Jump to content

Paper industry to come in prakasam district


Recommended Posts

Prakasam sodarulara inka vayinchadi......Prakasam valla dream neravera botundi anni rakaluga twaralo...both Godavari water&INDUSTRY

water leka okkadu dekatledu land unnna...chivaraki solution dorikindi

 

** NSP right total prakasam Godavari water supply to all corners(addanki,tripurantakam nsp branch&ongole NSP canal)

** Prakasam barrage=>Gundlakamma reservoir Godavari water to East prakasam areas(idi kuda 1 year maximum land vasthe)

 

X9BnqV.gif

 

 

 

643d3e13-8373-4bfd-a3bb-8f409b6f2f55

 

ca2564e6-5b3c-46a7-84b5-de3cdaa1fd72

Link to comment
Share on other sites

idi vastundi ani confirm ayite prakasam,Guntur,Krishna lo ekkada cheap ga subabulu panduddi anukunte manhci rojulu a dry polalaki

NSP based worst hit areas palnadu,vinukonda,nrt,Karempudi,Pidugralla down dry,chilakuliripeta,sattenapalli,achampeta drought belt and whole 100% prakasam(even west dry areas) andariki manchi rojulu....

 

main advantage TRAIN connectivity from every corner of subabulu belt including  telangana(subabuku is grown in borders of AP)

 

Subabulu ki chala bad time nadustundi e madhya......ippudu e paper industry dani based and golden days back for subabulu farmers

 

Link to comment
Share on other sites

52 minutes ago, AnnaGaru said:

packaging lo eucalyptus branches vadataru kani subabulu cheap&fast kada? > every two years guaranteed kada subabulu....eucalyptus how many years?..telidu bro...

subabulu every 3 yrs ki vasthayi..but recent ga varshalu leka vaati meeda kooda pedda income ravatam ledu

Link to comment
Share on other sites

ఏపీ.. పేపర్స్‌!
13-07-2018 02:50:05
 
636670470049523578.jpg
  • రాష్ట్రంలో భారీ కాగిత పరిశ్రమ
  • 20 వేల కోట్ల పెట్టుబడి.. 20 వేల మందికి ఉపాధి
  • 25 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
  • ఆసియాలోనే అతి పెద్ద కర్మాగారం
  • రాష్ట్రంలో ఏర్పాటుకు సినార్‌మస్‌ సిద్ధం
  • ప్రకాశం జిల్లా పెద్దగంజాంలో స్థాపన!
  • వారంలో స్పష్టత వచ్చే అవకాశం
ఒంగోలు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీ కాగిత పరిశ్రమ రాబోతోంది. దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడితో, ఏటా సుమారు 25 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. ఇండోనేషియాకు చెందిన ‘ఏపీపీ సినార్‌మస్‌’ సంస్థ దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. అంతేకాదు... ఇది ఆసియాలోనే అతిపెద్ద కాగిత పరిశ్రమ కానుంది. కాగితం తయారీలో సినార్‌మ్‌సకు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్నాయి. 80 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ కాగితం తయారీతోపాటు ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లోనూ ఉంది. భారత్‌లో తమ కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన నేపథ్యంలో... రాష్ట్ర సర్కారు సినార్‌మ్‌సను సంప్రదించింది. తాము అందిస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించింది.
 
 
ఈ చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. సినార్‌మస్‌ పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా పెద్దగంజాం ప్రాంతాలను పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులు పెద్దగంజాం సరైన ప్రాంతంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సముద్ర రవాణా ద్వారానే ముడిసరుకు దిగుమతి, ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటారు. అందుకే ఈ సంస్థ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పరిశీలించింది. రెండున్నరవేల ఎకరాల భూమి, తీరంలో జెట్టీ, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు, ఏడాదికి ఒక టీఎంసీ నీరు, 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంటు పరిశ్రమకు అవసరం.
 
