప్పటివరకు సుమారు రూ.84 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇందులో 2004 నుంచి 2014 వరకు చేసిన ఖర్చు సుమారు 40 శాతం వరకు ఉంది. అయితే జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే, ఈ నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం సాగునీటి రంగంపైన చేసిన ఖర్చు ఎక్కువ.

ప్రాజెక్టుల్లో అత్యధిక వ్యయంతో కూడుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.80,500 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇవ్వగా, ఇప్పటికే రూ.35వేల కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.14,800 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుని గుత్తేదారులకు చెల్లించింది. పరిపాలనా అనుమతి ప్రకారమే దీన్ని పూర్తి చేయడానికి మరో రూ.45,500 కోట్లు అవసరం. కానీ దీని నిర్మాణ వ్యయం ఇంకా పెరగనుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పెరిగిన వ్యయానికి ఇటీవలేప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకునే పనుల అంచనాలు కూడా  పెరిగాయి. వీటికి కూడా ప్రభుత్వం దశలవారీగా అనుమతి ఇవ్వనుంది. మొత్తమ్మీద ఆయకట్టుకు నీళ్లిచ్చే కాలువలతో సహా అన్ని పనులు వచ్చే మూడు నాలుగేళ్లలో పూర్తి చేసేటప్పటికి మరో రూ.పదివేల కోట్లకు పైగా అంచనా పెరిగే అవకాశం ఉంది. దేశంలో అత్యధిక వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఇదే కానుంది.

12ts-main1b.jpg
* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చి రూ.30వేల కోట్లకు గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకుంది. ఇంకొన్ని పనులు టెండర్లు పిలవాల్సి ఉండగా, ప్రభుత్వానికి అందిన సవరించిన అంచనా ప్రకారమే ఈ ప్రాజెక్టు వ్యయం మరో రూ.12వేల  కోట్లు అదనంగా పెరిగింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపైన చేసిన ఖర్చు కూడా రూ.నాలుగువేల కోట్లలోపే. రానున్న మూడు,నాలుగేళ్లలో ఖర్చు చేయాల్సిన రూ.లక్షా యాభైవేల కోట్లలో 60 శాతానికిపై నిధులు ఈ రెండు ప్రాజెక్టులకే అవసరం.

* సీతారామ ఎత్తిపోతల పథకం వ్యయం రూ.7,921 కోట్ల నుంచి రూ.13,051 కోట్లకు పెరిగింది. సంబంధిత ఇంజినీర్లు రూ.14,111 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, నీటిపారుదల శాఖ పరిశీలించి తగ్గించింది. ఇప్పటి వరకు చేసిన ఖర్చును మినహాయిస్తే మరో రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది.

* దేవాదుల ఎత్తిపోతల పథకం ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చి ప్రస్తుతానికి రూ.16,645 కోట్లకు చేరింది. గత ఏడాదిలోనే రూ.రెండువేల కోట్లకు పైగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.ఏడువేల కోట్లు కావాలి.

* దిండి ఎత్తిపోతల పథకానికి కూడా రూ.ఐదువేల కోట్లకు పైగా అవసరం. శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి, వరదకాలువ ఇలా అన్నిప్రాజెక్టుల వ్యయాలూపెరిగాయి.

Link to comment
Share on other sites

46 minutes ago, AnnaGaru said:

kaleswaram laksha kottindi ga...palamuru Rangareddy ni munduku kadaparu..idi 2014 lone cheppa and it will stay same except show off.....

varu golilu adina gramallo  varu chinappudu kondameda gesina "design" taruvate edaina..

Ah 1.5 lakh koka AP ki untey all districts ki water integration complete ayyipotundi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...