 
నీటి నిల్వ కోసం నిర్మించే రిజర్వాయర్‌ కోసమే 500 ఎకరాలు కావాలి. ముడిసరుకు నిల్వకు 400 ఎకరాలు, గ్రీనరీ కోసం 200 ఎకరాలు, వృథా నీటి కోసం 70 ఎకరాలు, రోడ్లు, భవనాలు ఇతరత్రా అవసరాలకు కలిపి దాదాపు 2500 ఎకరాల దాకా కావాలని చెబుతున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతంలో రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ భూమి సమకూర్చడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినట్లు సమాచారం.
 
 
ఐతే.. ఓకే!
పెద్దగంజాంలో ఉన్న భూములు, నిర్వాసితులు, పునరావాసం, నష్టపరిహారం తదితర అంశాలపై అధికారులు కొంత కసరత్తు చేశారు. పెద్దగంజాం పంచాయతీ పరిధిలో సముద్రతీరం వరకు ఐదారు చిన్న పల్లెలు ఉండగా... 2507 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 80శాతానికిపైగా పట్టాభూములే. నిర్వాసితుల పరిహారం కోసం రూ.350 కోట్లు అవసరం అవుతుందని లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ తరఫున డీపీఆర్‌ తయారీని ఢిల్లీలోని ఒక ప్రైవేట్‌ సంస్థ చేపట్టింది.
 
 
ఇప్పటికే కసరత్తు...
కాగితపు పరిశ్రమ ఏర్పాటు తర్వాత... ప్రతి నిమిషానికి ఒక వాహనం కాగితం లోడ్‌తో కంపెనీ నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగంజాంలోని ప్రతిపాదిత స్థలం నుంచి ఈ వాహనాలన్నీ రైల్వే లైన్‌ను దాటుకుని రావాలి. ఈ ఇబ్బందిని తొలగించేందుకు రూ.40 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించేలా ఇప్పటికే రైల్వే అధికారులతో చర్చలు జరిపారు. ఇండోనేషియా నుంచి సరుకు దిగుమతి, ఎగుమతి కోసం సముద్రంలో జెట్టి నిర్మాణం తప్పనిసరి. రూ.1300 కోట్లతో దానిని నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రకాశం జిల్లాలో భారీ కాగితపు పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి శిద్ధా రాఘవరావు ఇటీవల ప్రకటించారు. వారం రోజుల్లో సినార్‌మస్‌ ప్రతినిధులు వస్తున్నారు. ఆ సందర్భంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

no need to bro. after your comment, i got greedy thinking we may get 2. this one and the one previously rumored to come up near machilipatnam port. So I read the article again ?

a post nene vesanu db lo post kanpadatala eroju

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్, పేపర్’ (APP) రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్ధాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు తీరంలో వున్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.


 


ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.

అలాగే, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరిక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో వున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెలరోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

 
  •  
Link to comment
Share on other sites

రాష్ట్రంలో భారీ కాగిత పరిశ్రమ
15-02-2018 01:28:58

ఏర్పాటుకు ముందుకొచ్చిన ఏపీపీ
2500 ఎకరాలు కేటాయించాలని వినతి
రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ
సాగులో సాంకేతిక సహకారానికి బేయర్‌ రెడీ
22న ‘కియ’కు సీఎం..జనవరిలో రోడ్లపైకి కార్లు
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో భారీ కాగితం తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్‌ పేపర్‌’ (ఏపీపీ) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీపీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దేశంలోనే అతి పెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ముడిపదార్థాలు దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఏపీపీ యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు.
 
తమకు ఏదైనా ఓడరేవు సమీపంలో రెండున్నరవేల ఎకరాలను కేటాయించాల్సిందిగా సీఎంను కోరారు. ఈ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో భూములు పరిశీలించాలని ఏపీపీ యాజమాన్య ప్రతినిధులకు సీఎం సూచించారు. తమకు భూమి కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఏపీపీ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంకి హామీ ఇచ్చారు.
 
రోజుకు సగటున 4వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాగిత పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగోవంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్‌ సంస్థ ‘బేయర్‌’ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో సాంకేతక సహకారమందించేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు సీఎంతో బేయర్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. నెలరోజుల్లో సమగ్ర ప్రతిపాదనలతో వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సహకారం అందిస్తామని సీఎం వారికి తెలిపారు.
 
మరో ఏడాదిపాటు సిమెంటు సరఫరా
సీఎం చంద్రబాబుతో సిమెంటు కంపెనీల ప్రతినిధులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వానికి ప్రస్తుతం అందిస్తున్న ధరకే మరో ఏడాది పాటు సిమెంటు సరఫరా చేస్తామని వారు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకాస్త ధర తగ్గించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సిమెంటు కంపెనీలకు సూచించారు.
 
కియ పనుల ప్రారంభానికి సీఎం
ఈ నెల 22న అనంతపురం ప్లాంటులో కియ ఫ్రేమ్‌ వర్క్‌ బిగింపు పనులను ప్రారంభించనుంది. ఈ పనుల ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం చంద్రబాబును కియ ప్రతినిధులు ఆహ్వానించారు. దీనికి సీఎం అంగీకరించారు. దీంతో కియ యాజమాన్యం ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసి, తొలి కాపీని బుధవారం సీఎంకు అందజేసింది. ఈ సందర్భంగా సంక్రాంతి నాటికి కియ కార్లను రాష్ట్రంలో విడుదల చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను సీఎం కోరారు.
 
కాగా.. కియ కార్ల తయారీ సంస్థలో ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కియ సంస్థకు గతంలో ఇచ్చిన హామీల మేరకు జీఎస్టీ అనంతర ప్రోత్సాహక ప్రయోజనాల కోసం అమలు చేసే ప్రత్యేక విధానంపై గురువారం నాటి ఎస్‌ఐపీబీ చర్చించనుంది.
 
రాష్ట్రంలో కంటెంట్‌ కార్పొరేషన్‌
రాష్ట్రంలో కంటెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఇంధన, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తృతం కానున్న తరుణంలో ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించే ప్రసారాలను రూపొందించే నిపుణులతో ఈ కంటెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తుంది.

Link to comment
Share on other sites

8 hours ago, AnnaGaru said:

idi vastundi ani confirm ayite prakasam,Guntur,Krishna lo ekkada cheap ga subabulu panduddi anukunte manhci rojulu a dry polalaki

NSP based worst hit areas palnadu,vinukonda,nrt,Karempudi,Pidugralla down dry,chilakuliripeta,sattenapalli,achampeta drought belt and whole 100% prakasam(even west dry areas) andariki manchi rojulu....

 

main advantage TRAIN connectivity from every corner of subabulu belt including  telangana(subabuku is grown in borders of AP)

 

Subabulu ki chala bad time nadustundi e madhya......ippudu e paper industry dani based and golden days back for subabulu farmers

 

Subabulu kochem income taggindi eemadya madi ckp degera ooru idi materialize aite manchidi ma ooru lo max subabule 

Link to comment
Share on other sites

1 hour ago, kraghuveera said:

Since they have a captive port raw material import is an option  for them.Hope they will source raw material locally. 

Local availability unte required quality obvious kada, they can cut down a lot on import logistics costs

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...

పోర్టు నిర్మాణానికి 3,500 ఎకరాలు, దాని పరిధిలో పేపరు మిల్లునిర్మాణానికి 2,000 ఎకరాలు కలిపి మొత్తం 5,500 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

కృష్ణపట్నానికి దీటుగా రామాయపట్నం!
27-09-2018 03:25:48
 
636736155497174493.jpg
  •  2 కోట్ల టన్నుల ముడి సరుకులు
  •  దిగుమతి చేసేలా రూపకల్పన
  •  కాకినాడ పోర్టు డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి
కావలి: వైజాగ్‌ పోర్టు కన్నా పెద్దదిగా.. కృష్ణపట్నం రేవుకు దీటుగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపడతామని కాకినాడ పోర్డు డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రామాయపట్నం రేవు కోసం భూ సేకరణలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లా కావలి ఆర్‌డిఒ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి చేపట్టాల్సిన భూసేకరణపై చర్చించారు. పోర్టు నిర్మాణానికి 3,500 ఎకరాలు, దాని పరిధిలో పేపరు మిల్లునిర్మాణానికి 2,000 ఎకరాలు కలిపి మొత్తం 5,500 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భూసేకరణ చేపట్టాలనే విషయంపై రామాయపట్నం, రావూరు, చేవూరు, చెన్నాయపాలెం పరిధిలోని గ్రామాల మ్యాపులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలో 500 మీటర్ల పొడవున భూసేకరణ జరపాలని నిర్ణయించారు.
 
అనంతరం ప్రవీణ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. మైనర్‌ పోర్టు అంటే చిన్నది కాదు. రామాయపట్నం పోర్టులో 2 కోట్ల టన్నుల ముడిసరుకు దిగుమతి చేసేలా రూపకల్పన చేస్తున్నాం’ అని తెలిపారు. సమీక్షలో కాకినాడ పోర్టు ఎస్‌ఇ రాఘవరావు, పోర్టు అధికారి ధర్మశాస్త్రి, కావలి, కందుకూరు ఆర్‌డిఒలు భక్తవత్సలరెడ్డి, రామారావు, సిఆర్‌డిఎ సభ్యులు బీద మస్తాన్‌రావు, తహశీల్దార్‌ గోళ్ల వెంకటేశ్వర్లు, సర్వేయర్లు, రైట్స్‌ సంస్థ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ బృందం తీరం వెంబడి చెన్నాయపాలెం, చేవూరు, రావూరు మీదుగా రామాయపట్నం వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
ప్రకాశం జిల్లాలో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌
వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ రానుంది. ఇందుకు సంబంధించి సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది. ఈ యూనిట్‌ వస్తే 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రధానంగా కాగిత పరిశ్రమకు అవసరమైన గుజ్జు కోసం 50,000 మంది రైతులతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రకాశం జిల్లా రైతాంగానికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.
Link to comment
Share on other sites

40 minutes ago, sonykongara said:
ప్రకాశం జిల్లాలో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌
వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ రానుంది. ఇందుకు సంబంధించి సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది. ఈ యూనిట్‌ వస్తే 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రధానంగా కాగిత పరిశ్రమకు అవసరమైన గుజ్జు కోసం 50,000 మంది రైతులతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రకాశం జిల్లా రైతాంగానికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

Kia kanna huge investment gaa

Link to comment
Share on other sites

  • 4 weeks later...

hope this mega project(20,000 crores project) goes ahead......Today they came for site visit

like KIA for ATP, this will be game changer for prakasam....

- atleast 1 lakh farmers to get benefit supplying them.....

- also jobs(10,000 is the number APP gave in proposal)

- New port(will get boost) as this industry alone can support port capacity

a godavari water vachi idi vaste prakasam dasa maripotundi...best industry for prakasam....

 

 

67c8ee22-91cf-410d-b60d-f4e533a9b0a0

 

1x2.png

Link to comment
Share on other sites

50 minutes ago, AnnaGaru said:

hope this mega project(20,000 crores project) goes ahead......Today they came for site visit 

like KIA for ATP, this will be game changer for prakasam....

- atleast 1 lakh farmers to get benefit supplying them..... 

- also jobs(10,000 is the number APP gave in proposal)

- New port(will get boost) as this industry alone can support port capacity

a godavari water vachi idi vaste prakasam dasa maripotundi...best industry for prakasam....

 

 

67c8ee22-91cf-410d-b60d-f4e533a9b0a0

 

1x2.png

:nailbite::pray:

Feb nundi eduru choosthunnam, idhi final ayyedhi eppudo, dheeniki moksham eppudo? ippat raaka oka 5-6 saarlu vachi vellaru app vallu kaneesam. ennikalu lopu ayite baagundu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...